మంచి సమాచారం

ప్రశ్న: నిత్యజీవము కలుగుతుందా?

సమాధానము:
దేవునికి వ్యతిరేకముగా: రోమా (3.23) ప్రకారము “అందరూ పాపంచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు”. మనమందరము దేవునికి యిష్టము లేని పనులు చేసి శిక్షకు పాత్రులుగా ఉన్నాము. చివరకి మనం శాశ్వతమైన దేవునికి విరుద్ధ౦గా పాపంచేసినందుకు మనకు ఈ శాశ్వతమైన శిక్ష చాలు. రోమా (6:23) “ప్రకారము పాపం వలన వచ్చు అపరాధ౦ మరణం, కాని దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవము”.

ఎలాగైతే నేమి, (1 పేతురు 2.22) లో చెప్పినట్లుగా ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. మరియు ఆదియందు వాక్యముండెను,ఆ వాక్యము ఆయన రూపమై మనుషుల మధ్య నివసించెను, (యోహాను 1. 1, 14) “అద్వితీయ కుమారునిగా పుట్టి మన పాపములకై వెల చెల్లించెను. దేవుడు తన ప్రేమను ఇలా ప్రకటించెను.. మనము ఇంకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను”. (2 కొరింథి 5: 21) లో చెప్పినట్లుగా పాపమెరుగని ఆయన మనకొరకు పాపమై, మనము అనుభవించవలసిన శిక్షను ఆయన తన మీద వేసుకుని శిలువ మీద చనిపోయెను.(1 కొరింథి 15.1-4) లో చెప్పినట్లుగా మూడవ దినమున మరణము నుండి లేచి మరణము మీద మరియు పాపము మీద విజయము సాధించానని నిరూపించారు. (1పేతురు 1:3) “ఆయన గొప్ప కృప చేత మనకు నిత్యజీవముతో కూడిన నిరీక్షణ కలుగునట్లు మృతులలో నుండి తిరిగిలేచెను”.

అ.కా. (3.19) ప్రకారము మనము మారుమనస్సు పొంది విశ్వాసముతో ఆయనవైపు తిరిగినఎడల—ఆయన ఎవరు?, ఆయన ఏం చేసారు?, మరియు ఎందుకు రక్షణ ఇచ్చారు? అంటే మన పాపములు తుడిచివేయబడు నిమిత్తమై అని అర్థ౦. మనము ఆయన యందు విశ్వాసము ఉ౦చి, మన పాపములకై శిలువపై చనిపోయాడని నమ్మితే, మనము క్షమించబడి మరియు పరలోకములో మన కొరకు వాగ్దానము చేసిన నిత్యజీవమును అందుకోగలము. (యోహాను 3.16) లో చెప్పినట్లుగా “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”. ( రోమా 10:9) ప్రకారము “యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినయెడల నీవు రక్షింపబడుదువు. క్రీస్తు శిలువలో సమస్తము పూర్తి చేసాడు అన్న విశ్వాసము ఒక్కటే నిత్యజీవానికి దారిచూపిస్తుంది. ఎఫెసి (2:8-9) “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవునివరమే. అది క్రియలవలన కలిగినది కాదు. కాబట్టి ఎవడును అతిశయింప వీలులేదు.

మీరు యేసుక్రీస్తును మీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఇక్కడ నమూనా ప్రార్థన కలదు. గుర్తుంచుకో౦డి, ప్రార్థన చెప్పటం వలన లేదా ఇంకా ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. క్రీస్తుని నమ్ముట ద్వారా మాత్రమే అనగా ఆ నమ్మకమే మీ పాపము నుండి రక్షిస్తుంది. ఈ ప్రార్థన మీకు యిచ్చిన రక్షణ గురించి స్తుతి చెల్లించటానికి మరియు ఆయనయందు మీకున్న విశ్వాసాన్ని వివరించి చెప్పే ఒక దారిమాత్రమే. “దేవా, నాకు తెలుసు, నేను మీకు విరోధముగా పాపము చేసి శిక్షకు పాత్రుడనయ్యాను. కాని క్రీస్తు నా శిక్షను తీసుకుని విశ్వాసం ద్వారా ఆయన ఇచ్చిన క్షమాపణకు అర్హుడనయ్యాను. నా నమ్మకాన్ని మీరు ఇచ్చిన రక్షణలో ఉ౦చుతాను. మీ అద్భుతమైన కృప మరియు క్షమాపణ –శాశ్వతమైన వరము నిత్యజీవము కొరకు ధన్యవాదములు. ఆమెన్".

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: క్షమాపణ లభించిందా? మనం దేవుని నుండి క్షమాపణ ఎలా పొందగలం?

సమాధానము:
అ.కా. 13:38“సహోదరులారా, మీకు తెలియచేసే విషయం ఏమిటంటే యేసు క్రీస్తు ద్వారానే మీ పాపములు క్షమింపబడుతాయి” అని ప్రకటించబడింది.

క్షమాపణ అంటే ఏమిటి మరియు నాకెందుకది అవసరం?

“క్షమాపణ” అనే పదానికి అర్థ౦ పలకను శుభ్రంగా తుడిచివేయడం, క్షమించడ౦ , ఋణాన్ని రద్దు చేయటం అన్నమాట. మనము తప్పు చేసినప్పుడు తిరిగి మన సంబంధాలను కలుపుకోవటానికి క్షమాపణ కొరకు ఎదురుచూస్తాము. ఎందుకంటే ఒక వ్యక్తి క్షమించబడుటకు అర్హుడు అనుకున్న౦త మాత్రాన అతనికి క్షమాపణ ఇవ్వబడదు

క్షమాపణ అనేది ప్రేమ, దయ మరియు కనికరము అనే క్రియలతో కూడినది. క్షమాపణ అనేది మీకు ఏది చేసినప్పటికీ, ఎదుటి వ్యక్తికి వ్యతిరేకముగా వారు చేసినది ఏదైనా గట్టిగా పట్టుకోవటం కాదు.

బైబిల్ ఏం చెపుతుందంటే మన౦దరికీ దేవుని నుండి క్షమాపణ పొందవలసిన అవసరము ఎంతైనా ఉ౦ది. మనమందరము పాపము చేసాము. ప్రసంగి 7:20 లో, “పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు”. “1 యోహాను 1:8 లో మనము పాపము లేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొన్నట్లవును , మరియు మనలో సత్యముండదు”. కీర్తనలు 51:4 లో చెప్పినట్లుగా నేను కేవలము నీకే విరోధముగా పాపము చేసియున్నాను, నీ దృష్టి యెదుట చెడుతనము చేసియున్నాను. దీని ఫలితమే, మనందరికి ఖచ్చితంగా క్షమాపణ అవసరమై ఉన్నది. మన పాపములు క్షమింపబడనియెడల (మత్తయి 25:46: యోహాను 3:36) ప్రకారము మన పాపముల విషయమై మనము నిత్యశిక్షకు పాత్రులగుదుము.

క్షమాపణ—అది నేను ఎలా తెచ్చుకోగలను?

కృతజ్ఙతపూర్వకంగా, దేవుడు ప్రేమ మరియు దయగలవాడు—ఆయన మన పాపములను క్షమించటానికి ఎంతో ఆసక్తి కలవాడు. 2 పేతురు 3.9 లో మనకు తెలుపుతుంది... “ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలెనని దీర్ఘశాంతముతో ఎదురు చూస్తున్నారు”. ఆయన మనలను క్షమించాలని కోరుకుంటున్నారు, అందుకే మనకొరకు క్షమాపణ ఏర్పాటు చేసారు.

మన పాపములకు వెల కేవలము మరణము. రోమా మొదటి సగభాగంలో 6:23లో “పాపము వలన వచ్చు అపరాధము మరణము”…. మన పాపముల వలన మనము సంపాదించుకున్నది నిత్య మరణము. దేవుడు తన ఖచ్చితమైన ప్రణాళిక ద్వారా యేసు క్రీస్తు రూప౦లో ఈ భూమి మీద అవతరించి మనకు రావాల్సిన శిక్షను శిలువపై చనిపోవుట ద్వారా మనకొరకు వెల చెల్లించారు. 2 కొరింథి 5:21 లో, "మనము ఆయనయందు దేవుని నీతి అగునట్లుగా, ఏ పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను”.యేసు శిలువ మీద చనిపోయి, మనకు చెందవలసిన శిక్షను ఆయన తీసుకొనెను. దేవుడిగా యేసు యొక్క మరణము సమస్త మానవాళి పాపములకు క్షమాపణ అందచేయబడినది! (1 యోహాను 2:2) ప్రకారము ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకపాపపరిహారము కొరకై త్యాగధనులై ఉన్నారు. ( 1 కొరింథి 15:1-28 ) యేసు మరణము నుండి లేచి, పాపము మరియు మరణము మీద విజయము సాధించారని ప్రకటించబడింది. దేవునికి స్తోత్రము, యేసు క్రీస్తు మరణము మరియు పునరుద్ధానము ద్వారా రోమా6:23 రెండవ భాగము లో చెప్పింది నిజము... “కాని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్యజీవనము అనే వరము అనుగ్రహించబడింది”.

మీకు మీ పాపములు క్షమించబడాలి అని ఉ౦దా? మీకు ఈ పాపముల నుండి పారిపోలేననే అపరాధ భావన మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? మీ విశ్వాసాన్ని మీ రక్షకుడైన యేసుక్రీస్తు మీద ఉ౦చిన ఎడల మీ పాపములకు క్షమాపణ అవకాశం కలుగుతుంది. ఎఫెసి 1:7 లో చెప్పినట్లుగా “ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ ఆయన కృపా మహదైశ్వర్యమును బట్టి మనకు కలిగి యున్నది”. ఆయన మన అపరాధములకు వెల చెల్లించెను కాబట్టే మన పాపములు క్షమింబడినవి. యేసుద్వారా మీకు క్షమాపణ కలిగిందా అని అడిగితే---నాకు క్షమాపణ ఇవ్వటానికే యేసు చనిపోయారు అని నమ్మినయెడల ఆయన ఖచ్చితంగా మిమ్ములను క్షమిస్తారు. యోహాను 3.16,17 లో చెప్పిన అద్భుతమైన సమాచారము ఏమిటంటే, “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు ఇచ్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు".

క్షమాపణ—అది నిజముగా చాలా తేలికా?

అవును అది చాలా తేలిక! మీరు దేవునినుండి క్షమాపణ పొ౦దలేరు. దేవుని దగ్గర నుండి మీ క్షమాపణ కొరకు మీరు ఏమి చెల్లించలేరు. దేవుని కృప మరియు కనికరము ద్వారా విశ్వాసంతో మాత్రమే మీరు దానిని పొందగలరు. మీరు యేసుక్రీస్తుని మీ రక్షకుడిగా అంగీకరించి మరియు దేవుని వద్దనుండి క్షమాపణ పొందాలంటే ఈ ప్రార్థనను మీరు చేయవచ్చు. ఈ ప్రార్థన చెప్పటం వలన తప్ప మరి ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉ౦చుట ద్వారా మాత్రమే మన పాపములకు క్షమాపణ లభిస్తుంది. ఈ ప్రార్థన యేసు నందు మనకున్న విశ్వాసాన్ని వివరించటానికి మరియు ఆయన మనకు అనుగ్రహించిన క్షమాపణకు కృతజ్ఞతలు చెల్లించటానికి ఒక సులభమైన మార్గము మాత్రమే. “ప్రభువా! నాకు తెలుసు నేను మీకు విరోధముగా పాపము చేసాను మరియు నేను శిక్షకు పాత్రుడను. కాని యేసు క్రీస్తు నాకు చెందవలసిన శిక్షను తీసుకున్నారనే విశ్వాసం ద్వారా నేను క్షమించబడ్డాను. నా రక్షణ కొరకు నా నమ్మకాన్ని మీపై ఉ౦చుతాను. మీ అద్బుతమైన కృప మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు ! ఆమెన్ !”

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: యేసును మీ స్వరక్షకుడిగా అంగీకరించటంలో అర్థ౦ ఏమిటి?

