అతి ముఖ్యమైన ప్రశ్నలు

ప్రశ్న: దేవుడు ఉన్నాడా ? ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఉందా?

సమాధానము:
దేవుడు వున్నాడా? ఈ వాదనకి చాలా ఆసక్తి చూపించబడింది. ఇటీవల చేసిన పరిశోధనలను బట్టి ప్రపంచములోని 90 % ప్రజలు దేవుడు ఉన్నాడని లేదా ఒక మహా శక్తి అని నమ్ముతారు. ఏదైతేనేమి దేవుడున్నాడని నమ్ముతున్నా వాళ్లపై ఇది నిజంగా నిరూపించవలసిన భాద్యత ఉంచబడింది. ఇంకొక రకముగా ఆలోచిస్తే చాలా తర్కముగా అనిపిస్తుంది.

ఏమైనప్పటికి, దేవుడున్నాడని నిరూపించలేము అలా అని లేదని చెప్పలేము. బైబిలు చెప్పినట్లుగా విశ్వాసంతో దేవుడున్నాడన్న నిజాన్ని అంగీకరించాలని, “మరియు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉ౦డుట అసాధ్యమని, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” (హెబ్రీ 11.6). దేవుడు తలచుకుంటే ఆయన చాలా సూక్ష్మంగా ప్రపంచం అంతటా ప్రత్యక్షమై తాను ఉన్నాడని నిరూపించుకోగలడు. కానీ ఆయన అది చేస్తే, ఇంక విశ్వాసం యొక్క అవసర౦ లేదు. “యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని” అతనితో చెప్పెను (యోహాను 20.29).

ఏమయినప్పటికీ, దేవుడు ఉన్నాడనుటకు సాక్ష్యము లేదని, అర్థ౦ కాదు. "ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది; అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురి౦చుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఙానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు. మాటలు లేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలమానాలు భూమియందంతట వ్యాపించియున్నది. లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు వ్యాప్తి చె౦దియున్నవి” (కీర్తనలు 19: 1-4) నక్షత్రములను చూసినపుడు, విశాలమైన ఈ విశ్వాన్ని పరిశీలి౦చినపుడు, ప్రకృతి యొక్క అద్భుతాలను గమనించినపుడు సూర్యాస్తమయ అందాలను చూసినపుడు—ఇవన్నీ సృష్టి కర్త అయిన దేవుని సూచిస్తాయి. ఇవి కూడ చాలవు అనుకుంటే మనందరి హృదయాలలో దేవుడు ఉన్నారన్న సాక్ష్యం ఉ౦ది. ప్రసంగి (3.11) లో చెప్పినట్లుగా, ...“ఆయన శాశ్వత కాల జ్ఙానమును నరుల హృదయములో ఉ౦చి వున్నాడు…”. చాలా లోతుగా గుర్తిస్తే, ఈ జీవితం వెనుక ఏదో వుంది, మరియు ఈ ప్రపంచము వెనుక ఎవరో వున్నారు. మనము ఈ సమాచారాన్ని అర్థ౦ లేదని కొట్టివేసినా కాని, దేవుని సన్నిధి మనతో మరియు మన ద్వారా ఇ౦కా వుంది. ఇంకా దేవుడు లేడని ప్రక్కకి తోసివేసే వారితో (కీర్తన 14.1) లో చెప్పినట్లుగా “దేవుడు లేడని బుధ్ధిహీనులు, తమ హృదయములో అనుకుందురు”. 98 % పైగా ప్రజలు చరిత్ర, సంస్కృతి, నాగరికత, కల అన్ని ఖండాల వారు నమ్మేదేమిటంటే దేవుడువున్నాడని, ఈ నమ్మకము వెనుక ఏదో ఉ౦ది (లేదా ఎవరో ) ఉన్నారని.

బైబిలు వాదనల ప్రకారము దేవుడున్నాడని చూస్తే, తర్కపరమైన వాదనలు ఉన్నాయి. ప్రథమముగా, తర్కవిభేదమైన వాదము కలదు. ఈ తర్క విభేదానికి ముఖ్య అంశం ఏమిటంటే దేవుడున్నాడని నిరూపించటం. “ఆయనను మించిన మరే శక్తి లేదని” నిరూపించటంతో దేవుని గూర్చిన నిర్వచనం మొదలవుతుంది. ఈ వాదన ఎలా వుంటుందంటే ఆయన ఉనికి కన్నా ఇంకొక గొప్ప ఉనికి ఉందంటే అది ఎంత గొప్పదో బయటపడాలి. ఒకవేళ దేవుడు లేనట్లయితే ఆయన ఒక గొప్ప చలించే వ్యక్తి కాకపొతే దేవుని యొక్క ప్రతి నిర్వచనము విరుద్ధమైపోతుంది. రెండవది సరియైన వాదన ఏమిటంటే ఖచ్చితంగా ఈ విశ్వ సృష్టి వెనుక ఒక అద్భుతమైన దైవిక సృష్టి కర్త ఉన్నారని. ఉదాహరణకి భూమి సూర్యుడికి కొన్ని వందల మైళ్ళ దగ్గరగా గాని, లేదా దూరంగా ఉన్నట్లయితే , ప్రస్తుతం ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉ౦డేది కాదు. వాతావరణములో ఉన్న అణువులలో కనుక కొంచెం మార్పు ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయి ఉ౦డేది. 10,243 లో ఒక్క దానికే ప్రోటీన్ కణము అయ్యే అవకాశాలు ఉన్నాయి (2430 నుండి 10 వస్తాయి). ఒక్క కణము కొన్ని మిలియన్ల ప్రోటీన్ కణాలను కలిగి ఉంటుంది.

దేవుని ఉనికిని గూర్చిన మూడవ తర్కవాదన జగత్సంబంధమైన వాదన. ప్రతి పరిణామము వెనుక ఒక కారణము ఉ౦టుంది. ఈ విశ్వము మరియు సమస్తము ఒక ఏర్పాటే. ప్రతీది బయటకు అనగా ఉనికి లోనికి రావటానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణము ఉ౦డే ఉ౦టుంది. చిట్టచివరిగా చెప్పేదేమిటంటే సమస్తము ఉనికి లోనికి రావటానికి ఏదో తెలియని కారణము ఖచ్చితంగా ఉ౦డే ఉ౦టుంది. ఆ “తెలియని కారణమే” దేవుడు. నాల్గవ వాదన నీతి పరమైన వాదన. ప్రతి సంస్కృతి చరిత్ర అంతా ఒక విధమైన ధర్మశాస్త్రము తో ఏర్పాటయింది. ప్రతి మనిషికి మంచి, చెడు విచక్షణ కలవు. హత్య, అసత్యమాడటం, దొంగతనం మరియు అనైతికం వీటన్నిటిని విశ్వమంతా ఎప్పుడో త్రోసివేసింది. మరి పరిశుడైద్ధున దేవుని నుండి కాకపోతే మరి ఈ మంచి చెడు విచక్షణా జ్ఙానము ఎక్కడనుండి వచ్చాయి. వీటన్నిటిని ప్రక్కకు త్రోసివేసి, బైబిలు ఏం చెపుతుందంటే ప్రజలు సృష్టి౦చినవాటిని

మరియు ఉపేక్షించటానికి వీలు లేని దేవుని జ్ఙానమును నమ్మటానికి బదులు అసత్యమును నమ్మరు. రోమా 1:25 లో చెప్పినట్లుగా “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, మరియు సృష్టికర్తకు ప్రతిగా సృష్టి౦చినవాటిని

పూజించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్”. బైబిల్ ఇంకా ఏమని ప్రకటిస్తుందంటే (రోమా 1:20) “ప్రజలు ఏ సాకు లేకుండా దేవుని నమ్మటానికి బదులు—ఆయన అదృశ్య లక్షణములు,నిత్యశక్తియు, దైవత్వమును, స్పష్టముగా చూసి కూడ, ఎలా సృష్టించబడినవో అర్థము చేసుకుని కూడ నమ్మలేకున్నారు”.

ప్రజలు దేవుని యందు నమ్మకము లేదని చెప్పటానికి “శాస్త్రీయమైన” లేదా “సరియైన ఆధారము” లేక కాదు. నిజమైన కారణము ఏమిటంటే ఒకసారి దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నపుడు ఆయన ఇచ్చు అవసరమైన క్షమాపణ కొరకు ఆయన పట్ల బాధ్యులై ఉ౦డవలెనని గుర్తించాలి అనగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉ౦డాలి. (రోమా 3:23; 6:23). దేవుడు వున్నట్లయితే, మన క్రియల విషయమై మనము లెక్క అప్పచెప్పవలసినవారమై ఉన్నాము. ఒకవేళ దేవుడు లేనట్లయితే తీర్పు వస్తుందన్న చింత లేక మన ఇష్టానుసారంగా మనం చేయవచ్చు. సృష్టికర్తయిన దేవుడిని నమ్మటం అనే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వటానికి –మన సమాజంలో ఈ పరిణామము బలంగా పట్టుకుని వుంది. దేవుడు ఉన్నాడు మరియు ఆఖరికి ప్రతిఒక్కరికి తెలుసు ఆయన ఉన్నాడని. నిజమేమిటంటే కొంతమంది చాలా వాదనలతో కలహించి చివరకి ఆయన ఉన్నారన్న నిజాన్ని నిరూపించలేకపోయారు.

చివరగా దేవుడున్నాడని ఒకే ఒక వాదన వుంది. ఆయన ఉన్నాడని ఎలా తెలుస్తుంది? క్రైస్తవులుగా మనకి తెలుసు ఆయన ఉన్నాడని, ఎందుకంటే మనం ప్రతిరోజూ ఆయనతో మాట్లాడుతాం కాబట్టి. మనం ఆయన తిరిగి మాట్లాడటం వినకపోవచ్చు, కాని ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం, ఆయన నడిపించే అనుభూతి చెందుతున్నాం, మనకు ఆయన ప్రేమతెలుసు, ఆయన కృపను కోరుకుంటున్నాం. మన జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నా దేవుని కంటే ఎక్కువగా చెప్పటానికి మనదగ్గర ఏ ఇతర వివరణ లేదు. దేవుడు మనలను ఎంతో అద్భుతంగా రక్షించి మరియు మన జీవితాలను మార్చిన దానికి మనం ఆయనను అనుసరిస్తూ, ఆయన ఉనికిని స్తుతించటం తప్ప మనం ఏమి చేయలేము. ఈ వాదనలలో ఏ ఒక్కటీ వారిని కాని ఇతరులను కాని ఇంత స్పష్టముగా ఉన్నదానిని అనుసరి౦చటం ఎవరూ తప్పించలేరు. చివరికి దేవుని ఉనికిని విశ్వాసంతోనే అంగీకరించాలి. (హెబ్రీ 11.6). విశ్వాసం అనేది గుడ్డిగా చీకటిలోకి గంతు వేయటం కాదు, ఎక్కడ అప్పటికే 90 % ప్రజలు నిలబడి బాగా వెలిగించబడి ఉన్న గదిలోకి సురక్షితముగా అడుగుపెట్టటం.


ప్రశ్న: యేసుక్రీస్తు ఎవరు?

సమాధానము:
యేసుక్రీస్తు ఎవరు ? “అసలు దేవుడున్నాడా?” అసలు యేసుక్రీస్తు ఉన్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ లో యేసు నిజంగా మానవ రూపంలో ఈ భూమి మీద నడిచారని సాధారణముగా ప్రతిఒక్కరు అంగీకరిస్తారు. యేసును గూర్చిపూర్తి వివరణ అడిగినపుడే వాదన మొదలవుతుంది. దాదాపుగా ప్రతి ముఖ్యమయిన మతము ఏమి చెపుతుందంటే యేసు ఒక ప్రవక్త అని, లేదా మంచి బోధకుడని, లేదా దైవజనుడని.

సి.ఎస్. లూయిస్ తాను రాసిన క్రైస్తవతత్వము అనే పుస్తకములో: “నేను ఎవరైతే ఆయన యేసుక్రీస్తు అని బుద్దిహీనంగా చెపుతారో వారిని ఆపటానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఆయనను గొప్ప నైతిక బోధకుడిగా ఒప్పుకోవటానికి సిద్దంగా వున్నాను. కాని ఆయన [యేసు క్రీస్తు] దేవుడని ప్రకటించటానికి మాత్రము అంగీకరించను”. ఒక విషయము మనము అసలు చెప్పకూడదు. ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తి అయి కొన్ని మంచి విషయాలు చెప్పినంత మాత్రాన యేసు ఆయనను గొప్ప నీతి బోధకుడు అవడు అని చెప్పారు. అతడు అయితే పిచ్చివాడు –గుడ్లను దొంగిలించే స్థితిలో ఉన్న వ్యక్తి—లేదా నరకానికి సంబంధించిన దెయ్యము అయినా అయి వుండాలి. మీ ఇష్టము వచ్చినట్లుగా మీరు అనుకోవచ్చు. ఈ వ్యక్తిని దేవుని బిడ్డగా కాని లేదా పిచ్చివాడిగా లేదా ఇంకా అతి హీనమైన వ్యక్తిగా-….మీరు అనుకుని బుద్దిహీనుడిగా తోసివేసినా లేదా మీరు ఉమ్మి వేసినా, దెయ్యము అని చంపినా, కాళ్లతో తొక్కినా లేదా మీరు ఆయనని దేవుడని పిలిచినా ఏది అయినా అది మీ ఇష్టం. ఆయన గోప్ప మానవ బోధకుడని చెప్పే మాయమాటలకు తావు ఇవ్వవద్దు. ఆయన మనకొరకు అలాంటి అవకాశాన్ని తెరిచి ఉ౦చలేదు. ఆయనకి అలాంటి ఉద్దేశ్యమే లేదు.

