చాలా తరచుగా అడిగిన ప్రశ్నలు

ప్రశ్న: ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా?

సమాధానము:
ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా? యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినవారు దేవునితో సంభంధాన్ని ఏర్పరచుకొనుటయే కాక నిత్య భధ్రతను రక్షణ నిశ్చయతను కల్గి యుంటారు. పలు వాక్యభాగాలు ఈ వాస్తావాన్ని ప్రకటిస్తున్నాయి. ఎ) రోమా 8:30 ఈ విధంగా ప్రకటిస్తుంది. “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.” ఈ వచనం ప్రకారం దేవుడు మనలను ఎంపిక చేసిన క్షణమునుండి పరలోకములో ఆయన సన్నిధానములో మహిమ పర్చబడినట్లుగావుంటుంది. దేవుడు ఒక విశ్వాసిని పరలోకములో మహిమపర్చబడటానికి ఏర్పర్చాడు కాబట్టి దేనినుండి ఆపలేడు. దేవుడు ఉద్దేశించిన మహిమనుంచి ఒక విశ్వాసిని ఏది కూడ ఆపలేదు. నీతిమంతుడుగా తీర్పుతీర్చబడినటువంటి వ్యక్తికి రక్షణ ఖచ్చితము. పరలోకములో మహిమ ఉన్నదంతగా రూఢి గల్గినవాడు.

బి).రోమా 8:33-34 లో పౌలు రెండు కీలక ప్రశ్నలు లేవనెత్తుచున్నాడు. “దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్పుతీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతేకాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విఙ్ఞాపనముకూడ చేయువాడును ఆయనే.” దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద ఎవరు నేరము మోపగలరు? ఎవరు చేయలేరు ఎందుకంటే క్రీస్తే మన న్యాయవాది. ఎవరు శిక్ష విధించగలరు? ఎవరివలనా కాదు. మనకొరకు చనిపోయిన యేసుక్రీస్తు ఒక్కడే శిక్ష విధించగలడు. మనకు ఒక ఉత్తరవాదిగా, న్యాయవాదిగా ఆయన మనకు ఉన్నాడు.

సి).విశ్వాసులు తిరిగి జన్మించినవారు (యోహాను 3:3; తీతుకు 3:5) విశ్వసించినవారు. ఒక క్రైస్తవుడు రక్షణను కోల్పోవటం అంటే జన్మించకుండా ఉండిన వాడై యుండాలి. నూతన జన్మను తీసివేయబడతాది అంటానికి బైబిలులో నిదర్శనాలు లేవు. డి). ప్రతి విశ్వాసులందరిలో పరిశుధ్ధాత్ముడు ఉంటాడు (యోహాను 14:17; రోమా 8:9). క్రీస్తు యొక్క ఒక్క శరీరములోనికి బాప్తిస్మమిస్తాడు. ఒక విశ్వాసి రక్షణను కోల్పోవాలంటే పరిశుధ్ధాత్ముడు అతనిని “విడిచి వెళ్ళిపోవాలి.” క్రీస్తు శరీరమునుండి వేరు చేయబడాలి.

ఇ).యేసుక్రీస్తు నందు విశ్వాసముంచినవారు “నిత్య జీవముకలవారని” యోహాను 3:16 తెల్పుతుంది.ఒక రోజు నీవు క్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే నీకు నిత్య జీవముంటుంది అయితే దానిని నీవు కోల్పోయినట్లయితే దానిని “నిత్యమైనది” అనలేము. కాబట్టి రక్షణను కోల్పోయినట్లయితే బైబిలులో నిత్య జీవమునకు సంభందించిన వాగ్ధానములు అబద్దములవుతాయి. ఎఫ్). వీటన్నిటిని ఆధారముచేసుకొని , ఈ వాదనలన్నిటిని రోమా 8:48-39 లో చూడగలము, “మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” నిన్ను రక్షించినటువంటి దేవుడే నిన్ను కాపాడతాడన్న మాటను ఙ్ఞాపకముంచుకో. ఒకసారి రక్షింపబడినట్లయితే ఎప్పటికి రక్షింపబడినట్లే. మన రక్షణ ఖచ్చితముగా నిత్యమూ భధ్రమే.


ప్రశ్న: మరణం తర్వాత ఏమౌతాది?

సమాధానము:
మరణం తర్వాత ఏంజరుగుద్ది అనే విషయంపై క్రైస్తవ విశ్వాసంలోనే పలు అనుమానాలున్నాయి. మరణం తర్వాత ప్రతి ఒక్కరు అంతిమ తీర్పు వరకు నిద్రిస్తారని, ఆ తర్వాత పరలోకమునకుగాని నరకమునకుగాని పంపబడతారని కొంతమంది నమ్ముతారు. మరి కొందరైతే మరణమైన తక్షణమే తీర్పువుంటుందని నిత్య గమ్యానికి పంపింపబడతారని నమ్ముతారు. మరణము తర్వాత ప్రాణాత్మలు తాత్కాలికమైన పరలోకము లేక నరకమునకు పంపబడతాయని అక్కడ అంతిమ పునరుత్ధానము కోసం వేచియుంటారని, అంతిమ తీర్పు తర్వాత నిత్య గమ్యాలకు పంపబడతారని మరి కొంతమంది చెప్పుతారు. కాబట్టి మరణం తర్వాత ఏమి జరుగుద్ది అన్నదానిని బైబిలు ఏమి చెప్తుంది?

మొదటిగా క్రీస్తునందున్న విశ్వాసి బైబిలు చెప్పుతున్నట్లుగా చనిపోయిన తర్వాత అతని/ఆమె ఆత్మ పరలోకమునకు కొనిపోబడతాది. ఎందుకంటే ఆ వ్యక్తి పాపములు క్రీస్తు స్వంతరక్షకునిగా అంగీకరించుటనుబట్టి క్షమించబడినవికాబట్టి యోహాను 3:16.18,36). విశ్వాసునికి మరణము అంటే శరీరమునుండి వేరు పరచబడి ప్రభువుతో యింటికి చేరటమే (2 కొరింథి 5:6-8; ఫిలిప్పీయులకు 1:23). అయితే, 1కొరింథి 15:50-54 మరియు 1థెస్సలోనీయులకు 1: 13-17 ప్రకారము ఒక విశ్వాసి పునరుత్ధానుడై మహిమగల శరీరము ఇవ్వబడినట్లు వివరిస్తున్నాయి. విశ్వాసులు మరణనంతరం క్రీస్తు దగ్గరకు వెళ్ళేవాళ్ళాయితే ఇటువంటి పునరుత్ధానము యొక్క ఉద్డేశము ఏంటి? బహుశా! విశ్వాసులు యొక్క ప్రాణాత్మాలు మరణాంతరం క్రీస్తుదగ్గరకు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి భౌతిక దేహము సమాధిలో నిడ్రించునేమో. విశ్వాసులు యొక్క పునరుత్ధాన సమయంలో వారి భౌతికధేహము పునరుత్ధానమై మహిమ శరీరముతో తిరిగి కలుసుకొనును. ఈవిధముగా తిరిగి ఏకపరచబడిన ప్రాణాత్మదేహాలను విశ్వాసులు కలిగియుండి నూతన ఆకాశాములోను నూతనలోకములోను నిత్యత్వములో గడుపుదురు.

రెండవదిగా ఎవరైతే యేసుక్రీస్తుని స్వంతరక్షకునిగా అంగీకరించరో వారికి మరణము అంటే నిత్య శిక్ష. అయితే విశ్వాసులు యొక్క గమ్యము వలే అవిశ్వాసులు కూడ మరణానంతరం ఓ తాత్కలిక ప్రదేశములో ఉంచబడతారు. వారు అంతిమ పునరుత్ధానము, తీర్పు, నిత్యగమ్యము కొరకు వేచియుంటారు. ధనవంతుడు మరణాంతరము శిక్షపొందునట్లుగా లూకా 16: 22-23 వివరిస్తుంది. అవిశ్వాసులైన మృతులు యొక్క పునరుత్ధానమును ప్రకటనగ్రంధం 20: 11-15 వివరిస్తుంది. వారు ధవళమైన మహాసింహాసనపు తీర్పు పొంది అగ్ని గుండములో త్రోయబడుదురు. కాబట్టి అవిశ్వాసులు మరణం తర్వాత అనంతరమే నరకమునకు (అగ్ని గుండంలోనికి) త్రోయబడరు కాని తాత్కలికముగా తీర్పును, శిక్షను అనుభవిస్తారు. అయితే విశ్వాసులు మరణాంతరం అగ్నిగుండంలోనికి త్రోయబడకపోయిన వారి స్థితి సుఖవంతమైంది కాదు. ధనవంతుడు నేను ఈ అగ్ని జ్వాలలో యాతనపడుచున్నానని కేకలు వేసెను (లూకా 16:24).

కాబట్టి మరణాంతరం ఓ వ్యక్తి తాత్కలికమైన పరలోకము లేక నరకములో గడుపుతారు/ గడుపుతాడు. తాత్కలిక స్థితి తర్వాత అంతిమ పునరుత్ధానపు సమయంలో ఓ వ్యక్తి నిత్య గమ్యమైతే మారదు. స్థానభ్రమణం తప్పించి నిత్య గమ్యములో మార్పువుండదు. అంతిమముగా ఆ నూతన ఆకాశమునకు, నూతన భూమికి ప్రవేశము అనుగ్రహించబడుతాది. అవిశ్వాసులు అగ్నిగుండమునకు పంపబడుతారు. రక్షణ విషయమై యేసుక్రీస్తుని నమ్మారా లేదా అన్నదానిపై ఆధారపడివున్న అంతిమ నిత్య గమ్యాలు ఇవే.


ప్రశ్న: నిత్య భద్రత లేఖానానుసారమా?

సమాధానము:
ఒక వ్యక్తి క్రీస్తుని రక్షకుడుగా తెలుసుకొన్నప్పుడు దేవునితో సంభంధం ఏర్పడుతుంది. మరియు నిత్య భద్రత వున్నదని భరోసా దొరుకుతునంది. యూదా 24:ఈ విధంగా చెప్తుంది. “తొట్ట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్ధోషులనుగా నిలువబెట్టుటకును.” దేవుని శక్తి ఒక విశ్వాసిని పడిపోకుండా కాపాడుతుంది. దేవుని మహిమ సన్నిధిలో నిలువ బెట్టుట ఆయన పని. నిత్య భద్రత దేవుడు మనలను కాపాడంటం బట్టి వచ్చే నిత్య భద్రత గాని మన రక్షణను మనము కాపాడుకొనుట కాదు.

“నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును అపహరింపలేడు” అని యేసయ్య ప్రకటిస్తున్నాడు. తండ్రి మరియు యేసయ్య ఇరువురును తమ చేతులలో భద్రపరుస్తున్నారు. తండ్రి కుమారుల కభంధ హస్తాల నుంచి మనలను ఎవరూ వేరు చేయగలరు?

విశ్వాసులు “విమోచన దినమువరకు ముద్రింపబడియున్నారు” ఎఫెసీ4:30 తెల్పుతుంది. ఒకవేళ విశ్వాసుల నిత్య భద్రత విమోచన దినమువరకు ముద్రింపబడకుండా వుండినట్ట్లయితే అది మతభ్రష్టత్వమునకు, అపనమ్మకత్వమునకు లేక పాపమునకు అయిఉండాలి. యోహాను 3:15-16 చెప్తుంది ఎవరైతే యేసునందు విశ్వాసముంచుతారో వారికి “నిత్యజీవము వుందని.” ఒక వ్యక్తి నిత్య జీవాన్ని వాగ్ధానించి అది అతని యొద్దనుండి తీసివేయబడినట్లయితే అది “నిత్యమైనది” కానే కాదు.

నిత్య భద్రత వాస్తవము కానియెడల బైబిలులో వెల్లడించిన నిత్య జీవపు వాగ్ధానాలు అబద్దములే. నిత్య భధ్రత అతి శక్తివంతమైనటువంటి వాదన. రోమా 8:48-39 లో చూడగలము “మరణమైనను, జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను,మన ప్రభువైన క్రీస్తునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను.” మన నిత్య భధ్రత మనలను ప్రేమించి, విమోచించిన దేవునిపై ఆధారపడివుంది. మన నిత్య భధ్రతను క్రీస్తువెలపెట్టి కొన్నాడు. తండ్రి వాగ్ధానంచేసాడు. పరిశుధ్దాత్ముడు ముద్రించాడు.


ప్రశ్న: ఆత్మహత్య పై క్రైస్తవ దృక్పధం ఏంటి? ఆత్మహత్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?

సమాధానము:
ఆత్మహత్య చేసుకున్నటువంటి అబీమెలెకు (న్యాయాధిపతులు 9:54), సౌలు (1 సమూయేలు 31:4), సౌలు ఆయుధములు మోసేవాడు (1 సమూయేలు 31:4-6), అహీతోఫెలు (2 సమూయేలు 17:23),జిమ్రి (1 రాజులు 16:18), మరియు యూదా (మత్తయి 27:5)ఆరుగురు వ్యక్తులను గురించి బైబిలు ప్రస్తావిస్తుంది.వీరిలో ఐదుగురు దుష్టులు, పాపులు (సౌలు ఆయుధములు మోయు వాని గురించి అవసరమైన సమాచారము ఇవ్వబడలేదు) కాబట్టి అతని వ్యక్తిత్వము గురించి నిర్థారించలేము. కొంతమంది సంసోను గురి ఆత్మహత్య కాదు గాని ఫిలీష్తీయుల్ని చంపాలన్నది (న్యాయాధిపతులు 16:26-31). బైబిలు ఆత్మహత్యను హత్యగా పరిగణిస్తుంది. ఎందుకంటే తనను తాను హత్య చేసుకోవటం కాబట్టి కేవలం ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా మరణించాలో అని నిర్థారించేది దేవుడు మాత్రమే.