సమాధానము:
యేసుక్రీస్తును మీ స్వరక్షకునిగా అంగీకరించారా ? ఈ ప్రశ్నకు సమాధానము ఇవ్వటానికి ముందు, నాకు వివరించడానికి అవకాశం ఇవ్వండి. ఈ ప్రశ్నను సరిగా అర్థ౦ చేసుకోవాలంటే, ముందు యేసు క్రీస్తు, మీ” స్వంత “మరియు” రక్షకుడని” మీరు సరిగా అర్థ౦ చేసుకోవాలి.

యేసు క్రీస్తు ఎవరు? చాలా మంది యేసుక్రీస్తును ఒక మంచి వ్యక్తిగా, బోధకుడిగా లేదా దేవుని ప్రవక్తగా ఒప్పుకుంటారు. యేసును గూర్చిన ఈ విషయాలన్నీ నిజమే, కాని నిజంగా అతడెవరో ఎవరూ చెప్పలేకపోతున్నారు. బైబిల్ ( యోహాను 1. 1,14 చూస్తే) ఏం చెపుతుందంటే ఆదియందు వాక్యముండెను. ఆ వాక్యము శరీరధారియై, మన మధ్యకు మనకు బోధించటానికి, స్వస్థత పరచటానికి, సరిచేయటానికి, క్షమించటానికి మరియు మనకొరకు చనిపోయారు. మీరు ఈ యేసును అంగీకరించారా?

రక్షకుడు అంటే ఏమిటి మరియు మనకు ఈ రక్షకుడు ఎందుకు అవసరం? (రోమా 3:10-18) లో బైబిల్ ఏం చెపుతుందంటే మనమందరము పాపము చేసాము, చెడు పనులు చేసాము. దాని ఫలితమే దేవుని కోపానికి మరియు ఆయన తీర్పుకి పాత్రులమయ్యాము . (రోమా 6:23, ప్రకటన 20:11-15) లో చూస్తే శాశ్వతమైన మరియు అనంతమైన దేవునికి విరోధముగా మనము చేసిన పాపములకు కేవలము మనకు వచ్చిన శిక్ష అనంతమైనది, అందుకే మనకు రక్షకుడు కావాలి!

యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మనకొరకు ఇక్కడ చనిపోయారు. దేవుడు మానవ రూపములో యేసుగా వచ్చి చనిపోయి మన పాపములకు లెక్కలేనంత వెల చెల్లించారు. (2 కొరింథి 5:21) లో చెప్పినట్లు. ( రోమా 5:8 ) ప్రకారము యేసు చనిపోయి మనపాపములకు వెల చెల్లించెను. మనము చేయలేనిది ఆయన చేసి మన కొరకు వెల చెల్లించెను. యేసు మరణము మీద తెచ్చిన పునరుధ్ధానము ఏమని చెపుతుందంటే ఆయన మరణము మన పాపములకు సరిపడినంత వెల చెల్లించెను. (యోహాను 14.6 ; అ. కా 4.12 ) ప్రకారము ఆయన ఒక్కరే మరియు ఆయన మాత్రమే రక్షకుడు. యేసును మీ రక్షకునిగా మీరు నమ్ముచున్నారా?

యేసు మీ “స్వంత” రక్షకుడా? చాలా మంది క్రైస్తవ తత్వము అంటే చర్చికి రావటం, విధులను ఆచరించటం, కొన్ని నిర్ణీతమైన పాపములు చేయకుండా ఉ౦డటం అనుకుంటారు. ఇది క్రైస్తవ తత్వము కాదు. నిజమైన క్రైస్తవ తత్వము అంటే యేసు క్రీస్తుతో వ్యక్తిగతంగా సంబంధం కలిగివుండటం. యేసుని మీ స్వరక్షకునిగా అంగీకరించటం అంటే మీ స్వంత విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ఆయనపై ఉ౦చటం. ఇతరుల విశ్వాసము ద్వారా ఎవరూ రక్షింపబడరు. కొన్ని నిశ్చయమైన పనులు చేయటం ద్వారా ఎవరూ క్షమించబడరు. రక్షింపబడాలి అంటే ఒకే ఒక మార్గము ఏమిటంటే యేసుని మీ స్వరక్షకుడిగా అంగీకరించటం, నా పాపములకు ఆయన మరణము ద్వారా వెల చెల్లించారు అని నమ్మటం. మరియు ఆయన పునరుధ్ధానము ద్వారా నాకు ఖచ్చితంగా నిత్యజీవము లభించిందని విశ్వసించటం. (యోహాను 3:16) లో చెప్పినట్లు. యేసు మీ స్వరక్షకుడేనా?

యేసును మీ స్వరక్షకుడిగా అంగీకరించాలి అనుకుంటే, దేవునితో ఈ మాటలు చెప్పండి. ప్రార్థన చేయుట వలన గాని మరి ఏ ఇతర ప్రార్థన మిమ్ములను రక్షించలేదు. క్రీస్తు నందు నమ్మకము ఉ౦చుట ద్వారా మాత్రమే మీ పాపములు క్షమించబడతాయి .ఈ ప్రార్దన యేసు నందు మీకు కల విశ్వాసాన్ని వివరించటానికి మరియు ఆయన అందచేసిన రక్షణను గూర్చి కృతజ్ఙతలు చెల్లించటానికి ఉపకరిస్తుంది. ప్రభువా, నాకు తెలుసు నేను నీకు విరోధముగా పాపము చేసి శిక్షకు పాత్రుడనయ్యాను. కాని యేసుక్రీస్తు నాకు చెందవలసిన శిక్షను ఆయన తీసుకొనుట వలన నేను విశ్వాసం ద్వారా క్షమించబడ్డాను. మీరు అందించిన క్షమాపణను తీసుకుని నా నమ్మకాన్ని రక్షణ కొరకు మీలో ఉ౦చుతాను. నేను యేసుని నా స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నాను! మీ అద్బుతమైన కృప మరియు క్షమాపణ ---“ నిత్యజీవనపు వరము కొరకు”కృతజ్ఙతలు! ఆమెన్!

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: రక్షణ ఫ్రణాళిక/ రక్షణమార్గమంటే ఏమిటి?

సమాధానము:
నీవు ఆకలిగొనియున్నావా? శరీరానుసారమైనది ఆకలి కాదు. అ౦తకంటే నీ జీవితంలో ఎక్కువగా దేనికొరకైనా ఆకలి గొనియున్నావా? నీ అంతరంగంలో తృప్తిపరచబడనిది ఏదైనా వున్నదా? అలాగైతే యేసే మార్గము. యేసు చెప్పెను “జీవాహారమును నేనే; నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, మరియు నా యందు విశ్వాసముంచువాడు దప్పిక గొనడు” (యోహాను 6:35)

నీవు కలవరము లో ఉన్నావా? నీ జీవితములో ఎన్నడూ ఒక ఉద్దేశ్యమును కనుగొన లేని స్థితిలో ఉన్నావా? ఎవరో లైటు ఆర్పివేయగా నీవు స్విచ్ కనుక్కోలేనట్లు వున్నదా? అలాగైతే, యేసే మార్గము: " నేను లోకమునకు వెలుగును, నన్ను అనుసరి౦చు వీడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండును" అని యేసు ప్రకటించెను (యోహాను 8:12)

నీ జీవితంలో నీవు బంధింపబడినావని ఎప్పుడైనా అనిపించినదా? శూన్యము, అర్థ రహితమైన వాటినే కనుగొనుటకు, చాలా ద్వారములు తెరువ ప్రయత్నించావా ? సంపూర్తి చేయబడిన జీవితములో ప్రవేశించుటకు చూస్తున్నావా? అలాగయినచో యేసే మార్గము: “నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశి౦చిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు, బయటకి వచ్చుచు మేత మేయుచుండును (యోహా 10:19)

ఇతరులు నిన్ను ఎప్పుడూ చిన్న చూపు చూస్తున్నారా! నీ సంబంధ బా౦ధవ్యాలు శూన్యముగాను ఖాళీగానున్నవా? ప్రతివారు నిన్నుబట్టి లాభ౦ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుందా! అయినచో యేసే మార్గము. “నేను గొర్రెలకు కాపరిని; మంచి కాపరి గొర్రెలను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును” అని యేసు చెప్పెను (యోహా: 10:11, 14)

ఈ జీవితం తరువాత ఏమగునోనని ఆశ్చర్యపోతున్నావా? పనికి రాని, తుప్పుపట్టిన జీవితం విషమై విసిగి పోయావా! అసలు ఈ జీవితమునకు ఏదైనా అర్ధముందా? అని సందేహపడినావా? నీవు చనిపోయిన తరువాత కూడా జీవించాలనుకుంటున్నావా? అలా అయితే యేసే మార్గము; పునరుద్ధానమును, జీవమును నేనే; నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిననూ బ్రతుకును; బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎప్పటికినీ మరణి౦చడు. (యోహా 11:25,26)

ఏది మార్గము, ఏది సత్యము, ఏది జీవము “నేనే మార్గమును సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాడు” అని యేసు చెప్పెను (యోహా 14.6). నీవు ఆకలి గొనుచున్నది, ఆత్మ సంబంధమైన ఆకలి. యేసు చేత మాత్రమే తీర్చ బడగలదు. యేసు మాత్రమే చీకటిని తొలగి౦చ గలడు. తృప్తి పరచే జీవితమునకు యేసు మాత్రమే ద్వారము. నీవు ఎదురు చూచే స్నేహితుడు, కాపరి యేసే! యేసే జీవము- ఈ లోకమునకు, రాబోవు లోకమునకు రక్షణ మార్గము యేసే!

నీవు ఆకలిగొని యుండుటకు కారణము, నీవు చీకటిలో తప్పి పోయిన కారణము, నీ జీవితములో అర్థము గ్రహించలేకపోవుటకు కారణము- నీవు దేవుని నుండి వేరు చేయబడుటయే! మనమందరము పాపము చేసినందున దేవుని నుండి వేరు చేయబడ్డామని బైబిలే సెలవిస్తున్నది (ప్రసంగ౦ 7 20, రోమా 3 23). నీ హృదయమందు శూన్యము కనిపించుటకు గల కారణము నీ జీవితంలో దేవుడు లేనందువల్లనే. దేవునితో సంబంధము కల్గి యుండుటకు మనము సృష్టి౦చబడినాము. మన పాపము వల్ల ఆ సంబంధము నుండి మనము వేరు పర్చబడినాము. ఇ౦కా ఘోరమైనదేమంటే మన పాపము మనలను దేవుని నుండి ఈ జీవితములోనికి రాబోవు జీవితము నుండి నిత్యము వేరుచేస్తూ ఉ౦డడమే! (రోమా 6 23, యోహా 3:36)

ఈ సమస్య ఎలా పరిష్కరింపబడగలదు. యేసే మార్గము! యేసు మనపాపములను తనపైన వేసుకొనెను (2 కొరి 5 :21) మనము పొందవలసిన శిక్షను ఆయన తీసుకుని, మన స్థానములో యేసు చనిపోయెను. (రోమా 5:8). మూడు దినముల తరువాత యేసు మరణము నుండి లేచి, పాపము మీద, మరణము మీద ఆయన జయమును రుజువు చేసెను (రోమా 6: 45) ఎందుకు ఆయన అది చేసెను. “తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు” అని ఆ ప్రశ్నకు యేసే సమాధానము చెప్పెను. ( యోహాను 15: 13) మనము జీవించునట్లుగా యేసు చనిపోయెను. మన విశ్వాసమును యేసు నందు ఉంచినట్లైతే, ఆయన మరణము మన పాపములకు పరిహారముగా చెల్లించాడని నమ్మినట్లైతే- మన పాపములన్నియు క్షమించబడి, కడిగిగివేయబడినట్లే. అప్పుడు మన ఆత్మీయ ఆకలి తీర్చబడును. తిరిగి, వెలుగు వచ్చును. సంపూర్తిచేయబడిన జీవితములోనికి మనకు మార్గముండును. మన మంచి కాపరిని, నిజస్నేహితుని కనుగొనగలము. మనము మరణించిన తరువాత జీవముందని గ్రహించగలము- పునరుద్ధాన జీవితము, పరలోకమందు యేసులో నిత్య జీవము.

“దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”(యోహాను 3:16)

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: క్రైస్తవుడు అంటే ఎవరు?

