పరిశుదాత్మునికి సంభంధించిన ప్రశ్నలు

ప్రశ్న: పరిశుధ్దాత్ముడు ఎవరు?

సమాధానము:
పరిశుద్ధాత్ముని గుర్తింపు విషయమై అనేక అపోహాలున్నాయి. కొంతమంది పరిశుద్ధాత్ముని ఒక అతీత శక్తిగా పరిగణిస్తారు. క్రీస్తును వెంబడించువారందరికి దేవుడనుగ్రహించు పరిశుద్ధాత్ముడు కేవలము శక్తి అని అర్ధమౌతుంది. పరిశుద్ధాత్ముని గురించి బైబిలు ఏమని భోదిస్తుంది? బైబిలు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు దేవుడు అని తెలియచెప్పుతుంది. పరిశుద్ధాత్ముడు మనస్సు, భావోద్రేకాలు, చిత్తం కల్గియున్న దైవికమైన (దైవ)వ్యక్తి అని బైబిలు భోదిస్తుంది.

అపోస్తలుల కార్యములు 5:3-4 వచనాలతో సహా పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా దేవుడు అని అనేక పాఠ్యభాగాలలో చూడవచ్చు. ఈ వచనంలో పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నీవు అబద్దమాడితివని పేతురు అననీయాను ఖండించి, మరియు “నీవు మనుష్యులతోకాదు గాని దేవునితోనే అబద్దమాడితివని” వానితో చెప్పెను. పరిశుద్ధాత్మునితో అబద్దమాడితే దేవునితోనే అబద్దమాడినట్లు అని ఇక్కడ బహిర్గతమౌతుంది. దేవునికి మాత్రమే వుండదగిన స్వభావలక్షణాలు పరిశుద్ధాత్ముడు కల్గియుండుటనుబట్టి, పరిశుద్ధాత్ముడుకూడా దేవుడే అని తెల్సుకోవచ్చు. కీర్తన 139: 7-8 లో : “నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పారిపోవుదును? నీ సన్నిదినుండి నేనెక్కడికి పారిపోవుదును?” మరియు 1కొరింధి 2:10-11 లో పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని అనే లక్షణం వున్నదిఅంటానికి నిదర్శనమైయున్నది. “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి యున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములనుకూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు మనుష్యాత్మకేగాని మనుష్యులలో మరి ఎవనికిని తెలియదు. ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగానీ మరి ఎవనికిని తెలియవు.”

మనస్సు, భావోద్రేకం, చిత్తం ఈ లక్షణాలు కల్గియుండటాన్ని బట్టి పరిశుధ్ధాత్ముడు తప్పనిసరిగ్గా దైవికమైన వ్యక్తి. పరిశుధ్ధాత్ముడు అన్నిటిని ఆలోచించేవాడు, తెలుసుకోగలిగేవాడు (1 కొరింధి 2:10), పరిశుధ్ధాత్ముని ధుఖపరచవచ్చు.(ఎఫెస్సి 4:30), ఆత్మ మనకొరకు విజ్ఞాపనచేస్తాడు (రోమా 8:26-27). తన చిత్తానుసారముగా నిర్ణయాలుతీసుకుంటాడు (1కొరింధి 12: 7-11). పరిశుద్ధాత్ముడు దేవుడు, త్రిత్వములోని మూడవ వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వాగ్ధానం చేసినట్లుగా దేవునిలాగే పరిశుద్ధాత్ముడు కూడ ఆదరణకర్తగా, భోధకుడుగా(యోహాను 14:16;26; 15:26) వ్యవహరిస్తాడు.


ప్రశ్న: ఎప్పుడు/ ఏవిధంగా పరిశుధ్ధాత్మను పొందుకుంటాం?

సమాధానము:
అపోస్తలుడైన పౌలు స్పష్టముగా భోధిస్తున్నాడు ఏంటంటే మనము యేసుప్రభువునందు విశ్వాసముంచిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందుకుంటాము. 1 కొరింథి 12:13 "ఏలాగనగా యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి." రోమా 8"9 చెప్తుంది ఒకవ్యక్తిలో పరిశుధ్ధాత్మను లేనివాడైతే అతడు/ఆమె క్రిస్తుకు చెందినవాడు కాడు: "దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మ స్వభావముగలవారే గాని శరీరస్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు." ఎఫెసీ 1:13-14 భోధిస్తుంది అయనయందు విశ్వాసముంచినవారికి రక్షణ అనే పరిశుధ్ధాత్మను ముద్రనుంచియున్నాడు " మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్ధానముచేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు."

ఈ మూడు పాఠ్యభాగాలు యేసుప్రభువునందు విశ్వాసముంచిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందుకుంటామని స్పష్టము చేస్తున్నాయి. పౌలు చెప్పలేకపోయాడు అది మనమందరము ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమని, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమని ఎందుకంటె కొరింథీ విశ్వాసులు అందరు పరిశుధ్ధాత్మను కలిగియున్నారని. రోమా 8:9 ఇంకా గట్టిగా చెప్తుంది ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడని. కాబట్టి ఒకడు ఆత్మను కలిగియుండటం అనేది ఒకడు రక్షణను కలిగియున్నాడనుటకు గుర్తింపుగానున్నది. పైగా పరిశుధ్ధాత్మడు "రక్షణకు ముద్రగాలేడు" (ఎఫెసీ1:13-14) ఎప్పుడంటే రక్షణపొందిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందనపుడు. చాల వాక్యభాగాలు స్పష్టముచేస్తున్నావేంటంటే యేసుప్రభువును రక్షకునిగా విశ్వాసముంచిన క్షణములోనే మన రక్షణ భద్రముచేయబడినది.