బైబిలు ప్రకారము ఒక వ్యక్తి పరలోకమునకు వెళ్ళటం అనే దానిని ఆత్మహత్య నిర్థారించలేదు. రక్షింపబడని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లయితే నరకమునకు పయనాన్ని“వేగవంతం” చేసుకొనుటమే కాక మరి ఇంకేమి కాదు. ఏది అయినప్పటికి ఒక వ్యక్తి నరకమునకు పాలవుటానికి రక్షణ తృణీకరించినందుకు గాని ఆత్మహత్య చేసుకున్నందుకు కాదు. ఒక క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకొంటే ఏమౌతాదని బైబిలు చెప్తుంది? ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసముంచుతారో ఆ క్షణంనుండే వారికి నిత్యజీవం ఖచ్చితమని బైబిలు ప్రస్తావిస్తుంది. ఎటువంటి అనుమానము లేకుండ క్రైస్తవులకు నిత్య జీవమున్నదని బైబిలు చెప్తుంది (యోహాను 3:16). 1 యోహాను 5:13) క్రైస్తవుల్ని ఏదీకూడా దేవుని ప్రేమనుండి ఎడబాపలేదు (రోమా 8:38-39). ఒకవేళ “సృజింపబడినది” ఏదియూ ఒక క్రైస్తవుని దేవుని ప్రేమనుండి ఎడబాపనట్లయితే ఆత్మహత్య కూడ “సృజింపబడినదే” కాబట్టి ఎడబాప లేదు. యేసయ్య మన అన్ని పాపముల కోసం చనిపోయాడు కాబట్టి ఓ నిజమైన క్రైస్తవుడు ఆత్మీయ పోరాటములో బలహీనతను బట్టి అత్మహత్యను చేసుకున్నట్లయితే ఆ పాపాన్ని కూడ క్రీస్తు రక్తం పరిహారిస్తుంది.

ఆత్మహత్య దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఒక గొప్ప పాపం. ఆత్మహత్య హత్య కాబట్టి అది ఎప్పటికి తప్పే. క్రైస్తవుడ్ని అని చెప్పుకొంటూ ఎవరైన ఆత్మహత్య చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి విశ్వాసంను అనుమానించదగిందే. ఒక క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు ఆత్మహత్య ఏ పరిస్థితులలో చేసుకున్నప్పటికి అది అంగీకారయోగ్యమైనది కాదు. క్రైస్తవులు దేవునికోసం జీవించటానికి పిలువబడినవారు. వారి మరణపు విషయమై నిర్ణయము దేవునిదే. 1 కొరింధి 3:15 ఆత్మహత్య విషయంపై వివరించకపోయినప్పటికి, ఒక క్రైస్తవుడు ఆత్మహత్య చేసుకుంటే ఎలాగుంటాదో వివరించినట్ట్లుగా నున్నది “అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొన్నట్టు రక్షింపబడును.”


ప్రశ్న: పాస్టరమ్మలు/ ప్రసంగీకురాలు? స్త్రీలు పరిచర్య చేయుట విషయములో బైబిలు ఏమంటుంది?

సమాధానము:
స్త్రీలు ప్రసంగించడం, సంఘంకాపరులుగా వుండడం అనే అంశం కంటె ఎక్కువగా వాదించగలిగే అంశం సంఘంలో మరోకటి వుండదేమో. కాబట్టి పురుషులకు వ్యత్యాసముగా స్త్రీలను పెట్టి ఈ అంశంను చూడటం మంచిదికాదు. స్త్రీలు సంఘకాపరులుగా వుండకూడదని బైబిలు కొన్ని ఆంక్షలు పెడ్తుందని విశ్వసించే స్త్రీలున్నారు. మరియు కొంతమంది స్త్రీలు పరిచర్య చేయవచ్చని ప్రసంగీకులుగా వుండటానికి ఎటువంటి ఆంక్షలు లేవని నమ్మే పురుషులు కూడా వున్నారు. ఇది స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసము చూపించే అంశంకాదు. కాని బైబిలు భాష్యానికి సంభందించినది.

1తిమోతి: 2:11-12 లో "స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా వుండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషులమీద అధికారము చేయుటకైనను ఆమెను సెలవియ్యను" అని దేవుని వాక్యం ప్రకటిస్తుంది. సంఘంలో స్త్రీ పురుషులులకు వేర్వేరు పాత్రలు చేపట్టడానికి దేవుడు అప్పగించాడు. మానవులు సృజించబడినటువంటి విధానమునుబట్టి మరియు పాపము ప్రవేశించిన తీరునుబట్టి వచ్చిన పర్యవసానము (1తిమోతి: 2:13-14). దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా స్త్రీలు భోధించే భాధ్యత, పురుషులపై ఆధిపత్య్హాని కల్గివుండరాదని ఆంక్షలు విధించాడు. దీనిని బట్టి స్త్రీలు సంఘకాపరులుగా పురుషులపై ఆదిపత్యాన్ని, భోధించడం, ప్రసంగించడం అనే పరిచర్యలు చేయకూడదని అడ్డగిస్తుంది.

స్త్రీలు పరిచర్య చేయుటవిషయంపై అనేకమైనటువంటి "ఆక్షేపణలు"న్నాయి. అందులో సర్వ సామాన్యమైనది పౌలు మొదట శతాబ్దపు చదువులేనటువంటి స్త్రీలను భోదించవద్దని నియత్రించినది. అయితే 1తిమోతి: 2:11-14 విద్యస్థాయిని ప్రస్తావించుటలేదు. పరిచర్యకు విద్య అనేది అర్హత అయినట్లయితే యేసుక్రీస్తు శిష్యులలో ఎక్కువశాతం మంది యోగ్యతను కోల్పోతారు. పౌలు కేవలం ఎఫెస్స్సెసు పటణములో వున్న స్త్రీలను మాత్రమే నియత్రించాడు అన్నది రెండవ సామాన్య ఆక్షేపణ (తిమోతి మొదటి పత్రికను ఎఫెస్సీ సంఘంనకు కాపరిగా వున్నప్పుడు రాశాడు). ఎఫెస్సెసు పట్టణము గ్రీకు, రోమా దేవత అర్తమయిపేరనవున్న దేవాలయమునకు ప్రసిధ్ది. అర్తమయిని ఆరాధించుటలో స్త్రీలు అధికారము కలిగిన వారుగానున్నారు. అయితే మొదటి తిమోతి గ్రంధంలో అర్తమయిని ఎక్కువగా ప్రస్తావించలేదు. అంతేకాదు, అర్తమయిని ఆరాధించుట అనే విషయాన్ని బట్టి పౌలు ఆంక్షలు విధిస్తున్నట్లుగా 1తిమోతి: 2:11-12 లో వ్రాయలేదు.

పౌలు భార్య భర్తలకే సూచనలిస్తున్నాడని స్త్రీ పురుషులకు కాదు అన్నదే మూడవ ఆక్షేపణ. ఈ వాక్య భాగములో ఉపయోగించిన గ్రీకుపదాలు భార్య భర్తలకు వర్తిస్తాయి. అయితే వాటి ప్రాధమిక అర్ధం స్త్రీ పురుషులకు కూడా వర్తిస్తాయి. అంతేకాకుండా 8-10 లో అదే గ్రీకుపదాన్ని వాడారు. "కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చేయుట కేవలం పురుషులకు మాత్రమేనా? (8) కేవలం స్త్రీలు మాత్రమే అణుకువయు స్వస్థబుధ్దియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రాలు కలిగి, దైవభక్తి కలిగియుండాలా? (9-10 వచనాలు) ముమ్మాటికి కాదు. 8-10 వచనాలు కేవలం భార్య భర్తలకే మాత్రమే కాకుండా స్త్రీ పురుషులందరికి వర్తిస్తాయి. వచనాలు 11-14 సంధర్భానుసారంగా గమనిస్తే భార్య భర్తలకే వర్తించినట్లు సూచనలు లేవు.

పాతనిభంధనలోని మిర్యాము, దెబోరా, హుల్ధా లాంటి స్త్రీలు ప్రాముఖ్య నాయకత్వపు హోదాను కలిగి యుండటాన్ని సూచిస్తూ స్త్రీలు పరిచర్య అనే భాష్యంవిషయంలో తరచుగా మరొక ఆంక్షను ఎదుర్కోంటాం. ఈ ఆంక్ష కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గుర్తించటంలో విఫలమౌవుతుంది. మొదటిది దెబోరా, పదముగ్గురు పురుష న్యాయాధిపతులమధ్య ఏకైక స్త్రీ న్యాయాధిపతి. భైబిలు పేర్కొన్న అనేక పురుష ప్రవక్తలమధ్య హుల్ధా ఏకైక స్త్రీ, ప్రవక్త్రినీగా వున్నది. మోషే అహరోనుల సహోదరునిగా మిర్యాము నాయకురాలిగా సూచించబడింది. రాజుల కాలములో పేర్కొనబడినటువంటి ప్రాముఖ్యమైన ఇద్దరు స్త్రీలు అతల్యా, జెజెబెలు, భక్తి కలిగినటువంటి నాయకురాండ్రగా ఉదహరించబడలేదు. పాత నిభంధనలో స్త్రీలు ఆధిపత్యముకలిగి యుండుట ఆనేది ప్రస్తుత అంశమునకు వర్తింపగలిగేది కానేకాదు. సంఘాలనుద్దేశించి రాసినటువంటి మొదటి తిమోతిలాంటి మరియు ఇతర సంఘము- క్రీస్తు- శరీరములో వచ్చిన మార్పులను సూచిస్తున్నాయి. ఆమార్పు ఇశ్రాయేలీయుల దేశము విషయము లేక పాతనిబంధనలోని మరి ఏ వ్యవస్థ విషయంకాదుగాని సంఘం అధికారం విషయమే.

క్రొత్తనిబంధనలోని ప్రిస్కిల్లా, ఫీబీల విషయమై ఇటువంటి వాదనేవున్నది. అపోస్తలుల కార్యములు 18 వ అధ్యాములో అకుల్లా ప్రిస్కిల్లాలు క్రీస్తునందు నమ్మకమైన పరిచారకులుగా చూడగలం. ప్రిస్కిల్ల పేరు ముందు ప్రస్తావించబడింది కాబట్టి పరిచర్యలో భర్త కంటే ఆమెదే “ప్రాముఖ్యమైన” స్థానమని కాబోలు. ఏది ఏమైనప్పటికి 1 తిమోతి 2:11-14 ప్రస్తావించిన విషయాలకు విరుద్దముగా సూచించలేదు. అకుల్లా ప్రిస్కిల్లాను అపొల్లోను తమ గృహములో చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరచిరి (అపొస్తలుల కార్యములు 18:26).

రోమా 16:1 ప్రకారము ఫీబేను “సేవకురాలిగా” కాకుండా “పరిచారకురాలిగా” గుర్తించినప్పటికి ఆమే సంఘంలో భోధకురాలు అని సూచించినట్లుగాదు. “భోధించుటకు సమర్థులు” అన్న అర్హత పరిచారకులకు వర్తిస్తుందిగాని పెద్దలకు ఇవ్వబడింది కాదు (1 తిమోతి 3:1-13 మరియు తీతుకు 1:6-9). తర్వాత “పెద్దలు” / “అధ్యక్షులు”/ “పరిచారకులు,” “ఏకపత్నీపురుషులు,” “ విశ్వాసులైన పిల్లలు” కలిగి మరియు “సజ్జన ప్రియులు” అని వివరించారు. ఈ అర్హతలన్ని పురుషులకే వర్తిస్తాయి. అంతేకాకుండా (1 తిమోతి 3:1-13 మరియు తీతుకు 1:6-9)మధ్యన పెద్దలకు, అధ్యక్షులకు, పరిచారకులకు పురుషలింగాన్నే ఉపయోగించారు.