సమాధానము:
వెబ్ స్టర్స్ డిక్షనరీ ప్రకారము “ఒక వ్యక్తి బాహాటంగా యేసుపై తన నమ్మకాన్ని క్రీస్తుగా లేదా యేసుని గూర్చిన బోధనతో మతము లోకి వచ్చుట”. క్రైస్తవుడు అంటే ఏమిటి అని అర్థ౦ చేసుకోవటానికి ఈ మంచి అ౦శ౦ తో మొదలైంది కాని, చాలా లౌకికపు నిర్వచనముల ప్రకారము బైబిల్ ద్వారా మనకు తెలియ చేసే సత్యమేదో వుంది .

నూతన నిబంధనలో “క్రైస్తవుడు” అనే మాట మూడుసార్లు వాడబడింది. (అ.కా 11:26, అ.కా 26:28, 1 పేతురు 4:16). అంతియోక్ లో (అ.కా 11:26) ప్రధమముగా క్రీస్తును అనుసరి౦చేవారిని క్రైస్తవుడు అనేవారు ఎందుకంటే వారి ప్రవర్తన, పనితీరు మరియు భాషతీరు అంతా క్రీస్తు మాదిరిగా ఉ౦డేది. ఆరంభంలో అంతియోక్ లో రక్షింపబడని వారు క్రైస్తవులను ఒక విధమైన తిరస్కారభావముతో ఎగతాళి చేసేవారు. వెబ్ స్టర్స్ డిక్షనరీ నిర్వచనానికి దగ్గరగావున్న ఒకే ఒక అర్థ౦ ఏమిటంటే “క్రీస్తుకి సంబంధించినవారు” లేదా “క్రీస్తుని అనుసరి౦చేవారిగా లేదా హత్తుకొనిపోవువారు.”

దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కాలం గడిచే కొలది, “క్రైస్తవుడు” అనే పదం ఎంతో గొప్ప సంబంధం కల తన ఉనికిని కోల్పోయి మరియు ఒక మతపరముగా వాడబడటం. అంతేకాక నైతిక విలువలు కలిగి నిజముగా యేసు క్రీస్తుని అనుసరి౦చేవారే కరువైపోయారు . చాలామంది యేసు క్రీస్తునందు విశ్వాసము మరియు నమ్మకము ఉ౦చరు కాని తమకు తామే క్రైస్తవులు అనుకుంటారు ఎందుకంటే చర్చికి వెళ్లటం వలన లేదా క్రైస్తవ దేశంలో జీవించుట వలన కాని, చర్చికి

వెళ్లటంవలన కాని, నీకంటే పైవారికి సేవచేయుటవలన కాని, లేదా మంచివ్యక్తిగా వుండుట కాని, ఈ పైవాటిలో ఏవి మిమ్ములను క్రైస్తవునిగా పరిగణి౦పజేయవు. మతబోధకుడు ఏమి చెప్పారంటే ఒక వ్యక్తి రోజూ గ్యారేజికి వెళ్లినంత మాత్రాన ఆటోమొబైల్ ఇ౦జనీర్ గా ఎలా అవ్వలేడో అలాగే రోజూ చర్చికి వెళ్ళినంత మాత్రమున క్రైస్తవుడు కాలేడు.. చర్చి సభ్యుడిగా ఉ౦డటంవలన, సేవా కార్యక్రమాలకి సక్రమముగా హాజరయినందువలన, మరియు చర్చిపని చేయున౦త మాత్రముననే ఎవరూ క్రైస్తవులు కాలేరు.

బైబిల్ ఏమి చెబుతుందంటే మనం చేసిన మంచిపనులు వేటిని దేవుడు అంగీకరించరు. తీతు పత్రిక 3:5 ప్రకారము “మనము చేసిన నీతికార్యములను మూలముగా కాక, తన కనికరము వలననే రక్షింపబడితిమి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారానూ, పరిశుద్దాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుటద్వారానూ ఆయన మనలను రక్షించెను”. ( యోహను 3:3, 7 1 పేతురు 1:23 ) ఎవరైతే వారి విశ్వసాన్ని, నమ్మకాన్ని యేసుక్రీస్తు పై ఉ౦చుతారో వారే క్రైస్తవులు. ఎఫెసి 2:8 ప్రకారము “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే -”. నిజమైన క్రైస్తవుడు ఎవరంటే ఆమె లేక అతడు తాను చేసిన పాపమునకు పశ్చాత్తాపపడి మరియు తన నమ్మకాన్ని, విశ్వాసాన్ని యేసు క్రీస్తునందు మాత్రమే ఉ౦చటం. వారి నమ్మకం. మతాన్ని వెంబడించటం లేదా ఇది చేయవచ్చు లేదా చేయకూడదు అనే నీతి విలువలతో కూడిన పట్టీని అనుసరి౦చటం కాదు.

నిజమైన క్రైస్తవుడంటే ఆమె లేక అతడు తన నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని యేసుక్రీస్తు పై ఉ౦చి మరియు నిజముగా ఆయన పాపముల కొరకై శిలువ పై చనిపోయి తిరిగి మూడవ దినమున లేచి మరణము మీద విజయము సాధించి ఆయనయందు విశ్వాసము ఉ౦చు వాళ్ళందరికీ నిత్యజీవనము ఇవ్వటానికి చేసిన క్రియ. యోహాను 1ఛ12 లో చెప్పినట్లు: “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవునిపిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను”. క్రీస్తు కొరకు ఎవరైతే తమ జీవితాన్ని సమర్పించుకు౦టారో , వారే నిజమైన క్రైస్తవునిగా అనగా దేవుని బిడ్డగా, నిజమైన దేవుని కుటుంబంలో భాగమవుతారు. (1యోహాను 2:4, 10) ప్రకారము నిజమైన క్రైస్తవతత్వము అంటే ఇతరులను ప్రేమించటం మరియు దేవుని మాటకు విధేయత చూపించటం.

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడంటే అర్థం ఏమిటి?

సమాధానము:
క్రొత్తగా జన్మించిన క్రైస్తవుడంటే అర్థం ఏమిటనా? ఈ ప్రశ్నకి ప్రత్యుత్తరం ఇచ్చే ప్రామాణికమైన వచనం బైబిల్లో యోహాను 3:1-21 లో ఉంది. ప్రభువు యేసుక్రీస్తు ఒక ప్రఖ్యాతి పొందిన పరిసయ్యుడు మరియు సన్హెద్రిన్ ( యూదుల అధికారి) యొక్క సభ్యుడు అయిన నికొదేముతో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రి నికొదేము యేసు వద్దకి వచ్చేడు. యేసుని అడగడానికి అతని వద్ద ప్రశ్నలు ఉన్నాయి.

యేసు నికొదేముతో మాట్లాడినప్పుడు “ నేను నీకు సత్యాన్ని చెప్తాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడని” ఆయన చెప్పేడు. అందుకు నికొదేము- ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమున ప్రవేశించి జన్మింపగలడా? అని ఆయనను అడుగగా! యేసు ఇట్లనెను-ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు (యోహాను 3:3-7).

క్రొత్తగా జన్మించుట” అన్న పదబంధానికి భాషాంతరంగా “ పైనుండి జన్మించుట” అని అర్థం. నికొదేముకి ఒక సహజమైన అవసరం ఉంది. అతనికి తన హృదయంలో ఒక ఆధ్యాత్మిక రూపాంతరం చెందే ఒక మార్పు యొక్క అవసరం ఉంది. నూతన జన్మ- క్రొత్తగా జన్మించడం అన్నది విశ్వసించే వ్యక్తికి నిత్యజీవితం అనుగ్రహింపబడే దేవుని చర్య ( 2 కొరింధీయులు 5:17; తీతుకు 3:5; 1 పేతురు 1:3; 1 యోహాను 2:29; 3:9; 4:7 ; 5:1-4; 18). “క్రొత్తగా జన్మించుట” యేసు క్రీస్తు నామమున ఉన్న విశ్వాసము మూలముగ “దేవుని బిడ్డలయే” భావాన్ని కూడా వ్యక్తపరుస్తుందని యోహాను 1:12,13 సూచిస్తుంది.

“ ఒక వ్యక్తికి క్రొత్తగా జన్మించే అవసరం ఏమిటుంది” అన్న ప్రశ్న తార్కికంగా తలెత్తుతుంది. “ మీ అపరాధములచేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రతికించెను” అని ఎఫసీయులు 2:1 లో అపొస్తలు పౌలు చెప్పెను. రోమీయులు 3:23 లో అపొస్తలు రోమీయులకి “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోందలేక పోవుచున్నారు” అని రాసెను. కావున తమ పాపాలు క్షమించబడటానికి మరియు దేవునితో ఒక సంబంధం ఉండే నిమిత్తము ఒక వ్యక్తికి క్రొత్తగా జన్మించే అవసరం ఉంది.

కావున అదెలా అయింది? “మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలులేదు” అని ఎఫసీయులు 2:8-9 చెప్పును. ఎవరైనా రక్షింపబడినప్పుడు అతను/ఆమె క్రొత్తగా జన్మించి ఆధ్యాత్మికంగా నూతన సృష్టి అయి క్రొత్తజన్మ హక్కు కొద్దీ ఇప్పుడు దేవుని బిడ్డ అవతాడు/అవుతుంది. ఆయన శిలువమీదన మరణించినప్పుడు యేసుక్రీస్తునందు నమ్మకంతో పాపానికి దండనని చెల్లించిన వ్యక్తే ఆధ్యాత్మికంగా “ క్రొత్తగా జన్మించినవాడని అర్థం. “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను( కొరింథీయులు 5:17). ప్రభువు యేసుక్రీస్తు మీ రక్షకుడని మీరు ఎప్పుడూ నమ్మకపోతే పరిశుద్ధాత్మ మీ హృదయంతో మాట్లాడినప్పుడు ఆయన్ని ప్రేరేపించడాన్ని మీరు పరిగణిస్తారా? మీకు క్రొత్తగా జన్మించవలిసిన అవసరం ఉంది.

మీరు మారుమనస్సు యొక్క ప్రార్థన చేసి ఈ కాలమందు క్రీస్తునందలి క్రొత్త సృష్టి అవతారా? “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని రక్తమువలనైనను శరీరేచ్ఛలవలనైనను మానుషేచ్ఛలవలనైనను పుట్టినవారు కారు.

మీరు కనుక యేసుక్రీస్తును మీ రక్షకునిగా అంగీకరించాలనుకొని క్రొత్తగా జన్మిస్తే ఇక్కడ ఒక మచ్చు ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనని కానీ ఇంకే ప్రార్థనని కానీ పలికినందు వల్ల మీరు రక్షింపబడరు. క్రీస్తు మీదన నమ్మకాన్ని పెట్టడం మాత్రమే మిమ్మల్ని పాపం నుండి రక్షించేది. ఈ ప్రార్థన దేవుని పట్ల మీ విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక మార్గం మాత్రమే మరియు మీ రక్షణకి దోహదపడినందుకు మీరు ఆయనకి “దేవా, నీ పట్ల నేను పాపం చేసేనని నాకు తెలుసు. మరియు నేను శిక్షకి పాత్రుడను. ఆయనయందు విశ్వాసం వల్ల నేను క్షమింపబడటానికి యేసుక్రీస్తు నా శిక్షని భరించేడు. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీమీదన ఉంచుతాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క బహుమానం. అమేన్‌.

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: నాలుగు ధర్మశాస్త్రాలు ఏవి?

సమాధానము:
నాలుగు ధర్మశాస్త్రాలు యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా లభ్యమయే రక్షణ యొక్క శుభ సమాచారాన్ని పంచుకునే ఒక మార్గం. సువార్తలో ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని పొందుపరిచే ఒక సరళమయిన విధానం ఇది.

“దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నీ జీవితం కోసమని ఆయన వద్ద ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది” అన్నది నాలుగు ధర్మశాస్త్రాలలో మొదటిది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను” అని యోహాను 3:10 మనకి చెప్తుంది. “గొఱ్ఱెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు వచ్చిన కారణాన్ని మనకి యోహాను 10:10 తెలుపుతుంది. దేవుని ప్రేమనుంచి మనలని అడ్డుకుంటున్నది ఏది? మనకి ఒక సమృద్ధిగల జీవితం ఉండటాన్ని ఆపుతున్నది ఏది?