కాబట్టి ఎవరు యేసుని గూర్చి వాదిస్తారు అతని గురించి బైబిల్ ఏమి చెపుతుందో ఎవరు చెప్తారు మొదట యోహాను 10:30 లో యేసును గూర్చిన మాటలు చూద్దాం, “నేనును తండ్రియును ఒక్కరమే” అని చెప్పారు. ఇంత వేగముగా మొదటి చూపులోనే ఆయన దేవుడని వాదించలేము. ఎలాగైతే యూదులు ఆయన ప్రకటనకు విరోధముగా –నీవు మనుష్యడవైయుండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక దైవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని చెప్పిరి. యూదులు యేసు తనను దేవుడిగా చేసుకునిన ప్రకటనను ఈ విధంగా అర్థ౦ చేసుకున్నారు. ఈ క్రింది వరుసలను చూస్తే యేసు ఎక్కడా దేవుడిని గాను అని యూదులను సరిచేసినట్లు లేదు. దీనిని బట్టి చూస్తే నిజముగా యేసు తానే దేవుడినని , నేను నా తండ్రి ఒక్కరే అని ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇంకొక ఉదా( యోహాను 8.58). అబ్రహామ్ పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో సత్యము చెప్పుచున్నాను, ఆ మాటకు బదులుగా వాళ్లు కొట్టుటకు రాళ్ళను ఎత్తిరి. నిర్గమ కాండం 3:14 లో ఆయన నేను ఉన్నవాడును అనువాడనై యున్నాను అని పాతనిబంధనలో తానే ప్రకటించుకున్నారు. ఆయనను కొట్టటానికి యూదులు మరల రాళ్ళు ఎందుకు తీసారు—ఆయన చేసిన దైవదూషణను గూర్చి ఏమి చెప్పకుండా ,తాను దేవుడినని వాదించుకుంటున్నందుకా.

యోహను 1:1 లో చెప్పినట్లు ఆదియందు వాక్యము వుండెను. ఆ వాక్యము శరీరధారిగా మనుష్యలమధ్య నివసించెను. ఇది చాలా స్పష్టముగా యేసు మానవ రూపములో ఉన్న దేవుడు. అందుకే ఆయన శిష్యులలో ఒకరైన థామస్ ఆయనను నా దేవా, నా ప్రభువా అనెను. అందుకు యేసు ఆయనను ఖండించలేదు. తీతు 2:13 లో కూడ అపొస్తలుడైన పౌలు ఆయనను మహా దేవుడును మన రక్షకుడైన క్రీస్తు అని , అదే రీతిగా పేతురు కూడ మన దేవుడు రక్షకుడని సంబోధించెను. తండ్రియైన దేవుడు యేసుకి ప్రత్యక్షసాక్షి కాని కుమారుని గురించి చూస్తే మీ సింహాసనము, ఓ దేవా, తరతరములకు నిలుచును గాక మరియు మీ నీతి మీ రాజ్యమంతటా విస్తరింప చేయబడును గాక. పాత నిబంధనలో క్రీస్తును గూర్చిన ప్రవచనములము చూస్తే ఆయనే దైవము, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.ఆయన భుజము మీద భారముండును . మరియు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టుదురు.

కాబట్టి సి.ఎస్ లూయిస్ ఏమని వాదిస్తున్నారంటే యేసును మంచి బోధకుడిగా నమ్మాలనటం అనేది మన ఇష్టం కాదు. యేసు చాలా స్పష్టంగా, తిరుగలేని విధంగా తానే దేవుడినని వాదించారు. ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే, ఆయన అబద్దికుడు, మరియు ప్రవక్త, మంచిబోధకుడు, లేదా దైవజనుడు అయివుండేవారు కాదు. యేసు మాటలలోనే చెప్పాలనుకుంటే నవీన “పండితులు” ఆయనను “నిజమైన చారిత్రక యేసు” అని వాదిస్తారు, పైగా బైబిల్ లో ఆయనను గురించి ఆరోపించిన విషయాలు ఏవి చెప్పరు. ఎలా ఒక పండితుడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసును గూర్చిన మంచి దృక్ఫథాన్ని త్రోసివేస్తే లేదా చెప్పకపోతే మరిఎవరితో ఉన్నట్లు, ఎవరిని సేవించినట్లు. తనకు తానే యేసుని బోధించినప్పుడు (యోహాను 1: 26).

ఈ ప్రశ్న యేసు యొక్క నిజమైన గుర్తింపు పైన ఎందుకు కాదు? యేసు దేవుడైనా లేదా కాకపోయినా ఇది మనకు ఒక సమస్య కాదు? యేసు దేవుడనటానికి దేవుడు కాదనటానికి చాలా ముఖ్యమైన కారణము , అతని మరణము సర్వ లోకము చేసిన పాపములకు శిక్ష సరిపోయెడిది కాదు.(1 యోహాను 2:2) కేవలం దేవుడు మాత్రమే అటువంటి అనంతమైన శిక్షను చెల్లి౦చగలడు. (రోమా 5:8;2 కోరింథి 5 21). మన పాపములు చెల్లించగలడు కావున యేసు దేవుడు. కేవలం యేసు క్రీస్తు నందు విశ్వాసముతో మాత్రమే రక్షణ కలుగుతుంది! అతను రక్షణ మార్గము వలనే దేవుడు. యేసు దేవుడని ఆయన తెలిపెను (యోహాను 14 :6) "నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాలేడు”


ప్రశ్న: యేసు దేవుడా? యేసు ఎప్పుడైనా దేవుడని అన్నారా?

సమాధానము:
బైబిల్ లో ఎక్కడా “నేనే దేవుడను” అని ఖచ్చితమైన పదాలతో యేసు గురించి తెలుపలేదు. ఏమయినప్పటికీ, ఆయన దేవుడని తెలుపలేదని కాదు. ఉదాహరణకి యోహాను 10:30 లో “నేనుయు మరియి తండ్రి ఒకరై ఉన్నాము.” మొదట చూడగానే, ఇది దేవుడని చెప్పినట్లు లేదు. ఏమయినప్పటికీ, (యోహాను 10:33) అతని ప్రవచనానికి యూదుల ప్రతిస్పందనను చూస్తే, “నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని, మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి”. యూదులు యేసు దేవుడన్న ప్రవచనాన్ని అర్ధo చేసుకున్నారు. తరువాత వాక్యాలలో యూదులు “నేను దేవుడను కాను” అన్న దాన్ని వ్యతిరేకించలేదు. దీనివల్ల మనకు యేసు ఆయన వాస్తవంగా దేవుడని (యోహాను 10:33) లో “నేనుయు మరియు తండ్రి ఒకరై ఉన్నాము.”అని ప్రకటించారు. యోహాను 8:58 మరియొక ఉదాహరణ. "అబ్రహాము పుట్టుక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!" మరల యూదులు యేసు పై రాళ్ళు ఎత్తినపుడు బదులు పలికెను (యోహాను 8:59). వారు దైవదూషణ అని నమ్మేటట్లు నేను దేవుడను అని చెప్పడం వంటిది కాకపోతే యూదులు యేసుపై ఎందుకు రాళ్ళు రువ్వాలనుకున్నారు?

యోహాను 1:1 చెబుతుంది “వాక్యము దేవుడై యుండెను.” యోహాను 1:14 ప్రకారం “ఆ వాక్యము శరీర ధారియై యుండెను.” ఇది శరీరంలో యేసు దేవుడైయున్నాడని సూచిస్తుంది. అపోస్తలు 20:28 మనకు తెలుపుతోంది, "దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ...”. తన స్వరక్త ముతో ఎవరు సంఘాన్ని కొన్నారు? యేసు క్రీస్తు. అపోస్తలు 20:28 దేవుడు తన స్వరక్తముతో సంఘాన్ని కొన్నారు. కాబట్టి యేసే దేవుడు!

యేసు గురించి శిష్యుడు, “నా ప్రభువా నా దేవా” అనెను (యోహాను 20:28). యేసు అతనిని సరిచేయలేదు. తీతుకు లో 2:13 మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూడండి అని ప్రోత్సహిస్తుంది- . యేసు క్రీస్తు (2 పేతురు 1:1 కూడా చూడండి). హెబ్రీ 1:8 లో, యేసు తండ్రి గురించి చెబుతారు, "తన కుమారుని గూర్చి అయితే, "దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది, మరియు నీ రాజ దండము న్యాయార్ధమయినది."

ప్రకటనలలో, ఒక దేవదూత యోహానును దేవునికి మాత్రమే నమస్కారము చేయుడని సూచించెను (ప్రకటనలు 19:10).లేఖనాలలో చాలా చోట్ల యేసు పూజలను అందుకున్నారు (మత్తయ2:11; 14:33; 28:9,17; లూకా 24:52; యోహాను 9:38).తనని పూజింజిన వారిని ఎప్పుడూ గద్దించలేదు. యేసు దేవుడు కాని ఎడల, ప్రకటనలలో దైవదూతలు తెలిపిన విధంగా, ఆయనను పూజించవద్దని ప్రజలను వారించెడివాడు. యేసు దేవుడనే వాదలకు లేఖనానలలోని పదబంధాలు మరియు సారాంశాలు ఇంకా చాలా ఉన్నాయి.

ఆయన దేవుడు కాకుండా యేసు దేవుడు కావటానికి ముఖ్య కారణము సర్వ లోక పాపములను చెల్లించుటకు ఆయన మరణము సరిపోయెడిదికాదు (1 యోహాను 2:2). అటువంటి అనంతమైన శిక్షను దేవుడు మాత్రమే చెల్లి౦చగలడు. దేవుడు మాత్రమే సర్వలోక పాపములను తీసుకుని, (2 కొరింథి 5:21), మరణించి- పాపము మరియు మరణమును జయించి మరియు పునరుద్ధానమయ్యెను.


ప్రశ్న: దేవుడు సత్యమైనవాడా? దేవుడు సత్యమైనవాడని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను?

సమాధానము:
దేవుడు తన్ని తాను మనకి మూడు విధానాల్లో వెల్లడిపరిచినందువల్ల ఆయన నిజమైనవాడని మనకి తెలుసుః సృష్టియందు, ఆయన వాక్యంయందు మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు. దేవుని ఉనికి యొక్క అతి ప్రాధమికమయిన సాక్ష్యం ఆయన చేసినది మాత్రమే.

“ఆయన అదృశ్యలక్షణములను, అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తురులై యున్నారు” (రోమీయులు 1:20). “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” (కీర్తన 19:1).

ఒక పొలం మధ్యలోకనుక, నేను ఒక చేతి గడియారాన్ని చూస్తే, అది ఎక్కడినుండో “ప్రత్యక్ష్యమైయిందని కానీ, లేక అది అక్కడే ఎప్పుడూ ఉందనికానీ నేను అనుకోను. ఆ గడియారపు రూపకల్పన మీదన ఆధారపడి, దానికి ఒక రూపకర్త ఉన్నాడని నేను అనుకుంటాను. కానీ, లోకంలో మన చుట్టుపట్ల చాలా ఎక్కువ రూపకల్పనా మరియు ఖండితం ఉన్నాయి. కాలం యొక్క మన కొలత, చేతి గడియారాలపైన ఆధారపడదు కానీ దేవుని చేతిపని పైన ఆధారపడి ఉంది- భూమి యొక్క నియమానుసారమైన భ్రమణము ( మరియు సెసిమ్ -133 ఏటమ్ యొక్క వికిరణోత్తేజిత రసాయన లక్షణాలు). జగత్తు గొప్ప విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఇది ఒక రూపకర్తకోసం వాదిస్తుంది.

నాకు కనుక రహస్యలిపిలో ఉన్న ఒక సందేశం కనిపిస్తే, ఆ లిపిని విడగొట్టడానికి సహాయపడేటందుకు నేను ఒక గుప్తభాష నిపుణిని కోసం శోధిస్తాను. ఆ లిపిని సృష్టించి, సందేశాన్ని పంపించిన ఒక మేధావి ఉన్నాడన్నది నా తలంపు అవుతుంది. మనం మన శరీరాలలో ఉన్న ప్రతి జీవకణంలో మోసే “డిఎన్‌యే” కోడ్ ఎంత క్లిష్టమైనది? డిఎన్‌యే యొక్క జటిలత్వం మరియు ఉద్దేశ్యం, రహస్యలిపి యొక్క మేధావి అయిన ఒక లేఖకునికోసం వాదించదా?

దేవుడు ఒక జటిలమైన మరియు చక్కగా శృతి చేయబడిన భౌతికమైన లోకాన్ని సృష్టించడమేకాక; ఆయన ప్రతి వ్యక్తి హృదయంలో ఒక నిత్యత్వపు భావనని స్థిరపరిచేడు ( ప్రసంగి 3:11). కంటికి కనిపించేదానికన్నా జీవితంలో ఎక్కువ ఉందని, ఈ ఐహికమైన క్రమణికకన్నా ఎక్కువ ఉన్నతమైన ఒక ఉనికి ఉందని, మానవజాతికి ఒక అంతర్లీనమైన గ్రాహ్యత ఉంది. మన నిత్యత్వపు ఇంద్రియజ్ఞానం కనీసం రెండు విధాల్లో ప్రత్యక్ష్యపరచబడుతుంది: ధర్మశాస్త్రానికి ఆకారాన్ని ఇవ్వడం మరియు ఆరాధన.

చరిత్రంతటా ప్రతి శిష్టతా కొన్ని నైతికమైన ధర్మశాస్త్రాలకి విలువనిచ్చింది. అవి ఆశ్చర్యకరంగా సంస్కృతికీ సంస్కృతికీ తుల్యమైనవే. ఉదాహరణకి, ప్రేమ అన్న భావం సర్వత్ర గుణ్యమైనది, అయితే అబద్ధం పలకడం అన్న చర్య సర్వత్ర దండనకి అర్హమైనది. ఈ సామాన్యమయిన నీతి- మంచి చెడుల ఈ వసుదైక నీతి- మనకి ఇటువంటి ధర్మాధర్మ శంకలని ఇచ్చిన సర్వశ్రేష్టుడైన, నైతికమైన జీవిని సూచిస్తుంది.

అదేవిధంగా, లోకమంతటా ఉన్న మనుష్యులు, సంస్కృతితో ఏ సంబంధం లేకుండా ఆరాధన యొక్క ఒక పద్ధతిని ఎప్పుడూ అవలంబించుకున్నారు. ఆరాధన యొక్క విషయం మారవచ్చు, కానీ “ అధికోన్నతమైన శక్తి” యొక్క భావం మానవుడు అవడానికి ఒక నిరాకరించలేని భాగం. ఆరాధించే ఇచ్ఛ దేవుడు మనలని “తన స్వరూపమున” సృష్టించేడన్న” (ఆదికాండం 1:27) సత్యంతో ఏకీభవిస్తుంది.

