25
బిల్దదు 
 1 అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు. 
 2 అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు. 
 3 ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా? 
 4 మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? 
 5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు. 
 6 మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.