ఈ చర్చ చాల వివాదమైనది ఎందుకంటే పరిశుధ్ధాత్ముని యొక్క పనులు తరచుగా కలవరపరుస్తాయి. యేసుప్రభువునందు విశ్వాసముంచిన క్షణములోనే పరిశుధ్ధాత్మను పొందుకోవటామా లేక పరిశుధ్ధాత్మ నింపుదలయా. పరిశుధ్ధాత్మ నింపుదలను కలిగియుండటం అనేది క్రైస్తవజీవితములో కొనసాగుతుండే ప్రక్రియ. కొందరు విశ్వసించేది రక్షణ పొందిన సమయంలోనే పరిశుధ్ధాత్మ బాప్తిస్మము కూడ జరుగును అని , మరికొంతమంది క్రైస్తవులు అది నమ్మరు. ఇది కొన్ని సార్లు పరిశుధ్ధాత్మ బాప్తిస్మమునకు బదులు పరిశుధ్ధాత్మను పొందుకోవటంతో తారుమారు చేస్తుంది అటుపిమ్మట ఇదే రక్షణ కార్యమునకు కారణమౌతుంది.

చివరిగా, మనము ఏవిధంగా పరిశుధ్ధాత్మను పొందుకుంటాం? కేవలము యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించుటను బట్టి పరిశుధ్ధాత్మను పొందుకుంటాం (యోహాను 3:5-16). ఎప్పుడు పరిశుధ్ధాత్మను పొందుకుంటాం? యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచినపుడే పరిశుధ్ధాత్ముడు మనలో శాశ్వతముగా నివసించును.


ప్రశ్న: నేను ఏ విధంగా పరిశుధ్ధాత్మ నింపుదలను పొందగలను?

సమాధానము:
పరిశుధ్ధాత్మ నింపుదలను అవగాహన చేసుకొనుటకు ఒక ముఖ్యమైన వచనము యోహాను 14:16 అక్కడ యేసు ప్రభువువారు వాగ్ధానం చేసింది ప్రతీ విశ్వాసిలో పరిశుధ్ధాత్ముడు నివసించును. మరియు నివసించుట శాశ్వతమైనది. ఒకనిలో ఆత్మ నివసించుట నుండి ఆత్మ నింపుదలపొందుట అనేది ప్రత్యేకించుట చాలా ముఖ్యమైనది. శాశ్వతంగా విశ్వాసిలో ఆత్మ నివసించుట అనేది కొంతమంది ప్రత్యేకించిన విశ్వాసులకు మాత్రమే కాదుగాని అందరి విశ్వాసులకు. కొద్ది లేఖనభాగాలు మాత్రమే దీనిని తుది పలుకుటకు సహయాపడ్తున్నాయి. మొదట పరిశుధ్ధాత్మ అనే కృపావరము ఒకరికి తప్పకుండ అందరి విశ్వాసులకు ఇవ్వబడింది. మరియు దానిపై యేసు క్రీస్తులో విశ్వాసముంచుట తప్ప మరి ఏ షరతు ఈ కృపావరము మీదనుంచబడలేదు (యోహాను 7:37-39). రెండవది, రక్షణ క్రియ జరిగినప్పుడే ఆ క్షణములోనే పరిశుధ్ధాత్ముడు అనుగ్రహించబడెను (ఎఫెసీ 1:13). గలతీయులకు 3:2 లోకూడా ఇదే సత్యాన్ని నిక్కివకాణిస్తుంది ఏంటంటే ఆత్మచే ముద్రించబడటం మరియు ఆయనయందు విశ్వాసముంచిన సమయంలో అంతర్వర్తియైన ఆత్మ నివసించుట మొదలుపెట్టెను. మూడవది, పరిశుధ్ధాత్ముడు విశ్వాసిలో శాశ్వతంగా నివసించును. విశ్వాసులందరికి పరిశుధ్ధాత్ముడు ప్రధమంగా అనుగ్రహించబడ్డాడు లేక భవిష్యత్తులో క్రీస్తులో మహిమపర్చబడుట నిజపర్చుటకు(2 కొరింథీ 1:22; ఎఫెసీ 4:30).