1 తిమోతి 2:11-14 నిర్మాణపద్దతి “హేతువును” ప్రస్ఫుటముగా సూచిస్తుంది. పౌలు 11,12 వచనములలో ప్రస్తావించినటువంటి “కారణంను” 13లో చూడగలుగుతాం. ఎందుకు స్త్రీ భోధించకూడదు? లేక పురుషునిమీద ఎందుకు ఆధిపత్యాన్ని కల్గియుండకూడదు? ఎందుకంటే ఆదాము ముందు సృష్టించబడ్డాడు, ఆ తర్వాత హవ్వ. ఆదాము మోసపరచబడలేదుగాని స్త్రీ మోసపరచబచబడింది. దేవుడు ఆదామును మొదట సృష్టించి ఆ తర్వాత హవ్వను సహకారిగా అనుగ్రహించాడు. ఈ సృష్టి క్రమము కుటుంబములోను (ఎఫెసీయులకు 5:22-33)సంఘంనకు సార్వత్రికంగా వర్తిస్తుంది. స్త్రీ హవ్వ, మోసగించబడింది అన్న వాస్తవాన్ని హేతువుగా తీసుకొని సంఘకాపరిలుగా వుండకూడదని పురుషునితో ఆత్మీయ అధికారం కలిగియుండకూడదని స్త్రీలు సంఘకాపరులుగాను, పురుషులపై ఆత్మీయ ఆధికారము కలవారనుటకు సూచనైంది. దీని ఆధారంగా స్త్రీలు భోధించకూడదు ఎందుకంటె వారు సుళువుగా మోసగించబడతారు అని అంటానికి దారి తీస్తుంది. ఈ అంశం చర్చనీయమైనది, ఎందుకంటె స్త్రీలు (సుళువుగా మోసగించబడేవాళ్ళు) సుళువుగా మోసగించబడేదైతే పిల్లలకు, ఇతర స్త్రీలకు (ఇంకా సుళువుగా మోసగించబడేవాళ్ళు) భోదించమని ఎందుకు ఇతరులకు అనుమతించాలి? పాఠ్యభాగము ప్రస్తావిస్తుంది అదికాదు. స్త్రీలు పురుషులకు భోధించకూడదు లేక పురుషులపై ఆత్మీయమైన ఆధిపత్యము కల్గియుండకూడదు ఎందుకంటే హవ్వ మోసగించబడుతుంది. దీని కారణంగా దేవుడు పురుషులకే సంఘంలో అధికారంతో భోధించటానికి అధికారంఇచ్చాడు.

చాలామంది స్త్రీలు అతిధులకు ఆతిధ్యమివ్వడం, దయను చూపించడం, భోధించడం, సహాయం చేయటం వంటి వరముల విషయములో అధిగమిస్తారు. ఒక ప్రాంతీయ సంఘం యొక్క పరిచర్య స్త్రీలమీద ఆధారపడియుంటుంది. బాహాటముగా ప్రార్థించుట లేక ప్రవచించుట విషయములో సంఘంలోనున్న స్త్రీలను నియత్రించలేదు (1 కొరింధీయులకు 11:5), గాని పురుషులపై ఆత్మీయమైన ఆధికారపూర్వకమైన భోధన విషయములో మాత్రమే. స్త్రీలు పరిశుధ్దాత్ముని వరము కల్గియుండటం విషయంలో బైబిలు మాత్రము నియత్రించలేదు (1 కొరింధీయులకు 12). స్త్రీలు పురుషుల వలె పరిచర్య చేయుటకు, ఆత్మ ఫలములు కల్గియుండుటకు (గలతీయులకు 5:22-23), నశించినవారికి సువార్త అందించటానికి పిలువబడ్డారు (మత్త్తయి 28:18-20; అపోస్తలుల కార్యములు 1:8; 1 పేతురు 3:15).

దేవుడు సంఘంలో కేవలం పురుషులకు మాత్రమే ఆత్మీయమైన అధికారపూర్వకమైన భోధను చేయటానికి అభిషేకించారు. దీనికి కారణం పురుషులు శ్రేష్టమైన భోధకులని కాదు, లేధా స్త్రీలు తక్కువ తెలివి తేటలు గలవారని కాదు. ఇది కేవలం దేవుడు సంఘం వ్యవహరించాల్సిన పద్దతిని అ విధముగా రూపొందించినదానిని బట్టే. పురుషులు ఆత్మీయమైనటువంటి నాయకులుగా తమ జీవితాలలో మాదిరియైయుండాలి. స్త్రీలు తక్కువ అధికార భాధ్యతలను చేపట్టాలి. స్త్రీలు ఇతర స్త్రీలకు భోధించాలని (తీతుకు 2:3-5)ప్రోత్సాహించారు. స్త్రీలు పిల్లలకు భోధించకూడదని బైబిలు నియత్రించుటలేదు. పురుషులకు భోధించుట విషయములో స్త్రీలు నియత్రించబడుతున్నారు. దీనిని బట్టి స్త్రీలు సంఘకాపరులుగా, ప్రసంగీకులుగా వుండకూడదని హేతుబద్దంగా అర్ధమౌతుంది. దీని అర్ధం స్త్రీలు తక్కువ ప్రాధాన్యత కలిగినవారు అని కాదు, కాని పరిచర్య విషయంలో నిర్ధిష్ట గురి కలిగియుండటానికి, దేవుని ప్రణాళికను అంగీకారంగా తమ కిచ్చిన వరములకు అనుగుణ్యంగా వుండటానికి దోహదపడ్తుంది.


ప్రశ్న: తెగాంతర వివాహముపై బైబిలు ఏమి చెప్తుంది?

సమాధానము:
తెగాంతర వివాహము వుండకూడదని పాతనిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలియులకు ఆఙ్ఞాపించింది (ద్వితియోపదేశకాండము 7:3-4). ఏదిఏమైనప్పటికి ప్రాధమిక కారణము తెగకాదుగాని మతము. తెగాంతర వివాహము చేసుకొనకూడదని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆఙ్ఞాపించుటకు కారణము ఇతర తెగలకు చెందిన ప్రజలు విగ్రహారాధికులు, మరియు ఇతర దేవతలను ఆరాధించువారు. ఇశ్రాయేలీయులు ఒకవేళ విగ్రహారాధికులను, అన్యులను వివాహమాడినట్లయితే దేవునినుండి దూరపరచబడుతారు. ఇలాంటి నియమమే నూతన నిబంధనలో కూడా ఇచ్చారు. గాని అది వేరే స్థాయిలో వుంటుంది. 2 కొరింధి 6:14, "మీరు అవిశ్వాసులతో జోడుగా వుండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?" ఏ విధంగా ఇశ్రాయేలీయులు (నిజమైన ఒక దేవునియందు విశ్వాసముంచినవారు) విగ్రాహారాధికులను పెళ్ళిచేసుకోకూడదని ఆఙ్ఞాపించబడ్డారో అదే విధంగా క్రైస్తవులు (నిజమైన ఒక దేవునియందు విశ్వాసముంచినవారు)అవిశ్వాసులను పెండ్లిచేసుకొనకూడదని ఆఙ్ఞాపించబడుతున్నారు. పైన పేర్కొనబడిన ప్రశ్నకు ఖచ్చితమైన జవాబు లేదు, అని అనాలి. బైబిలు తెగాంతర వివాహము తప్పని ఎక్కడ పేర్కొనలేదు.

మార్టిన్ లూధర్ కింగ్ ప్రస్తావించినట్లు ఒక వ్యక్తి శీలాన్నిబట్టి గాన్ని చర్మపు రంగునుబట్టిగాని (యాకోబు 1:1-10) తీర్పు తీర్చకూడదు. ఒక క్రైస్తవుని జీవితములో తెగ కారణంగా ప్రత్యేకతను సంక్రమించుకోవటం ఎక్కడా లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనేటప్పుడు ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి తిరిగి జన్మించినదా లేదా జన్మించినాడా (యోహాను 3:3-5) అనేది మొట్టమొదటిగా నిర్ధారించుకోవాలి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవటంలో బైబిలు నియమము చర్మపు రంగు కాదు గాని క్రీస్తునందు విశ్వాసమే. తెగాంతర వివాహము ఙ్ఞానము, వివేచన, ప్రార్ధనకు సంభంధించినది గాని నైతికంగా తప్పా సరియైనదా అన్నది కానేకాదు.

తెగాంతర వివాహము విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఒకే ఒక్క ప్రాముఖ్య కారణన్ని బట్టి- మిశ్రిత తెగ, జోడి, ఒకరినొకరు అంగీకరించుకోవటం విషయంలో కష్టాల్ని ఎదుర్కోవటమే. తెగాంతర వివాహాము చేసుకొన్న భార్యభర్తలు పక్షపాతముతో, ఎగతాళి కొన్ని సార్లు కుటుంబ సభ్యులనుండి అనుభవిస్తారు. మరికొన్ని సార్లు వీరికి జనించిన పిల్లలు వేరువేరు చర్మపు రంగులనుబట్టి వ్యత్యసాన్ని, కష్టాన్ని అనుభవిస్తుంటారు. ఎవరైతే తెగాంతర వివాహము చేసుకోవాలి అని ఆశపడుతున్నారో వారు ఈ పరిస్థితులన్నిటికి సంసిద్దపడాలి. ఒక క్రైస్తవుడు, ఎవర్ని పెళ్ళి ఛేసుకోవాలి అన్న దానిపై బైబిలు పెట్టే ఆంక్ష ఒక్కటే ఆ వ్యక్తి కూడ క్రీస్తు శరీరములో సభ్యుడు లేక సభ్యురాలు అయివుండాలి.


ప్రశ్న: పచ్చబొట్లు / శరీరమును చీల్చుకొనుట గురించి బైబిలు ఏమి చెప్తుంది?

సమాధానము:
పాత నిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆఙ్ఞ, చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడైన యెహోవాను (లేవీకాండము 19:28). నేటి విశ్వాసులకు పాత నిబంధన ధర్మశాస్త్రము వర్తించకపోయిన (రోమా 10:4; గలతీయులకు 3:23-25; ఎఫెసీయులకు 2:15) పచ్చబొట్టుకు వ్యతిరేకంగా వున్న ఆఙ్ఞ కొన్ని ప్రశ్నలను లేవనెత్తాలి. విశ్వాసులు పచ్చబొట్టును కలిగి యుండవచ్చా లేదా అన్న విషయంపై క్రొత్త నిభందన ఏమి చెప్పలేదు.

ఓ పరీక్ష ద్వారా పచ్చబొట్టు శరీరము చీరుకొనుట సరియైనదా కాదా అని నిర్థారించుటకు యధార్థంగా మంచిమనసాక్షితో ఆ ప్రక్రియను తన మంచి ఉద్డేశ్యాలకు ఆశీర్వదించమని దేవున్ని అడగటమే (1కొరింధి 10:31). క్రొత్త నిబంధన పచ్చబొట్లు, శరీరమును చీల్చుకొనుట విషయమై వ్యతిరేకంగా ఏ ఆఙ్ఞ లేదు. అయితే దేవుడు వాటిని అనుమతిస్తున్నాడని హేతువును కూడా ఇవ్వలేదు.

బైబిల్ ఏ యే విషయాలలో నిర్ధిష్టమైనటువంటి సూత్రాలను ప్రస్తావించదో ఆ విషయాలలో దేవునికి ప్రీతికరంగా ఆ ప్రక్రియ ఉంటుందా లేదా అని అనుమానించాలి. “విశ్వాసమూలము కానిది యేదో పాపము” అని రో మా 14:23 ప్రస్తావిస్తుంది. మన దేహములు మన ప్రాణాలు విమోచించబడ్డయాని, అది దేవునికి చెందాయని ఙ్ఞాపకముంచుకోవాలి. 1 కొరింధి 6:19-20 పచ్చబొట్టు, శరీరము చీరుకొనుట విషయమై నేరుగా ప్రస్తావించపోయినప్పటికి ఒక నియమానైతే సూచిస్తుంది. “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుధ్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.” ఈ గొప్ప సత్యము మన శరీరవిషయములో ఏమి చేస్తామో అన్న దాన్నిపై ప్రభావం చూపాలి. మన శరీరములు దేవునికి చెందినవైతే, వాటిపై పచ్చబొట్టు వేయుటకు లేక శరీరము చీరుటకు ఆయన దగ్గరినుండి ఖచ్చితమైన అనుమతి కలిగివుండాలి.


ప్రశ్న: మద్యపానము/ ద్రాక్షారసము సేవించుట విషయమై బైబిలు ఏమి చెప్తుంది? క్రైస్తవులు మద్యపానమును/ ద్రాక్షారసము సేవించుట పాపమా?

సమాధానము:
మద్యపానము సేవించుట విషయమై అనేక లేఖనభాగాలున్నయి(లేవీకాండము 10:9; సంఖ్యాకాండము 6:3; ద్వితియోపదేశకాండము 29:6; న్యాయాధిపతులు 13:4, 7, 14; సామేతలు 20:1; 31:4; యెషయా 5:11, 22; 24:9; 28:7; 29:9; 56:12). ఏదిఏమైనప్పటికి లేఖనములు ఓ క్రైస్తవుడ్ని బీరు, ద్రాక్షారసము మద్యమును కలిగిన మరి ఏ ఇతర పానీయములు తాగకూడదని నిషేదించదు. వాస్తవానికి కొన్ని లేఖన భాగాలు మద్యం విషయంలో సానుకూలమైన పదాలుపయోగించింది. ప్రసంగి 9:7 లో "ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షారసము త్రాగుము." కీర్తన 104:14-15, "నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును" దేవుడే ఆ ద్రాక్షరసమును అనుగ్రహిస్తాడని చెప్తుంది. “సొంత ద్రాక్షతోటనుండి వాటి రసమును త్రాగుట దేవుని ఆశీర్వాదమునకు గుర్తు అని ఆమోసు 9:14 లో చర్చిస్తుంది. యెషయ 55:1 "రండి, రూకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి" అని ప్రోత్సాహిస్తుంది.