దేవుడు తన్ను తాను మనకి తన వాక్యం అయిన బైబిల్ ద్వారా వెల్లడిపరచుకున్నాడు. లేకఖనమంతటిలో ఆ దేవుని యొక్క ఉనికి ఒక స్వయంవిదితం అయిన సత్యంగా చూడబడింది( ఆదికాండము 1:1; నిర్గమకాండము 3:14). బెంన్జామిన్ ఫ్రేంక్లిన్ తన ఆత్మకథ రాసినప్పుడు, అతను తన ఉనికిని నిరూపించుకోవడంలో సమయాన్ని వ్యర్థం చేయలేదు. అదేవిధంగా, దేవుడు ఆయన గ్రంధంలో తన ఉనికిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎక్కువ సమయాన్ని వెచ్చించలేదు. బైబిల్ యొక్క జీవితం- మార్చే స్వభావం, తమ న్యాయవర్తన మరియు దాని రాతలని అనుసరించిన అద్భుతాలు ఎక్కువ సమీపంగా ఉండే చూపుకి అధికారాన్ని కలుగజేయటానికి తగినంతది.

దేవుడు తన్ను తాను వెల్లడిపరచుకున్నది తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ( యోహాను 14:6-1). “ ఆదియందు వాక్యముండెను మరియు వాక్యము దేవుడాయెను. వాక్యం శరీరధారియై మన మధ్య నివసించెను. ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది( కొలొస్సయులు 2:9).

యేసు యొక్క అద్భుతమైన జీవితంలో, ఆయన పాతనిబంధన యొక్క ధర్మశాస్త్రాలని పరిపూర్ణంగా గైకొని, అభిశక్తునికి సంబంధించిన (మత్తయి 5:7) ప్రవచింపులనన్నిటిని నెరవేర్చేడు (మత్తయి 5:17). ఆయన తన సందేశాన్ని ప్రమాణపూర్వకంగా సిద్ధిపరచడానికి మరియు తన దైవానికి సాక్ష్యమివ్వడానికీ లెక్కలేనన్ని కృపగల మరియు బాహాటమైన అద్భుతాలని చేసేడు( యోహాను 21:24-25). అటుపిమ్మట ఆయన శూలారోపణ యొక్క మూడుదినాల పిమ్మట ఆయన మృతులలోనుండి లేచేడు. ఆ సంగతి కండ్లారా చూసిన సాక్ష్యులవల్ల ధృవీకరించబడింది. యేసు ఎవరో అన్న సాక్ష్యాలు చారిత్రిక దస్తావేజులో విస్తారంగా ఉన్నాయి. అపొస్తలు పౌలు చెప్పినట్టు ఈ సంగతి “మరుగైయుండలేదు” (అపొస్తుల కార్యములు 26:26).

దేవుని గురించి తమ స్వంత అభిప్రాయాలుండే నిత్యశంకితులు ఎప్పుడూ ఉంటూ ఉంటారని మరియు వారు దాని ప్రకారమే సాక్ష్యాన్ని చదువుతారని మనం గుర్తిస్తాం. మరియు కొంతమందిని ఎంత సాక్ష్యమైనా సరే, ఒప్పించలేదు( కీర్తన 14:1). ఇదంతా ఆఖరికి విశ్వాసమే( హెబ్రీయులు 11:6).


ప్రశ్న: దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?

సమాధానము:
మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస్తారేమో. బైబిల్ యొక్క అధికారం లేకుండా, ఈ వాక్యాల యొక్క సంగ్రహం ఒక మనిషి యొక్క అభిప్రాయం కన్నా ఎక్కువ బృహత్తరమైనదేమీ కాదు కనుక, లేఖనాల ఉపప్రమాణాలు సంపూర్ణముగా అవసరం. మనిషి అభిప్రాయం తనంతట తానే దేవుని గురించి అర్థం చేసుకోవడంలో తరచుగా సరికానిది ( యోబు 42:7). మనకి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనదని చెప్పడం ఒక పెద్ద మాట. అలా చేయలేకపోవటం వల్ల మనం ఆయన చిత్తానికి ప్రతికూలంగా, అబద్ధపు దేవుళ్ళను ఆరాధించి, వెంబడించేలా చేయగల సంభవనీయత ఉంది (నిర్గమకాండము 20:3-5).

దేవుడు తనను గురించి వెల్లడించదలచుకున్నది మాత్రమే తెలియబడుతుంది. దేవుని యొక్క గుణాల్లో లేక లక్షణాలలో “వెలుగు” అంటే అర్థం ఆయన తన గురించిన సమాచారమును తానే వెల్లడిపరచుకుంటున్నాడని (యెషయా 60:19), (యాకోబు 1:17). ఆయన యొక్క విశ్రాంతిలో మనలో ఒక్కడైనను ప్రవేశించకుండా, ఆయన తన గురించిన పరిజ్ఞానాన్ని తానే వెల్లడిపరిచేడన్న సత్యం నిర్లక్ష్యపెట్టబడకూడదు ( హెబ్రీయులు 4:1). సృష్టి అయిన బైబిల్ మరియు శరీరధారియైన వాక్యం (యేసుక్రీస్తు) దేవుడు ఎటువంటివాడో అని అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడతాయి.

దేవుడు మన సృష్టికర్త అనీ మరియు మనం ఆయన సృష్టి యొక్క ఒక భాగం అని అర్హం చేసుకోవడంతో మనం ప్రారంభిద్దాం (ఆదికాండం 1:1 మరియు కీర్తనలు 24:1). మనిషి తన ప్రతిరూపంలో సృజింపబడ్డాడని దేవుడు చెప్పేడు. మనిషి మిగతా సృష్టికి అతీతం మరియు దానిమీద అధికారం మానవునికి ఇవ్వబడింది (ఆదికాండం 1:26-28). సృష్టి "పతనం"తో దెబ్బతిన్నా కానీ అది ఆయన క్రియ యొక్క ఒక ఈషద్దర్శనాన్ని మనకి ఇస్తుంది ( ఆదికాండము 3:17-18, రోమీయులు 1:19-20). సృష్టి యొక్క విశాలతను, జటిలత్వాన్ని, సౌందర్యాన్ని మరియు క్రమాన్ని చూస్తే భగవంతుని గురించి భయభక్తులు కలుగవచ్చు.

దేవుడు ఎటువంటివాడన్న మన శోధనకి సహాయం చేయడానికి, దేవుని కొన్ని నామములను చదవడం మనకి సహాయపడగలదు. అవి ఇలా ఉన్నాయిః

ఏలోయీము -ధృడమైనవాడు, దివ్యమైనవాడు( ఆదికాండము 1:1).
ఏదోనయి - ప్రభువు, యజమాని మరియు సేవకుని సంబంధాన్ని సూచించేది (నిర్గమకాండము 4:10,13).
ఎల్ ఎల్యోను - సర్వోన్నతుడు, అతి శక్తిమంతుడు
ఎల్ రోయి - చూచుచున్న శక్తిమంతుడు (ఆదికాండము 16:13)
ఎల్ షద్దయి - సర్వశక్తి గల దేవుడు (ఆదికాండము 17:1)
ఎల్ ఓలాము - నిత్య్డమగు దేవుడు (యెషయా 40:28)
యాహ్వే - దేవుడు “నేను ఉన్నవాడను” -అంటే బాహ్యమై ఉండునను దేవుడు (నిర్గమకాండము 3:13-14).

ఇప్పుడు మనం దేవుని మరిన్ని లక్షణాలని పరిశీలించడం కొనసాగిద్దాం: దేవుడు నిత్యమైనవాడు. అంటే అర్థం ఆయనకి ఏ ప్రారంభం లేదు మరియు ఆయన ఉనికి ఎప్పుడు అంతం అవదు ఆయన అమర్త్యుడు, అనంతమైనవాడు ( ద్వితీయోపదేశకాండము 33:27, కీర్తన 90:2, 1 తిమోతి 1:17). దేవుడు నిర్వికారుడు, అంటే అర్థం ఆయన నిర్వ్యత్యాసమైనవాడు; అంటే దేవుడు శుద్ధముగా ఆధారపడతగినవాడు మరియు నమ్మతగినవాడు(మలాకి 3:6 ; సంఖ్యాకాండము 23:19; కీర్తన 102:;26,27). ఆయన సాటిలేనివాడు, అంటే ఎవరూ ఆయనవలె క్రియల్లోకాని లేక ఉనికిలోకాని ఉండలేరని అర్థం; ఆయన అసమానమైనవాడు మరియు పరిపూర్ణుడు ( 2 సమూయేలు 7:22; కీర్తన 86:8, యెషయా 40:25; మత్తయి 5:48); దేవుడు రహస్యస్వరూపుడు, అంటే గూఢమైనవాడు, అననేష్వణీయమైనవాడు. ఆయన జ్ణానమును శోధించుట అసాధ్యము( యెషయా 40:28; కీర్తన 145:3; రోమీయులు 11:33,34).

దేవుడు న్యాయస్థుడు; ఆయన పక్షపాతి కాడు అన్న భావంలో (ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 18:30) ఆయన మనుష్యులను లక్ష్యపెట్టేవాడు కాదు. “ఆయన శర్వశక్తి సంపన్నుడు అంటే ఆయన శక్తిమంతుడు. ” తనకి ఇష్టమున్నదేదైనా ఆయన చేయగలడు, కానీ ఆయన క్రియలెప్పుడూ ఆయన స్వభావం ప్రకారం ఉంటాయి (ప్రకటన 19:6), యిర్మీయా 32:17, 27). ఆయన సర్వవ్యాపకుడు, ప్రతి చోటా ఎప్పుడూ ఉండేవాడని అర్థం; కానీ దేవుడే ప్రతీదీ అని దీని అర్థం కాదు (కీర్తన 139:7-13; యిర్మీయా 23:23). దేవుడు సర్వజ్ఞుడు- అంటే ఆయనకి గతం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలియడమేకాక మనం ఎప్పుడు, ఏమిటి ఆలోచిస్తూ ఉంటామో అని కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు కనుక ఆయన న్యాయం కూడా ఎల్లప్పుడూ సబబుగానే నడుస్తుంది (కీర్తన 139:1-5, సామెతలు 5:21).

దేవుడు ఒక్కడే. అంటే, ఇంకెవరూ లేరనే కాక మన హృదయపు అంతరంగాల యొక్క అవసరాలు మరియు వాంఛలని నెరవేర్చేవాడు ఆయన ఒక్కడే మరియు ఆయన ఒక్కడు మాత్రమే మన ఆరాధనకి మరియు నిరత్యతకి యోగ్యుడు(ద్వితీయోపదేశకాండము 6:4). దేవుడు నీతిమంతుడు అంటే దేవుడు తప్పులని క్షమించడు మరియు క్షమించజాలడు. మన పాపాలు ఆయనపైన మోపబడినప్పుడు మన పాపాలు క్షమించబడటానికి ఆయన నీతి మరియు న్యాయం వలన యేసు దేవుని తీర్పుని అనుభవించవలిసి వచ్చింది (నిర్గమకాండము 9:27; మత్తయి 27:45-46; రోమీయులు 3:21-26).

దేవుడు సర్వాధికారి, అంటే ఆయన సర్వశ్రేష్టుడు. తెలిసీ, తెలియకా కూడా, ఆయన సృష్టి సమస్తం కలిపికూడా ఆయన ఉద్దేశ్యాలని అడ్డగించలేదు. (కీర్తన 93:1, యిర్మీయా 23:20). దేవుడు, అంటే ఆయన అగోచరమయేవాడు ( యోహాను 1:18, 4:24). ఆయన త్రిత్వము. అంటే ఆయన ఒకరిలో ముగ్గురు అని- సారములో ఒకటే, శక్తి మరియు మహిమయందు సమానమే అనీ. ప్రధమ లేఖనము ఉదహరించబడినప్పుడు అది, “ తండ్రి, కుమారుడు మరియ పరిశుద్ధాత్మ” అన్న ముగ్గురు భిన్నమైన వ్యక్తిత్వాలని ఉదహరించినప్పటికీ , ఆ “నామము” ఏకవచనంలో ఉంది ( మత్తయి 28:19, మార్కు 1:9-11). దేవుడే సతము, అంటే ఆయన ఉనికికంతా ఆయన ఏకీభావాన్ని కలిగి ఉండి ఆయన అనశ్వరమైనవానిగా ఉండి అబద్ధాలు పలకలేడని అర్థం( కీర్తన 117: 2, 1 సమూయేలు 15:29).

దేవుడు పరిశుద్ధుడు-అంటే ఆయన నైతికంగా, అపవిత్రతనుండి వేరు చేయబడ్డాడని మరియు దానికి విరుద్ధమైనవాడని అర్థం. దేవుడు కీడునంతా చూస్తాడు మరియు అది ఆయనకి కోపాన్ని రప్పిస్తుందిః సామాన్యంగా పవిత్రతతోపాటు లేఖనంలో అగ్ని ఉదహరించబడుతుంది. దేవుడు దహించు అగ్నివలె చెప్పబడతాడు( యెషయా 6:3 ; హబక్కూకు 1:13; నిర్గమకాండము 3:2, 4,5; హెబ్రీయులు 12:29). దేవుడు దయాళువు-దీనిలో ఆయన మంచితనం, కృప, దయ మరియు ప్రేమ చేర్చబడి ఉన్నాయి- అవి ఆయన మంచితనానికి అర్థాల యొక్క లేశాలని అందించే పదాలు. అది కనుక దేవుని మహిమ వల్ల కాకపోతే, ఆయన యొక్క ఇతర లక్షణాలు ఆయన్నుంచి మనలని మినహాయించి పెడతాయి. కృతజ్ఞతాపూర్వకంగా, ఆయనకి మనలో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా తెలుసుకునే ఇచ్ఛ ఉంది కనుక సంగతి అది కాదు( నిర్గమకాండము 34:6, కీర్తన 31:19, 1 పేతురు 1:3; యోహాను 3:16; యోహాను 17: 3).