ఎఫెసీ 5:18 లో చెప్పబడిన ఆత్మ నింపుదల విషయంకు పరస్పర భేధము కలిగియుంది. మనము పరిశుధ్ధాత్మకు సంపూర్తిగా లోబడినట్లయితే ఆయన మనలను స్వతంత్రించుకొని పూర్తిగా తన ఆత్మతో నింపుదల ననుగ్రహిస్తాడు. రోమా 8:9 మరియు ఎఫెసీ 1:13-14 చెప్తుంది ఆయన ప్రతీవిశ్వాసిలో నివసిస్తాడు గాని మనము ఆయనను ధు:ఖపరుస్తున్నాము(ఎఫెసీ4:30), ఆయన క్రియను మనలో ఆర్పివేయవచ్చు (1 థెస్సలోనీయులకు 5:30). ఈ విధంగా ఆయన ఆత్మను ఆర్పివేసినట్లయితే మనము తన ఆత్మ నింపుదల కార్యమును మరియు ఆయన శక్తిని మనలో , మన ద్వారా అనుభవించలేం. పరిశుధ్ధాత్మలో నింపబడటం అంటే మన జీవిత ప్రతీ భాగమును ఆయనకు అప్పగించి, ఆయనచే నడిపించబడి స్వాధీనపరచబడ్డామని భావించడం. తర్వాత ఆయన శక్తి మననుండి ప్రయోగించబడినట్లయితే మనము ఏమిచేయుచున్నామో అది దేవునికి ఫలవంతముగానుండును. ఆత్మ నింపుదల అనేది బాహ్యమైన జరిగే క్రియలతో పరిమితమైంది కాదు, లోలోపల ఆలోచనలను, భావోధ్ధేశ్యాలను అమ్రియు మన క్రియలకు పరిమితమైంది. కీర్తన19:14లో చెప్పినట్లు "యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా,నా నోటిమాటలును నా హృదయధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక."

పాపము పరిశుధ్ధాత్ముని నింపుదలను అవరోధిస్తుంది. అయితే దేవునికి విధేయత చూపించుట ద్వారా పరిశుధ్ధాత్ముని నింపుదలను క్రమబద్దీకరిస్తుంది. ఎఫెసీ 5:18 మీరు ఆత్మ పూర్ణులైయుండుడి అని హెచ్చరిస్తుంది. ఏదిఏమైనప్పటికి, నింపుదల కలిగియున్నాము అనేదాన్ని నిరూపించుటకు పరిశుధ్ధాత్ముని నింపుదల కొరకు ప్రార్థించుటకాదు, కేవలము దేవుని ఆఙ్ఞల పట్ల విధేయతచూపుతూ పరిశుధ్ధాత్ముని పని జరుగు నిమిత్తం ఆత్మకు స్వాతంత్ర్యంనివ్వడం. ఎందుకంటె మనమింక పాపముచే సోకింపబడ్డాము కాబట్టి అన్ని సమయాలలో ఆత్మనింపుదల కలిగియుండటం అసాధ్యంగావుంటుంది. మనము పాపము చేసినపుడు, తక్షణమే దేవునిదగ్గర పాపపు ఒప్పుదలకలిగి, మరియు ఆయన ఆత్మనింపుదలతో, మరియు ఆయన ఆత్మనడిపింపు కలిగి జీవించుటకు తీర్మానించుకొనవలెను.


ప్రశ్న: పరిశుధ్ధాత్మ బాప్తిస్మము అంటే ఏంటి?

సమాధానము:
పరిశుధ్ధాత్ముని యొక్క బాప్తిస్మము ఈ విధంగా నిర్వచించబడింది అదేమనగా పరిశుధ్ధాత్మ దేవుని కార్యము ఒక విశ్వాసిలో రక్షణ క్రియ జరిగిన క్షణములో ఆ వ్యక్తిని క్రీస్తుతో ఏకము చేయుటకు మరియు క్రీస్తు శరీరములోని ఇతర విశ్వాసులతో ఐక్యముచేయును. ఈ పాఠ్యభాగము మొదటి కొరింథీయులు 12: 12-13 బైబిలులో పరిశుధ్ధాత్మ బాప్తిస్మమును గూర్చిన కేంద్ర పాఠ్యభాగముగా ఎంచబడింది "ఏలగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తీస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి" ( 1 కొరింథీయులు 12: 12-13). అప్పుడు రోమా 6:1-4 దేవుని ఆత్మనుగూర్చి విశేషంగా నొక్కి వక్కాణించలేదుగాని అది తప్పక దేవుని యంది ఒక విశ్వాసియొక్క స్థితిని వివరిస్తూ ఆ భాషకు సమతుల్యమైన పాఠ్యభాగమే 1 కొరింథీ పాఠ్యభాగము: "ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగులేపబడెనో, ఆలాగే నూతనజీవము పొందినవారమై నడచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలుపొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి."

ఈ దిగువ చెప్పబడిన వాస్తవాలు చాల అగత్యమైనవి. ఎందుకంటె ఆత్మ బాప్తిస్మము గూర్చిన అవగాహనను వివక్షించి ఘనీకరించుటకు దోహదపడ్తుంది. మొదటిది, 1 కొరింథీయులు 12:13 స్పష్టంగా వర్ణిస్తుందేంటంటే ఒక్క ఆత్మయందే బాప్తీస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానముచేసినవారమైతిమి"(అంతర్వర్తియైన ఆత్మ).రెండవది, లేఖనములు ఎక్కడ ఒక వ్యక్తి ఆత్మలో, తో, ద్వారా బాప్తిస్మముపొందవలెనని లేక పరిశుధ్ధాత్మ యొక్క బాప్తిస్మము కొరకు వేడుకొనవలెనని అర్థమిచ్చురీతిలో వక్రీకరించి చెప్పలేదు. మూడవది ఎఫెసీ 4:5 ఆత్మ బాప్తిస్మను సూచిస్తున్నట్లు అగుపడ్తుంది. ఇదే వాస్తవమయినట్లయితే "ఒకే విశ్వాసము" మరియు "ఒకే తండ్రి" అన్నట్లు ప్రతీ విశ్వాసిలో ఆత్మబాప్తిస్మకార్మము సత్యమే.