దేవుడు క్రైస్తవులను మద్యము విషయములో ఆఙ్ఞ ఇచ్చునది మత్తులై యుండకూడదని (ఎఫెసీయులకు 5:18). బైబిలు త్రాగుడు దాని పర్యవసానాల్ని ఖండిస్తుంది (సామేతలు 23: 29-35). క్రైస్తవులు తమ శరీరములను ఇతర "ఆధిపత్యమునకు" అప్పగించకూడదని ఆఙ్ఞాపించబడుచున్నారు(1 కొరింధీయులకు 6:12; 2 పేతురు 2:19). ఎక్కువగా మద్యమును సేవించుట నిర్హేతుకముగా వ్యసనమే. ఇతర క్రైస్తవులను భాధపెట్టకూడదని, హింసించకూడదని, మనస్సాక్షికి వ్యతిరేకంగా పాపాన్ని ప్రోత్సాహించకూడదని బైబిలు లేఖనభాగాలు క్రైస్తవులను ఆటంకపరుస్తుంది (1 కొరింధీయులకు 8:9-13).ఈ నియమముల వెలుగులో ఓ క్రైస్తవుడు మద్యమును అధికముగా సేవించుట ద్వారా దేవునిని మహిమపరుస్తారని అనడం చాలా కష్టం (1కొరింధీయులకు 10:31).

యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. దీనిని బట్టి యేసయ్య కూడ కొన్ని సంధర్భాలలో ద్రాక్షారసమును సేవించినట్లు అర్థం అవుతుంది (యోహాను 2:1-11; మత్తయి 26:29). నూతన నిబంధనకాలంలో, నీరు పరిశుభ్రంగా కాకుండా కలుషితమై యుండేది. ఆధునిక పారిశుధ్యం లేని దినాలల్లో బాక్టీరియా, వైరస్ మరియు ఇతర కలుషిత పదార్ధాలతో నిండియుండేది. నిమ్న జాతి దేశాలలో ప్రస్తుత పరిస్థితి ఇదే. దీని కారణంగా, ప్రజలు ద్రాక్షారసము సేవిస్తారు. ఎందుకంటే దాంట్లో కాలుష్యం తక్కువగా వుంటాది కాబట్టి. 1 తిమోతి 5:23 లో కడుపు జబ్బు తగ్గించుటకుగాను, నీరుకు బదులు ద్రాక్షారసమును త్రాగమని ఉపదేశించాడు. ఆ రోజులలో ద్రాక్షారసము పులిసినదే (సారా కలిగియుండుట), అయితే ఇప్పుడున్నంత మోతాదులో కాదు. అది కేవలము ద్రాక్షారసమే అన్నది ఎంత తప్పో ఇప్పుడున్నది మద్యముతో సమానమని అనడం కూడా తప్పే. ఏదిఏమైనప్పటికి క్రైస్తవులు బీరు, ద్రాక్షారసం మద్యం కలిగిన ఇతర ఏ పానీయములను త్రాగకూడదని ఆటంకపరచదు. మద్యం పాపముకాదు. మద్యముతో మత్తులైయుండుట, మద్యమును వ్యసనముగా కలిగియుండుట క్రైస్తవులు ఖచ్చితముగా నిరోధించాలి (ఎఫెసీయులకు 5:18; 1 కొరింథీయులకు 6:12).

మద్యమును తక్కువ మోతాదులో సేవించుట హానికరముకాదు. వ్యసనము కాదు. వాస్తవానికి కొంతమంది వైద్యులు ఆరోగ్యలబ్ధికోసం ముఖ్యంగా హృదయానికి సంభంధమైన విషయంలో తక్కువ మోతాదులో సేవించుట తప్పుకాదని వాదిస్తారు. తక్కువ మోతాదులో మద్యమును సేవించుట క్రైస్తవుల స్వేఛ్చకు సంభంధించినది. మత్తులై యుండుట, వ్యసనము కలిగియుండుట పాపము. ఏది ఏమైనప్పటికి మద్యము దాని పర్యవసానముగురించి బైబిలు కలిగియున్నటువంటి భయాలు. సుళువుగా ఎక్కువ మోతాదులో మద్యము సేవించటాన్ని శోధన, మరియు ఇతరులకు కష్టాన్ని, అడ్డుబండాగామారే అవకాశాలను బట్టి క్రైస్తవులు పరిపూర్ణంగా మద్యమునకు దూరముగా వుండుట మంచిది.


ప్రశ్న: క్రైస్తవ బాప్తిస్మము ప్రాముఖ్యత ఏంటి?

సమాధానము:
ఒక విశ్వాసి అంతరంగిక జీవితములో జరిగిన వాస్తవతకు బహిర్గత సాక్ష్యమే క్రైస్తవ బాప్తిస్మము అని బైబిలు చెప్పుతుంది. ఒక విశ్వాసి క్రీస్తు ద్వార మరణములో, సమాధిలో మరియు పునరుత్థానములో ఐక్యమగుటకు సాదృశ్యమే క్రైస్తవ బాప్తిస్మము. "క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడ పాతి పెట్టబడితిమి " (రోమా 6:3-4) అని బైబిలు ప్రకటిస్తుంది. నీటిలో ముంచబడుట అనే ప్రక్రియ క్రీస్తు మరణము, సమాధికి సాదృశ్యముగా నున్నది. అదే విధంగా నీటిలోనుండి బయటకు రావటం క్రీస్తు పునరుత్థానమునకు సాదృశ్యముగానున్నది.

క్రైస్తవ బాప్తిస్మములో ఒక వ్యక్తి కనీసము రెండు అవసరతలు నెరెవేర్చాలి. 1). ఆ వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకుడుగా నమ్మియుండాలి. 2). బాప్తిస్మము దేనిని సూచిస్తుందో దానిని బాగుగా ఎరిగియుండాలి. ఓ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి, బాప్తిస్మము అనేది క్రీస్తునందున్న విశ్వాసి అని బహిర్గతం చేయమన్న ఆఙ్ఞ అని గ్రహించి బాప్తిస్మము పొందుటకు ఆశపడినట్లయితే ఆవ్యక్తి బాప్తిస్మము పొందకుండాల్సిన అవసరతలేదు. బైబిలు ప్రకారము క్రైస్తవ బాప్తిస్మము ప్రాముఖ్యమైంది, ఎందుకంటే- క్రీస్తునందున్న విశ్వాసాన్ని, నమ్మకత్వాన్ని బాహాటముగా ప్రకటించాలన్న ఆఙ్ఞకు విధేయత. మరియు క్రీస్తు మరణము, సమాధి, పునరుత్థానములకు గుర్తింపు.


ప్రశ్న: క్రైస్తవత్వం దశమభాగం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

సమాధానము:
చాలామంది క్రైస్తవత్వం దశమభాగం ఇవ్వటం గురించి సతమవుతారు. కొన్ని సంఘాలలో దశమభాగం ఇవ్వటం గురించి ఎక్కువ భోధిస్తారు. కొంతమంది క్రైస్తవులు, ప్రభువుకు అర్పించుటమనే బైబిలు హెచ్చరికకు విధేయత చూపించరు. చందా ఇవ్వటం అనేది సంతోషాన్ని అశీర్వాదాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది. అయితే భాధాకరమైన విషయం ఏంటంటే సంతోషాన్ని నేడు సంఘాల్లలో కనబడుట లేదు. అది అరుదైపోయింది.

దశమభాగం ఇవ్వటం పాత నిబంధన అంశం. ధర్మశాస్త్రప్రకారము ఇశ్రాయేలీయులు చందాచెల్లించుట విషయంలో తమ రాబడి అంతటిలో దశమభాగాన్ని దేవాలయమునకు గాని ప్రత్యక్షగుడారమునకుగాని ఇవ్వాలి (లేవీకాండం 27:30; సంఖ్యాకాండం 18:26; ద్వితియోపదేశకాండం 14:24; 2 దినవృత్తాంతాలు 31:5). వాస్తవానికి పాత నిబంధన ధర్మశాస్త్రము ప్రకారము ఇవ్వటం అనేది పలు స్థాయిలలో యుండేది. కాబట్టి దాని మొత్తం 23.3 శాతంవుండేది. కాని చాలమంది అనుకున్నట్లు 10శాతం కాదు. కొంతమంది అవగాహన ప్రకారము పాతనిబంధనలోని దశమభాగము సుంకం చెల్లించుట వంటిదని యాజకులు, లేవీయులు బలులు అర్పించుటానికి వుపయోగించబడేదని అనుకుంటారు. క్రొత్తనిబంధన ఎక్కడ ధర్మశాస్త్రపరమైన దశమభాగము అనే పద్దతిని తలవొగ్గాలని అఙ్ఞ ఇవ్వదు, ఆదేశించదు. విశ్వాసులు తమ రాబడిలోని కొంత చందాన్ని సంఘాభివృధ్దికి ప్రక్కన పెట్టాలని పౌలు చందా ఇవ్వటం ఆదేశించారు (1 కొరింథీ 16:1-2).

క్రొత్త నిబంధనలో ఎక్కడకూడా "తన కొచ్చేరాబడిలో" (1 కొరింథీ 16:2).ఎంత శాతం ఇవ్వాలో స్పష్టీకరణము చేయలేదు గాని వర్ధిల్లినకొలది అని పేర్కొనబడింది. కొన్ని క్రైస్తవ సంఘాలలో అయితే పాత నిబంధనలో పేర్కొన్నదశమభాగాన్ని, క్రైస్తవులు కనీసం ఇవ్వాల్సిన చందాగా వర్తించారు. క్రొత్తనిబంధన ఇవ్వటం అనే అంశంయొక్క ప్రాధాన్యతను, ప్రయోగాలను మాత్రమే పేర్కొన్నది. తనకు ఎంత సాధ్యమయితే అంత ఇవ్వటం నేర్చుకోవాలి. కొన్ని సార్లు దశమభాగము కంటే ఎక్కువకావచ్చు లేక తక్కువకావచ్చు. ఓ క్రైస్తవుని సామర్ధ్యతలమీద సంఘ అవసరతలమీద ఆధారపడుతుంది. ప్రతీ క్రైస్తవుడు కూడా ప్రార్థనచేసి దేవుని ఙ్ఞానాన్ని బట్టి ఎంత చందా ఇవ్వాలో తెలిసికోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంలో చందా ఇవ్వటం అనేది మంచి వుద్దేశ్యంతో దేవునిపట్ల ఆరాధన వైఖరితో క్రీస్తు సంఘం యొక్క సేవా దృక్పధముతో వుండాలి (1 కొరింథీ 9:7).


ప్రశ్న: బైబిలు విడాకులు మరియు తిరిగి వివాహాము చేసికొనుట గురించి ఏమంటుంది?

సమాధానము:
మొదటిదిగా విడాకులకు ఎటువంటి దృక్పధమున్నప్పటికి మలాకీ 2:16 "భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ యని ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు" అని ఙ్ఞాపకముంచుకోవచ్చు. బైబిలు ప్రకారము వివాహామనేది జీవితకాల ఒప్పాందము. "కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను." వివాహామనునది పాపులైన ఇద్దరు వ్యక్తులకు మధ్య సంభంధము కాబట్టి విడాకులు జరగటం సాధ్యమని దేవుడు ముందుగానే గుర్తించాడు.కాబట్టి పాత నిబంధనలో విడాకులు తీసుకున్నటువంటి వ్యక్తులను కాపాడటానికి మరి ముఖ్యంగా స్త్రీలును, దేవుడు కొన్ని చట్టాలను పెట్టాడు, నియమించాడు (ద్వితియోపదేశకాండము 24:1-4). యేసుక్రీస్తు ప్రభువువారు ఈ చట్టాలను గూర్చి మాట్లాడుతూ, మనుష్యులు కాఠిన్యమును బట్టేగాని దేవుని కోరిక కాదు అని సూచించారు (మత్తయి 19:8).

విడాకులు మరియు తిరిగి వివాహాము చేసికోవటం అనే వివాదాస్పదమైన అంశం యేసుక్రీస్తు ఈ రెండు చోట్ల, మత్తయి 5:32 మరియు 19:9 ప్రస్తావించిన పలుకులు బైబిలులోని యేసుక్రీస్తుమాటలపై ఆధారపడియున్నది. వ్యభిచార కారణమొక్కటే విడాకులు తీసుకోవడానికి, తిరిగి వివాహాము చేసికోవటానికి దేవుడు అనుగ్రహించి అనుమతిస్తున్నట్లు లేఖనములలో అనిపిస్తుంది. కొంతమంది ఈ వ్యభిచార కారణము ప్రధానమునకీయబడిన కాలమునకు మాత్రమే వర్తిస్తుందని భాష్యం చెప్తారు. యూదా సంస్కృతిప్రకారము నిశ్చిత్తార్థము తర్వాత ప్రధానము చేయబడినటువంటి స్త్రీ పురుషులను భార్య భర్తగా ఎంచుతారు. ఈ పరిస్థితుల్లో ప్రధానమున కీయబడినవారు అవినీతికి పాలపడినట్లయితే విడాకులకు హేతు బద్దమైన కారణంగా పరిగణిస్తారు.

1కొరింథీ 7:15 ఓ అవిశ్వాసి విశ్వాసినుంచి విడాకులు కోరినట్లయితే అది తిరిగి వివాహాము చేసికొనుటకు అనుమతిస్తుందని కొంతమంది అర్థం చెప్తారు. అయితే ఆ వాక్య భాగాలలో తిరిగి వివాహము చేసికొనుట అన్నది లేదు కాని ఓ అవిశ్వాసి తన జీవిత భాగస్వామినుంచి వేరవడానికి ఇష్టపడినట్లయితే విశ్వాసికి నిర్భంధనమే లేదని తెల్పుతుంది. జీవిత భాగస్వామిని లేక పిల్లలను లైంగింకంగా భాధపెట్టినట్లయితే బైబిలులో ప్రస్తావించకపోయిన అది విడాకులకు హేతుబద్దమైన కారణమని కొంతమంది అంటారు. ఇది సరియైనది అని అనిపించపోయినాప్పటికి వాక్యములో ప్రస్తావించలేదు కాబట్టి దాన్ని ఆపాదించుట తప్పు.