ఒక దేవుని మహత్తైన ప్రశ్నకి సమాధానం చెప్పే ఒక సాత్వికమైన ప్రయత్నం ఇది. దయచేసి ఆయన్ని శోధించడం కొనసాగించడంలో గొప్పగా ప్రోత్సాహాన్ని పొందండి.


ప్రశ్న: జీవితానికి అర్థం ఏమిటి?

సమాధానము:
జీవితానికి ఉన్న అర్థం ఏమిటి? నేను జీవితంలో ఉద్దేశ్యాన్ని, నేరవేర్పుని మరియ సంతోషాన్ని ఎలా పొందగలను? శాస్వతమయిన ప్రాముఖ్యతని పొందే సామర్థ్యత నాకు ఉంటుందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలని పరగణించడానికి అధికమంది ఎప్పుడూ ఆగలేదు. సంవత్సరాల పిమ్మట, వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూసి తమ సంబంధాలు ఎందుకు తెగిపోయేయో మరియు తాము ఎందుకు అంత శూన్యంగా భావిస్తున్నామో అని ఆశ్చర్యపడతారు. బేస్‌బాల్ హాల్ ఓఫ్ ఫేమ్‌కి చేరిన ఒక బేస్‌బాల్ ఆటగాడిని, అతను మొదట బేస్‌బాల్‌ని ఆడటం ప్రారంభించినప్పుడు ఎవరైనా అతనికి ఏమిటి చెప్పవలిసి ఉండేదో అని అతను ఏమిటి కోరుకున్నాడో లేదోనని ప్రశ్నించబడింది. “ నీవు పైశిఖరానికి చేరిన తరువాత అక్కడేదీ లేదని ఎవరైనా నాకు చెప్తారని నేను ఆశించేను” అని అతను సమాధానం ఇచ్చేడు. చాలా సంవత్సరాల వ్యర్థ ప్రయత్నం తరువాత చాలా గమ్యాలు తమ శూన్యత్వాన్ని వెల్లడిపరుస్తాయి.

మన మానవ సమాజంలో మనుష్యులు వాటిలో తమకి అర్థం దొరుకుతుందని అనుకుంటూ అనేకమైన ఉద్దేశ్యాలని వెంబడిస్తారు. వారి కొన్ని ప్రయత్నాలలో వ్యాపారపు విజయం, ఆస్థి, మంచి బాంధవ్యాలు, లైంగిక సంబంధాలు, వినోదం మరియు ఇతరులకి మంచిచేయడం కలిగి ఉంటాయి. వారు ధనార్జన యొక్క గమ్యం, బాంధవ్యాలు మరియు సుఖసంతోషాలు సాధించినప్పటికీ కూడా , వారికి మనస్సులో ఒక గాఢమైన శూన్యత, ఏదీ నింపలేని ఒక రిక్తమైన భావన ఉందని, మనుష్యులు సాక్ష్యం పలికేరు.

అతడు “ వ్యర్థము! వ్యర్థము!........ సమస్తమూ వ్యర్థమే (ప్రసంగి 1:2) అని చెప్పినప్పుడు, ఈ భావనని ప్రసంగి యొక్క బైబిల్‌యుతమైన గ్రంధం యొక్క గ్రంధకర్త వ్యక్తపరుస్తాడు. ప్రసంగి యొక్క గ్రంధకర్త అయిన సోలొమోను రాజు వద్ద లెక్కలేనంత ఆస్థి ఉండి, అతనికి అతని సమకాలీనులకు మరియు మనకాలంలో ఉన్న ఏ మనిషికన్నా కూడా ఎక్కువ వివేకం, వందల గొద్దీ స్త్రీలు, రాజ్యాలు ఈర్ష్య పడే కోటలు, తోటలు అతి ఉత్తమమైన ఆహారం మరియు ద్రాక్షారసం మరియు సాధ్యమయే ప్రతి విధమైన వినోదం ఉండేవి. తన మనస్సు దేన్ని కోరినాకానీ, తను దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తానని అతడు తన జీవితంలో ఒకానొక సమయంలో చెప్పేడు. అయినప్పటికీ అతను దాన్ని “ఆకాశము క్రింద ఉన్న జీవితం” అని సంక్షిప్తంగా చెప్పేడు- జీవితానికున్నదల్లా మన కళ్లతో చూడగలిగేది మరియు మనం అనుభూతి చెందేది- అది –వ్యర్థము! అక్కడ అంత శూన్యత ఎందుకు ఉంది? ఎందుకంటే దేవుడు మనలని మనం ఇప్పుడే- ఇక్కడే అనుభవించేదానికన్నా మించిన దేనికోసమో సృష్టించేడు. ఆయన శాస్వత కాలజ్ఞానమును నరుల హృదయమందుంచియున్నాడు గాని........(ప్రసంగి 3:11) అని సొలొమోను దేవుని గురించి చెప్పేడు. ఉన్నదంతా ఇక్కడే-ఇప్పుడే అన్నదే కాదని, మనం మన హృదయాల్లో ఎరిగి ఉన్నాం.

బైబిల్ యొక్క ప్రధమ గ్రంధం అయిన ఆదికాండములో మానవజాతి దేవుని ప్రతిరూపమున సృజింపబడిందని మనం చదువుతాం (ఆదికాండము 1:26). మనం ఇంకేదాని కన్నా కూడా( ఏ ఇతర జీవాకృతియైనా) ఎక్కువ దేవుని వలె ఉన్నాం అని దీని అర్థం.

మానవజాతి పాపంలో పడి, పాపం యొక్క శాపం భూమిపైన పడినముందు ఈ కిందవి సత్యం అని కూడా మనం చూస్తాం. (1) దేవుడు మనిషిని ఒక సామాజిక జీవిగా చేసెను( ఆదికాండము 2:18-25); (2) దేవుడు మనిషికి పని ఇచ్చెను( ఆదికాండము 2:15); (3) దేవుడు నరునితో సహవాసము చేసెను( ఆదికాండము 3:8); మరియు (4) దేవుడు నరునికి భూమిమీద అధినివేశాన్ని ఇచ్చేడు(ఆదికాండము 1:26). ఈ సంగతుల ప్రాముఖ్యత ఏమిటి? వీటిలో ప్రతీదీ, మన జీవితంలో నిర్వర్తింపుని తేవాలని దేవుడు ఉద్దేశ్యించేడు, కానీ ఇవన్నీ (ప్రత్యేకంగా దేవునితో నరుని సహవాసం) మనిషి పాపంలో పడటం మరియు మరియు భూమిమీద శాపంగా పరిణమించడంవల్ల వ్యతిరేకంగా పరిణమించేయి (ఆదికాండము 3).

బైబిల్లో ఆఖరి గ్రంధం అయిన ప్రకటన గ్రంధంలో, మనకి తెలిసి ఉన్న ఈ ప్రస్తుత భూమిని మరియు పరలోకాలని నాశనం చేసి, ఒక నూతన పరలోకమునీ మరియు ఒక నూతన భూమినీ సృష్టించడంతో, నిత్యమైన రాజ్యాన్ని ప్రవేశపెడతానని దేవుడు వెల్లడిపరుస్తాడు. రక్షింపబడనివారు అయోగ్యులని మరియు వారు అగ్నిగుండంలోనికి త్రోయబడాలని తీర్పు తీర్చబడినప్పుడు (ప్రకటన 20:11-15), ఆ సమయాన్న తను పునరుత్ధరించబడిన మానవజాతితో ఒక పూర్ణమైన సహవాసాన్ని దేవుడు మరల అనుగ్రహిస్తాడు. పాపం యొక్క శాపం నశించిపోయి ఏ పాపం, దుఃఖం, రోగం, మృత్యువు, నొప్పి ఇత్యాదివి ఇంక ఉండవు( ప్రకటన 21:4), మరియు విశ్వాసులు అన్ని సంగతులనీ స్వతంత్రించుకుంటారు. వారితో దేవుడు నివశించి వారు ఆయన కుమారులవుతారు( ప్రకటన 21:7). అలాగు, ఆయనతో సహవాసము ఉండటానికి దేవుడు మనలని సృజించి, మనిషి పాపం చేసి, ఆ సహవాసాన్ని తెంపినందువల్ల మనం చుట్టూ తిరిగి అక్కడికే వస్తాం. దేవుడు పూర్ణంగా తనవల్ల యోగ్యులుగా పరిగణించబడినవారికి ఆయన ఆ సహవాసాన్ని మరల అనుగ్రహిస్తాడు.

ఇప్పుడు, జీవితంలో ప్రతీదీ సాధిస్తూ, జీవితాన్ని గడిపి నిత్యత్వంకోసం దేవునితో వేరుపడి మరణించడంకోసమే అయితే అది వ్యర్థం కన్నా చెడుగానున్నది! కానీ నిత్యమైన ఆశీర్వాదం సాధ్యపరచడానికేకాక (లూకా 23:43), భూమిపైన జీవితాన్ని సంతృప్తికరంగా మరియు అర్థవంతంగా కూడా గడిపే ఒక దారిని దేవుడు చూపించేడు. ఈ నిత్యమైన ఆశీర్వాదం మరియు “పరలోకము మరియు భూమి” ఎలా ప్రాప్తమవుతాయి? యేసుక్రీస్తు ద్వారా మరల అనుగ్రహింపబడిన జీవితానికి అర్థం జీవితంలో ఉన్న నిజమైన అర్థం ఇప్పుడు మరియు నిత్యత్వంలో రెండిటిలో ఆదాము మరియు హవ్వలు పాపంలో పడిన సమయాన్న, కోల్పోయిన దేవునితో సంబంధాన్ని పునస్థాపించడంలో కనిపిస్తుంది. ఈకాలం దేవునితో ఆ సంబంధం ఆయన కుమారుడైన యేసుక్రీస్తుద్వారా మాత్రమే సంభవం ( అపొస్తులల కార్యములు 4:12; యోహాను 14:6; యోహాను 1:12). ఎవరైనా తన పాపానికి (ఇంక దానిలో గడపక క్రీస్తు వారిని మార్చివేసి, వారిని ఒక నూతన వ్యక్తివలె చేయాలని కోరితే) మారుమనస్సు పొంది, మరియు రక్షకునిగా క్రీస్తుపైన ఆధారపడటం ప్రారంభిస్తే ( ఈ అతి ముఖ్యమైన అంశంపైన ఎక్కువ సమాచారంకోసం “ రక్షణ యొక్క ప్రణాళిక ఏమిటి? అన్న ప్రశ్నని చూడండి), నిత్యజీవితం లభిస్తుంది.

జీవితపు పరమార్ధం యేసుని రక్షకునిగా చూడటం వల్ల మాత్రమే కనిపించదు

( అది ఎంత అద్భుతమైనది అయినప్పటికీ). అంతకన్నా ఎవరైనా తను క్రీస్తుని అతని శిష్యుని వలె, వెంబడిస్తూ ఆయనవల్ల నేర్చుకుని ఆయనతో ఆయన వాక్యం అయిన బైబిల్‌యందు సమయాన్ని వెచ్చిస్తూ, ఆయనతో ప్రార్థనయందు సంభాషిస్తూ, మరియు ఆయన శాసనాలపట్ల విధేయతతో నడుస్తూ ఉన్నప్పుడు, అదే జీవితపు పరమార్థం. మీరు కనుక ఒక అవిశ్వాసి అయి ఉంటే (లేక బహుశా ఒక క్రొత్త విశ్వాసేమో), “ అది నాకు చాలా ఉత్తేజకరంగా లేక సంతృప్తిగా ఏమీ అనిపించడం లేదే “ అని మీకు మీరే చెప్పుకుంటూ ఉండే సంభావ్యత ఉంది. కానీ దయచేసి ఇంకొద్దిపాటు చదవండి. యేసు ఈ క్రిందనున్న మాటలని చెప్పేడుః

“ప్రయాసపడి భారమును మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకి రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను కనుక మీమీది నా కాడి ఎత్తికొని, నాయొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సుళువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి” ( మత్తయి 11:28-30). గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను( యోహాను 10:10 బి). “అప్పుడు యేసు తన శిష్యులని చూచి –ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును” ( మత్తయి 16:24-25). “యహోవానుబట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును( కీర్తన 37:4).

ఈ వచనాలన్నీ చెప్తున్నది మనకి ఒక ఎంపిక ఉందని. మనం మన స్వంత మార్గదర్శులమి అవడానికి శోధిస్తే, అది శూన్యమైన జీవితంగా పరిణమిస్తుంది. లేక మనం దేవుడిని మరియు ఆయనచిత్తాన్ని పూర్ణ హృదయంతో మన జీవితాల కోసం వెంబడిస్తే, అది జీవితాన్ని మన హృదయపు ఇచ్ఛలని నెరవేరుస్తూ, సంతోషం మరియు సంతృప్తిని కనుక్కుంటూ, సంపూర్ణంగా జీవించడంగా పరిణమిస్తుంది. మన సృష్టికర్త మనలని ప్రేమించి మనకోసం అతి ఉత్తమమైనది( అతి సులభమయిన జీవితం అయితే తప్పకకాదు, కానీ అతిగా సంతృప్తి కలిగించేది) కావాలని కోరినందువల్ల అది ఇలా అవుతుంది.