ఇక సమాప్తిలో పరిశుధ్ధాత్మునియొక్క బాప్తిస్మము రెండు పనులు చేయును. 1) క్రీస్తు శరీరములోనికి మనలను చేర్చును,మరియు 2). మనము క్రిస్తుతో సహా సిలువవేయబడ్డాము అనేది వాస్తవమని నిరూపించును. ఆయన శరీరములో ఉనికి కలిగియున్నాము అంటే నూతనజీవము పొందుటకై ఆయనతో కూడా తిరిగి లేపబడితిమి ( రోమా 6:4). 1 కొరింథీ 12:13 లో చెప్పిన సంధర్భ ప్రకారము శరీర అవయవములు అన్ని సక్రమంగాపనిచేయుటకు వ్యాయామము చేయునట్లు ఆత్మీయవరముల విషయములో కూడ వ్యాయామము చేయవలెను. ఎఫెసీ 4:5 చెప్పిన సంధర్భములో ఒకే ఆత్మ బాప్తిస్మమును అనుభవించినట్లయితే అది సంఘ ఐక్యతను కాపడుటకు ఆధారమవుతుంది.ఆత్మ బాప్తిస్మము ద్వారా ఆయన మరణము, సమాధిచేయబడుట మరియు తిరిగిలేపబడుటలో ఆయనతో సహా పాలిభాగస్థులమవుటవలన మనలను అంతర్వర్తియైన పాపపు శక్తినుండి వేరుచేసి నూతనజీవములో నడచునట్లు మనలను స్థాపించును ( రోమా 6:1-10; కొలస్సీయులకు 2:12).


ప్రశ్న: పరిశుధ్ధాత్మునికి వ్యతిరేకంగా దేవదూషణ అంటే ఏంటి?

సమాధానము:
మార్కు 2: 22-30 లో మరియు మత్తయి 12:22-32 లో ఆత్మకు వ్యతిరేకంగా దేవదూషణ ఈ ప్రత్యయం చెప్పబడింది.దేదూషణ అనే పదం సామాన్యముగా ఈ రీతిగా "తిరస్కారపూర్వకంగా అగౌరవించుట" వివరించబడింది. ఈ పదము సామాన్యముగా దేవునిని శపించుట చిత్తపూర్వకంగా దేవునికి సంభంధించిన విషయాలను చిన్నచూపు చూచుటకు ఉపయోగిస్తారు. దేవునిలో చెడు ఉన్నట్లు ఆరోపించటం లేక ఆయనకు చెందవలసిన ఘనతను ఇవ్వక ఆయనలో చెడుఉన్నట్లు ఆరోపించటం. ఈ విధమైన దేవదూషణ, ఏదిఎంఐనప్పటికి ఇది ఒక రకంగా "పరిశుధ్ధాత్మకు విరోధముగా దేవదూషణ" అని మత్తయి 12:31 చెప్తుంది. ఈ మత్తయి 12:31-32 లో పరిసయ్యులు పరిశుధ్ధాత్ముని శక్తితో యేసు గొప్ప అధ్భుతములు చేయుచున్నాడని, తిరస్కరించలేని ఋజువుకు సాక్ష్యులుగా వున్నప్పటికి దానికి బదులుగా వీడు దయ్యములకు అధిపతియైన "బయెల్జెబూలు" వలననే దయములు వెళ్ళగొట్టుచూ అధ్భుతములు చేయుచునాడని చెప్పిరి (మత్తయి 12:24).ఇప్పుడు గమనించండి మార్కు 3:30లో యేసు చాల స్పష్టముగా వారు ఏ విధంగా "పరిశుధ్ధాత్మకు విరోధముగా దేవదూషణ" అనే తప్పుచేసినారో ఈ భాగములో తెలియును.

ఈ దేవదూషణను ఎవరో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ఆత్మ-నింపుదలకన్న అతడు దయ్యములచేత క్రియలుచేయుచున్నాడని నిందమోపినట్లున్నది. దీనికి కారణంగా, ఇదే విధమైన "పరిశుధ్ధాత్మకు విరోధముగా దేవదూషణ" మరలా ఈ దినాలలో మరొకసారి తిరిగి జరుగనే జరుగదు. యేసుక్రీస్తు ఆయన భూమిమీద లేడు- దేవుని కుడి పార్శ్వమున కూర్చోనియున్నాడు.ఎవరుకూడ యేసుక్రీస్తు అధ్భుతములు చేయుచున్నాడని సాక్ష్యమిచ్చి, ఆ ఆత్మ కార్యపుశక్తికి బదులుగా సాతాను శక్తికి ఎవరూ ఆరోపించరు.ఈ దినాలలో మనకు అతి సామీప్యమంగా అర్థమయ్యే ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి విమోచించబడిన జీవిత అధ్భుతాన్ని, ఆవ్యక్తిలో జరుగుతున్నకార్యపు ప్రభావఫలితంను అంతర్వర్తియైన పరిశుధ్ధాత్మునికి బదులుగా సాతాను శక్తికి ఆరోపించలేం.