వ్యభిచారమునుబట్టి విడాకులు అనుమతించారే కాని అది అవసరమైనది అని కూడా పేర్కొనలేదు అన్న వాస్తావానికి ఈ వాదోపవాదనల మధ్య మర్చిపోకూడదు. వ్యభిచారము తర్వాత కూడా భార్య భర్తలు దేవుని కృపనుబట్టి ఒకరినొకరు క్షమించుకొని వివాహామును తిరిగి కట్టుకోవచ్చు. దేవుడు మనలను ఎన్నో విషయాలలో క్షమించాడు. కాబట్టి దానిని అనుకరిస్తూ వ్యభిచారాపాపాన్ని కూడా క్షమించవచ్చు (ఎఫెసీయులకు 4:32). అయితే కొన్ని సంధర్భాలలో ఈ జారత్వమునకు పాల్పడిన వ్యక్తి పశ్చాత్తాపపడక కొనసాగటం గమనిస్తాం. అటువంటి సంధర్భములో మత్తయి 19:9 ని వర్తింపవచ్చు. మరికొంతమంది విడాకులతర్వాత దేవుడు ఒంటరిగా ఆశిస్తున్నాడని గమనించకుండా మరలా పెళ్ళి చేసుకొంటున్నారు. దేవుడు కొంతమందిని ఏకమనస్సు వుండుటకు వివాహాము చేసుకోకుండా వుండాలని ఆశిస్తారు (1 కొరింథీయులకు 7:32-35). విడాకుల తర్వాత తిరిగి వివాహాము చేసుకొనుట అన్నది కొన్ని సంధార్భాలలో ఒక పద్దతి మాత్రమే. అయితే దాన్ని అర్థం అదే చేయాలని కాదు.

క్రైస్తవులు అని చెప్పుకొనే వారిలో విడాకుల సంఖ్య అవిశ్వాసులతో సమానముగానుండుట అలా విషాదకరం. దేవుడు విడాకులను అసహ్యించుకొంటున్నాడని (మలాకీ 2:16) క్షమించుకోవటం, తిరిగి కలిసి జీవించటం విశ్వాసుల లక్షణమని బైబిలు స్పష్టముగా చేస్తుంది (లూకా 11:4; ఎఫెసీయులకు 4:32). అయితే తన బిడ్డల విషయములో కూడా విడాకులు సధయమే అని గుర్తించాడు. విడాకులు తీసుకొన్న వ్యక్తి విశ్వాసి తనను దేవుడు తక్కువగా ప్రేమిస్తున్నాడని ఎప్పుడూ అనుకోకూడదు. మత్తయి 19:9 లో పేర్కొనబడిన ప్రత్యేకమైన కారణము తనకు వర్తించకపోయినప్పటికి దేవుడు కొన్ని సార్లు క్రైస్తవుల యొక్క అవిధేయతను కూడా గొప్ప కార్యముల కోసమే వాడుకో గలుగుతాడు.


ప్రశ్న: వివాహామునకు ముందు లైంగిక చర్య విషయమై బైబిలు ఏమి చెప్తుంది?

సమాధానము:
హీబ్రూలో గాని గ్రీకు భాషలో గాని ఎక్కడ కూడా వ్వివాహామునకు ముందు లైంగిక చర్య విషయమై ప్రత్యేక పదం ఉపయోగించలేదు. బైబిలు నిస్సందేహముగా జారత్వమును, వ్యభిచారమును ఖండిస్తుంది. అయితే వివాహామునకు ముందు లైంగిక చర్య జారత్వమా? 1 కొరింధి 7:2 ప్రకారము "అవును అన్నదే స్పష్టమైన జవాబు". "అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య యుండవలెను. ప్రతి స్త్రీకి సొంత భర్త యుండవలెను." ఈ వచనముతో పాటు జారత్వమునకు విరుగుడు వివాహమే అన్నట్లు పేర్కొన్నాడు. 1 కొరింధి 7: 2 ప్రాధమికంగా చెప్పినదేమిటంటే మనుష్యులు తమను తాము జారత్వములో పడిపోకుండా అదుపులో పెట్టుకోలేరు కాబట్టి అనేక మంది వివాహేతర లైంగిక సంభంధాలు కలిగి యుంటున్నారు. కాబట్టివివాహము దానికి విరుగుడు. అప్పుడు వారి కోరికలు నైతికమైన పద్దతిలో తీర్చుకోగలుగుతారు.

1కొరింధి 7:2 స్పష్టముగా వివాహమునకు ముందు లైంగిక సంభంధము జారత్వముగా నిర్వచించింది. కాబట్టి బైబిలులో జారత్వమును పాపమని ఖండిస్తున్న ప్రతీవచనము వివాహామునకు ముందు లైంగిక చర్య పాపమను చూపిస్తుంది. జారత్వమునకు వున్న బైబిలు పరమైన నిర్వచనములలో వివాహామునకు ముందు లైంగిక చర్య చేర్చబడింది. వివాహామునకు ముందు లైంగిక చర్య పాపమంటూ అనేక లేఖనభాగలున్నాయి(అపొస్తలుల కార్యములు 15:20; 1 కొరింధీయులకు 5:1; 6:13, 18; 10:8; 2 కొరింధీ 12:21; గలతీయులకు 5:19; ఎఫెసీయులకు 5:3; కొలస్సీయులకు 3:5; 1 ధెస్సలోనీయులకు 4:3; యూదా 7). వివాహమునకు ముందు ఎటువంటి లైంగిక సంభంధమును కూడ బైబిలు ప్రోత్సాహపరచదు మరియు నిషేధించుద్ది. భార్య భర్తల మధ్యనుండే లైంగిక సంభంధమును మాత్రమే దేవుడు అనుమతిస్తున్నాడు (హెబ్రీయులకు 13:4).

లైంగిక చర్య అనే అంశాన్ని చాలసార్లు ఆహ్ల్లాదంను ఇచ్చే విషయంగా నొక్కి వక్కాణిస్తాముగాని "ఉత్పన్నం ఛేయటం" అనే అంశాన్ని గురించి మరచి పోతుంటాము. వివాహము సంభంధములో నున్నటువంటి లైంగికచర్యలో వినోదం, వికాసం వుండేటట్లు దేవుడు రూపించాడు. వివాహ సంభంధంలో స్త్రీ పురుషులు ఆనందించాలనేది దేవుని ఆశ. పరమగీతములాంటి మరియు ఇతర అనేక బైబిలు భాగాలు (సామెతలు 5:19లాంటి), లైంగిక సంభంధంలో నున్న సుఖాన్ని వివరిస్తున్నాయి. అయితే దేవుడు లైంగిక సంభంధాన్ని అనుగ్రహించినదాంట్లో పిల్లలను ఉత్పత్తి చేయటం దేవుని ఉద్దేశం అని దంపతులు మరచిపోకూడదు. కాబట్టి వివాహమునకు ముందు లైంగిక సంభంధం కల్గియుండటం రెంఢూ విధాలుగా తప్పు. 1). వాళ్ళకు అనుమతించని సుఖాన్ని అనుభవించటాన్ని ప్రయత్నించటం. 2). దేవుడు ఆశించిన కుటుంబ వ్యవస్థకు బయట ఒక ప్రాణాన్ని ఉత్పత్తి చేయటం.

ఇది ప్రయోగాత్మకంగా సరియైనది కాదా అని తేల్చిచెప్పటం కంటే, ఒకవేళ బైబిలు వివాహమునకు ముందు వుండే లైంగిక చర్యలకు సంభంధించిన ఆదేశాలకు విధేయత చూపినట్లయితే లైంగిక సంభంధమైనటువంటి జబ్బులు తక్కువవుతాయి. గర్భస్రావాలు తక్కువవుతాయి. పెళ్ళికాని తల్లులు తక్కువవుతారు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు తక్కువవుతారు. వివాహమునకు ముందు లైంగిక చర్య విషయములో దేవునికున్న నియమము నిషేధించడమే. జీవితాలను కాపాడతాది, బిడ్డలకు భద్రత కల్పిస్తాది, లైంగిక సంభంధాలకు సరియైన విలువనిస్తాది. అన్నిటికంటే ముఖ్యంగా దేవునిని గౌరవిస్తాది.


ప్రశ్న: బైబిలు త్రిత్వము గురించి ఏమి భోధిస్తుంది?

సమాధానము:
క్రైస్తవ అంశమైన త్రిత్వములో అతి కష్టమైనది దాన్ని సమగ్రవంతంగా వివరించలేకపోవటమే. “త్రిత్వము” అనే అంశం అర్థం చేసుకోడానికి చాల కష్టం. దేవుడు అపరిమితముగా ఉన్నతమైనవాడు గొప్పవాడు, కాబట్టి ఆయనను పరిపూర్ణముగా అవగాహన చేసుకోగలం అని అనికూడ అనుకోవద్దు. క్రీస్తు దేవుడని, తండ్రి దేవుడని పరిశుధ్దాత్ముడు దేవుడని బైబిలు భోధిస్తుంది. దేవుడు ఒక్కడే అనికూడా భోధిస్తుంది. త్రిత్వ దేవునిలో వ్యక్తులమధ్య సంభాందాన్నికి ఋజువులున్నప్పటికి మానవ మనస్సుకు అది గ్రహింపశక్యముకానిది. ఏదిఏమైనప్పటికి దీనిని బట్టి “త్రిత్వము” వాస్తవము కాదని, బైబిలు భోధనకాదని అనలేము.

ఒక్కదేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో వుండుటయే త్రిత్వము. దీని అర్థం ముగ్గురుదేవుళ్ళున్నారని ప్రతి పాదించటంకాదు. త్రిత్వము అన్న పదం లేఖనములో లేదన్న విషయము ఈ అంశం అధ్యయనం చేసేటప్పుడు మనస్సులోనుంచుకోవాలి. త్రియేకదేవుని వివరించటానికి ఉపయోగించినపదమిది. ముగ్గురు ఒకేసారి ఉనికిలో వున్నవారు. నిత్యులైన వ్యక్తులు దైవత్వమైయున్నారు. వాస్తవము ఏంటంటే త్రిత్వము అనే అంశానికి సంబంధించిన వివరాలు లేఖనాలలో వున్నాయి. త్రిత్వము గురించి బైబిలు భోధిస్తున్న కొన్ని విషయాలు.

1). దేవుడు అద్వితీయుడు- ఏకమై యున్నావాడు (ద్వితియోపదేశకాండం 6:4; 1 కొరింథి 8:4; గలతీయులకు 3:20; 1 తిమోతి 2:5).

2). త్రిత్వములో ముగ్గురు వ్యక్తులున్నారు (ఆదికాండము 1:1, 26; 3:22; 11:7; యెషయా 6:8, 48:16, 61:1; మత్తయి 3:16-17, 28:19; 2 కొరింథీయులకు 13:14). ఆదికాండము 1:1 లో "ఎలోహీమ్" అన్న హీబ్రూ పదము దేవుడు బహుళ పదమునకు వుపయోగించింది. ఆదికాండము లో 1:26, 3:22, 11:7 మరియు యెషయా లో 6:8, బహుళ సర్వ నామము "మన" వుపయోగించారు. ఎలోహీం సర్వ నామము, ఈ రెండు బహుళ పదాలు. ఇవి ఖచ్చితముగా భాషలో ఒకటికంటె ఎక్కువమందిని సూచిస్తుంది. ఈ వాదన త్రిత్వాన్నికి ఋజువు కాదు గాని దేవునిలోని బహుళత్వాన్ని మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది. దేవుడు హీబ్రులో ఎలోహీం, ఖచ్చితంగా త్రిత్వాన్నికి చోటిస్తుంది.

యెషయా 48: కుమారుడు తండ్రి గురించి, పరిశుధ్దాత్ముని గురించి మాట్లాడాడు. యెషయ 61: 1 వచనమును లూకా 4:14-19 ను పోల్చినట్లయితే కుమారుడే మాట్లాడినట్లు గనించగలము. యేసుక్రీస్తు బాప్తీస్మము గురించి వివరించే భాగం మత్తయి 3:16-17. ఈ భాగంలో కుమారుడైన దేవుని మీద పరిశుధ్దాత్ముడైన దేవుడు దిగరావటం, కుమారుడైన దేవునియందు తండ్రియైన ధేవుడు ఆనందిస్తున్నాడని చెప్పటం గమనించగలం. మత్తయి 28:11; 1 కొరింథీ 12:14 లో త్రిత్వములో ముగ్గురు వ్యక్తులున్నారనటానికి చక్కని ఉదాహరణ.

3). త్రిత్వములోని సభ్యులను వేరువేరుగా చూపించేటటువంటి వాక్యాభాగాలున్నాయి. పాతనిబంధనలో "ప్రభువును" "యెహోవా" కు వేరువేరుగా చూపించారు (ఆదికాండం 19:24; హోషేయా 1:4). ప్రభువు కుమారుని కనెను (కీర్తన 2:7, 12; సామెతలు 30:2-4). ఆత్మను "యెహోవాను" (సంఖ్యాకాండము 27:18) "ప్రభువైన దేవుడ్ని" (కీర్తన 51:10-12)వేరువేరుగా చూపించారు. తండ్రిదేవుడు, కుమారుడైన దేవుడు వేరువేరుగా నున్నది(కీర్తన 45:6-7; హెబ్రీయులకు 1:8-9). క్రొత్తనిబంధనలో తండ్రినుండి ఆదరణకర్తను, పరిశుధ్దాత్ముని పంపిస్తానని (యోహాను 14:16-17) యేసయ్య చెప్పాడు. దీనిని బట్టి యేసయ్య తాను తండ్రికాడని, పరిశుధ్దాత్ముడు కాడని స్పష్టంచేస్తున్నాడు. సువార్త పాఠ్యభాగలలో యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడిన సంధర్భాలన్ని గమనించాలి. యేసయ్య తనతో తానే మాట్లాడుకొంటున్నడా? లేదు. త్రిత్వములోని మరొక వ్యక్తియైన తండ్రితో మాట్లాడుతున్నాడా?