మీరు కనుక ఆటల/క్రీడల అభిమాని అయి ఉండి, ఒక వృత్తిపరమైన ఆటకి వెళ్తే, మీరు కొన్ని డాలర్లని వెచ్చించి, క్రీడా దర్శకకేంద్రంలో పైనున్న వరుసలో ఒక “ముక్కు- రక్తంకారే” సీటు పొందడానికి నిర్ణయించుకోవచ్చు లేకపోతే మీరు కొన్ని వందల డాలర్లని వెచ్చించి చర్య జరుతున్న చోటుకి దగ్గిరగా మరియు సన్నిహితంగా అవవచ్చు. క్రైస్తవ జీవితంలో అలా ఉండదు. దేవుడు పని చేయడాన్ని కొత్తగా చూడటం ఆదివారపు క్రైస్తవుల పనికాదు. వారు మూల్యాన్ని చెల్లించలేదు. దేవుడు పని చేయడాన్ని సమీపంనుంచి చూడటం తను దేవుని ఉద్దేశ్యాలని సాధించడం కోసం ఆమె/ అతను తన ఇచ్ఛలని సాధించడానికి ప్రయత్నం చేయడం నిజంగా మానివేసే పూర్ణహృదయపు శిష్యుల పనే. వారు మూల్యాన్ని చెల్లించేరు( క్రీస్తు మరియు ఆయన చిత్తానికి సంపూర్ణమైన అప్పగింత); వారు తమ జీవితాన్ని అతి ఉత్తమంగా ఉల్లసిస్తున్నారు; మరియు వారు తమని తాము, తమ సహవాసులని, తమ సృష్టికర్తనీ చింతించనక్కరలేకుండా ఎదురుకోగలరు. మీరు మూల్యాన్ని చెల్లించేరా? మీకు సమ్మతమేనా? అలా అయితే, మీరు అర్థం లేక ఉద్దేశ్యం వెనుక మరల ఆశపడరు.


ప్రశ్న: క్రైస్తవత్వం అంటే ఏమిటి మరియు క్రైస్తవులు వేటిని నమ్ముతారు?

సమాధానము:
1 కొరింధీయులు 15:1-4 చెప్తుందిః “మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి, దానియందే నిలిచియున్నారు. మీవిశ్వాసము వ్యర్థమైతేనేగాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో, ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల, ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందెను. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.”

సంక్షిప్తంగా చెప్పాలంటే, అదే క్రైస్తవత్వం యొక్క మూల విశ్వాసం. ఇతర మతాలన్నిటి మధ్యనా అనన్యమైనది, క్రైస్తవత్వం మతసంబంధమైన ఆచారాల కన్నా ఎక్కువగా ఒక సంబంధం గురించినది. “ఇది చేయి మరియు ఇదిచేయవద్దు” అన్న జాబితాకి అంటిపెట్టుకొని ఉండేకన్నా, ఒక క్రైస్తవుని గమ్యం తండ్రియైన దేవునితో ఒక అన్యోన్యమైన గమనం కోసం కృషి చేయడం. యేసుక్రీస్తు యొక్క క్రియ వల్ల మరియు పరిశుద్ధాత్మ క్రైస్తవుని జీవితంలో చేసిన పరిచర్య వల్ల ఆ సంబంధం సాధ్యమయింది. బైబిల్ దేవుని వల్ల ప్రేరేపించబడిన పొరపాటులేని దేవుని వాక్యం అని మరియు దాని బోధన అంతిమ అధికారత్వం అని క్రైస్తవులు నమ్ముతారు (2 తిమోతి 3:16; 2 పేతురు 1:20-21). ముగ్గురు వ్యక్తులలో ఉండే ఒక దేవుడిని క్రైస్తవులు నమ్ముతారు. తండ్రి, కుమారుడు( యేసుక్రీస్తు) మరియు పరిశుద్ధాత్మ.

మానవజాతి దేవునితో ఒక సంబంధం ఉండేటందుకు ప్రత్యేకంగా సృష్టించబడినప్పటికీ, ఆ పాపం జనులందరినీ దేవునితో వేరుపరుస్తుందని క్రైస్తవులు నమ్ముతారు( రోమీయులు 3:23, 5:12). యేసుక్రీస్తు ఈ భూమిపైన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా నడిచి, శిలువపైన మరణించేడని క్రైస్తవులు విశ్వసిస్తారు. శిలువపైన ఆయన మరణం పిమ్మట క్రీస్తు సమాధి చేయబడి, ఆయన తిరిగి ల్రేచి, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉండి, విశ్వాసులకి యుగయుగాలకీ మధ్యవర్తిత్వము నిర్వహిస్తున్నాడని క్రైస్తవులు నమ్ముతారు (హెబ్రీయులు 7:25). శిలువపైన యేసు మరణం అందరివల్ల ఋణపడిఉన్న పాపానికి పూర్తిగా చెల్లించడానికి చాలినంతది మరియు ఇదే దేవునికీ మరియు నరునికీ మధ్యన ఉన్న తెగిపోయిన సంబంధాన్ని పునహ్‌స్థాపించేది (హెబ్రీయులు 9:11-14, 10:10, రోమీయులు 5:8, 6:23).

రక్షింపబడటానికి ఎవరైనా తన విశ్వాసాన్ని యావత్తూ శిలువపైన క్రీస్తు వల్ల ముగియబడిన క్రియపైన పెట్టాలంటే. క్రీస్తు తన స్థానాన్న మరణించేడని మరియు తన స్వంతపాపాలకి మూల్యాన్ని చెల్లించేడని మరియు తిరిగి లేచేడని కనుక విశ్వసిస్తే , అప్పుడు ఆ వ్యక్తి రక్షింపబడలేదు. రక్షణని సంపాదించుకొనేటందుకు ఎవరైనా చేయగలిసేది ఏదీ లేదు. మనమందరం పాపులమి కనుక, తనంతట తానే దేవుడిని సంతోషపెట్టడానికి ఎవరూకానీ చాలినంత మంచివారు కారు. రెండవదేమిటంటే, క్రీస్తు అంత క్రియనీ ముగించినందువలన, చేయబడవలిసినది ఏదీ లేదు. ఆయన శిలువపైన ఉన్నప్పుడు యేసు “ఇది సమాప్తమాయెను” అని చెప్పేడు (యోహాను 19:30).

రక్షణని పొందడానికి ఎవరూ చేయగలిగేది ఏదీ లేనట్లే, ఒకసారి ఆమె/అతడు కానీ తన విశ్వాసాన్ని శిలువపైనున్న క్రీస్తు యొక్క క్రియపైన పెట్టినప్పుడు, క్రియంతా క్రీస్తు వల్ల జరిగింపబడి, ముగిసినందువల్ల తన రక్షణని కోల్పోయేటందుకు ఎవరైనా చేయగలిసేది కూడా ఏదీ లేదు. రక్షణ గురించినదేదీ దాన్ని ఎవరు పొందుతారన్న దానిపైన ఆధారపడదు. (యోహాను 10:27-29)లో అది “ నేను వాటినెరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు. ఎవడును వాటిని నాచేతిలోనుండి అపహరింపలేడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటె గొప్పవాడు కనుక, నా తండ్రి చేతిలోనుండి వాటిని యెవడును అపహరింపలేడు” అని చెప్తుంది.

“ఇది బాగుంది- ఒకసారి నేను రక్షింపబడ్డాక, నేను నాకిష్టమైనది చేసికూడా నేను నా రక్షణని కోల్పోను” అని కొందరు అనుకోవచ్చు. కానీ రక్షణ అంటే తనకి ఇష్టమైనది చేయడానికి స్వతంత్రం ఉండటం కాదు. రక్షణ అంటే పాతపాపపు స్వభావానికి పరిచర్య చేయడం నుంచి స్వతంత్రులవడం మరియు దేవునితో ఒక యుక్తమైన సంబంధాన్ని సాధించడానికి ప్రయత్నించడం. మనం ఒకానొకప్పుడు పాపానికి బానిసముగా ఉన్నప్పటికీ, ఇప్పుడు మనం క్రీస్తుకి బానిసలం( రోమీయులు 6:15-22). విశ్వాసులు తమ పాపపూరితమైన శరీరాలయందు ఈ భూమిపైన జీవిస్తున్నంతకాలమూ, పాపాన్ని వదిలిపెట్టే నిరంతరమైన ఘర్షణ ఉంటుంది. ఏమైనప్పటికీ, దేవుని వాక్యాన్ని(బైబిల్ని) అధ్యయనం చేసి, దాన్ని తమ జీవితాలకి వర్తించుకుంటూ, పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడుతూ ఉండి- అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రభావానికి లోబడుతూ, దైనందిన సందర్భాల్లో ఆత్మ యొక్క శక్తివల్ల ముందు నడుస్తూ, దేవుని వాక్యాన్ని గైకొంటూ ఉండటంవల్ల క్రైస్తవులు పాపంతో ఘర్షణ పైన విజయాన్ని సాధించగలరు.

కాబట్టి, ఒక వ్యక్తి కొన్ని నిర్దిష్టమైన సంగతులని చేయాలని లేక చేయకూడదని అనేకమైన మతసంబంధమయిన వ్యవస్థలు కోరినప్పటికీ, క్రైస్తవత్వం మన పాపానికి మూల్యంగా క్రీస్తు శిలువపైన మరణాన్నొంది, తిరిగి లేచేడని నమ్మడం గురించే. మీ పాపపు –ఋణం చెల్లించబడింది మరియు మీకు దేవునితో సహవాసం ఉండగలదు. మీరు మీ పాపపు స్వభావంపైన విజయాన్ని పొంది, దేవునితో సహవాసంయందు మరియు విధేయతయందు మీరు నడవగలరు. అదే సత్యమైన బైబిల్‌యుతమైన క్రైస్తవత.


ప్రశ్న: రక్షణ విశ్వాసము వలనే కలుగుతుందా? లేక క్రియలుకూడా అవసరమా?

సమాధానము:
క్రైస్తవ సిధ్దాంతములోనే బహుశా యిది అతి ప్రాముఖ్యమైన అంశంకావచ్చు. ఈ ప్రశ్న ప్రొటెస్టెంటు, ఖథోలిక్ సంఘాలకు మధ్యన విభజనకు, మరియు దిద్దుబాటుకు (రిఫర్మేషన్- మతోథ్దారణకు) దారితీసింది. బైబిలుకేంద్రిత క్రైస్తవత్వానికి, అబద్ద భోధనలకు మద్యన తారతమ్యం చూపించే ప్రాముఖ్యమైన అంశం కూడా ఇదే. రక్షణ విశ్వాసమువలనే కలుగుతుందా? లేక క్రియలుకూడా అవసరమా? నేను రక్షణపొందటానికి యేసుప్రభువునందు విశ్వాసముంచితే సరిపోతుందా లేక ఇంకేమైనా పనులు చేయాల్సిన అవసరం వుందా?

రక్షణ విశ్వాసము ద్వారానే మరియు విశ్వాసముతోకూడిన పనులవలనే అనే ఈ రెండు అంశాలుకు సంభందించి, ఖఛ్చితమైన వాక్యభాగాలు వుండటంబట్టి ఈ ప్రశ్న మరింత జఠిలంఅవుతుంది. రోమా 3:28: 5:1; గలతీ 3:24; యాకోబు 2:24 తో పోల్చిచూడండి. కొంతమంది పౌలు (రక్షణ విశ్వాసము వలనే) మరియు యాకోబు (రక్షణ విశ్వాసముతో కూడిన క్రియలువలన) మధ్య వ్యత్యసాన్ని చూస్తుంటారు (ఎఫెసి 2:8-9). విశ్వాసముమూలముగానే నీతిమంతుడుగా తీర్పుతీర్చబడుతారు అని పౌలు ఖండితముగ భోధిస్తే యాకోబు విశ్వాసమునకు క్రియలు జోడిస్తున్నట్లు అనిపిస్తుంది. యాకోబు యేమి రాస్తున్నాడు అని గమనించినట్లైతే ఈ విభేధాన్ని తొలగించుకోవచ్చు. ఓవ్యక్తి మంచి క్రియలులేకుండా విశ్వాసము కల్గియుండవచ్చు అనే నమ్మకాన్ని యాకోబు తృణీకరిస్తున్నాడు (యాకోబు 2:17-18). యేసుక్రీస్తునందు యధార్దమైన విశ్వాసము మార్పునొందిన జీవితముగా, మంచిక్రియలుగా ఫలిస్తుందని యాకోబు నొక్కివక్కాణించాడు (యాకోబు 2:20-26). నీతీమంతుడుగా తీర్పుతీర్చబడుటకు విశ్వాసంతోకూడిన క్రియలు అవసరము అని యాకోబు చెప్పడంలేదుగాని విశ్వాసముతో నీతిమంతుడుగా తీర్పు తీర్చబడిన వ్యక్తి జీవితములో మంచి క్రియలు ఖచ్చితముగా వుంటాయని యాకోబు చెప్పుతున్నాడు. ఓ వ్యక్తి విశ్వాసిని అని చెప్పుకొంటూ జీవితములో మంచి క్రియలు కనపర్చకపోనట్లయితే యేసుక్రీస్తునందు యధార్దమైన విశ్వాసము లేనట్లే(యాకోబు 2:14, 17, 20, 26).

పౌలు తన రచనలలో అదే విషయం చెప్పుతున్నాడు. ఓ విశ్వాసికి వుండాల్సిన మంచి ఫలముల జాబితను గమనించవచ్చు (గలతీ 5:22-23). మనకు క్రియలను బట్టి కాక విశ్వాసము వలననే రక్షణ అని భోధించిన పౌలు (ఎఫెసి 2:8-9), మంచి క్రియలు చేయుడానికే మనం సృజించబడ్డామని పౌలు తెల్పుతున్నాడు(ఎఫెసి 2:10). జీవితములో మార్పు అవసరమని యాకోబు భోధించినట్లే పౌలు కూడా ఆశిస్తున్నాడు.కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను (2కొరింధి 5:17). రక్షణకు సంభంధించిన విషయంలో యాకోబు, పౌలు ఒకరినొకరు విభేధించుకోవడంలేదు. ఒకే అంశాన్ని వేర్వేరు కోణంలో భోధిస్తున్నారు. విశ్వాసము ద్వారానే ఒకడు నీతిమంతుడుగా తీర్చబడును అని పౌలు క్షుణ్ణంగా నొక్కివక్కాణిస్తే క్రీస్తునందు అట్టి యధార్దమైన విశ్వాసము మంచిక్రియలుగా ఫలిస్తుందని యాకోబు వొక్కాణించాడు.


ప్రశ్న: పాతనిబంధనలోని ధర్మశాస్త్రమునకు క్రైస్తవులు విధేయత చూపించాలా?