ఈ దినాలలో ఆత్మకు విరోధముగా దేవదూషణ, క్షమించరాని పాపమువంటిది. అది కొనసాగుతున్న అపనమ్మకత్వపు స్థితి, అపనమ్మకత్వములో జీవిస్తున్న వ్యక్తికి క్షమాపణలేనేలేదు. యేసుక్రీస్తునందు నమ్మికయుంచుటకు పరిశుధ్ధాత్ముడు ప్రేరణ కలిగించినపుడు నిరంతారాయములేకుండా ధిక్కరించే స్థితియే అయనకు వ్యతిరేకముగా క్షమించరాని దైవదూషణ. యోహాను 3:16 లోనిది ఙ్ఞప్తిలోనికి తెచ్చుకోండి "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవముపొందునట్లు ఆయనను అనుగ్రహించెను." అదే అధ్యాయములో ముందు భాగపు వచనములో " కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును" (యోహాను 3:36).ఒకే ఒక షరతు ఏంటంటే "ఎందరైతే విశ్వాసముంచితిరో" అనే జాబితాలో ఒకరు లేనట్లయితే క్షమాపణలేదు ఎందుకంటె ఆవ్యక్తి "దేవుని కుమారుని తృణీకరించినందుకే".


ప్రశ్న: నా ఆత్మీయవరాలు ఏంటో నేనేవిధంగా తెలిసికోగలను?

సమాధానము:
మన ఆత్మీయ వరాలేంటో అని కనుగొనటానికి ఒక నిర్ధిష్టమైన మంత్ర సూత్రాలు గాని ఖచ్చితమైన పరీక్షలు గాని లేవు. పరిశుధ్ధాత్మ దేవుడు నిర్ణయించిన ప్రకారము అందరికి వరాలు పంచుతాడు ( 1 కొరింథీ 12:7-11). సామాన్యంగా క్రైస్తవులకు వచ్చే సమస్య ఏంటంటే మనలను దేవుడు ఏ వరములతో నింపాడో అని గ్రహిస్తామో ఆ వరాన్ని మాత్రమే వుపయోగించి దేవుని సేవ చేయటానికి శోధింపబడతాము. అయితే ఆత్మీయవరాలు పనిచేయాల్సింది ఆవిధంగా కాదు. దేవుడు అన్ని విషయాలలో విధేయతతో ఆయనను సేవించాలని మనల్ని పిలిచాడు. అయితే ఒక వరము లేక వరాలతో మనలను తర్ఫీదు చేసి మనలను పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనము ఏదైతే సాధించవలసిన కార్యము సాధించాలో దానికి సంసిధ్ధులను చేస్తాడు.

మనకివ్వబడిన ఆత్మీయవరాల స్థితిని గుర్తించుటకు అనేక మార్గాలలో సాధించవచ్చు. అత్మీయవరాలా పరీక్ష లేక కనుగొనుటద్వారా పూర్తిగా వాటిమీద అధారపడపోయినప్పటికి, ఖచ్చితంగా మనకివ్వబడిన వరమేదో గుర్తించుటలో అవగాహన కల్పించుటకు తోడ్పడుతుంది. ఇతరులు మనకున్న ఆత్మీయవరాల సామర్ధ్యతను గుర్తించి, మనకు వారిచ్చే సంకేతములవలన అవీ ధృవీకరించబడును. కొంతమంది తరచుగా మనము ప్రభువుని సేవించేటప్పుడు చూచేవారు ఏ ఆత్మీయవరములను ఉపయోగిస్తున్నామో అది మనకు ఖచ్చితముగా దేవుడిచ్చిన వరముగా మనము గుర్తించకపోవటాన్ని లేక స్వీకరించుటను గుర్తిస్తారు. ప్రార్థన చాల ముఖ్యం. మనము ఏ విఢఃఅంగా ఆత్మీయవరాల సామర్ధ్యత కలిగియున్నామో ఒకేఒక వ్యక్తికి ధృఢంగా తెలుసు. ఆయనే ఆవరాలాను అనుగ్రహించేవాడు తన్నుతానే అయిన పరిశుధ్ధాత్ముడు. మనము ఎటువంటి వరములతో నింపబడమో, శేష్టమైన పద్దతిలో ఆత్మీయవరాలను తన మహిమ కొరకు ఉపయోగించుటకుగాను మనము దేవునిని అడగవచ్చు.