4). త్రిత్వములోనున్న ప్రతీ వ్యక్తి దేవుడు (యోహాను 6:27; రోమా 1:7; 1పేతురు 1:2). కుమారుడైన దేవుడు (యోహాను 1:1, 14; రోమా 9:5; కొలస్సీయులకు 2:9; హెబ్రీయులకు 1:8; 1 యోహాను 5:20). పరిశుధ్దాత్ముడైన దేవుడు (అపోస్తలుల కార్యములు 5:3-4; 1 కొరింథీయులకు 3:16).

5). త్రిత్వములో ఒకరిమీద మరొకరు ఆధారపడియుంటారు. లేఖనములు చూపించుచున్నట్లుగా పరిశుధ్ధాత్ముడు తండ్రికి, కుమారునికి మరియు కుమారుడు తండ్రికి విధేయులు. ఇది అంతర్గత సంభంధమే కాని త్రిత్వములో ఏ ఒక్క వ్యక్తికి దైవత్వమును లేదనకూడదు. పరిమిత మనస్సు కలిగిన మనము అనంతుడైన దేవునిని ఈ విషయములో అవగాహన చేసుకొనుట అసాధ్యము. కుమారుని విషయములో పరిశుధ్ధాత్ముని విషయములో ఈ లేఖన భాగాలలో లూకా 22:42, యోహాను 5:36, యోహాను 20:21, మరియు 1 యోహాను 4:14. పరిశుధ్ధాత్ముని గురించి యోహాను 14:16, 14:26, 15:26, 16:7, మరియు ప్రత్యేకముగా యోహాను 16:13-14 గమనించండి.

6). త్రిత్వములోని సభ్యులకు వేరువేరు భాధ్యతలున్నాయి. తండ్రి అంతిమ విశ్వాసమునకు అంతిమ కారకుడు, లేక ఆధారము((1 కొరింథీయులకు 8:6; ప్రకటన 4:11); దైవిక ప్రత్యక్షత (ప్రకటన 1:1); రక్షణ (యోహాను 3:16-17); మరియు యేసుక్రీస్తు మానవ చర్యలు(యోహాను 5:17, 14:10). తండ్రి ఈ విషయములన్నిటిలో చొరవ తీసుకుంటాడు.

పరిశుధ్ధాత్ము తండ్రి ప్రతినిధిగా ఈ కార్యములను నిర్వర్తిస్తున్నాడు. విశ్వాన్ని సృష్టించడం, కొనసాగించటం (ఆదికాండము 1:2; యోబు 26:13; కీర్తన 104:30); దైవిక ప్రత్యక్షత (యోహాను 16:12-15; ఎఫెసీయులకు 3:5; 2 పేతురు 1:21); రక్షణ (యోహాను3:6; తీతుకు 3:5; 1 పేతురు 1:2); మరియు యేసుక్రీస్తు క్రియలు(యెషయా 61:1; అపోస్తలుల కార్యములు 10:38). తండ్రి పరిశుధ్ధాత్ముని శక్తి ద్వారా ఈ కార్యములన్ని తలపెడ్తాడు.

త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి పలువిధములైన ఉపమానములను ప్రయత్నించటమైనది. అయితే అందులో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణముగా సరితూగేదికాదు. గుడ్డును ఉదాహరణ తీసుకోవటం సరిపోదు. ఎందుకంటె పసుపు, తెల్లసొన, డొల్ల, గుడ్డులోని భాగాలే గాని అవి పరిపూర్ణంగా గుడ్డు కాదు. ఏపిల్ కాయ కూడా అదే విధంగా సరియైన ఉదాహరణ కాదు. ఎందుకంటె తోలు, గుజ్జు, విత్తనము భాగాలేగాని కాయ కాదు కాబట్టి. తండ్రి కుమార పరిశుధ్ధాత్ములు దేవునిలోని భాగాలు కాదు. ప్రతి ఒక్కరూ దైవమై యున్నారు. నీటిని ఉదాహరణగా తీసుకోవటం కొంతవరకు సబబే గాని అది కూడా సమగ్రవంతంగా త్రిత్వాన్ని వివరించలేదు. ఎందుకంటె ద్రవ పదార్థములోనునున్న నీరు, ఘన పదార్థములోనునున్న ఐస్, వాయు పదార్థములోనునున్న ఆవిరి నీటి యొక్క రూపము మాత్రమే. కాబట్టి ఈ ఉపమానములు త్రిత్వము గురించి కొంత అవగాహన అనుగ్రహించినప్పటికి పరిపూర్ణంగా సమగ్రమైనవి కాదు. అనంతమైన దేవున్ని, పరిథిలు కలిగిన ఏ ఉపమానము కూడా వివరించలేదు.

బైబిలు సిధ్ధాంతమైన త్రిత్వము క్రైస్తవ సంఘ చరిత్ర అంతట విభేధాలుకు కారణమైనదే. దేవుని వాక్యములో త్రిత్వము గురించి కేంద్రిత అంశములు స్పష్టముగా కనపరచబడినప్పటికి, కొన్ని విషయాలు అంత ప్రస్పుటముగా వివరించలేదు. తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, మరియు పరిశుధ్ధాత్ముడైన దేవుడు, కాని దేవుడు ఒక్కడే. ఇదే బైబిలు సిధ్ధాంతమైన త్రిత్వము. దీనికి మించి ఇతర విషయాలు ప్రశ్నార్థకమైనవి. అంతా ప్రాముఖ్యమైనవి కూడా కాదు. పరిమిత మానవమనస్సులతో త్రిత్వాన్ని పరిపూర్ణంగా వివరించటానికి ప్రయత్నించుటకు బదులు దేవుని గొప్ప లక్షాణాలు అనంతమైన మరియు ఉన్నతమైన స్వభావాన్ని కేంద్రీకరిస్తూ ఆయనకు పరిచర్యచేయాలి "ఆహా, దేవుని బుద్ది ఙ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు?" (రోమా11:33-34).


ప్రశ్న: భాషలలో మాట్లాడుట అనే వరం అంటే ఏంటి?

సమాధానము:
భాషలలో మాట్లాడుటం అన్నది తొలిసారిగా జరిగింది. (అపొస్తలుల కార్యములు 2:14 పెంతెకోస్తు దినాన్న అపొస్తలులు బయటకు వెళ్ళి ప్రజలకు వారి భాషలలోనే సువార్తను అందించారు "క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి" (అపొస్తలుల కార్యములు 2:11).నాలుకలు అన్న గ్రీకు పదంనకు అసలు అర్థం భాషలు. కాబట్టి ఒక వ్యక్తి పరిచర్య చేయుటకుగాను తనకు తెలియని భాష ఇతరులకు వినేవారికి అర్థమయిన భాష అయితే దానిని భాషలలో మాట్లడటంఅని అంటారు. 1కొరింథీ 12-14 పౌలు ఈ అధ్భుతమైన వరములను గురుంచి మాట్లాడుతూ "సహోదరులారా, ఆలోచించుడి; భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెననియైనను ఙ్ఞానోపదేశము చేయవలెననియైనను ప్రవచింపవలెననియైనను భోదింపవలెననియైనను మీతో మాటలాడకపోయిన యెడల, నా వలన మీకు ప్రయోజనమేమి?" (1 కొరింథీ14:6). అపోస్తలుడైన పౌలు మాటలనుబట్టి అపోస్తలుల కార్యములు గ్రంధములో భాషలు గురించి రాసిన భాగమునకు అంగీకారముగా ఈ పరిచర్యఈ పరిచర్య ఆ భాషను అర్థంచేసుకొనేవారికి సువార్తను అందించుట విషయంలో చాలా విలువైంది. అయితే దానికి అర్థం చెప్పే వారు అవగాహన చేసుకొనేవారు లేకపోయితే నిరుపయోగమైనది.

భాషలకు అర్థం చెప్పగలిగేవరం కలిగిన వ్యక్తి భాషలతో మాట్లాడేవ్యక్తిని అర్థం చేసుకోగలుగుతాడు ఆ భాష రాకపోయిన. ఆ విధంగా అర్థం చెప్పి అందరికి యుపయోగపడేటట్లు చేస్తారు. అవగాహనయ్యేటట్లు "భాషతో మాటలాడువాడు అర్థముచెప్పు శక్తికలుగుటకై ప్రార్థనచేయవలెను"(1 కొరింథీయులకు 14:13). అర్థమం చెప్పలేనటువంటి భాష విషయంలో పౌలు చాల శక్తివంతమైనటువంటి పదాలు వుపయోగించాడు "అయినను సంఘములో భాషతో పదివేల మాటలు పలుకుటకంటె, ఇతరులకు భోధకలుగునట్లు నా మనస్సుతో అయిదు మాటలు పలుకుట మేలు" (1కొరింథీయులకు 14:19).

భాషాలలో మాట్లాడేవరం ఈ నాటికి వర్తిస్తుందా? 1కొరింథీయులకు 13:8 ప్రకారము భాషలైనను "నిలిచిపోవును" అన్నది "పరిపూర్ణమైనది" వచ్చినపుడు అన్న దానిలో ముడిపడివున్నది 1కొరింథీయులకు 13:10. కొంతమంది పండితులు గ్రీకువ్యాకరణాన్ని ఆధారంచేసుకొని ప్రవచనము, ఙ్ఞానము అన్న దానికి వర్తమాన కాలములో ఉన్నవని భాషలు భూతకాలములో వున్నవని దీనిని బట్టి పరిపూర్ణమైనది రాకమునుపే భాషలునిలిచి పోయినదని వాదిస్తారు. ఇది సాధ్యము అనిపించినపుడికి లేఖనభాగము స్పష్టీకరించుటలేదు. మరికొంతమంది యెషయా 28:11 మరియు యోవేలు 2:28-29 వాక్య భాగాలను సూచిస్తూ దేవునియొక్క తీర్పును జరుగుతుంది అని భాషాలలో మాట్లాడుటకు అనేవరాన్ని సూచిస్తారు. 1 కొరింథియులకు 14:22 ప్రకారము భాషల వరము "అవిశ్వాసులకు సూచన." ఈ వాదన ప్రకారము భాషలవరము యూదులకు హెచ్చరిక ఇవ్వడానికి యేసుక్రీస్తును మెస్సీయగా తృణీకరించినందుకు దేవుడు ఇశ్రాయేలీయులను తీర్పుతీరుస్తున్నాడన్నది. కాబట్టి దేవుడు ఇశ్రాయేలీయులమీద తీర్పు తీర్చునపుడు భాషలవరం దాని నుద్దేశించినటువంటి పనికి నిరుపయోగమైంది (యె రూషలేము రోమీయుల ద్వారా నాశనమైనది క్రీస్తుశకము 70). ఈ దృక్పధం సాధ్యము అని అనిపించినప్పటికి భాషలు ప్రాధమిక ఉద్దేశ్యము పరిపూర్ణమవ్వటాన్నిబట్టి నిలిచిపోవటం అన్న దానికి సరైన హేతువును చూపలేకపోతున్నం. భాషలవరం నిలిచి పోయింది అనటానికి ఖచ్చితమైన ఆధారము ఏదిలేదు.

అదేసమయంలో భాషల వరము ఈ రోజులలో చురుకుగావున్నయెడల అది వాక్యానుసారంగా వుండాలి. అది నిజమైన అర్థవంతమైన భాషై యుండాలి ( 1కొరింథీ 14:10). దాని ఉద్డేశ్యము దేవుని వాక్యాన్ని వేరే భాషమాట్లాడే వ్యక్తికి అందించటానికి ఉపయోగపడాలి. దేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చిన ఆఙ్ఞకు అనుగుణంగా ఉండాలి "భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేనియెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెనుగాని, తనతోను దేవునితోను మాటలాడవచ్చును" (1 కొరింథీ 14:27-28).1కొరింథి14:33 "అలాగే పరిశుధ్దుల సంఘము లన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు" అనే వచనానికి భిన్నంగా వుండదు.

వేరె వ్యక్తికి సువార్త అందించే వ్యక్తిగాను ఆ వ్యక్తి మాట్లాడే భాషను దేవుడు వరంగా ఇవ్వగలిగే సామర్ధ్యత కలిగినవాడు. ఆత్మ వరములను పంచి ఇచ్చుటలో పరిశుధ్దాత్ముడు సార్వభౌమాధికారము కలిగినవాడు (1కొరింథీ 12:11). మిషనరీలు భాషను నేర్చుకోడానికి స్కూలుకు వెళ్ళకుండ ఉన్నపాళంగా భాషను మాట్లాడే ఉండగలిగే పరిస్థితి వుంటే ఎలాగుంటుందో ఊహించి చూడండి. ఏదిఏమైనప్పటికి దేవుడు ఆ విధంగా తరచుగా వ్యవహరించే వాడు కాడు. క్రొత్త నిబంధన కాలంలో జరిగినట్లు భాషలలో మాట్లాడటం అనేది ఇప్పుడు జరగటంలేదు. అది ఎంతో అవసరమైనప్పటికి భాషల వరాన్ని అభ్యసించేటటువంటి ఎక్కువశాతం మంది దేవుని వాక్యానుసారంగా వ్యవహరించటంలేదు. కాబట్టి ఆత్మల వరం భాషలవరం అయితే నిలిచిపోయింది. లేదా దేవుని ప్రాణాళిక ప్రకారము నేటి సంఘానికి అరుదైనది.


