134
యాత్ర కీర్తన. 
 1 యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి! 
రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి. 
 2 సేవకులారా, మీ చేతులు ఎత్తి 
యెహోవాను స్తుతించండి. 
 3 యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! 
యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.