అవును, దేవుడు కొంతమందిని భోధకులుగాను పిలిచి వారికి భోధించేవరాన్ని ఇచ్చాడు. దేవుడు కొంతమందిని పరిచారకులుగాను పిలిచి వారికి సహాయముచేసే వరాన్ని ఇచ్చాడు. ఏదిఏమైనా, మన ఆత్మీయవారాల్ని ఖచ్చితముగా తెలిసికోవటం వలన ఆ వరాలకు బయట వేరే వరాలను దేవుని సేవించుటకు ఉపయోగించకూడదని అది క్షమించే విషయం కాదు. దేవుడు మనకు ఏదైతే వరం లేక వరాలు అనుగ్రహించాడో వాటిని తెలిసికోవటము అంతా ఉపయోగకరమేనా? ఆత్మీయవరాలపై ఎక్కువ దృష్టి పెట్టి దేవునిని సేవించటానికి ఇవ్వబడిన అనేక అవకాశాలు పోగొట్టుకోవడం తప్పేనా? అవును. మనలను మనము దేవునిచేత వాడబడటానికి సమర్పించుకున్నట్లయితే ఆయనే మనకు అవసరమైన ఆత్మీయవరాలలో ఆయన మనలను సంసిధ్దంచేస్తాడు.


ప్రశ్న: ఆత్మచే నడిపించబడే ఈ అధ్భుతవరాలు ఈ దినాలలోయున్నాయా?

సమాధానము:
దేవుడు ఈ దినాలలో అధ్భుతాలు ఇంకను చేయుచున్నాడా అని ప్రశ్నించటం సబబు కాదని మొదటిగా గుర్తించుకోవాల్సింది. అది అవివేకము మరియు బైబిలుపరమైనది కాదు, దేవుడు ప్రజలను స్వస్థపరచడని, ప్రజలతో మాట్లాడడని, అధ్భుత సూచకక్రియలు చేయడని , ఆశ్చర్యాలు చేయడని అనుకోవటం. మనం ప్రశ్నించవలసిందేటంటే 1కొరింథీ 12-14 లో వివరించబడినరీతిగా , ఆత్మచే జరిగే అధ్భుతక్రియలు ఇంకా మన సంఘాలలో చురుకుగా పనిచేయుచున్నావా లేదా అనేది. ఇది ఒకనికి పరిశుధ్ధాత్ముడు ఆత్మీయవరంను అనుగ్రహిస్తాడా లేదా అనేది కాదు. ప్రశ్న ఏంటంటే పరిశుధ్ధాత్ముడు ఈ దినాలలో ఇంకా అధ్భుతవరాలు నిర్వహిస్తున్నాడా? అన్నిటికన్నా మనం మొత్తంగా గుర్తించాల్సింది పరిశుధ్ధాత్ముడు ఆయన చిత్తము ప్రకారము ఆత్మీయవరాలు నిర్వహించుటకు సమర్థుడు ( 1 కొరింథీ 12: 7-11).

అపోస్తలుల కార్యములు, పత్రికలలో ఎక్కువశాతములో అధ్భుతాలన్ని అపోస్తలులద్వారా వారి సహచరుల ద్వార జరిగినవి. పౌలు ఒక కారణము ఎందుకో చెప్తున్నాడు" ఏలాగు శరీరము ఏకమైయున్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో, యేలాగు శరీరముయొక్క అవయములన్నియు అనేకములైనను ఒక్క శరీరమైయున్నవో, ఆలాగే క్రీస్తు ఉన్నాడు" (2 కొరింథీ 12:12).యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన ప్రతీ విశ్వాసి, సూచనలు, ఆశ్చర్యాలు, మరియు అధ్భుతక్రియలు, సూచనక్రియలు, ఆశ్చర్యాలు, మరియు అధ్భుతక్రియలు చేయుటకు క్రమపద్డతిలో సిద్డపరచబడి స్థోమత కలిగినవారుగా, అవి వుంటేనే అపోస్తలుడుగా గుర్తింపుపొందుటకు ఇవే లక్షాణాలు అని అనుటకు లేదు. అపోస్తలుల కార్యములు 2:22 యేసుక్రీస్తు "ఆశ్చర్యాలు, అధ్భుతక్రియలు మరియు సూచనలు" చేయుటకు "నియమించబడ్డారు". అదేవిధంగా అపోస్తలులు వారు చేసిన అధ్భుతక్రియలను బట్టి వారు దేవునిచే పంపబడినా విచారణాదారులుగా "గుర్తింపు" పొందారు. అపోస్తలుల కార్యములు 14:3 పౌలు బర్నబాసు, అందించిన సువార్తను బట్టి వారు చేసిన అధ్భుతాలు కూడా సత్యమేనని ఋజువుపర్చబడ్డాయి.

కొరింథీ 12-14 అధ్యాలలో ప్రాధమికంగా ఆత్మీయవరాల విషయమై వివరిస్తుంది. ఈ పాఠ్యాభాగాలను చూచినట్లయితే "సామాన్య" క్రైస్తవులకు కూడ అధ్భుతవరాలు ఇవ్వబడినట్లు తెలుస్తుంది (12:8-10, 28-30). అయితే ఇవి ఎంత సామాన్యమైనవో అనేది మనకు వివరించబడలేదు. మనము ముందు నేర్చుకున్నరీతిగా అపోస్తలులు వారు చేసిన సూచకక్రియలు, ఆశ్చర్యములద్వారా గుర్తింపుపొందారని, అయితే సామాన్య క్రైస్తవులుకూడా అధ్భుతవరాలు అనుగ్రహించబడుట అనేది మినహాయింపు గాని నియమంకాదుని సూచిస్తుంది. అపోస్తలులు మరియు వారితోటి సహచరులు తప్ప నూతన నిబంధనలో ఎక్కడ కూడా ప్రత్యేకంగా వారు వ్యక్తిగతంగా ఆత్మచేత అధ్భుతవరాలను ప్రయోగిస్తున్నారని వివరించబడలేదు.