సమాధానము:
ఈ అంశమును అవగాహన చేసుకొనుటకు మూల కారణము పాతనిబంధనలోని ధర్మశాస్త్రము ప్రాధాన్యముగా ఇశ్రాయేలీయులకే గాని క్రైస్తవులకు కాదుఅన్నది. ఇశ్రాయేలీయులు విధేయత చూపించటం ద్వారా దేవునిని ఏవిధంగా సంతోషపెట్టాలని కొన్ని ఆఙ్ఞలు బహిర్గతము చేస్తున్నాయి (ఉదాహరణకు: పది ఆఙ్ఞలు).మరి కొన్నైతే ఇశ్రాయేలీయులు దేవునిని ఏవిధంగా ఆరాధించాలి అంటే ప్రాయశ్చిత్తం చెల్లించాలి (బలి అర్పించే విధానము). మరి కొన్ని నియమములు ఇశ్రాయేలీయులను ఇతర రాజ్యాలనుంచి ప్రత్యేకించటానికి (ఉదాహరణ: ఆహారపు పద్దతులు, దుస్తులు) పాతనిబంధనలోని ధర్మశాస్త్రముకూడా నేడు మనపై కట్టుబడిలేదు. యేసుక్రీస్తు ప్రభువువారు సిలువమీద చనిపోయినపుడు పాతనిబంధన ధర్మశాస్త్రమును అంతమొందించారు (రోమా 10:4; గలతీ 3:23-25; ఎఫెసీ 2:15)

పాతనిబంధన ధర్మశాస్త్రమునకు బదులుగా క్రీస్తు నియమము క్రింద మనము తేబడ్డాము (గలతీ 6:2)అదేదనగా, “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆఙ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆఙ్ఞయు దానివంటిదే” (మత్తయి 22:37-39). ఈ రెండు ఆఙ్ఞలకు ధర్మశాస్త్రమునకు విధేయత చూపించినవారు యేసుక్రీస్తు ఆశించినవన్ని పరిపూర్ణము చేసినట్లే, “ఈ రెండు ఆఙ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవని” అతనితో చెప్పెను (మత్తయి 22:40). దీన్ని అర్ధం పాతనిబంధన ధర్మశాస్త్రము నేటికి వర్తించదని కాదు. దానిలోని అనేక ఆఙ్ఞలు, దేవునిని ప్రేమించడం, పొరుగువారిని ప్రేమించడం అనేవి జాబితాలో వున్నవే. “దేవునిని ఏవిధంగా ప్రేమించాలి,” “పొరుగువారిని ప్రేమించడంలో” ఏముంటాది అనేదానికి/ అనితెలుసుకోవటానికి పాతనిబంధన ఒక మంచి దిక్సూచి. అదే సమయంలో పాతనిబంధన ధర్మశాస్త్రము నేటి క్రైస్తవులకు వర్తిస్తాది అనేది పొరపాటే. పాతనిబంధన ధర్మశాస్త్రమంతటినీ ఒకటిగా తీసుకోవాలి (యాకోబు 2:10). అయితే పూర్తిగా వర్తిస్తాది లేకపోతే పూర్తిగా వర్తించకుండా పోతాది. యేసుక్రీస్తు ప్రభువువారు ప్రాయశ్చిత్తార్ధబలిని నెరవేర్చినట్లయితే దానిని పరిపూర్ణంగా నెరవేర్చినట్లే.

“మమాయన ఆఙ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆఙ్ఞలు భారమైనవి కావు” (1 యోహాను 5:3). పది ఆఙ్ఞలు ప్రాధామికంగా పాతనిబంధన ధర్మశాస్త్రము యొక్క సారాంశము. పదింట తొమ్మిది ఆఙ్ఞలు క్రొత్త నిబంధనలో బహు స్పష్టముగా తిరిగి చెప్పబడ్డాయి (సబ్బాతు దినము పాటించండి అనే ఆఙ్ఞ తప్ప మిగిలినవి). ఎందుకంటే ఎవరైతే దేవునిని ప్రేమిస్తున్నారో వారు ఇతర దేవుళ్ళను ఆరాధించరు లేక విగ్రహాలకు మొక్కరు. మనము మన పొరుగువారిని ప్రేమిస్తున్నట్లయితే మరి వారిని హత్యచేయము, వారితో అబద్దమాడము, వారితో వ్యభిచరించము, మరియు వారికి సంభంధించినది ఏదియు ఆశించము. పాతనిబంధన ధర్మశాస్త్రము మనకు ఇవ్వబడింది ప్రజల యొక్క అవసరతను చూపిస్తూ రక్షణయొక్క అవసరతనను గుర్తించేటట్లు చేయటమే (రోమా 7:7-9; గలతీ 3:24). దేవుడు పాతనిబంధన ధర్మశాస్త్రమును సార్వత్రికంగా అందరికి వర్తించేదిగా చేయలేదు.మనము దేవుని, పొరుగువారిని ప్రేమించాలి ఈ రెండు ఆఙ్ఞలను నమ్మకముగా విధేయత చూపించాలన్నదే దేవుడు మన అందరినుండి కోరుకొంటున్నాడు.


ప్రశ్న: క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?

సమాధానము:
యేసు తన గురించి చేసుకొన్న ఖచ్చితమైన సవాళ్ళతోపాటు శిష్యులు కూడ క్రీస్తుని దేవత్వమును అంగీకరించారు. యేసు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారము కలవాడని వారు సవాలు చేసారు. అది దేవునికి మాత్రమే సాధ్యం (అపోస్తలుల కార్యములు 5:31; కొలస్సీయులకు 3:13; కీర్తన 130:4; యిర్మియా 31:34). ఎందుకంటే పాపంచేత నొప్పింపబడినవాడు దేవుడు కాబట్టి. దీనికి అనుభంధమైన మరొక సవాలు యేసు సజీవులకును మృతులకును తీర్పు తీర్చువాడు “దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు” క్రీస్తుయేసు యెదుటను (2 తిమోతి 4:1). తోమా “నా దేవా నా దేవా” అని యేసుతో అనెను (యోహాను 20:28). పౌలు యేసయ్యను గొప్ప “దేవుడుగా, రక్షకుడుగా” (తీతుకు 2:13) అని పిలవటమే కాకుండా క్రీస్తు అవతరించకమునుపు “దేవుడు స్వరూపియైయున్నాడని” సూచించెను (ఫిలిప్పీయులకు 2:5-8). తండ్రియైన దేవుడు యేసయ్యను గురించి చెప్పినది “దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది” (హెబ్రీయులకు 1:8).యోహాను భక్తుడు “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము (యేసు) దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను” (యోహాను 1:1). క్రీస్తు దైవత్వమును భోధించేవి అనేకమైన లేఖనాలున్నవి (ప్రకటన 1:17; 2:8;22:13; 1 కొరింథి10:4; 1 పేతురు 2:6-8; కీర్తన 18:2; 95:1; 1 పేతురు 5:4; హెబ్రీయులకు 13:20), ఆయన శిష్యులు క్రీస్తును దేవుడుగా గుర్తించారనటానికి ఈ వచనాలలో ఏ ఒక్కటియైన సరిపోతుంది.

పాతనిబంధనలో యెహోవాకు (దేవుని నామం) మాత్రమే వర్తించేటటువంటి బిరుదులు యేసయ్యకు ఇచ్చారు. పాతనిబంధనలో “విమోచకుడు” (కీర్తన 130:7; హోషేయా 13:14). క్రొత్తనిబంధనలో యేసయ్యకు ఉపయోగించారు (తీతుకు 2:13; ప్రకటన 5:9). యేసయ్యకు ఇమ్మానుయేలు “దేవుడు మనతో” నున్నాడు (మత్తయి 1) అని పిలిచారు. జెకర్యా 12:10లో “వారు తాము పొడిచిన వానిమీద దృష్టియుంచి,” యెహోవా దేవుడు చెప్పిన దానినే క్రొత్తనిబంధనలో సిలువపై మరణించిన క్రీస్తుకు ఆపాదించారు ( యోహాను 19:37;ప్రకటన 1:7). ఒకవేళ పొడిచి దృష్టియుంచినది యెహోవామీద అయితే దానిని యేసుకు ఆపాదించినట్లయితే పౌలు యెషయ్యా 45:23 కు భాష్యం చెప్పుతూ దాన్ని ఫిలిప్పి 2:10,11 క్రీస్తుకు ఆపాదించారు. అంతేకాకుండా ప్రార్థనలో క్రీస్తునామాన్ని, దేవుని నామానికి జోడించెను, “తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపకలుగునుగాక” (గలతీయులకు 1;3; ఎ ఫెస్సీయులకు 1:2). ఒకవేళ క్రీస్తు దైవత్వంకానియెడల ఇది దేవ దూషణ అయివుండేది. యేసయ్య సర్వలోకమునకు సువార్తనందించి బాప్తిస్మము ద్వారా శిష్యులుగా చేయమన్న ఆఙ్ఞలో క్రీస్తునామము తండ్రి నామముతో అగపడుతుంది (మత్తయి 28:19; 2 కొరింధి 13:14).

దేవునికి మాత్రమే సాధ్యమయ్యే పనులను యేసయ్యకు వర్తించారు. యేసయ్య చనిపోయినవారిని లేపటమే కాకుండా (యోహాను 5:21;11:38-44), పాపములు క్షమించాడు (అపొస్తలుల కార్యములు 5:31; 13:38), విశ్వాన్ని సృజించి దానిని కొనసాగించాడు (యోహాను 1:2; కొలస్సీయులకు 1:16,17). యెహోవా ఒక్కడే విశ్వాన్ని సృజించాడు అన్న మాటలు గ్రహించటం ద్వారా ఇది ఇంకను స్పష్టమౌతుంది (యెషయ 44:24).అంతేకాకుండా కేవలము దేవునికి మాత్రమే వర్తించిన గుణగణాలు క్రీస్తు కలిగియున్నాడు. నిత్యుడు (యోహాను 8:58), సర్వఙ్ఞాని (మత్తయి 16:21), సర్వవ్యామి (మత్తయి 18:20; 28:20)మరియు సర్వశక్తుడు (యోహాను 11:38-44).

తాను దేవుడనని చెప్పుకొంటూ ఇతరులను మోసపూరితంగా నమ్మించటం ఒక ఎత్తైతే, దాని ఋజువు పర్చడం మరో ఎత్తు, ఇంకా దాని ధృవీకరించి, ఋజువుపర్చడం మరొకటి. క్రీస్తు తానే దేవుడనని ఋజువు పర్చటానికి అనేక సూచక క్రియలు చేసాడు. క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చడం (యోహాను 2:7), నీళ్ళమీద నడవడం (మత్తయి 14:25), ఐదు రొట్టెలు రెండు వేలమందికి పంచి పెట్టడం (యోహాను 6:11), గ్రుడ్డివారిని స్వస్థపరచడం (యోహాను 9:7), కుంటివారిని నడపించడం (మార్కు 2:3), రోగులను స్వస్థపరచడం (మత్తయి 9:35:మార్కు 1:40-42), చనిపోయినవారిని సహితము తిరిగి లేపడం (యోహాను 11:43-44);లూకా 7:11-15) యేసయ్య చేసిన సూచక క్రియలలో ఇవి కొన్ని మాత్రమే. అంతేకాకుండా, క్రీస్తు మరణంనుంచి తానే పునరుత్ధాడయ్యాడు. మరణంనుండి తిరిగిలేవడం అనేది అన్య పురాణాలలో నున్నప్పటికి ఏ మతముకూడా పునరుత్ధానాన్ని ఆపాదించుకోలేకపోయింది. అంతేకాకూండా మరి దేనికికూడా లేఖనమునకు అతీతంగా ఇన్ని నిడర్శనాలు , ఋజువులు లేవు.

క్రైస్తవేతర పండితులు సహా యేసుక్రీస్తును అంగీకరించగల పన్నెండు వాస్తవాలు.

1). యేసు సిలువపై మరణించాడు.
2). ఆయన సమాధి చేయబడ్డాడు.
3). ఆయన మరణము శిష్యులను నిరాశ, నిస్పృహలకు కారణం మయ్యింది.
4). యేస్యు సమాధి కొన్ని దినాల తర్వాత ఖాళీగా వున్నట్లు కనిపెట్టబడింది.
5). యేసయ్య శిష్యులు, పునరుత్ధానుడైన యేసును చూసిన అనుభవాన్ని నమ్మారు.
6). అనుభవంతర్వాత అనుమానించిన శిష్యులు ధైర్యముకలిగిన విశ్వాసులుఅయ్యారు.
7). ఆది సంఘభోధనలో ఈ వర్తమానం మూలాంశమైయున్నది.
8). ఈ వర్తమానం యెరూషలేంలో భోధించారు.
9). ఈ భోధనకు ఫలితమే సంఘం ప్రారంభమై ఎదిగింది.
10). సబ్బాతు (శనివారం) కు బదులుగా పునరుత్ధానదినం (ఆదివారం) ఆరాధనకు ప్రాముఖ్యమైనదినముగా మారింది.
11). అనుమానుస్ధుడుగా గుర్తింపుపొందిన యాకోబు మార్పు చెంది,పునరుత్ధానుడైన క్రీస్తును చూచినట్లు నమ్మాడు.
12). క్రైస్తవత్వానికి శత్రువుడైన పౌలు పునరుత్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతనుబట్టి మార్పు చెందినట్లుగా నమ్మాడు.

పునరుత్ధానాన్ని ఋజువుచేస్తూ సువార్తను స్థాపించగలిగితే పైన పేర్కొన్నవాటి విషయం పై వచ్చిన ఏ అనుమానాన్ననైనా నివృత్తిచేయవచ్చు.యేసు మరణం, సమాధి, పునరుత్ధానం, మరియు ఆయన కనపడటం (1కొరింధి 15:1-5). పైన పేర్కొన్న వాటిని వివరించటానికి కొన్ని సిధ్ధాంతాలు వున్నప్పటికి వాటికి సమర్థవంతంగా వివరణ ఇవ్వగలిగేది పునరుత్ధానము మాత్రమే. క్రీస్తుని శిష్యులు పునరుత్ధానమును సహితం తాము చూసారని చెప్పుకున్నారని విమర్శకులు కూడా ఒప్పుకున్నారు. భ్రమ, అబద్డములకు సాధ్యముకాని మార్పు పునరుత్ధానమునకు మాత్రమే సాధ్యమయింది. మొదటిదిగా, వారు లబ్ధి పొందింది ఏంటి? డబ్బు సంపాదించుకోడానికి క్రైస్తవత్వం ప్రభావితమైంది కాదు. రెండవది, అబద్దికులు హతసాక్షులవ్వలేరు. తమ విశ్వాసంకోసం, క్రూరమైన మరణం సహితం శిష్యులు అంగీకరించటానికి పునరుత్ధానము సరైన వివరణ. తాము నిజమను కొనే అబద్దానికోసం చనిపోయేవారు ఎందరో వుండవచ్చు గాని తాను అబద్దం అనుకోడానికికోసం చనిపోయే వారెవ్వరుండరు.