నాలుగు ఆధ్యాత్మిక ధర్మశాస్త్రాలలో రెండవది, “విధేయత పాపం వల్ల కళంకపడింది కాబట్టి అది దేవుని వద్ద నుంచి విడిపోయింది” అన్నది. దాని ఫలితంగా మన జీవితాలకైన దేవుని ప్రణాళికని మనం తెలిసికోలేం. “ అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” అంటూ ఈ సమాచారాన్ని రోమీయులు 3:23 ధృవీకరిస్తుంది. “పాపానికి జీతము మరణము” అని రోమీయులు 6:23 పాపానికి గల పర్యవసానాన్ని మనకి తెలుపుతుంది.

తనతో సహవాసం ఉండటానికి దేవుడు మనలను సృష్టించేడు. ఏమైనప్పటికీ పాపాన్ని లోకంలోకి మానవజాతి తెచ్చింది కాబట్టి అది దేవుని వద్దనుండి విడిపోయింది. మనం తనతో ఉండాలని దేవుడు ఉద్దేశించిన సంబంధాన్ని మనం నాశనం చేసేం. పరిష్కారం ఏమిటి?

ఆధ్యాత్మిక ధర్మశాస్త్రాల్లో మూడవది “ మన పాపానికి దేవుని ఏర్పాటు ఒక్క ఏసుక్రీస్తే” అన్నది. యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు క్షమించబడి మనం దేవునితో ఒక యుక్తమైన సంబంధాన్ని మరల పొందుతాము. “అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకా పాపులమైయుండగానే క్రీస్తు మనకోసము చనిపోయెను” అని రోమీయులు 15:3-4 మనకి చెప్తుంది. “అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను” అని తెలియజేస్తూ రక్షింపబడటానికి మనకి తెలిసికోవలిసిన మరియు నమ్మవలిసిన అవసరం ఉందని 1 కొరింధీయులు 15:3-4 సెలవిస్తుంది. యోహాను 14:6 లో రక్షణకి తను ఒక్కడే మార్గమని యేసు తానే యోహాను 14:6 లో ప్రకటిస్తాడు, “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకి రాడు.” రక్షణ యొక్క ఈ అద్భుతమైన వరాన్ని నేను ఎలా పొందగలను?

ఆధ్యాత్మిక ధర్మశాస్త్రాలలో నాలుగవది, “రక్షణ యొక్క వరాన్ని మరియు మన జీవితాల కొరకైన దేవుని అద్భుతమైన ప్రణాళికని తెలుసుకోవడానికి మనం మన విశ్వాసాన్ని యేసుక్రీస్తుపైనే ఉంచాలి” అన్నది. దీన్ని యోహాను 1:12 మనకి వర్ణిస్తుంది, “తన్ను ఎందరంగీకరించితిరో, వారికందరికి, అనగా తన నామమందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.” అపొస్తలుల కార్యములు 16:31 “ ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము.” అని దీన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు”( ఎఫెసీయులు 2:8-9).

మీ రక్షకునిగా మీరు కనుక యేసుక్రీస్తుని నమ్మాలనుకుంటే ఈ క్రింద ఉన్న వాక్యాలని దేవునితో చెప్పండి. ఈ వాక్యాలని చెప్పడంతో అవి మిమ్ము రక్షింపవు గానీ క్రీస్తుపైన విశ్వాసముంచడం మిమ్ము రక్షిస్తుంది. ఈ ప్రార్థన దేవునియందు మీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు అర్పించడానికి ఒక దారి మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షకి పాత్రుడనని నాకు తెలుసు. కానీ నా శిక్షని ప్రభువు యేసుక్రీస్తు తీసుకున్నాడు. దాని వల్ల ఆయనయందు ఉన్న విశ్వాసము ద్వారా నేను క్షమింపబడగలను. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీ మీద పెడుతున్నాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క వరం! ఆమెన్ ‍.

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: నేను దేవునితో ఎలా సరిగ్గా అవగలను?

సమాధానము:
దేవునితో “సరిగ్గా” ఉండటానికి “తప్పు” అంటే ఏమిటో అని మనం ముందు అర్థం చేసుకోవాలి. సమాధానం పాపం. “మేలు చేయువారెవరును లేరు. ఒక్కడైనను లేడు” (కీర్తన 14:3). మనం దేవుని శాసనాల పట్ల తిరగబడ్డాం; మనం దారి తప్పిన గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి” (యెషయా 14:3).

చెడు సమాచారం ఏదంటే పాపానికి జీతం మృత్యువు. “పాపము చేయువాడే మరణమునొందును” (ఎహెజ్కేలు 18:4). శుభ సమాచారం ఏమిటంటే మనకి రక్షణని తెచ్చుటకు దేవుడు మనలని వెంబడించేడు. “నశించినదానిని వెదికి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను” (లూకా 19:10), మరియు “ఇది సమాప్తమాయెను” అన్న మాటలని శిలువ మీదన మరణించినప్పుడు ఆయన ప్రకటించినప్పుడు ఆయన ఉద్దేశ్యం నెరవేరింది(యోహాను 19:30).

మీ పాపాన్ని అంగీకరించడంతో దేవునితో మీకు సరియైన సంబంధం ఉండటం ప్రారంభం అవుతుంది. తరువాత దేవునితో మీ పాపం యొక్క మీ వినయం గల ఒప్పుదల మరియు పాపాన్ని పరిత్యజించే నిర్ధారణా వస్తాయి (యెషయా 57:15). “ ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును” (రోమీయులు 10:10).

మారుమనస్సు పొందడం విశ్వాసము వల్ల అనుసరించబడాలి, ప్రత్యేకంగా ఆయన మీ రక్షకునిగా ఆయన్ని పాత్రునిగా చేసిన యేసు యొక్క మరణత్యాగం మరియు మహాద్భుతమైన పునరుత్ధానం వల్ల వచ్చిన విశ్వాసం.”......అదేమనగా- యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు” (రోమీయులు 1010). యోహాను 20;27, కార్యములు 1631, గలతీయులు 2:16, 26 మరియు ఎఫసీయులు 2:8 వంటి అనేకమైన ఇతర వచనాలు విశ్వాసం యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడుతాయి.

దేవునితో సరియైన సంబంధం ఉండటం అన్నది మీ పక్షాన్న దేవుడు ఏమిటి చేసేడో అన్న మీ ప్రతిస్పందన యొక్క సంగతి.

ఆయన రక్షకుడిని పంపించేడు, మీ పాపాన్ని తీసివేసే త్యాగాన్ని ఆయన ఏర్పరిచేడు(యోహాను 1:29), మరియు “అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణ పొందుదురు” అన్న వాగ్దానాన్ని ఆయన మీకనుగ్రహిస్తాడు( కార్యములు 2:21).

పశ్చాత్తాపం మరియు క్షమాపణ యొక్క ఒక అందమైన దృష్టాంతం తప్పిపోయి దొరికిన కుమారుని ఉపమానం( లూకా 15:11-32). చిన్నకుమారుడు తన తండ్రి ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను( 13 వ వచనం). అతను తన దుర్వ్యాపారమును గుర్తించినప్పుడు అతను ఇంటికి తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాడు( వచనం 18). ఇకమీదట కుమారుడనని పిలిపించుకొనుటకు తను యోగ్యుడని కానని అని అతననుకున్నాడు( 19 వ వచనం), కానీ అతను తప్పు. తప్పిపోయి దొరికిన తిరుగుబాటుదారుని తండ్రి ఎప్పటివలె ప్రేమించెను( 20 వ వచనం). అంతా క్షమింపబడింది మరియు ఒక ఉత్సవము జరిగింది( వచనం 24). క్షమాపణ యొక్క వాగ్దానంతో పాటు దేవుడు వాగ్దాలన్నిటినీ నెరవేర్చే మంచివాడు. “విరిగిన మనస్సుగలవారికి యహోవా ఆసన్నుడు. నలిగిన మనస్సు కలిగినవారిని ఆయన రక్షించును”(కీర్తన 34;18).

మీరు కనుక దేవునితో సరియైన సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటే ఇక్కడ ఒక సరళమయిన ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనని కానీ లేక ఇంకే ప్రార్థనని కానీ పలకడం మిమ్ము రక్షించదని జ్ఞాపకం పెట్టుకోండి. పాపం నుంచి మిమ్ము రక్షించేది క్రీస్తునందలి విశ్వాసం మాత్రమే. ఈ ప్రార్థన దేవునిపైన మీకు ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికీ ఒక మార్గం మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షని పాత్రుడనని నాకు తెలుసు. కానీ ఆయనయందు విశ్వాసం వల్ల నేను రక్షింపబడటానికి నేను పాత్రుడనయిన శిక్షని యేసుక్రీస్తు తీసుకున్నాడు. నీ అద్భుతమయిన మహిమకి మరియు క్షమాపణకి నీకు కృతజ్ఞతలు- నిత్యజీవితం యొక్క వరం! అమేన్‌”

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: పరలోకానికి వెళ్ళడానికి యేసు ఒక్కడే మార్గమా?

సమాధానము:
“నేను ప్రాధమికంగా ఒక మంచి వ్యక్తిని, కాబట్టి నేను పరలోకానికి పోతాను.” సరే. నేను కొన్ని చెడు విషయాలని చేస్తాను కాని నేను మంచి విషయాలని ఎక్కువ చేస్తాను, కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను.” “నేను బైబిల్ ప్రకారం జీవించనందువల్ల నన్ను దేవుడు పాతాళలోకానికి పంపించడు. కాలం మారింది!” “చిన్నపిల్లలపైన అత్యాచారం చేసేవారు మరియు హంతకులవంటి నిజమైన చెడ్డవారు మాత్రమే పాతాళలోకానికి వెళ్తారు

అవన్నీ సామాన్యమైన హేతువాదాలు, కానీ నిజం ఏమిటంటే అవన్నీ అసత్యాలు. లోకానికి పరిపాలకుడైన సాతాను ఈ ఆలోచనలని మన మెదళ్ళలో నాటుతాడు. అతడు మరియు అతని మార్గాలని అనుసరించే ఎవరైనా దేవుని శత్రువు (1 పేతురు 5:8). సాతాను ఒక మోసగాడు మరియు తరచుగా మారువేషాన్ని ధరిస్తాడు

(2 కొరింథీయులు 11:14), కానీ దేవునికి చెందని మనస్సులన్నిటిపైన అతనికి నియంత్రణ ఉంది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను(2 కొరింధీయులు 4:4).

దేవుడు చిన్నపాపాలని పట్టించుకోడు అని నమ్మడం లేక పాతాళలోకము “చెడ్డవారి” కోసము ప్రత్యేకింపబడి ఉందని నమ్మడం ఒక అబద్ధము. పాపమంతా మనలని దేవునినుండి వేరుపరుస్తుంది, “ఒక చిన్న అబద్ధమైనప్పటికీ” కూడా. ప్రతిఒక్కరు పాపం చేసేరు మరియు పరలోకంలోనికి తమంతట తామే ప్రవేశించడానికి ఎవరూ గానీ తగినంత మంచివారు కారు (రోమీయులు 3:23). మన మంచితనం మన చెడ్డతనం కన్నా ఎక్కువా అన్నదానిపైన పరలోకంలోకి ప్రవేశించడం ఆధారపడదుః అదే కనుక విషయమైతే మనమందరం ఓడిపోతాం. “అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు. కానియెడల కృప ఇకను కాకపోవును”( రోమీయులు 11:6). పరలోకములోనికి ప్రవేశాన్ని పొందడానికి మనం చేసే మంచిపనేదీ లేదు( తీతుకు 3:5).

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది. దానిద్వారా ప్రవేశించువారు అనేకులు (మత్తయి 7:13). దేవుడిని విశ్వసించడం లోకమర్యాద కాకపోయిన ఒక సంస్కృతిలో ప్రతి ఒక్కరూ పాపంపూరితమయిన జీవితాన్ని గడుపుతున్నప్పుడు దేవుడు దాన్ని మన్నించడు.

“మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రతికించెను. మీరు వాటిని చేయుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి”( యెఫెసీయులు 2:1-2).

దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు అది పరిపూర్ణంగా మరియు మంచిగా ఉండేది. తరువాత ఆయన ఆదాముని మరియు హవ్వని సృష్టించి వారికి వారి స్వేచ్ఛానుసారమైన చిత్తాన్ని ఇచ్చేడు. దాని వల్ల వారికి దేవుడిని అనుసరించాలో లేక పాటించాలో అన్న ఎంపిక ఉండగలదు. కానీ దేవుని పట్ల అవిధేయత చూపడానికి, వారు సాతాను వల్ల ప్రలోభపరచబడి, పాపం చేసేరు. ఇది దేవునితో ఒక అన్యోన్యమైన సంబంధం ఉండకుండా వారిని(మరియు మనతో కలుపుకుని వారి తరువాత వచ్చిన ప్రతి ఒక్కరిని) వేరుపరచింది. ఆయన పరిపూర్ణుడు, పరిశుద్ధుడు మరియు పాపాన్ని తీర్పుతీర్చవలిసినవాడు. పాపులుగా మనంతట మనమే దేవునితో సఖ్యత పడలేము. కాబట్టి మనం ఆయనతో పరలోకంలో ఏకం కావడానికి దేవుడు ఒక దారిని చూపించేడు. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టినవానియందు, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, నిత్యజీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను (యోహాను 3:16). “ఏలయనగా, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము, మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. మనము మరణించనక్కరలేకుండా క్రీస్తు మన పాపాలకి మరణించవలిసి వచ్చింది. ఆయన మరణానికి మూడుదినాల పిమ్మట తను మృత్యువుపైన విజేయుడనని నిరూపించుకుంటూ ఆయన సమాధినుండి లేచెను. మనం కనుక విశ్వసిస్తే మనకి ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధం ఉండేటందుకు ఆయన దేవునికి మరియు మనిషికి మధ్యన ఉన్న దూరాన్ని తొలిగించేడు.

“ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము” (యోహాను 17:3). సాతానుతో సహా అధికమంది దేవుడిని నమ్ముతారు. కానీ రక్షణని పొందడానికి మనం దేవుని తట్టు తిరిగి, ఒక వ్యక్తిగతమైన సంబంధాన్ని ఏర్పరచుకొని, మన పాపాలనుండి దూరం తొలిగి, ఆయన్ని వెంబడించాలి. మనం మన వద్ద ఉన్న ప్రతీదానితో మరియు చేసే ప్రతిదానితో యేసునందు నమ్మకాన్ని పెట్టాలి. “అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు( రోమీయులు 3:22). క్రీస్తుద్వారా తప్పితే రక్షణకి ఇంకేమార్గమును లేదని బైబిల్ బోధిస్తుంది. యోహాను 14:6 లో “యేసు-నేనే మార్గమును, సత్యమును, జీవమును; నాద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకి రాలేడు” అని యేసు యోహాను 14:6 లో చెప్తాడు.

యేసు ఒక్కడే మన పాపపరిహారాన్ని చెల్లించేవాడు కనుక రక్షణకి ఆయన మాత్రమే మార్గము (రోమీయులు 6:23). పాపం యొక్క లోతు లేక గంభీరత మరియు దాని పర్యవసానాల గురించి ఏ ఇతర ధర్మం బోధించదు. యేసు ఒక్కడే వీలుకల్పించే పాపానికి గల అనంతమైన మూల్యాన్ని ఏ ఇతర మతమూ ఇవ్వజూపదు. ఏ ఇతర “మత మూలపురుషుడూ “ మనిషి అయిన దేవుడు కాడు( యోహాను 1:1,14)- ఒక అనంతమైన రుణం చెల్లించబడే ఒకటే మార్గము. మన రుణాన్ని ఆయన చెల్లించేందుకు యేసు దేవుడు అయి ఉండాలి. ఆయన మరణించేటందుకు, యేసు మనుష్యుడైయుండాలి. రక్షణ యేసుక్రీస్తునందలి విశ్వాసము వల్ల మాత్రమే లభ్యమౌతుంది ! “మరి ఎవరివలనను రక్షణ కలుగదు; ఆ నామముననే రక్షన పొందవలనుగాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను (కార్యములు 4:12).

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: నేను మరణించినప్పుడు నేను పరలోకానికి వెళ్తానని నేను ఎలా నిశ్చయంగా తెలిసికోగలను?

సమాధానము:
మీకు నిత్యజీవితం ఉందని మరియు మీరు మరణించినప్పుడు మీరు పరలోకానికి వెళ్తారని మీకు తెలుసా? మీరు నిశ్చయంగా ఉండాలని దేవుడు కోరతాడు! “దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవము గలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను” అని బైబిల్ సెలవిస్తుంది (1యోహాను 5:13). సరిగ్గా ఇప్పుడే మీరు దేవుని ముందు నిలుచుని ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని “ నేను నిన్ను పరలోకంలోనికి ఎందుకు అనుమతించనీయాలి?” అని అడిగేడనుకుందాం. మీరేమిటి చెప్తారు? ఏ ప్రత్యుత్తరం ఇవ్వాలో అని మీకు తెలియకపోవచ్చు. దేవుడు మనలని ప్రేమిస్తాడని మరియు మనం నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతామో అని మనం నిశ్చయంగా తెలిసికోగల ఒక దారిని ఆయన చూపించేడనీ మనం తెలిసికోవడం అవసరం. బైబిల్ దీన్ని ఈ విధంగా చెప్తుందిః “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను”(యోహాను 3:16).

మనలని పరలోకానికి దూరంగా ఉంచిన సమస్యని మనం మొదట అర్థం చేసుకోవాలి. సమస్య ఇది- దేవునితో ఒక సంబంధాన్ని కలిగి ఉండటాన్ని మన పాపపూరితమైన స్వభావం అడ్డగిస్తుంది. మనమందరం స్వభావపూర్వకంగా మరియు ఎంపికకొద్దీ పాపులం. “ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు”(రోమీయులు 3:23). మనలని మనం రక్షించుకోలేం. “మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు. దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడవీలు లేదు”(ఎఫసీయులు 2:8-9). మనము మరణానికి మరియు పాతాళలోకమునకు పాత్రులము. “ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము” (రోమీయులు 6:23). దేవుడు పరిశుద్ధుడు మరియు న్యాయమైనవాడు మరియు పాపాన్ని శిక్షించవలిసినవాడు అయినప్పటికీ ఆయన మనలని ప్రేమించి మన పాపానికి క్షమాపణ యొక్క వీలుని కల్పిస్తాడు. “యేసు-నేనే మార్గమును, సత్యమును, జీవమును; నాద్వారానే తప్ప యెవడును తండ్రి వద్దకి రాడు” అని యేసు చెప్పేడు (యోహాను 14:6). యేసు మననిమిత్తము శిలువపైన మరణించేడుః “ ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయమై చంపబడియు....(1 పేతురు3:18). యేసు మృతులలోనుండి పునరుద్ధానుడయెను. “ ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను” (రోమీయులు 4;25).

కాబట్టి అసలు ప్రశ్నకి తిరిగి వద్దాము. నేను మరణించినప్పుడు నేను పరలోకానికి పోతానని నేను ఎలా నిశ్చయపరచుకోగలను?” సమాధానం ఇది- “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము; అప్పుడు నీవును నీఇంటివారును రక్షణ పొందుదురు(కార్యములు 16:31). “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను 1:12). మీరు నిత్యజీవమును ఉచితవరముగా పొందగలరు. “ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము” (రోమీయులు 6:23). “గొఱ్ఱెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకునేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” అని యేసు చెప్పెను(యోహాను 10:10). ఆయన ఇలా వాగ్దానం చేసేడు కనుక మీరు యేసుతోడి పరలోకంలో నిత్యత్వాన్ని గడపగలరు “ నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును” (యోహాను 14:3).

మీ రక్షకునిగా మీరు క్రీస్తుని అంగీకరించాలనుకుని దేవుని వద్దనుండి క్షమాపణని పొందాలంటే మీరు ప్రార్థించవలిసిన ఒక ప్రార్థన ఇక్కడ ఉంది. ఈ ప్రార్థనని కానీ లేక ఇంకే ఇతర ప్రార్థనని కానీ పలకడం మిమ్మల్ని రక్షించదు. పాపం నుంచి మిమ్ము రక్షించేది క్రీస్తునందలి విశ్వాసం మాత్రమే. ఈ ప్రార్థన దేవునిపైన మీకు ఉన్న విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికీ ఒక మార్గం మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షని పాత్రుడనని నాకు తెలుసు. కానీ ఆయనయందు విశ్వాసం వల్ల నేను రక్షింపబడటానికి నేను పాత్రుడనయిన శిక్షని యేసుక్రీస్తు తీసుకున్నాడు. నీ అద్భుతమయిన మహిమకి మరియు క్షమాపణకి నీకు కృతజ్ఞతలు- నిత్యజీవితం యొక్క వరం! అమేన్‌”

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: మరణము పిమ్మట జీవం ఉంటుందా?

సమాధానము:
మరణము పిమ్మట జీవం ఉంటుందనా? బైబిల్ మనకి తెలియచెప్తుంది, “ స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును..... మరణమైన తరువాత నరులు బ్రదుకుదురా” ( యోబు 14:1-2,14).

యోబువలె మనలో ఇంచుమించు అందరిమీ ఈ ప్రశ్నని ఆక్షేపించేము. మనం మరణించిన పిమ్మట సరిగ్గా ఏమిటి జరుగుతుంది? మనం కేవలం ఉనికిలో ఉండటం ఆపివేస్తామా? వ్యక్తిగత అధిక్యతని సాధించే నిమిత్తము భూమిమీదనుంచి పోయి తిరిగి వచ్చే చుట్టూ తిరిగే తలుపా జీవితం? అందరూ ఒక్క చోటకే పోతారా లేక మనం భిన్నమైన స్థలాలని పోతామా? నిజంగా ఒక పరలోకం మరియు పాతాళలోకం ఉన్నాయా లేక అది మనస్సులో ఊహించుకున్నది మాత్రమేనా?

మరణానికి పిమ్మట జీవం ఉండటమే కాక నిత్యజీవితం ఎంత మహిమాత్మకమైనదంటే “దేవుడు తన్ను తాను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,మనుష్య హృదయమునకు గోచరమవలేదు” (1 కొరింధీయులు 2:9). యేసుక్రీస్తు దేవుని శరీరంయందు మనకి నిత్యజీవితం యొక్క ఈ వరాన్ని ప్రసాదించడానికి భూమిమీదకి వచ్చేడు. “మన యతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది” (యెషయా 53:5).

మనలో ప్రతి ఒక్కరిమీ పాత్రులైన శిక్షని యేసు తన మీద మోపుకొని తన జీవితాన్నే త్యాగం చేసేడు. మూడు దినాల పిమ్మట ఆత్మయందు మరియు శరీరంయందు సమాధిలోనుండి లేవడంతో మరణంపైన తను విజయాన్ని పొందేనని నిరూపించేడు. ఆయన భూమిపైన నలువది దినాలు మిగిలిఉండి పరలోకమందు తన నిత్యనెలవుకి లేచేముందు వేలమందివల్ల సాక్ష్యమివ్వబడ్డాడు. “ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను” అని రోమీయులు 4:25 చెప్తుంది.

క్రీస్తు యొక్క పునరుత్ధానం యుక్తముగా వృత్తాంతపరచబడిన ఘటన. అపొస్తలు పౌలు దాని బలాన్ని పరీక్షించడానికి సాక్ష్యులని ప్రశ్నించమని మనుష్యులని ఆపేక్షించేడు. క్రైస్తవత్వం యొక్క మూలరాయి పునరుత్ధానం. క్రీస్తు మృతులలోనుండి లేపబడినందున మనం కూడా పునరుత్ధరించబడతామని మనకి నమ్మకం ఉండగలదు. దీన్ని నమ్మని కొంతమంది పూర్వపు క్రైస్తవులని అపొస్తలు పౌలు మందలించేడుః “క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు- మృతుల పునరుత్ధానము లేదని యెట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్ధానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడియుండలేడు” (1 కొరింధీయులు 15:12-13).