మరిముఖ్యంగా మనము గమనించాల్సింది ఆది సంఘానికి మనకిప్పుడునాట్లుగా పూర్తిస్థాయిలో బైబిలు గ్రంధం లేదు (2 తిమోతి 3: 16-17). అందునుబట్టి, ప్రవచించేవరం, ఙ్ఞానం, తెలివి మొదలగునవి చాల ఖచ్చితముగా ఆది క్రైస్తవులకు దేవుడు వారిని ఏమైతే చేయమన్నాడో వాటిని చేయుటకు గాను అవి ముఖ్య అవసరతలు. ప్రవచించే వరం విశ్వాసులను క్రొత్తసత్యాన్ని మరియు దేవుని ప్రత్యక్షతను తెలియపర్చటానికి సహాయపడింది. అయితే ఇప్పుడు దేవుని ప్రత్యక్షతను బైబిలు ద్వారా పూర్తిగ తెలియడమైంది. "ప్రత్యక్షపరచే" వరాలు ఇంకా ఎన్నటికీ అవసరతలేదు అంటే క్రొత్తనిబంధనలో నున్న రీతిగా అదే స్థాయిలో అవసరంలేదు.

దేవుడు అధ్భుతంగా ప్రజలను ఈ దినాలలో కూడా స్వస్థపరుస్తున్నాడు. దేవుడు ఇంకా మాట్లాడుతూనేవున్నాడు, అది బహిర్గంగా వినిపించబడే స్వరముతోనో, మనమనస్సులలోనో, భావనలలో మరియు చెరగనిముద్రలలోనో. దేవుడు ఇంకా గొప్ప అధ్భుతములు, సూచకక్రియలు మరియు ఆశ్చర్యాలు చేస్తూనే వున్నాడు. కొన్ని సార్లు ఈ అధ్భుతాలు క్రైస్తవులు ద్వారా చేయబడుతుంటాయి. ఏది ఏమైనా, ఇవి ఖచ్చితముగా అత్మచేత చేయబడే అధ్భుతవరాలు కాకపోవచ్చు. ఈ అధ్భుతవరాల ప్రాధమిక ఉద్దేశ్యం ఏంటంటే సువార్త సత్యమని ఋజువుపర్చడానికి, మరియు అపోస్తలులు దేవుని పరిచారకులని నిరూపించుటకు. అధ్భుతవరాలు నిలిచిపోయాయని బైబిలు కొట్టచ్చినట్లు చెప్పుటలేదుగాని అది ఖచ్చితముగా క్రొత్తనిభంధనలో రాసినట్లు ఆ స్థాయిలో అవి ఇంకా అనుకున్నరీతిలో ఎందుకు ఆ రీతిగా పనిచేయకపోవటానికి పునాది మాత్రమే వేస్తుంది.


ప్రశ్న: భాషలలో మాట్లాడుట అనే వరం అంటే ఏంటి?

సమాధానము:
భాషలలో మాట్లాడుటం అన్నది తొలిసారిగా జరిగింది. (అపొస్తలుల కార్యములు 2:14 పెంతెకోస్తు దినాన్న అపొస్తలులు బయటకు వెళ్ళి ప్రజలకు వారి భాషలలోనే సువార్తను అందించారు "క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి" (అపొస్తలుల కార్యములు 2:11).నాలుకలు అన్న గ్రీకు పదంనకు అసలు అర్థం భాషలు. కాబట్టి ఒక వ్యక్తి పరిచర్య చేయుటకుగాను తనకు తెలియని భాష ఇతరులకు వినేవారికి అర్థమయిన భాష అయితే దానిని భాషలలో మాట్లడటంఅని అంటారు. 1కొరింథీ 12-14 పౌలు ఈ అధ్భుతమైన వరములను గురుంచి మాట్లాడుతూ "సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెననియైనను ఙ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను భోదింపవలెననియైనను మీతో మాటలాడకపోయిన యెడల, నా వలన మీకు ప్రయోజనమేమి?" (1 కొరింథీ14:6). అపోస్తలుడైన పౌలు మాటలనుబట్టి అపోస్తలుల కార్యములు గ్రంధములో భాషలు గురించి రాసిన భాగమునకు అంగీకారముగా ఈ పరిచర్యఈ పరిచర్య ఆ భాషను అర్థంచేసుకొనేవారికి సువార్తను అందించుట విషయంలో చాలా విలువైంది. అయితే దానికి అర్థం చెప్పే వారు అవగాహన చేసుకొనేవారు లేకపోయితే నిరుపయోగమైనది.