ముగింపులో క్రీస్తు తానే యెహోవా అని చెప్పుకున్నాడు (ఒక “దేవుడు” కాదు, ఒకే ఒక్క దేవుడు). ఆయన అనుచరులు (విగ్రహారాధనంటే భయపడే యూదులు) ఆయనను దేవునిగా నమ్మారు, గుర్తించారు. క్రీస్తు తన దైవత్వాన్ని ఋజువుపరచుకోడానికి అనేక సూచక క్రియలు చేశారు. పునరుత్ధానుడైనాడు అన్నది అన్నిటికి మించినది, ప్రపంచాన్నే తలక్రిందులు చేసినటువంటి ఋజువు. మరి ఏ సిధ్దాంతము కూడ ఈ వాస్తవాలకు సరియైన వివరణ ఇవ్వలేదు. బైబిలు ప్రకారము క్రీస్తే దేవుడు.


ప్రశ్న: పరిశుధ్దాత్ముడు ఎవరు?

సమాధానము:
పరిశుద్ధాత్ముని గుర్తింపు విషయమై అనేక అపోహాలున్నాయి. కొంతమంది పరిశుద్ధాత్ముని ఒక అతీత శక్తిగా పరిగణిస్తారు. క్రీస్తును వెంబడించువారందరికి దేవుడనుగ్రహించు పరిశుద్ధాత్ముడు కేవలము శక్తి అని అర్ధమౌతుంది. పరిశుద్ధాత్ముని గురించి బైబిలు ఏమని భోదిస్తుంది? బైబిలు ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు దేవుడు అని తెలియచెప్పుతుంది. పరిశుద్ధాత్ముడు మనస్సు, భావోద్రేకాలు, చిత్తం కల్గియున్న దైవికమైన (దైవ)వ్యక్తి అని బైబిలు భోదిస్తుంది.

అపోస్తలుల కార్యములు 5:3-4 వచనాలతో సహా పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా దేవుడు అని అనేక పాఠ్యభాగాలలో చూడవచ్చు. ఈ వచనంలో పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నీవు అబద్దమాడితివని పేతురు అననీయాను ఖండించి, మరియు “నీవు మనుష్యులతోకాదు గాని దేవునితోనే అబద్దమాడితివని” వానితో చెప్పెను. పరిశుద్ధాత్మునితో అబద్దమాడితే దేవునితోనే అబద్దమాడినట్లు అని ఇక్కడ బహిర్గతమౌతుంది. దేవునికి మాత్రమే వుండదగిన స్వభావలక్షణాలు పరిశుద్ధాత్ముడు కల్గియుండుటనుబట్టి, పరిశుద్ధాత్ముడుకూడా దేవుడే అని తెల్సుకోవచ్చు. కీర్తన 139: 7-8 లో : “నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పారిపోవుదును? నీ సన్నిదినుండి నేనెక్కడికి పారిపోవుదును?” మరియు 1కొరింధి 2:10-11 లో పరిశుద్ధాత్ముడు సర్వజ్ఞాని అనే లక్షణం వున్నదిఅంటానికి నిదర్శనమైయున్నది. “మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి యున్నాడు. ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములనుకూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు మనుష్యాత్మకేగాని మనుష్యులలో మరి ఎవనికిని తెలియదు. ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకేగానీ మరి ఎవనికిని తెలియవు.”

మనస్సు, భావోద్రేకం, చిత్తం ఈ లక్షణాలు కల్గియుండటాన్ని బట్టి పరిశుధ్ధాత్ముడు తప్పనిసరిగ్గా దైవికమైన వ్యక్తి. పరిశుధ్ధాత్ముడు అన్నిటిని ఆలోచించేవాడు, తెలుసుకోగలిగేవాడు (1 కొరింధి 2:10), పరిశుధ్ధాత్ముని ధుఖపరచవచ్చు.(ఎఫెస్సి 4:30), ఆత్మ మనకొరకు విజ్ఞాపనచేస్తాడు (రోమా 8:26-27). తన చిత్తానుసారముగా నిర్ణయాలుతీసుకుంటాడు (1కొరింధి 12: 7-11). పరిశుద్ధాత్ముడు దేవుడు, త్రిత్వములోని మూడవ వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభువు వాగ్ధానం చేసినట్లుగా దేవునిలాగే పరిశుద్ధాత్ముడు కూడ ఆదరణకర్తగా, భోధకుడుగా(యోహాను 14:16;26; 15:26) వ్యవహరిస్తాడు.


ప్రశ్న: నా జీవితంపట్ల దేవుని చిత్తాన్ని ఏవిధంగా తెల్సుకోవాలి? దేవుని చిత్తం తెల్సుకోవటం విషయంలో బైబిలు ఏమిచెప్తుంది?

సమాధానము:
ఒక విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికీ రెండు చిట్కాలు లేక అవసరతలు. 1) నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో దానిని బైబిలు తప్పుగా ఎంచినది కాదని ధృవీకరించుకో. 2). నీవేదైతే అడుగుతున్నావో లేక ఆశపడుతున్నావో అది దేవుని మహిమ పరచేదిగాను, నీకు ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహించేదిగాను ఉన్నదో లేదో ధృవీకరించుకో.ఈ రెండు వాస్తవమై నీవు అడిగినదానిని దేవుడు ఇంకా అనుగ్రహించకుండా వుండినట్లయితే బహుశా అది నీవు కల్గియుండుట దేవుని చిత్తంకాదేమో, లేదా ఇంకా కొంచెం సమయం వేచి యుండాలేమో. దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట కొన్నిసార్లు కష్టము. కొంతంమంది ఎక్కడ పని చేయాలి, ఎక్కడ జీవించాలి, యెవరిని పెళ్ళిచేసుకోవాలి వగైరా విషయాల్లో దేవుడు ఖచ్చితముగా తన చిత్తాన్ని బయలు పరచాలని ఆశిస్తున్నారు. అయితే దేవుడు చాలా అరుదుగా నిక్కర్చిగా, నేరుగా అలాంటి సమాచారాన్ని అనుగ్రహిస్తాడు. ఇలాంటి విషయాల్లో మనమే ఎంపిక చేసుకోవాలని దేవుడు అనుమతిస్తాడు.

రోమా 12:2 లో “మీరు ఈ లోకమర్యాదను ననుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి” అని చెప్పబడింది. పాపంచేయాలని లేకా ఆయన చిత్తాన్ని తృణీకరించాలి అన్న ఒక విషయంలో నిర్ణయాన్ని మనం తీసుకోకూడదని దేవుడు మనలనుండి ఆశిస్తున్నాడు. ఆయన చిత్తానికి కనుగుణంగా ఎంపికలు చేసుకోవాలని ఆశిస్తున్నాడు. అయితే నీ జీవితంపట్ల దేవుని చిత్తమేంటోనని నీకెలా తెలుస్తుంది? ఒకవేళ నీవు దేవునికి సన్నిహితంగా నడుస్తూ, యధార్ధంగా నీ జీవితంపట్ల తన చిత్తాన్ని నెరవేర్చాలని ఆశిస్తున్నాట్లైతే అప్పుడు దేవుడు తన ఆశయాలను, కోరికలను నీ హృదిలో వుంచుతాడు. నీ చిత్తం కోసం కాక దేవుని చిత్తంకోసమే వేచియుండటం చాలా ప్రాముఖ్యం. “యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంచలను తీర్చును” (కీర్తన 37:4). నీవు ఆశిస్తున్నాదాన్ని బైబిల్ వ్యతిరేకంగా సూచించనట్లయితే అది యధార్దంగా నీ ఆత్మీయతకు అభివృధ్ధి కలగించేదేతై, దానిని ఎంపిక చేసుకోవడానికి నీ హృదయాను సారముగా నడవడానికి బైబిలు “అనుమతి”స్తుంది. వినయముతో, విన గలిగే మనస్సుతో ఆయన చిత్తాన్ని తెల్సుకోడానికి యధార్ధంగా ప్రయత్నిస్తే, దాన్ని బహిర్గతం చేయడానికి దేవుడు సంసిధ్దంగా నున్నాడు.


ప్రశ్న: క్రైస్తవ జీవితంలో పాపంపై విజయం అధిగమించటం ఎలా?

సమాధానము:
మనము పాపంను అధిగమించే ప్రయత్నాలను బలోపేతము చేయుటకు బైబిలు అనేక రకములైన వనరులను అందిస్తుంది. మనము ఈ జీవితంలో ఎప్పటికి కూడా పాపంపై విజయాన్ని సాధించలేము ( 1 యోహాను 1:8), అయినప్పటికి అది మన గురిగా వుండాలి. దేవుని సహాయముతో ఆయన వాక్యములోని సూత్రాలను అనుసరించటం ద్వారా పాపాన్ని క్రమేణా అధిగమిస్తూ క్రీస్తు స్వారూప్యములోనికి మారగలుగుతాం.

పాపంను అధిగమించటానికి గాను బైబిలు మనకు అందించే మొదటి సహాయం పరిశుద్ధాత్ముడు. దేవుడు మనకు పరిశుద్ధాత్ముని అనుగ్రహించింది జయోత్సాహాపు క్రైస్తవ జీవితం కోసమే. శారీరక క్రియలకు ఆత్మీయఫలాలకు ఖచ్చితమైన వ్యత్యాసాన్ని గలతీ 5:16-25 లో దేవుడు చూపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని బట్టి ఆత్మీయాను సారముగా నడచుటకు దేవుడు మనలను పిలిచాడు. విశ్వాసులందరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అయినప్పటికి ఈ విశ్వాసాన్ని బట్టి మనలను పరిశుద్ధాత్మునికి అప్పగించుకొని ఆత్మానుసారముగా నడచుకోవాలని భోదిస్తుంది. దీని అర్థం మనం నిలకడగా పరిశుద్ధాత్ముని యొక్క మెల్లని స్వరానికి స్పందించాలి గాని శరీరానికి కాదు.

పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొస్తాడో పేతురు జీవితం ద్వారా ప్రస్పుటం అవుతుంది- పరిశుద్ధాత్మునితో నింపబడకమునుపు యేసుయెవరో తెలియదని మూడుసార్లు బొంకిన వ్యక్తి, తర్వాత మరణమువరకు క్రీస్తును వెంబడించటానికి సిద్దపడ్డాడు. పెంతెకోస్తుదినాన్న పేతురు పరిశుద్ధాత్మునితో నింపబడిన తర్వాత బాహాటముగా , ధైర్యముగా యూదులతో మాట్లడాడు.

పరిశుద్ధాత్ముని ప్రేరణలను ఆర్పకుండటం ద్వారా ఆత్మానుసారముగా నడుస్తాం (1 ధెస్సలోనీయులకు 5:19 చెప్పిన రీతిగా) మరియు ఆత్మ నింపుదలకై ప్రయత్నించాలి (ఎఫెసీ 5:18-21). పరిశుద్ధాత్ముని నింపుదల ఒకడు ఏవిధంగా పొందగలడు? మొట్టమొదటిగా పాతనిబంధనవలే ఇది దేవుని ఎంపిక. తన కార్యాలను నెరవేర్చటానికి తాను ఎంపిక చేసుకున్న వ్యక్తులను తన ఆత్మతో నింపాడు (ఆదికాండం 41:38; నిర్గమకాండం 31:3; సంఖ్యాకాండం 24:2; 1 సమూయేలు 10:10). ఎవరైతే దేవుని వాక్యంచేత తమ జీవితాలను నింపుకుంటారో వారిని తన ఆత్మచేత నింపుతాడని ఈ రెండు వాక్యములు, ఎఫెసీయులకు 5:18-21; మరియు కొలొస్సీయులకు 3:16 ద్వారా ఋజువు అవుతుంది. ఇది రెండవ సాధనం లోనికి నడిపిస్తుంది.

దేవునివాక్యమైన బైబిలు చెప్తుంది దేవుడు తన వాక్యం ద్వారా ప్రతి మంచి కార్యముచేయటానికి సన్నద్దపరుస్తాడు (2 తిమోతి 3:16-17). ఎలా జీవించాలో, దేనిని నమ్మాలో అని భోధిస్తుంది. తప్పు మార్గాన్ని ఎంపిక చేసుకున్నపుడు బహిర్గతముచేస్తుంది, సరియైన మార్గములోనికి రావడానికి దోహదపడ్తుంది, సన్మార్గములో స్థిరపడటానికి సహాయపడ్తుంది. హెబ్రి 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా వుండి, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను శోధించుచున్నది. కీర్తనకారుడు 119 లో జీవన విధానము మార్చడంలో వాక్యము ఎంత శక్తివంతమైనదో భోధిస్తున్నాడు. శత్రువులపై విజయం సాధించటానికి మూలం తనకప్పగించబడిన వాక్యమును మర్చిపోకుండా దివారాత్రము దానిని ధ్యానించుటయే విజయ రహస్యమని తెలిపాడు. దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆఙ్ఞ యుద్ధపరిస్థులు భిన్నమైనప్పటికి, అర్థరహితమైనప్పటికి, విధేయత చూపించటం ద్వారా వాగ్ధానపు దేశము చేరుకోవటంలో వచ్చిన యుద్దాలపై విజయం సాధించాడు.