మరల సజీవులగుటకు లేపబడే ఒక గొప్ప ప్రధమఫలము ఒక్కడే. భౌతికమైన మృత్యువు మనందరికీ సంబంధం ఉన్న ఆదామునుంచి వచ్చింది. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా దేవుని కుటుంబంలోనికి దత్తత చేసుకోబడిన వారందరికి నూతన జీవితం ఇవ్వబడుతుంది ( 1 కొరింధీయులు 15:20-22). దేవుడు క్రీస్తు శరీరాన్ని లేపేడో అటువలె యేసు రాకడతో మన శరీరములు పునరుత్ధరించబడతాయి( 1 కొరింధీయులు 6:14).

మనమందరం ఆఖరికి పునరుత్ధరించబడేటప్పటికీ ప్రతి ఒక్కరు కలిపికూడి పరలోకంలోనికి ప్రవేశింపరు. అతను కానీ లేక ఆమెకానీ తమ నిత్యత్వాన్ని ఎక్కడ గడపబోతారో అన్న నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ ఎంచుకోవాలి. మనం ఒకసారే మరణించాలని నిర్ణయింపబడియున్నదని మరియు దాని పిమ్మట తీర్పు వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతులు అయినవారు పరలోకంలో నిత్యజీవితంలోనికి ప్రవేశిస్తారు కానీ అవిశ్వాసులు నిత్యశిక్షకి లేక పాతాళలోకానికి పంపించబడతారు (మత్తయి 25:46).

పరలోకంవలె పాతాళలోకం ఉనికి యొక్క ఒక స్థితి కానీ ఒక శబ్దతహ్ మరియు చాలా సత్యమైన స్థలం. అనీతిమంతులు దేవుని వద్దనుంచి వచ్చే నిరంతరమైన శాస్వతమైన ఉగ్రతని భరించే చోటది. వారు అవమానం, వ్యాకులత మరియు తిరస్కారం వల్ల కలిగే ఉద్వేగాత్మకమైన మానసికమైన మరియు భౌతికమైన పీడని అనుభవిస్తారు.

పాతాళలోకము ఒక అగాధము అని (లూకా 8:31, ప్రకటన 9:1). మరియు అగ్నిగుండం అని అగ్నిగంధకములు గల గుండము అని మరియు అచ్చట ఉన్నవారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురని (ప్రకటన 20:10) వర్ణించబడింది. పాతాళలోకమందు తీవ్రమయిన దుఃఖం మరియు కోపాన్నీ సూచిస్తూ ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు ఉండును (మత్తయి 13:42). అది పురుగు చావని మరియు అగ్ని ఆరని ఒక చోటు( మార్కు 9:48). దుర్మార్గుడు మరణమునొందుట వలన దేవునికి సంతోషము లేదు కానీ వారు తమ దుర్మార్గతనుండి మరలి బ్రదుకుట వలన ఆయనకు సంతోషం కలుగును( యెహెజ్కేలు 33:11). కానీ వారు లోబడేటట్లు ఆయన బలవంతము చేయడుః మనం కనుక ఆయన్ని తిరస్కరించాలనుకుంటే తిరస్కరించాలనుకుంటే, మనకి కావలిసినది ఇవ్వడం తప్పితే ఆయన వద్ద ఇంకే ఎంపికా లేదు- అది ఆయననుంచి దూరంగా జీవించడం.

భూమిమీదన జీవితం ఒక పరీక్ష, రాబోయేదానికి సన్నాహం. విశ్వాసులకి ఇది దేవుని సన్నిధిని తక్షణమైన నిత్యజీవితం. కాబట్టి మనం ఎలా నీతిమంతులమి అయి మిత్యజీవితాన్ని పొందుకోగలం? ఉన్న ఒక్కటే దారి దేవుని కుమారుడైన యేసుక్రీస్తుయందు విశ్వాసం మరియు నమ్మకం ద్వారా మాత్రమే. ”అందుకు యేసు-పునరుత్ధానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును. బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు”.....(యోహాను 11:25-26) అని చెప్పెను.

నిత్యజీవితం యొక్క వరం మనకందరికీ లభిస్తుంది కానీ దీనికి మనం మన ఐహిక సంతోషాలని విడిచిపెట్టవలిసిన అవసరం మరియు మనల్ని మనం దేవునికి అర్పించుకోవలిసిన అవసరం ఉంది. “కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు. కుమారునికే విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచియుండును (యోహాను 3:36). మరణానికి పిమ్మట మన పాపాలకొరకు ప్రాయశ్చిత్తాన్ని పొందే అవకాశం మనకి ఇవ్వబడదు. ఎందుకంటే ఒకసారి మనం దేవుడిని ముఖాముఖీ ఎదురుకున్న తరువాత ఆయనయందు విశ్వాసముంచడం తప్ప మనకి ఏ ఎంపికా ఉండదు. ఇప్పుడు మనం ఆయన్ని విశ్వాసం మరియు ప్రేమయందు సమీపించాలని ఆయన కోరతాడు. దేవుని పట్ల మన పాపపూరితమైన తిరుగుబాటుతనానికి మూల్యం వలె, మనం క్రీస్తు యొక్క మరణాన్ని అంగీకరించితే, మనకి ఈ భూమిమీదన ఒక అర్థవంతమైన జీవితమేకాక క్రీస్తు సమక్షాన్న ఒక నిత్యజీవితం కూడా అనుగ్రహించబడుతుంది.

మీరు కనుక యేసుక్రీస్తుని మీ రక్షకునిగా నమ్మాలనుకుంటే, ఈ క్రింద ఉన్న వాక్యాలని దేవునితో చెప్పండి. ఈ వాక్యాలని చెప్పడంతో అవి మిమ్ము రక్షింపవు గానీ, క్రీస్తుపైన విశ్వాసముంచడం మిమ్ము రక్షిస్తుంది. ఈ ప్రార్థన దేవునియందు మీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు అర్పించడానికి ఒక దారి మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షకి పాత్రుడనని నాకు తెలుసు. కానీ నా శిక్షని ప్రభువు యేసుక్రీస్తు తీసుకున్నాడు. దాని వల్ల ఆయనయందు ఉన్న విశ్వాసము ద్వారా నేను క్షమింపబడగలను. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీ మీద పెడుతున్నాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క వరం! ఆమెన్ ‍.

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: నా కొరకు యుక్తమైన ధర్మం ఏది?

సమాధానము:
సరిగ్గా మనకి కావలిసినట్టే ఆనతి చేయడాన్ని అనుమతించే ఈ త్వరగా వడ్డించే ఫలహారశాలలు మనలని ఆకట్టుకుంటాయి. కొన్ని కాఫీబడ్డీలు తమ వద్ద ఒక వందకన్నా ఎక్కువ సువాసన మరియు వైవిధ్యం కల భిన్నమైన కాఫీలు దొరుకుతాయని అతిశయోక్తులు చెప్తారు.

మనం ఇళ్లని మరియు కార్లనీ కొన్నప్పుడు కూడా మనకి అభిరుచి ఉన్న తీరుల కోసం మనం చూస్తాం. మనం ఇంక ఒక చోక్లేట్ ,వనీలా మరియు స్ట్రాబెరీ లోకంలో జీవించడం లేదు. అభిరుచే రాజు! మీ వ్యక్తిగత ఇష్టాలు మరియు అవసరాలకి అనుగుణంగా మీరేది కోరుకున్నారో మీరు దానిగురించి కనుక్కోగలరు.

కాబట్టి మీకు సరిపడే ధర్మం మాట ఏమిటి? అపరాధ భావన లేకుండా ఏ హక్కులనీ అడగకుండా ఇది-చేయి, అది-చేయవద్దు వంటి ఎన్నో ఇబ్బందికరమైనవాటితో నిండక ఉన్న ఒక ధర్మం మాట ఏమిటి? అది నేను వర్ణించినట్లే అక్కడ లేదు. కానీ ఒక ఇష్టమైన సువాసన గల ఐస్‌క్రీమ్ వలె ధర్మం ఏదో ఎంచుకునేదా?

మన ధ్యానం కోసం పోటీపడుతున్న ఎన్నో కంఠాలు ఉన్నాయి. అయితే ఎవరైనాకానీ మొహమ్మద్ లేక కన్ఫూసియస్ లేక ఛార్లస్ తాజ్ రస్సెల్ లేక యోసేఫు స్మిథ్ పైన యేసుని ఎందుకు పరిగణించాలి? అన్ని దార్లూ పరలోకానికే దారి తీయవా? అన్ని ధర్మాలూ ప్రాధమికంగా ఒకటే కావా? నిజం ఏమిటంటే అన్ని బాటలూ ఇండియానాని వెళ్ళనట్టే అన్ని ధర్మాలూ పరలోకానికి దారి తీయవు.

యేసు ఒక్కడే మృత్యువుని జయించేడు కనుక యేసు ఒక్కడే దేవుని అధికారంతోపాటు మాట్లాడుతాడు. మహమ్మదు, కన్ఫూసియస్‌ మరియు ఇతరులు తమ సమాధుల్లో అదే దినాన్న కుళ్ళిపోతారు. కానీ యేసు తన అధికారంయందు క్రూరమైన రోమను శిలువపైన మరణించిన మూడుదినాల పిమ్మట సమాధినుండి దూరం నడిచేడు. మరణంపైన అధికారం ఉన్న ఎవరైనా మన ధ్యానానికి పాత్రులు. మరణంపైన అధికారం ఉన్న ఎవరైనా సరే వారికి మాట్లాడే యోగ్యత ఉంది.

యేసు యొక్క పునరుత్ధానానికి ఆధారాన్ని ఇస్తున్న సాక్ష్యం బ్రహ్మాండమైనది. మొదట, లేచిన క్రీస్తుకి అక్షరాలా సాక్ష్యమిస్తున్న వారు ఐదువందలకన్నా ఎక్కువమంది. అది ఎంతో ఎక్కువ. ఐదువందల స్వరాలు నిర్లక్ష్యపెట్టేవికావు. రిక్త సమాధి యొక్క సంగతి కూడా ఉంది. పునరుత్ధానం యొక్క అన్ని పుకార్లనీ యేసు శత్రువులు అతని మృత కుళ్ళిపోతున్న శరీరాన్ని చూపించి సులభంగానే ఆపేవారు, కానీ చూపించడానికి వారి వద్ద ఏ మృతదేహం లేదు. సమాధి ఖాళీగా ఉంది. శిష్యులు ఆయన శరీరాన్ని దొంగిలించి ఉంటారా? అసాధ్యం. అటువంటి అనిశ్చయత్వాన్ని అడ్డుకోవడానికి యేసు సమాధి ఆయుధాలు పట్టుకుని ఉన్న సైనికులవల్ల గట్టిగా కాపలా కాయబడింది. ఆయనకి అతి సన్నిహితమైన అనుచరులు ఆయన అడ్డగింపు మరియు శూలారోపణ పట్ల భయంతో పారిపోయేరన్నది పరిగణించితే భయపడి ఉన్న ఈ చింకిగుడ్డల జాలరుల మేళం శిక్షణ పొందిన శాస్త్రజ్ఞులని ఢీకొనడం అన్నది అతి అసంభవం. వారు అనేకమంది చేసినట్లు తమ జీవితాలనీ త్యాగం చేసి ఉండి మృతవీరులు అయిఉండేవారు కారు- ఒక మోసం కోసం. సరళమైన సంగతి ఏమిటంటే యేసు యొక్క పునరుత్ధానం విశదీకరించబడలేదు.

తిరిగి మరణంపైన శక్తి ఉన్న ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది. యేసు మృత్యువుపైన తన శక్తిని నిరూపించేడు; కాబట్టి ఆయన చెప్పేది మనం వినడం అవసరం. రక్షణకి మార్గం తాను ఒక్కడే అని యేసు చెప్తాడు( యోహాను 14:6). ఆయన ఒక మార్గము కాదు; ఆయన అనేకమైన మార్గాల్లో ఒకటి కాడు. యేసే మార్గము.