ప్రశ్న: యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానల మధ్యనున్న మూడు రోజులలో ఎక్కడ గడిపాడు?

సమాధానము:
1 పేతురు 3:18-19 "ఏలయనగా మనలను దేవునియొద్డకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్ర్మపడెను. దేవుని దీర్ఙ్హశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్డపరచుచుండగా, అవిధేయులైనవారియొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి." 18 వచనములోనున్న "ఆత్మ విషయములో" అన్న భాగము శరీర విషయములో లాగా నిర్మితమయినది. కాబట్టి ఆత్మ అన్న పదాన్ని శరీరమన్న పదముతో పోల్చుట సముచితమే. ఇక్కడున్న శరీరము ఆత్మ, క్రీస్తు శరీరము ఆత్మయే. ఆత్మ విషయములో బ్రదికింపబడి అన్నది క్రీస్తు పాపముల విషయములో శ్రమపడి మరణముద్వారా, తండ్రినుండి తన ఆత్మను వేరుపరచినాడు అని సూచిస్తుంది(మత్తయి 27:46). శరీరము ఆత్మల మధ్యనే వ్యత్యాసము మత్తయి 27:46 మరియు రోమా 1:3-4 సూచించినట్లు క్రీస్తు శరీరము పరిశుధ్ధాత్మలమధ్య కాదు. క్రీస్తు పాపముల విషయమై ప్రాయశ్చిత్తము చెల్లించటం పరిపూర్ణమయినప్పుడు ఆయన ఆత్మ తెగిపోయిన సహవాసాన్ని పునరుద్డీకరించెను.

1 పేతురు 3:18-22 వచనాలలో క్రీస్తు శ్రమలకు (18) ఆయన మహిమపరచబడుటకు (22) మధ్యనున్న సంభంధాన్ని సూచిస్టుంది. కేవలం పేతురు మాత్రమే ఈ రెండు సంఘటనల మధ్యన జరిగిన సమాచారాన్ని అందిస్తున్నాడు. 19వ వచనములో భోధించటం అన్న పదం నూతన నిభంధనలో తరచుగా వాడే సువార్త భోధించటం అన్నవంటిది కాదు. ఒక వార్తను చాటించటం అని అర్థం. యేసు శ్రమనొంది సిలువపై మరణించాడు. ఆయన శరీరము మరణమునకు అప్పగించబడింది. ఆయన మీద పాపము మోపగా ఆయన ఆత్మ మరణించెను. అయితే ఆయన ఆత్మను బ్రదికించబడినపుడు ఆయన దానిని తండ్రికి అప్పగించెను. పేతురురాసినట్లుగా మరణానికి పునరుత్థానికి మధ్యన "చెరలోనున్న" ఆత్మలకు ప్రత్యేకంగా ప్రకటన చేసెను.

పేతురు మనుష్యులకు సూచించటానికి ప్రాణాత్మలు (సోల్స్)వుపయోగించాడు కాని ఆత్మలుగా (స్పిరిట్స్)కాదు. క్రొత్త నిబంధనలో ఆత్మ అన్నదానిని దేవదూతలకు, దయ్యములకు వుపయోగించారు కాని మనుష్యులకు కాదు. ఇదే భావాన్ని 22వ వచనములో కూడ చూడవచ్చు. మరియు బైబిలులోమరీ ఇంకెక్కడ కూడ యేసుక్రీస్తు నరకాన్ని దర్శించినట్లు పేర్కొనబడలేదు. అపోస్తలుల కార్యములు 2:31లో పేర్కొనబడిన పాతాళము కాదు. పాతాళముఅన్నది మరణించిన వారి స్థాయిని సూచించేది. పునరుత్థానముకోసం వేచియుండే తాత్కాలికమైన ప్రదేశము. ఈ రెండింటి మద్యననున్న వ్యత్యాసాన్ని ప్రకటన 20:11-15 ను చూడగలం. నరకం నిత్యమైనది, అంతిమ స్థానం నశించినవారికి ఇచ్చినటువంటి తీర్పు. పాతాళము (హెడెస్) తాత్కాలికమైనది.

మన ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాత మరణించాడు. మరణ పునరుత్థానముల మధ్య పాతాళములోనున్న ఆత్మలకు (బహుశా త్రోసివేయబడినటువంటి దేవదూతలు యూదా6)లో భోధించెను. నోవహు ప్రళయమునకు ముందు కాలమునకు చెంధినవారికి వర్తమానము అందించెను. 20వచనము దీనిని స్పష్టము చేస్తుంది. చెరలోనున్న ఆత్మలకు ఏమి ప్రకటించారో పేతురు చెప్పలేదు గాని, బహుశా! వర్తమానము విమోచనమునకు సంభంధించినది కాకపోవచ్చు. ఎందుకంటే రక్షణ దేవదూతలకు వర్తించదు కాబట్టి (హెబ్రీయులకు 2:16). ఇది బహుశా! సాతాను మరియు అతని శక్తులపై ప్రకటించిన విజయము (1 పేతురు 3:22; కొలస్సీయులకు 2:15). ఎఫెసీయులకు 4:8-10 క్రీస్తు పరదైసుకు వెళ్ళినట్లు సూచిస్తుంది. (లూకా 16:20;23:43) మరియు ఆయన మరణమునకు ఆయనయందు విశ్వాసముంచిన వారందర్ని పరలోకమునకు తీసుకొనివెళ్ళెను. ఈ వాక్యభాగమునకు ఎక్కువ వివరములను ఇవ్వటంలేదు అని చెరను చెరగా కొనిపోబడెను అన్న దానికి ఎక్కువమణ్ది బైబిలు పండితులు అంగీకరించేది ఈ భాష్యంనే.

కాబట్టి యేసుక్రీస్తు మరణమునున్న మధ్య మూడురోజులలో ఖచ్చితంగా ఏంచేశారో అన్నది బైబిలు స్పష్టీకరించటం లేదు. ఆయన త్రోసివేయబడిన దేవదూతలు అవిశ్వాసులపై విజయాన్ని ప్రకటించటానికి వెళ్ళినట్లు సూచిస్తున్నాయి. యేసయ్య రక్షణ నిమిత్తము ప్రజలకు రెండవ అవకాశము ఇవ్వటానికి అన్న విషయము మాత్రము ఖచ్చితముగా అర్థంచేసుకోగలం. మరణం తార్వాత మనము తీర్పును ఎదుర్కోవాలి రెండవ అవకాశం లేదని ఖచ్చితముగా (హెబ్రి 9:27) చెప్తుంది. యేసుక్రీస్తు తన మరణము పునరుత్థానముల మధ్య ఏంచేశారో అని నిర్థిష్టమైన జవాబు లేదు. బహుశా మనము మహిమలో చేర్చబడిన తర్వాత అర్థంచేసుకోగలిగే ఒకే మర్మం ఇదేనేమో!


ప్రశ్న: జూదము పాపమా? బైబిలు జూదము గురించి ఏమి చెప్తుంది?

సమాధానము:
జూదము, పందెంలో పాల్గొనుట, లాటరీ టిక్కెట్టులు కొనడం వంటివి బైబిలు స్పష్టముగా ఖండించదు. అయితే బైబిలు మాత్రము ఖచ్చితముగా ధనాపేక్షకు దూరంగా వుండమని హెచ్చరిస్తుంది (1 తిమోతి 6:10; హెబ్రీయులకు 13:5). త్వరగా డబ్బు సంపాదించే ప్రయత్నంనుండి దూరంగా వుండమని బైబిలు ప్రోత్సాహిస్తుంది(సామెతలు 13:11; 23:5; ప్రసంగి 5:10). జూదము ఖచ్చితముగా ధనాపేక్షకు కేద్రంగా కలిగియున్నది. మరియు జూదము డబ్బు సంపాదించటమే కేంద్రితమై యున్నది కాబట్టి త్వరితగతిలో సులభ పద్దతుల ద్వారా డబ్బు సంపాదించాలాని ప్రజలకు వాగ్ధానం చేస్తూ శోధిస్తుంది?

జూదము తప్పేంటి? జూదము అది చాలా కష్టమైనది. పరిమితం కాబట్టి దాని గురించి ఆలోచించుట చాలా కష్టము. అప్పడప్పుడు ఆడేది కాబట్టి ధానాన్ని వృధాచేస్తుంది. అయితే అది అవసరమైన దురచారం కానే కాదు. ప్రజలు వేర్వేరు కలాపాలకు ధానాన్ని వృధాచేస్తారు. లేక డబ్బును వృధాచేస్తారు. జూదము కూడా ఇతర కార్యకలాపాలకు సమయాన్ని , ధనాన్ని వెచ్చించినట్లుగానే వుంటుంది. ఉదాహరణకు సినిమాకు వెళ్ళటం, హొటళ్ళో ఖరీదైన భోజనం చేయటం లేక ఉపయోగం లేకపోయిన ఎంతో ఖర్చుపెట్టి వస్తువు కొనడం వంటిది. అదే సమయంలో ఇతర విషయములో డబ్బు వృధాచేయటంతో సమానంగా పోల్చటంనుబట్టి జూదాన్ని సమర్థించలేము. డబ్బును వృధాచేయకూడదు. మిగులు ధానాన్ని భవిష్యత్తు అవసరతలకొరకు నిలువచేసుకోవాలి లేక ప్రభువు పనికి ఇవ్వాలిగాని జూదములో పెట్టుకొనకూడదు.

బైబిలు జూదముగురించి స్పష్టముగా ప్రస్తావించకపోయినప్పటికి “అదృష్టము”, “ఆకస్మిక అవకాశము”, అనుకోకుండ వచ్చిన అంశాలు గురించి పేర్కొంటుంది.ఉదాహరణకు లేవీకాండంలో బలి ఇచ్చే కోడెను , విడువబడే కోడెను నిర్ణయించటానికి చీట్లువేసేవారు. యెహోషువాకు వేరు వేరు గోత్రాలకు భూభాగాలను నిర్ణయించటానికి చీట్లు వేసారు. యెరూషలేము గోడలోపల భాగములో ఎవరు నివసించాలో నిర్ణయించటానికి యెహోషువా చీట్లు వేసాడు. అపోస్తలులు ఇస్కరియోతు యూదాకు మారుగా శిష్యుని ఎంపిక చేయుటకు చీట్లు వేసెను.సామెతలు 16:33 లో "చీట్లు ఒడిలో వేయబడును. వాటివలని తీర్పు యెహోవా వశము" అని చెప్తుంది.

బైబిలు కసినోలు, క్లబ్బులు, చీట్లువేయటాన్ని గురించి ఏమి చెప్తుంది? క్లబ్బులు, కసినోలు, జూదగాళ్ళను ఆకర్షించటానికి డబ్బు వెచ్చించటానికి, వేరు వేరు వ్యాపార పద్దతులు ఉపయోగిస్తారు. ఉచితముగా లేక చవకగా లభించే మద్యము ద్వార త్రాగుడును ప్రోత్సాహించి తెలివిగా నిర్ణయము తీసుకొనే స్థోమతను, సామర్ధ్యతను కోల్పోయేటట్లు చేస్తారు. ఇటువంటి క్లబ్బులో జూదము ద్వారా డబ్బును కోల్పోవటం తప్పించి సంపాదించటం అనేది వుండదు. అయితే నిరుపయోగమైన సరదా మాత్రం వుంటుంది. కొంతమంది లాటరీ టిక్కెట్టు ద్వారా విద్య లేక సాంఘీక ప్రయోజనాలకు అంటూ మబ్బి పెడ్తారు. ఏదిఏమైనప్పటికి ఒక సర్వే ప్రకారము లాటరీ టిక్కెట్లు కొనడం ఎక్కువశాతంమంది ఆ టిక్కెట్లను కొనడానికి కూడా స్థోమత లేనివాళ్ళు, "త్వరగా గొప్పవాళ్ళు అవ్వచ్చు" అనేది పెద్ద శోధన. నిరాశలో వున్నవారు దాని కాదు అని అనలేరు. గెలుపు అవకాశాలు చాలా తక్కువ దాని పర్యవసానంతో అనేకమంది జీవితాలు నాశనమవుతాయి.