తరచుగా ఈ బైబిలును మరి చులకనగా చూస్తాం. బైబిలును నామకార్థంగా చర్చికి తీసుకువెళ్తాం. అనుదినం ఒక అధ్యాయం చదువుతాం, కాని దానిని ధ్యానించము, మననం చేయం, మన జీవితానికి అన్వయించుకోము. పాపాలను ఒప్పుకోవటం విషయములో, దేవుడు బహిర్గతము చేసిన విషయములో, మరియు దేవుని స్తుతించే విషయములో విఫలులమౌతాం. బైబిలు విషయాలకు వచ్చేటప్పడికి బీడు పట్టిన వారివలే వుంటాం. అయితే కేవలం అత్మీయంగా సజీవంగా వుండటానికి సరిపడే వాక్యాన్ని తీసుకోడానికి ఇష్టపడతాం (ఆరోగ్యవంతమైన క్రైస్తవులుగా వుండటానికి సరిపడే ఆహారం తీసుకోం), లేక వాక్యాన్ని తరచుగా చదివిన ఆత్మీయంగా బలముపడే విధంగా అధ్యయనం చేయము.

అనుదినము దేవుని వాక్యామును చదివి అధ్యయనం చేయుట అలవాటుగా మార్చుకోవటం అవసరం. కొంతమంది దినచర్య (డైరి) రాసుకోవటం అలవాటు. దేవుని వాక్యంలోంచి పొందిన ఏదో లాభం రాసేటంతవరకు విడచి పెట్టకుండా అలవర్చుకోవాలి. కొంతమంది దేవుడు వారికి సూచించిన, బహిర్గతము చేసినటువంటి మార్పు విషయమై తాము చేసిన ప్రార్థనలను రాసుకొంటూవుంటారు. బైబిలు పరిశుద్ధాత్ముడు యుపయోగించే ప్రాముఖ్యమైన పరికరము(ఎఫెసీ 6:17). ఆత్మీయ పోరాటములో దేవుడు మనకిచ్చిన అతి ప్రాముఖ్యమైన యుద్ధోపకరణము (ఎఫెసీ 6:12-18).

పాపంపై పోరాటములో మూడవ ప్రాముఖ్యమైన సాధనం ప్రార్థన. క్రైస్తవులు ఎక్కువ శాతం ప్రార్థనను కూడ అవసరానికి మట్టుకే వుపయోగించేకొనే సాధనం. ప్రార్థన కూడికలు మరియు ప్రార్థన సమయాలు వున్నప్పటికి మొదటి శతాబ్ధపు సంఘంవలే మనం వుపయోగించలేదు (అపోస్తలుల కార్యములు 3:1; 4:31; 6:4; 13:1-3). తాను పరిచర్య చేయువారికోసం ప్రార్థించే వాడని పౌలు పలుమార్లు ప్రస్తావించాడు. దేవుడు ప్రార్థన విషయములో అనేక వాగ్ధానాలను ఇచ్చాడు (మత్తయి 7:7-11; లూకా 18:1-8; యోహాను 6:23-27; 1 యోహాను 5:14-15), ఆత్మీయపోరాటము గురించి రాసినటువంటి దానిలో పౌలు ప్రార్థన యుద్దోపకరణముగా చర్చించాడు (ఎఫెసి 6:18).

పాపంను అధిగమించటంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది? గెత్సేమనేతోటలో పేతురు క్రీస్తును ఎరుగనని బొంకి పలికిన మాటలు మనకున్నాయి. క్రీస్తు ప్రార్థించుచుండగా పేతురు నిద్రపోయాడు. యేసయ్య అతనిని లేపి ఇట్లన్నాడు “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమేగాని శరీరము బలహీనము” ( మత్తయి 26:41). పేతురువలే మనము కూడ చాలసార్లు సరియైనదే చేయాలనుకుంటాము గాని శక్తి చాలదు. మనము దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ఙ్ఞాపకముంచుకొని, అడిగేవాళ్ళము, తట్టే వాళ్ళము, వెదికే వాళ్ళముగా వుంటాము. అప్పుడు ఆయన కావాల్సిన శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రార్థన ఒక మంత్రము కాదు. ప్రార్థన అనేది మన బలహీనతలను ఒప్పుకొంటూ దేవుని అపార శక్తిని , సామర్ద్యతను అంగీకరిస్తూ మనము కాక ఆయన కోరిన దానిని చేయటానికి శక్తికోసమే ఆయనవైపు తిరగటం (1 యోహాను 5:14-15).

పాపంపై విజయానికి నాల్గవ ప్రాముఖ్యమైన సాధనం సంఘం లేక ఇతర విశ్వాసులతో సహవాసం. యేసయ్య తన శిష్యులను పంపించినపుడు ఇద్దరిద్దరిగా పంపించాడు (మత్తయి 10:1). ఆదిఅపోస్తలులు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళలేదు, ఇద్డరిద్దరిగాగాని లేక గుంపుగా గాని వెళ్ళారు. యేసయ్య అఙ్ఞ ఇచ్చినట్లు సమాజముగా కూడుట మానక, ప్రేమనుచూపుటలో మంచి కార్యముల చేయునిమితమై ఒకరినొకరు పురికొల్పుకొనుచు హెచ్చరించుట మానకూడదు (హెబ్రీయులకు 10:24). మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి (యాకోబు 5:16)అని ఆయన చెప్తున్నాడు. పాతనిబంధనలోని సామెతలు చెప్తున్నట్లు ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును (సామెతలు 27:17). మంది ఎక్కువగా వుండుటవలన ఎక్కువ శక్తి ఉంటాది(ప్రసంగి 4:11-12).

మొండి పాపంపై విజయం సాధించుటానికి జవాబుదారియైన సన్నిహితుడు లేక తోటి విశ్వాసి వుండుట చాలా లాభధాయకమని చాలామంది క్రైస్తవులు గ్రహించారు. నీతో మాట్లాడి, నీతో ప్రార్థనచేసే, నిన్ను ప్రోత్సాహించే, అవసరమయితే నిన్ను ఖండించే మరో వ్యక్తి వుండటం ఎంతైనా ప్రయోజనకరం. అందరు శోధించబడతారు. జవాబుదారియైన వ్యక్తి లేక గుంపు మనము ఎదుర్కోనే మొండి పాపములపై విజయానికి అంతిమ ప్రోత్సాహాం, మరియు ఉత్తేజము.

కొన్నిసార్లు పాపంపై విజయం చటుక్కున వచ్చేస్తుంది. మరి కొన్ని సార్లు దీర్ఘకాలం పడ్తుంది. దేవుడు మనకిచ్చిన వనరులను వాడుతున్నప్పుడు మన జీవితంలో క్రమేణా మార్పు అనుగ్రహిస్తాడని వాగ్ధానం చేసాడు. పాపమును అధిగమించుటలో మనము జీవితంలో ప్రదర్శించటానికి నేర్చుకోవాలి ఎందుకంటే వాగ్ధానం నెరవేర్చుటలో ఆయన నమ్మదగినవాడు.


ప్రశ్న: నేనేందుకు ఆత్మహత్య చేసుకోకూడదు?

సమాధానము:
ఆత్మహత్య చేసుకోవాలనీ ఆలోచించే వారి పట్ల మన హృదయం కలవరపడ్తుంది. నిరాశ, నిస్పృహల మధ్యన సతమతమవుతూ అటువంటి ఆలోచనలకు లోనైన వ్యక్తివి నీవే అయితే నీవు ఒక లోతైన గుంటలో వున్నట్లు, ఇంకా మంచి స్ధితిగతులుంటాయనే నిరీక్షణను అనుమానించవచ్చు. నిన్నెవరు అర్దంచేసుకోవటంలేదని, ఆదరించువారు లేరని అనిపించవచ్చు. ఈ జీవితం జీవనయోగ్యమైనదేనా?

నీవు కొద్ద్ది నిమిషాలు దేవుడ్ని నీజీవితానికి దేవునిగా అనుమతించగలిగినట్లైయితే ఎంతగొప్పవాడో ఋజువు చేసుకుంటాడు. ఎందుకంటే “ఆయనకు అసాధ్యమైనది యేది లేదు” (లూకా 1:37). బహుశా! చేదు అనుభవాల మచ్చలు, ఒంటరితనాన్నికి, తిరస్కారపు ఆలోచనలకు దారీతీస్తుందేమో. అది నీపై నీకు జాలి, కోపం, కక్ష్య, హింసాత్మకమైన ఆలోచనలు లేక లేనిపోయిన భయాలకు దారి తీస్తూ అతి సన్నిహిత సంభంధాల మీద ప్రభావం చూపవచ్చు.

నేనేందుకు ఆత్మహత్య చేసుకోకూడదు? స్నేహితా, నీ పరిస్ధితులు ఎంత గడ్డుగావున్నప్పటికి, నిన్ను ప్రేమించే దేవుడు నిరాశా సొరంగంనుంచి అద్భుతమైన వెలుగులోకి నడిపించటానికి వేచియున్నాడు. ఆయనే ఖచ్చితమైన నిరీక్షణ. ఆయనే యేసయ్యా.

పాపరహితుడైన దేవుని కుమారుడైన యేసు, నీ తృణీకారములో, అవమానములో నీతో ఏకీభవిస్తున్నాడు. ప్రవక్తయైన యెష్షయా ఆయన గురించి రాస్తూ ఆయన అందరిచేత “తృణీకరించబడి, విసర్జింబడినవాడుగా” అభివర్ణించాడు (యెష్షయా 53:2-6). ఆయన జీవితం దు:ఖము, శ్రమలతో నిండినది. అయితే ఆయన అనుభవించిన దు:ఖం తనకోసంకాదుగానీ మనకోసమే. మన పాపం నిమిత్తం ఆయన గాయాలు పొంది, నలుగగొట్టబడి, చీల్చబడ్డాడు. ఆయన పొందిన దెబ్బలచేత మన జీవితాలు విమోచించబడి, సంపూర్ణులమౌవుతాం.

స్నేహితా, యేసుక్రీస్తు ఇదంతా అనుభవించింది కేవలం నీ పాపాన్ని క్షమించటానికే. నీవెంత గొప్ప అపరాధభావనను మోస్తున్నప్పటికి, నిన్ను నీవు తగ్గించుకొని ఆయనను నీ రక్షకునిగా అంగీకరించినట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. “నీ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను” (కీర్తన 50:15). యేసుక్రీస్తు క్షమించలేనంత అపరాధము ఏదీ లేదు. ఆయన ఏర్పరచుకొన్న సేవకులలో కొందరు పెద్ద పెద్ద పాపాలు చేసినవారే. హత్య చేసినవారు (మోషే), హత్య మరియు వ్యభిచారము చేసినవారు( రాజైన దావీదు), శారీరకంగా, భావోద్రేకంగా హింసించినవారు (అపోస్తలుడైన పౌలు) వున్నారు. అయినప్పటికీ నూతన ఫలవంతమైన జీవితాన్ని, క్షమాపణను పొందుకున్నారు. “కాగా ఎవడైననను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను” (2 కొరింధి 5:17).

నీవెందుకు ఆత్మహత్య చేసికొనకూడదు? స్నేహితా, “ విరిగి నలిగి,” అంతంమొందిచాలన్నా నీ జీవితాన్ని బాగు చేయటానికి దేవుడు సంసిద్దుడుగా నున్నాడు. యెష్షయా61:1-3 లో యెష్షయా ప్రవక్తా ఈ విధంగా రాసాడు, “ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయముగలవారిని ధృఢపరచుటకును, చెరలోనున్నవారికి విడుదలను, బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హిత వత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దు:ఖాక్రాంతులందరిని ఓదార్చుటకును సీయోనులో దు:ఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దు:ఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.”

యేసయ్య దగ్గరకు రండి.ఆయన మీ జీవితంలో నూతనకార్యం ఆరంభించగా ఆనందాన్ని, ఉపయోగత్వాన్ని తిరిగి నెలకొల్ప నివ్వండి. నీవు పోగొట్టుకున్న ఆనందాన్ని పునరుద్దీకరించి, నూతన ఆత్మ ద్వారా స్ధ్తిరపరుస్తానని వాగ్ధానాన్ని చేసాడు. నీ విరిగి నలిగిన హృదయమే ఆయన కెంతో విలువైనది. “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు” (కీర్తన 51: 12; 15-17).

యేసుప్రభువును నీ రక్షకునిగా, నీ కాపరిగా ఆయనను అంగీకరించుటకు సంసిధ్దమేనా? నీ ఆలోచనలను, నీ నడవడికలను ఆయన వాక్యం, బైబిలు ద్వారా దినదినము నడిపిస్తాడు. “నీకు ఉపదేశము చేసెదను. నీవు నడవలసిన మార్గమును నీకు భోధించెదను. నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తన 32:8). “నీ కాలములో నియమింపబడినది స్ధిరముగా నుండును. రక్షణ బాహూళ్యమును బుద్ధిఙ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము” (యెషయా 33:6). క్రీస్తులోవున్నప్పుడు శ్రమలు ఇంకా వుండవచ్చు. కానీ నిరీక్షణ వుంటుంది. “ఆయన సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు” (సామెతలు 18: 24). ఈ నిర్ణయం తీసుకునే సమయంలో యేసుక్రీస్తు కృప నీకు తోడుగా నుండును గాకా.

యేసుక్రీస్తును నీ రక్షకుడు అని నమ్మకముంచుటకు నీవిష్టపడినట్లయితే హృదయములో ఈ మాటలు దేవునితో చెప్పు. “దేవా నా జీవితంలో నీవు నాకు అవసరం. నేను యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, ఆయనే రక్షకుడని నమ్ముతున్నాను. మీరు నన్ను స్వస్థపరచి, శుధ్ధీకరించి ఆనందాన్ని నాలో తిరిగి నెలకొల్పండి. నా పట్ల నీవు చూపించిన ప్రేమకై నా కోసం చనిపోయినా యేసయ్యకు కృతఙ్ఞతలు.”

మీరు ఇక్కడ చదివారు కాబట్టి మీరు క్రీస్తు కొరకు ఒక నిర్ణయానికి వచ్చారా? అలా అయితే, క్రింద "ఈ రోజు నేను క్రీస్తును అంగీకరించాను" అను బటన్ క్లిక్ చేయండి.