మరియు ఇదే యేసు చెప్తాడు “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకి రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును”( మత్తయి 11:28). ఇది ఒక కఠినమైన లోకం మరియు జీవితం కష్టమైనది. మనలో అనేకమందిమి ఎక్కువగానే రక్తం కార్చి, దెబ్బలు తగిలి, యుద్ధపు మచ్చలని మోస్తున్నవారిమి. ఒప్పుకుంటారా? మీకేమిటి కావాలి? పునస్థాపనమా లేక ఒట్టి ధర్మమా? ఒక సజీవుడైన రక్షకుడా లేక మృతులైన అనేకమంది “ ప్రవక్తల” లో ఒకడా? ఒక అర్థవంతమైన సంబంధమా లేక రిక్త సంస్కార విధా? యేసు ఒక ఎంపిక కాదు- ఆయనే ఎంపిక.

మీరు కనుక క్షమాపణ కోసం చూస్తూ ఉంటే యేసు యుక్తమైన “ధర్మం” ( కార్యములు 10:43). దేవునితో ఒక అర్థవంతమైన సంబంధం కోసం కనుక మీరు చూస్తూ ఉంటే యేసు సరియైన “ధర్మం” (యోహాను 10:10). యేసు మీ రక్షకునిగా మీరు మీ విశ్వాసాన్ని ఆయనపైన ఉంచండి; మీరు చింతించరు ! మీ పాపాలకి క్షమాపణకోసం మీరు ఆయన్ని నమ్మండి. మీరు నిరాశ చెందరు.

ఈ వాక్యాలని చెప్పడంతో అవి మిమ్ము రక్షింపవు గానీ క్రీస్తుపైన విశ్వాసముంచడం మిమ్ము రక్షిస్తుంది. ఈ ప్రార్థన దేవునియందు మీ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి మరియు మీ రక్షణకి వీలు కల్పించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తులు అర్పించడానికి ఒక దారి మాత్రమే. “దేవా, నేను నీ పట్ల పాపం చేసేనని మరియు నేను శిక్షకి పాత్రుడనని నాకు తెలుసు. కానీ నా శిక్షని ప్రభువు యేసుక్రీస్తు తీసుకున్నాడు. దాని వల్ల ఆయనయందు ఉన్న విశ్వాసము ద్వారా నేను క్షమింపబడగలను. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీ మీద పెడుతున్నాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క వరం! ఆమెన్ ‍.

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: రక్షణకి రోమీయుల మార్గం ఏమిటి?

సమాధానము:
రక్షణకి రోమీయుల మార్గం అన్నది సువార్త యొక్క శుభ సమాచారాన్ని రోమీయుల గ్రంధంలో ఉన్న వచనాలని ఉపయోగించి వివరించే ఒక విధానం. ఇది సరళమయినదయినప్పటికి మనకి రక్షణ యొక్క అవసరం ఎంత ఉందో అని, దేవుడు రక్షణకి ఎలా వీలు కల్పించేడో అని, మనం రక్షణని ఎలా పొందగలమో అని మరియు రక్షణ యొక్క పర్యవసానాలు ఏమిటో అని వివరించే ఒక బలీయమైన పద్ధతి.

రక్షణకి రోమీయుల మార్గంపైన ఉన్న మొదటి వచనం రోమీయులు 3:23 లో ఉంది, “అందరును పాపము చేసి, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు.” మనమందరము పాపము చేసేం. మనమందరం దేవునికి సంతోషకరముకాని పనులని చేసేము. అమాయకుడైన ఒక వ్యక్తీ లేడు. మన జీవితాల్లో పాపం ఎలా కనిపిస్తుందో అన్న ఒక వివరమయిన చిత్రాన్ని రోమీయులు 3:10-18 ఇస్తాయి. రక్షణకి రోమీయుల మార్గముపైన ఉన్న రెండవ వచనము రోమీయులు 6:23 పాపానికి గల పర్యవసానాన్ని మనకి బోధిస్తుంది -“ఏలయనగా. పాపమువలన వచ్చు జీతము మరనము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవితము.” మన పాపాలకి మనం సంపాదించుకున్న శిక్ష మరణము. ఒట్టి భౌతికమయిన మరణము కాదు, కానీ నిత్యమరణము.

రక్షణకి రోమీయుల మార్గంపైన ఉన్న మూడవ వచనము, రోమీయులు 6:23 ఆపివేసిన వద్దనుండి ప్రారంభం అవుతుంది “అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే, క్రీస్తు మనకొరకు చనిపోయెను” అని రోమీయులు 5:8 ప్రకటిస్తుంది. యేసుక్రీస్తు మనకొరకు చనిపోయెను! యేసు మరణము మన పాపాలకి మూల్యాన్ని చెల్లించింది. యేసు మరణాన్ని మన పాపాలకి మూల్యంగా దేవుడు అంగీకరించేడని యేసు యొక్క పునరుత్ధానం నిరూపిస్తుంది.

రక్షణకి రోమీయుల మార్గము యొక్క నాలుగవ మజిలీ రోమీయులు 10:9, “అదేమనగా- యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడెదవు.” మీ పక్షాన్న యేసు యొక్క మరణం వల్ల, మనం చేయవలిసినదల్లా ఆయన్ని విశ్వసించడం, మన పాపాలకి మూల్యంగా ఆయన మృత్యువుని నమ్మడం- అప్పుడు మనం రక్షింపబడతాం. “ఎందుకనగా, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును” , అని రోమీయులు 10:13 మరల చెప్తుంది.

మన పాపాలకి దండనని చెల్లించడానికి మరియు మనలని నిత్యమరణంనుంచి కాపాడటానికి యేసు మరణించేడు. ఆయన తమ ప్రభువు మరియు రక్షకుడు అని క్రీస్తునందు నమ్మకాన్ని పెట్టిన ఎవరికయినా రక్షణ, పాపాలకి క్షమాపణ లభిస్తుంది.

రక్షణకి రోమీయుల మార్గం యొక్క అంతిమ పక్షం రక్షణ యొక్క పర్యవసానాలు. రోమీయులు 5:1 లో ఈ అద్భుతమయిన సందేశం ఉంది, “ కాబట్టి విశ్వాసముమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము.” ఏసుక్రీస్తు ద్వారా మనకి దేవునితో సమాధానమయిన ఒక సంబంధం ఉండగలదు. రోమీయులు 8:1 “కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు” అని మనకి బోధిస్తుంది. మన పక్షాన్న యేసు యొక్క మృత్యువు వల్ల మన పాపాలకోసం మనం ఎన్నడూ శిక్షావిధిని పొందం. ఆఖరికి మనకి రోమీయులు 8:38-39 నుంచి ఈ అమూల్యమయిన వాగ్దానం ఉంది,” మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతయినను సృష్టింపబడిన మరి ఏదయినను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబార న్రవని రూఢిగా నమ్ముచున్నాను.”

మీరు రక్షణకి రోమీయుల మార్గాన్ని అనుసరించడం ఇష్టపడతారా? అలా అయితే, మీరు దేవుడిని ప్రార్థించడానికి ఇక్కడ ఒక సరళమయిన ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనని కానీ ఇంకే ప్రార్థనని కానీ పలికినందువల్ల మీరు రక్షింపబడరు. క్రీస్తు మీదన నమ్మకాన్ని పెట్టడం మాత్రమే మిమ్మల్ని పాపం నుండి రక్షించేది. ఈ ప్రార్థన దేవుని పట్ల మీ విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక మార్గం మాత్రమే మరియు మీ రక్షణకి దోహదపడినందుకు మీరు ఆయనకి “దేవా, నీ పట్ల నేను పాపం చేసేనని నాకు తెలుసు. మరియు నేను శిక్షకి పాతృడను. ఆయనయందు విశ్వాసం వల్ల నేను క్షమింపబడటానికి యేసుక్రీస్తు నా శిక్షని భరించేడు. రక్షణ కొరకు నేను నా విశ్వాసాన్ని నీమీదన ఉంచుతాను. నీ అద్భుతమైన మహిమ మరియు క్షమాపణ కొరకు కృతజ్ఞతలు- నిత్య జీవితం యొక్క బహుమానం. అమేన్‌.

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

ప్రశ్న: పాపుల ప్రార్థన ఏమిటి?

సమాధానము:
తము పాపులమని అర్థం చేసుకుని ఒక రక్షకుని అవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రార్థించేదే పాపుల ప్రార్థన. పాపుల ప్రార్థనని పలుకడం వల్ల దానంతట అదే దేన్నీ సాధించదు. ఒక వ్యక్తికి ఏమిటి తెలుసో, అర్థం చేసుకుంటాడో మరియు తమ పాపపు స్వభావం గురించి ఏమిటి నమ్ముతాడో అన్నదాన్ని శుద్ధముగా సూచిస్తే మాత్రమే ఒక పాపుల ప్రార్థన సఫలమవుతుంది.

పాపుల ప్రార్థన యొక్క మొదటి పక్షం మనమందరము పాపులమని అర్థం చేసుకోవడం. “ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా- నీతిమంతుడు లేడు. ఒక్కడును లేడు” అని రోమీయులు 3:10 ప్రకటిస్తుంది. మనమందరము పాపం చేసేమని బైబిల్ స్పష్టపరుస్తుంది. మనమందరము దేవుని వద్దనుంచి వచ్చే కృప మరియు క్షమాపణ యొక్క అవసరం ఉన్న పాపులమి( తీతుకు 3:5-7). మన పాపం వల్ల మనం నిత్యశిక్షకి పాత్రులం (మత్తయి 25:46). పాపుల ప్రార్థన తీర్పుకి మారుగా అనుగ్రహం కోసం మొర్ర. అది ఉగ్రతకి మారుగా దయకోసం ఒక ప్రార్థన.

పాపుల ప్రార్థన యొక్క రెండవ పక్షం మన పోగొట్టుకున్న మరియు పాపపూరితమయిన పరిస్థితిని బాగు చేయడానికి దేవుడు ఏమిటి చేసేడో అని తెలిసికోవడం.

దేవుడు శరీరధారియై, మన మధ్య ప్రభువు యేసుక్రీస్తు రూపమందు నివసించెను( యోహాను 1:1,14). యేసు మనకి దేవుని గురించి బోధించి, ఒక పరిపూర్ణమయిన నీతియుతమైన మరియు పాపరహితమయిన జీవితాన్ని జీవించేడు( యోహాను 8:46, 2 కొరింధీయులు 5:21). తరువాత యేసు మనం పాత్రులమయిన శిక్షని మోస్తూ శిలువపైన మరణించేడు(రోమీయులు 5:8). పాపం, మరణం మరియు పాతాళలోకంపైన తన విజయాన్ని నిరూపించడానికి యేసు మృతులలోనుండి లేచేడు( కొలొస్సయులు 2:15, 1 కొరింధీయులు అధ్యాయం 15). దీనంతటివల్లా మన పాపాలు క్షమింపబడి మనకి పరలోకంలో ఒక నిత్యగృహం వాగ్దానం చేయబడుతుంది- అది మనం కనుక మన నమ్మకాన్ని యేసుక్రీస్తునందు ఉంచితేనే. మనం చేయవలిసినదల్లా ఆయన మన స్థానాన్న మరణించేడని నమ్మడమే( రోమీయులు 10:9-10). మనం ఒక్క కృపద్వారానే యేసుక్రీస్తునందు మాత్రమే రక్షింపబడగలం. “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే” అని ఎఫెసీయులు 2:8 ప్రకటిస్తుంది.

పాపుల ప్రార్థనని పలకడం మీ రక్షకునిగా మీరు యేసుక్రీస్తుపైన ఆధారపడుతున్నారని దేవునికి చాటే ఒక సరళమయిన విధానం మాత్రమే. రక్షణగా పరణమించే గారడీ చేసే పదాలేవీ లేవు. యేసు మృత్యువు మరియు పునరుత్ధానంపైన నమ్మకం మాత్రమే మనలని రక్షించగలదు. మీరు ఒక పాపి అని మరియు రక్షణ యొక్క అవసరం ఉన్నవారని కనుక మీరు అర్థం చేసుకుంటే మీరు దేవునితో పలుకవలిసిన ఒక పాపుల ప్రార్థన ఉందిః “ దేవా, నేను పాపినని నాకు తెలుసు. నా పాపానికి ఫలితాలకి నేను పాత్రుడనని నాకు తెలుసు. ఆయన మృత్యువు మరియు పునరుత్ధానం నా క్షమాపణకి వీలు కల్పించేయని నేను నమ్ముతాను. నా స్వకీయమైన ప్రభువుగా మరియు రక్షకునిగా యేసునందు ఒక్క యేసునందు మాత్రమే నాకు నమ్మకం ఉంది. నన్ను రక్షించినందుకు మరియు క్షమించినందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభువా! అమెన్!”