భాషలకు అర్థం చెప్పగలిగేవరం కలిగిన వ్యక్తి భాషలతో మాట్లాడేవ్యక్తిని అర్థం చేసుకోగలుగుతాడు ఆ భాష రాకపోయిన. ఆ విధంగా అర్థం చెప్పి అందరికి యుపయోగపడేటట్లు చేస్తారు. అవగాహనయ్యేటట్లు "భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను"(1 కొరింథీయులకు 14:13). అర్థమం చెప్పలేనటువంటి భాష విషయంలో పౌలు చాల శక్తివంతమైనటువంటి పదాలు వుపయోగించాడు "అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు భోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు" (1కొరింథీయులకు 14:19).

భాషాలలో మాట్లాడేవరం ఈ నాటికి వర్తిస్తుందా? 1కొరింథీయులకు 13:8 ప్రకారము భాషలైనను "నిలిచిపోవును" అన్నది "పరిపూర్ణమైనది" వచ్చినపుడు అన్న దానిలో ముడిపడివున్నది 1కొరింథీయులకు 13:10. కొంతమంది పండితులు గ్రీకువ్యాకరణాన్ని ఆధారంచేసుకొని ప్రవచనము, ఙ్ఞానము అన్న దానికి వర్తమాన కాలములో ఉన్నవని భాషలు భూతకాలములో వున్నవని దీనిని బట్టి పరిపూర్ణమైనది రాకమునుపే భాషలునిలిచి పోయినదని వాదిస్తారు. ఇది సాధ్యము అనిపించినపుడికి లేఖనభాగము స్పష్టీకరించుటలేదు. మరికొంతమంది యెషయా 28:11 మరియు యోవేలు 2:28-29 వాక్య భాగాలను సూచిస్తూ దేవునియొక్క తీర్పును జరుగుతుంది అని భాషాలలో మాట్లాడుటకు అనేవరాన్ని సూచిస్తారు. 1 కొరింథియులకు 14:22 ప్రకారము భాషల వరము "అవిశ్వాసులకు సూచన." ఈ వాదన ప్రకారము భాషలవరము యూదులకు హెచ్చరిక ఇవ్వడానికి యేసుక్రీస్తును మెస్సీయగా తృణీకరించినందుకు దేవుడు ఇశ్రాయేలీయులను తీర్పుతీరుస్తున్నాడన్నది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులమీద తీర్పు తీర్చునపుడు భాషలవరం దాని నుద్దేశించినటువంటి పనికి నిరుపయోగమైంది (యె రూషలేము రోమీయుల ద్వారా నాశనమైనది క్రీస్తుశకము 70). ఈ దృక్పధం సాధ్యము అని అనిపించినప్పటికి భాషలు ప్రాధమిక ఉద్దేశ్యము పరిపూర్ణమవ్వటాన్నిబట్టి నిలిచిపోవటం అన్న దానికి సరైన హేతువును చూపలేకపోతున్నం. భాషలవరం నిలిచి పోయింది అనటానికి ఖచ్చితమైన ఆధారము ఏదిలేదు.

అదేసమయంలో భాషల వరము ఈ రోజులలో చురుకుగావున్నయెడల అది వాక్యానుసారంగా వుండాలి. అది నిజమైన అర్థవంతమైన భాషై యుండాలి ( 1కొరింథీ 14:10). దాని ఉద్డేశ్యము దేవుని వాక్యాన్ని వేరే భాషమాట్లాడే వ్యక్తికి అందించటానికి ఉపయోగపడాలి. దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చిన ఆఙ్ఞకు అనుగుణంగా ఉండాలి "భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెనుగాని, తనతోను దేవునితోను మాటలాడవచ్చును" (1 కొరింథీ 14:27-28).1కొరింథి14:33 "అలాగే పరిశుధ్దుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు" అనే వచనానికి భిన్నంగా వుండదు.

వేరె వ్యక్తికి సువార్త అందించే వ్యక్తిగాను ఆ వ్యక్తి మాట్లాడే భాషను దేవుడు వరంగా ఇవ్వగలిగే సామర్ధ్యత కలిగినవాడు. ఆత్మ వరములను పంచి ఇచ్చుటలో పరిశుధ్దాత్ముడు సార్వభౌమాధికారము కలిగినవాడు (1కొరింథీ 12:11). మిషనరీలు భాషను నేర్చుకోడానికి స్కూలుకు వెళ్ళకుండ ఉన్నపాళంగా భాషను మాట్లాడే ఉండగలిగే పరిస్థితి వుంటే ఎలాగుంటుందో ఊహించి చూడండి. ఏదిఏమైనప్పటికి దేవుడు ఆ విధంగా తరచుగా వ్యవహరించే వాడు కాడు. క్రొత్త నిబంధన కాలంలో జరిగినట్లు భాషలలో మాట్లాడటం అనేది ఇప్పుడు జరగటంలేదు. అది ఎంతో అవసరమైనప్పటికి భాషల వరాన్ని అభ్యసించేటటువంటి ఎక్కువశాతం మంది దేవుని వాక్యానుసారంగా వ్యవహరించటంలేదు. కాబట్టి ఆత్మల వరం భాషలవరం అయితే నిలిచిపోయింది. లేదా దేవుని ప్రాణాళిక ప్రకారము నేటి సంఘానికి అరుదైనది.