76
సంగీత నాయకునికి. వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన. 
 1 యూదాలో ప్రజలు దేవుని ఎరుగుదురు. 
దేవుని నామం నిజంగా గొప్పదని ఇశ్రాయేలుకు తెలుసు. 
 2 దేవుని ఆలయం షాలేములో* షాలేము యెరూషలేముకు మరియొక పేరు. దాని అర్థము “సమాధానము.” ఉంది. 
దేవుని గృహం సీయోను కొండ మీద ఉంది. 
 3 అక్కడ విల్లులను, బాణాలను కేడెములను, 
కత్తులను ఇతర యుద్ధ ఆయుధాలను దేవుడు విరుగగొట్టాడు. 
 4 దేవా, నీవు నీ శత్రువులను ఓడించిన ఆ కొండల నుండి 
తిరిగి వస్తూండగా నీవు ఎంతో మహిమతో ఉన్నావు. 
 5 ఆ సైనికులు చాలా బలం కలవారని తలంచారు. కాని యిప్పుడు వారు చచ్చి పొలాల్లో పడి ఉన్నారు. 
వారికి ఉన్నదంతా వారి శరీరాల నుండి దోచుకోబడింది. 
బలవంతులైన ఆ సైనికులలో ఒక్కరు కూడా వారిని కాపాడుకో లేకపోయారు. 
 6 యాకోబు దేవుడు ఆ సైనికులను గద్దించాడు. 
రథాలు, గుర్రాలుగల ఆ సైన్యం చచ్చిపడింది. 
 7 దేవా, నీవు భీకరుడవు. 
నీవు కోపంగా ఉన్నప్పుడు ఏ మనిషీ నీకు విరోధంగా నిలువలేడు. 
 8-9 యెహోవా న్యాయమూర్తిగా నిలిచి తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 
దేశంలోని దీన ప్రజలను దేవుడు రక్షించాడు. 
పరలోకం నుండి ఆయన తీర్మానం ఇచ్చాడు. 
భూమి అంతా భయంతో నిశ్శబ్దం ఆయ్యింది. 
 10 దేవా, నీవు దుర్మార్గులను శిక్షించినప్పుడు ప్రజలు నిన్ను స్తుతిస్తారు. 
నీవు నీ కోపం చూపిస్తావు. బతికి ఉన్నవారు మరింత బలంగలవారు అవుతారు. 
 11 ప్రజలారా! మీ దేవుడైన యెహోవాకు మీరు వాగ్దానాలు చేశారు. 
ఇప్పుడు మీరు వాగ్దానం చేసిన దాన్ని ఆయనకు ఇవ్వండి. 
అన్ని చోట్లనుండీ ప్రజలు తాము 
భయపడే దేవునికి కానుకలు తెస్తారు. 
 12 దేవుడు మహా నాయకులను ఓడిస్తాడు. 
భూలోక రాజులందరూ ఆయనకు భయపడుతారు.