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.

యేసు నందు నా విశ్వాసమును ఉంచియున్నాను....ఇప్పుడు ఏమిటి?

అభినందనలు! జీవితాన్ని మార్చుకోనే నిర్ణయం తీసుకున్నావు. బహుశా ఇప్పుడు ఏమిటి అని అడుగు చున్నారు. “దేవునితో నా ప్రయాణము ఎలా ప్రారంభించాలి?” పరిశుద్ధ గ్రంథ౦ నుండి ఇవ్వబడే 5 మెట్ల ద్వారా నీకు మార్గము దొరుకును. నీవు ప్రయాణిస్తుండగా నీకు స౦దేహాలు వస్తే దయచేసి మా వెబ్ సైట్ www.GotQuestions.org/Telugu ను వీక్షి౦చండి.

1. రక్షణను అర్ధం చేసుకున్నావని నిర్ధారణ చేసుకో.

1 యోహాన్ 5 13 “దేవుని కుమారునిగా మాయ౦దు విశ్వాస ముంచు. మీరు నిత్యజీవము గల వారని తెలిసికొనునట్లు, నేను ఈ సంగతులను మీకు తెలుపుచున్నాను ” రక్షణను అర్థ౦ చేసుకోవాలని దేవుడు కోరుచున్నారు. మనము రక్షింపబడినామనే ఖచ్చితమైన విషయము నందు గట్టి నమ్మకము కలిగియుండాలని దేవుడు కోరుచున్నారు. క్లుప్తముగా రక్షణ యొక్క ముఖ్యమైన అంశములు చూద్దాం:

a) మనమందరము పాపము చేసియున్నాము. దేవుని సంతోషపరచలేని విషయములను మనము చేసియున్నాము (రోమా 3 :23).

b) మన పాపములను బట్టే దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటుతో శిక్షించబడుటకు అర్హులము (రోమా 6:23).

(c) మన పాపములకు పరిహారము చెల్లించుటకై శిలువపై మరణించినారు (5 8, 2 కొరింథి 5 21) యేసు మన స్థానములో మరణించి మనము పొందవలసిన శిక్షను ఆయన పొందెను. యేసు యొక్క మరణము మన పాపములకు సరి అయిన పరిహారమని ఆయన పునరుద్ధానము రుజువు చేసెను.

(d) యేసు నందు విశ్వాసము ఉంచిన వారికి, క్షమాపణ, రక్షణ, దేవుడు అనుగ్రహించును- ఆయన మరణము మన పాపములకు పరిహారముగ చెల్లించబడెనని నమ్ముట వలన (యోహాను 3: 16, రోమా 5: 1, 8: 1)

అదే రక్షణ వర్తమానము.యేసుక్రీస్తు నీ రక్షకునిగా నీవు నీ విశ్వాసము ఆయన నందు ఉ౦చినట్లైతే, నీవు రక్షింపబడుదువు. నీ పాపములన్నీ క్షమించబడినవి, నిన్ను ఎన్నడూవిడువను, ఎడబాయను అని దేవుడు వాగ్దానము చేస్తున్నారు (రోమా 8: 38, 39, మత్త 28 :20) యేసే నీ రక్షకుడని నమ్మినట్లైతే, పరలోకమందు దేవునితో శాశ్వత౦గా గడపగలవనే నీకు ధైర్యము వుండును!

2. పరిశుద్ధ గ్రంధమును బోధించే మంచి చర్చిని చూచుకో.

చర్చి అంటే ఒక భవంతి అని తలంచకు. చర్చి అనగా ప్రజలు. యేసు క్రీస్తు నందు విశ్వాస౦ కలవారు. ఒకరితో నొకరు సహవాసము కలిగియుండుట చాలా ముఖ్యము. అది చర్చి యొక్కప్రాథమిక ఉద్దేశ్యములలో ఒకటి ఇప్పుడు నీవు యేసు క్రీస్తు నందు విశ్వాసముంచినందున, మీ ప్రాంతములో బైబిలును నమ్మే చర్చిని కనుగొని, ఆ కాపరితో మాట్లాడవలెనని, మిమ్ములను చాలా ప్రోత్సహిస్తున్నాము. యేసు క్రీస్తు న౦దుంచిన నీ విశ్వాసమును, ఆ కాపరిని గ్రహించనివ్వు !

చర్చి యొక్క రెండవ ఉద్దేశ్యము బైబిల్ నందు బోధించుట. దేవుని ఉపదేశములను నీ జీవితమునకు ఎలా అన్వయించు కోవాలో నీవు నేర్చుకోగలవు. విజయవంతమైన, శక్తివంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకు బైబిల్ ను అర్థము చేసుకొనుటయే తాళపు చెవి. 2 తిమో 3:16,17 లో దైవజ్ఞుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు స౦పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతీ లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, శిక్షణకును పరిశుద్ధమైన భావము కలిగియున్నది.

చర్చి యొక్క మూడవ ఉద్దేశ్యము ఆరాధన. ఆరాధన అనగా దేవుడు చేసిన వాటన్నిటికి కృతజ్ఞత చెల్లించుట. దేవుడు మనలను రక్షించును. దేవుడు మనలను ప్రేమించును. దేవుడు మనకు సమకూర్చును. దేవుడు త్రోవ చూపి నడిపించును. ఆయనకు కృతజ్ఞత చెల్లించకుండ ఎలా ఉ౦డగలము? దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమగల వాడు, కనికరముగలవాడు; ప్రకటన 4 11, “ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమును బట్టి అనియుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను. కనుక నీవే, మహిమ ఘనత, ప్రభావములు పొందనర్హుడవు” చెప్పబడినది.

3. దేవుని కొరకు కొంత సమయము కేటాయించుము.

ప్రతి దినము దేవునిపై దృష్టియుంచుట యందు సమయము గడుపుట చాలా ముఖ్యము. కొంత మంది దీనిని “నిశ్శబ్ద సమయము” అని కొంత మంది “దైవచింతన” అనిఅందురు. ఏలయనగా, మనము దేవునితో గడిపే సమయము. కొంత మంది ఉదయ కాలమును ఎంచుకుంటే మరి కొందరు సాయంత్ర సమయమును ఎంచుకొందురు. ఈ సమయములను ఏమని పిలిచామా, ఎప్పుడు గడిపామా అనేది విషయం కాదు. విషయమేమిట౦టే క్రమముగా దేవునితో గడుపుట ముఖ్యము. ఏ పరిస్థితులు దేవునితో సమయము గడుపునట్లుగ చేయును?

(a) ప్రార్థన అనగా దేవునితో మాటడ్లాడుట. నీ సమస్యల విషయమై దేవునితో మాట్లాడు. నీకు, జ్ఞానమును, దారిచూపుమని దేవుని అడుగు. నీ అవసరాలను తీర్చమని అడుగు. ఆయనను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో, ఆయన చేసిన వాటికి, ఆయనను ఎంతగా అభినందిస్తున్నావో ఆయనతో చెప్పు. ప్రార్థన అంటే అదే!

(b) బైబిల్ పఠించుట, చర్చిలో బోధించుట దానికంటె. సండే స్కూల్ లో బైబిలు తరగతుల్లో బోధించిన దానికంటె, నీకు నువ్వు బైబిలు చదువుట అవసరము. విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించుటకు అవసరమైనవన్నీ బైబిల్ (పరిశుద్ధ గ్రంధము) నందు పొందుపరచబడినవి. దేవుని యొక్క మార్గము , జ్ఞానము గల నిర్ణయములు ఎలా తీసుకోవాలో, దేవుని చిత్తమును ఎలా తెలుసుకోవలెనో, ఇతరులకు పరిచర్యలు ఎలా చేయవలెనో ఆత్మీయుడిగా ఎలా ఎదగవలెనో అవన్నీ బైబిలు నందు ఉన్న౦దున బైబిలు మనకు దేవుని మాటయైయున్నది. మన జీవితములు దేవునికి ఇష్టమైన రీతిలో, మనకు తృప్తి కలిగించు రీతిలో జీవించుటకు బైబిల్ దేవుని ఉపదేశ పుస్తకమై యున్నది.

4. ఆత్మ సంబంధంగా నీకు సహాయము చేయు వ్యక్తులతో సంబధము అభివృద్ధిచేసుకొనుము.

“మోసపోకుడి: దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును” (1కొరి 15 33) మనపైన ప్రభావితము చేయు మనుష్యుల గురించి బైబిలు నందు ఎన్నో హెచ్చరికలు ఉన్నవి. పాప సంబంధమైన క్రియలు చేయు వారితో సమయము గడిపినప్పుడు ఆ క్రియల చేత శోధించబడెదవు. నీ చుట్టు వున్న మనుష్యుల శీలము నీ మీద ‘రుద్ద బడును’. కాబట్టి ఎవరైతే దేవుని ప్రేమించి ప్రభువుకు కట్టుబడి ఉ౦టారో వారితో మనము కలిసియుండుట ముఖ్యము.

నిన్ను ప్రోత్సాహ పరచి. నీకు సహాయము చేసే ఇద్దరిని నీ నుండి ఏర్పాటు చేసుకో (హెబ్రీ 3 13 1024) నీవు గడిపే ఒంటరి సమయము, నీవు చేసే పనులు, లెక్క ఒప్ప చెప్పుటకై నీ స్నేహితుని అడుగు. వారి విషయమై నీవు అలాగని యేసు క్రీస్తుని రక్షకునిగా ఎరుగని నీ స్నేహితులందరినీ విడిచి పెట్టమని కాదు. వారికి నువ్వు స్నేహితునిగానే వుంటూ, వారిని ప్రేమించుము. యేసు నీ జీవితం మార్చినాడని, మరియు ఇది వరకు నువ్వు చేసే పనులు ఇప్పుడు చేయవని వారు తెలిసికొననిమ్ము. నీ స్నేహితులతో యేసే నీ జీవితం మార్చినాడని, మరియు ఇది వరకు నువ్వు చేసే పనులు ఇప్పుడు చేయవని వారు తెలిసికొననిమ్ము. నీ స్నేహితులతో యేసు గురించి చెప్పుటకు అవకాశములను ఇవ్వమని దేవుని అడుగుము.

5. బాప్తిశ్మము పొందుడి.

చాలా మందికి బాప్తిశ్మము అంటే తప్పు అభిప్రాయము కలదు. “బాప్తిశ్మము” అను మాటకు అర్థము నీటిలో మునుగుట. బాప్తిశ్మము అనగా క్రీస్తు నందు నీ యొక్క నూతనమైన విశ్వాసము, ఆయనను అనుసరి౦చుటకు నిశ్చయతను ప్రకటించుటయే బైబిల్ ప్రకారం బాప్తిశ్మము అను నీటియ౦దు మునుగు అను క్రియ, క్రీస్తుతో కూడా, పాతి పెట్టబడినావని విశదీకరించుచున్నది. నీటి నుండి పైకి వచ్చుట ద్వారా క్రీస్తు యొక్క పునరుద్ధానమును చూపించుచున్నది. బాప్తిశ్మము పొందుట ద్వారా నీవు క్రీస్తు తో కూడా మరణించి, పాతిపెట్ట బడి పునరుద్ధానము యొక్క సాదృశ్యమందు ఆయనలో ఐక్యముగల వాడవై యున్నావు (రోమా 6 3 4), బాప్తిశ్మము నిను రక్షించదు. బాప్తిశ్మము నీ పాపములను కడుగదు. రక్షణ కొరకు, బహిరంగముగా క్రీస్తునందే నీ విశ్వాసమును ప్రకటించుటకు ప్రాముఖ్యమైనది. ఎందుకనగా అది విధేయతతో వేసే ఒక అడుగు. క్రీస్తు నందు నీకున్న విశ్వాసము, ఆయనతో కట్టుబడియున్నావని చెప్పి, బహిరంగముగ తెలియపరచుట.నీవు బాప్తిశ్మము కొరకు సిధ్ధమైతే, మీ పాస్టరును స౦ప్రది౦చ౦డి.