లాటరీ నుంచే వచ్చేడబ్బులు దేవునిని సంతోషపరుస్తాయా? చాలామంది జూదం, లాటరీల ద్వారా డబ్బు సంపాదించి మంచి పనులకు లేక నష్టాలకు ఉపయోగిస్తామంటారు. ఉద్దేశ్యం మంచిదిగా కనబడినప్పటికి వాస్తవానికి కొద్ది మంది మాత్రమే దైవికమైన అవసరతలకు జూదము నుంచి సంపాదించిన డబ్బు మాత్రం వినియోగిస్తారు. ఒక సర్వే ప్రకారము జాక్ పాట్ ను సంపాదించిన తర్వాత కూడా ఆర్థికంగా దయనీయమైనటువంటి పరిస్థితిలో లాటరీ ఆటగాళ్ళున్నారు. కొద్దిమంది మత్రమే వాస్తావికంగా డబ్బును మంచి కారణానికి వాడతారు. పైగా దేవునికి ఇటువంటి సొమ్మును తన పరిచర్యకు అవసరం లేదు. సామెతలు 13:11 లో "మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసికొనును." దేవుడు సార్వభౌముడు తన సంఘ అవసరతలకు తాను యదార్థమైన పద్దతిలో అనుగ్రహిస్తాడు. దొంగ తనం లేక తప్పుడు పద్దతి ద్వారా, మారక ద్రవ్యము ద్వారా సంపాదించి ఆ డబ్బు దేవునికి ఘనతనివ్వగలిగిందా? ముమ్మాటికి కాదు. అంతేకాదు పేదవాడ్ని గొప్పవాళ్ళను చేస్తామని మోసం ద్వారా దొంగిలించిన డబ్బుకూడా దేవునికి అవసరంలేదు.

1తిమోతి 6:10 లో "ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాభాధాలతో తమ్మును తామే పొడుచుకొనిరి." హెబ్రీయులకు 13:5 లో "ధనాపేక్ష లేనివారై మీకు కలిగినవాటిలో తృప్తిపొంది యుండుడి - నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా." మత్తయి 6:24 ఈ విధంగా ప్రకటిస్తుంది "ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు."


ప్రశ్న: బైబిలు డినోసరస్సులు గురించి ఏమిచెప్తుంది? బైబిలులో డినోసరస్సులున్నాయా?

సమాధానము:
డినోసరస్సులు గురించి బైబిలులో నున్న వివాదము, మరియు ఇతర వివాదములు, క్రైస్తవులు చర్చించుకొనే భూమి వయస్సు ఎంత? ఆదికాండమునకు సరియైన భాష్యం ఏంటి? మన చుట్టూ వున్న భౌతిక నిదర్శానాలకు సరియైన భాష్యం ఏంటి? అనునటి వంటి విభేధాలతో ముడుపడివున్నదే బైబిలులోని డినోసరస్ అనే అంశం.భూమి యొక్క వయస్సు ఎక్కువ అనే ఆలోచించేటటు వంటి వారు బైబిలులో డినోసరస్సులు లేవని నమ్ముతారు. ఎందుకంటే వారి ఆలోచన ప్రకారము తొలి మానవుడు భూమీమీద అడుగుపెట్టడానికి వేల సంవత్సరాలకు ముందే డినోసరస్సులు చనిపోయినవని అనుకుంటారు. బైబిలు రచించిన వారిలో ఎవరు కూడా డినోసరస్సులను సజీవంగా చూడలేదు అనుకుంటారు.

భూమి వయస్సు తక్కువగా ఆలోచించే వాళ్ళు బైబిలులో “డినోసరస్” అనే పదాన్ని ఉపయోగించకపోయిన దాన్ని గురించి ప్రస్తావించారని నమ్ముతారు. అయితే హీబ్రూ పదము "టాన్నిన్"అన్నా పదాన్ని పలురకాలయిన అర్థాలు యుపయోగించారు. కొన్ని సార్లు మాహా సర్పమని సముద్ర మృగమని అని తర్జుమా చేసారు. టాన్నిన్ అనేది బహుశా అది ఒక పెద్ద ప్రాకెడి జంతువు (జైంట్ రెప్టైల్)భూమి మీద నీటిలోను జీవించే ఈ జీవులు గురించి పాత నిబంధనలో కనీసం 30 సార్లు ప్రస్తావించారు.

ఈ జంతువు గురించి ప్రస్తావించటంతో పాటు బైబిలు దానిని వివరించే పద్దతిని బట్టి కొంతమంది పండితులు దానిని డినోసరస్ అంటారు. దేవుని సృష్టి అంతటిలో నీటి గుఱ్ఱము (యోబు 40:15- బహెమాత్)అతి పెద్దది అని దాని తోకను దేవదారు చెట్టుతో పోల్చారు. బహెమాత్ అనే జంతువును కొంతమంది పండితులు నీటి గుఱ్ఱమును, ఏనుగుతోను పోలుస్తాము. మరికొంతమంది ఈ రెండు జంతువుల తోక సన్నముగా వుంది కాబట్టి దేవదారు వృక్షము వంటిది కాదని అని అంటారు. డినొసరస్, బ్రాఖీయోసరస్ మరియు డిప్లొడాకస్, ఈ రెండు జంతువుల సిదారు వృక్షమువంటి పెద్దతోక కలిగినటువంటి జంతువులు. పురాతనమైన ప్రతీ నాగరికతలో కూడా ఈ రాకసి బల్లుల చిత్రపటాలు వున్నాయి. ఉత్తర అమెరికాలో దొరికిన పెట్రొగ్లిఫ్ఫ్లు, రాతి ప్రతిమలు డినోసరస్ వలె నున్నవి. దక్షిణ అమెరికాలో (కనుగొన్న రాతి మీద చెక్కుడు) మనుష్యులు సవారిచేస్తున్న డిప్లోడాకస్ లాంటి జంతువులు రెక్కలు కలిగిన ట్రిసిరాటాప్స్ లాంటి, ప్టెరొడక్టైల్ లాంటి, మరియు టిరన్నోసరస్ లంటి జంతువులు యొక్క రాతి మీద చెక్కుడు బొమ్మలు డినోసరస్ను పోలియున్నది. రోమీయుల పాల రాతి ప్రతిమలు, మాయిన్ మట్టికుండలు, బబులోను పట్టణగోడలలోవున్న బొమ్మలు, సంస్కృతులకు అతీతముగా, విశ్వవ్యాప్తముగా ఈ జంతువుల గురించి వున్న మక్కువ అర్థం అవుతుంది. మార్కోపోలో రాసిన "ఇల్ మిల్లియోనె" అనే పుస్తకములో వున్న కధానాలలో ఈ జంతువు ప్రస్ఫుటము అవుతుంది. భౌగోళిక, చారిత్రక ఋజువులతో పాటు శిలాజాలు దక్షిణ అమెరికా ఉత్తర మధ్య ఆసియా ప్రాంతాలలో మనుష్యుల యొక్క డినోసరస్ యొక్క పాదముద్రల యొక్క శిలాజాలు బట్టి మనుష్యులు జంతువులు కలిసి జీవించారని అర్థం.

అయితే బైబిలు డినోసరస్ గురించి రాసారా? డినోసరస్లు ఉన్నయా? దీనిని అంగీకరించటానికి వున్న ఋజువులకు భాష్యంచెప్పటం ద్వారా చుట్టూనున్న ప్రపంచంపైన ఆధారపడియుంది. బైబిలుకు యధాతధంగా భాష్యంచేప్తే భూమి వయస్సు తక్కువని మానవుడు డినోసరస్ కలిసి జీవించారని అంగీకరించాలి. ఒకవేళ మానవుడు డినోసరస్ కలిసి జీవించినట్లయితే డినోసరస్సులు ఏమయినాయి? బైబిలు దీని గురించి ఈ విషయంపై చర్చించదు. బహుశా మహా ప్రళయము తర్వాత పర్యావరకమార్పులనుబట్టి మరియు నిరంతరము వీటిని హతము చేయాలని మానవుల ప్రయత్నాలను బట్టి డినోసరస్ అంతమైపోయినవి.


ప్రశ్న: పెంపుడు జంతువులు/ జంతువులు పరలోకమునకు వెళతాయా? పెంపుడు జంతువులు/ జంతువులకు ఆత్మలు వుంటాయా?

సమాధానము:
పెంపుడు జంతువులు/ జంతువులకు “ఆత్మలు” వుంటాయని గాని, అవి పరలోకమునకు వెళతాయనిగాని బైబిలు స్పష్టమైన భోధ చేయదు. అయితే బైబిలు సూత్రాలను ఆధారం చేసుకొని ఈ విషయంపై కొంత అవగాహన కలిగియుండవచ్చు. మనుష్యులకు (ఆదికాండం2:7) జంతువులకు (ఆదికాండం 1:30; 6:17; 7:15, 22) కూడా జీవవాయువు వుంటుందని బైబిలు చెప్తుంది. మనుష్యులకు, జంతువులకు ఉన్న ప్రాధమిక వ్యత్యాసము ఏదనగా కేవలం మనుష్యులు మాత్రమే దేవుని స్వరూపంలో, పోలికలో ( ఆదికాండం 1:26-27) సృజించబడుటయే. ఇది జంతువులకు వర్తించదు. దేవుని స్వరూపంలో, పోలికలో సృజించబడుట అంటే మనుష్యలు దేవునిలాగా మనస్సు, భావోద్రేకలు , చిత్తమును బట్టి ఆత్మీయతను కలిగి ఉండగలరు. మరియు మరణం తర్వాత కూడా కొంతమటుకు ఉనికిలో ఉండగలుగుతారు. ఒకవేళ పెంపుడు జంతువులకు/ జంతువులకు ఆత్మ ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా వేరు, లేక తక్కువ “వాశికి” చెందియుండాలి. ఈ భేధమునుబట్టి బహుశా పెంపుడు జంతువులకు/ జంతువులకు “ఆత్మలు” మరణం తర్వాత కొనసాగవు.

జంతువులు ఆదికాండం ప్రకారము దేవుని సృష్టి క్రమములో భాగము అని మనము గుర్తించాలి.దేవుడు జంతువులను సృజించి అవి మంచివి (ఆదికాండం 1:25) అని చూశారు. కాబట్టి జంతువులు క్రొత్త భూమిపై (ప్రకటన గ్రంధం 21:1) వుండవు అనుటకు హేతువు లేదు. వేయేళ్ళ పరిపాలనలో జంతువులు (యెషయా11:6; 65:25) ఖచ్చితంగా వుంటాయి. ఈ జంతువుల్లో కొన్ని మనము భూమిపై వున్నప్పటి జంతువులు అని అనుటకు ఆధారాలు లేవు. దేవుడు నీతిమంతుడు అని మనకు తెలుసు. మనము పరలోకము వెళ్ళినపుడు ఈ విషయంపై మనము పరిపూర్ణంగా అంగీకరించగలము.


ప్రశ్న: కయీను భార్య ఎవరు? కయీను అతని సహోదరిని భార్యగా చేసుకున్నాడా?

సమాధానము:
బైబిలు కయీను భార్య ఎవరో స్పష్టీకరించలేదు. బహూశా కయీను భార్య తన చెల్లిగాని లేక అతని సోదరుని లేక సోదరి కుమార్తె గాని అయివుండాలి. కయీను హేబేలును చంపినప్పుడు కయీను ఏ వయస్సు వాడో బైబిలులో వ్యక్తపరచలేదు (ఆదికాండం 4:8). ఇరువురు పొలములో పని చేసేవారు కాబట్టి ఖచ్చితముగా ఎదిగిన వారై వుండాలి. బహుశా వ్యక్తిగతంగా కుటుంబాలు కూడా కలిగి వుండవచ్చు. హేబేలు చంపబడే సమయానికి ఆదాము హవ్వలు ఇంకా పిల్లల్ని కలిగి ఉండేవుంటారు. వారు ఖచ్చితముగా ఆ తర్వాత వేరే పిల్లల్ని కలిగి వున్నారని (ఆదికాండం 5:4) ప్రస్తావిస్తుంది. సహోదరుని చంపిన తర్వాత కయీను (ఆదికాండం 4:14)భయపడటం అనేది ఆదాము హవ్వలకు ఇతరు పిల్లలు మరియు మనవలు, మనువరాళ్ళు వున్నారని అర్థమౌతుంది. కయీను భార్య ఆదాము హవ్వలకు కుమార్తె లేక మనవరాలు అయివుండాలి.

ఆదాము హవ్వలు (మాత్రమే)తొలి మానవులు కాబట్టి తమ పిల్లలు తోబుట్టువులను వివాహము చేసుకొనుట ఆవశ్యకతమైంది. తోబుట్టువులను వివాహము చేసుకోకూడదు (లేవికాండం 18:6-18) అనే నిబంధన చాలకాలం పలుఅవకాశాలు కల్పించిన తర్వాత దేవుడు విధించడమైనది. దగ్గర సంభంధం కల్గిన వాళ్ళను వివాహము చేసుకోవటాన్నిబట్టి పిల్లలు జన్యుపరమైన పలులోపాలతో జన్మించే అవకాశాలు చాలా ఎక్కువ. రక్త సంబంధం గలవారిమధ్య నిషేధించబడిన వైవాహిక బంధము వలన జన్యుపరమైన లోపాలకు కారణమౌతుంది ఎందుకంటే ఇద్దరు ఒకే జాతికి పోలిన జన్యువులను కల్గి(అంటే అన్న చెల్లి ) వారికి పిల్లలు కలిగినప్పుడు, ఆ పిల్లలలో కొన్ని జన్యు లక్షణాలు అణచివేయబడిన స్థితి బహిర్గంగా కన్పడుతుంది. వేర్వేరు కుటుంబాలనుంచి పిల్లలను వివాహము చేసుకున్నట్లయితే ఇలాంటి లోపాలు కలగటం బహు అరుదు. మానవ జన్యు సంకేతము రాను రాను లోపాలమయమైపోయి ఒక తరమునుండి మరొక తరమునకు వ్యాప్తిచెందుకొంటు వచ్చింది. ఆదాము హవ్వలకు జన్యు పరమైన లోపాలు లేవు కాబట్టి మొదటి తరమువారు ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కలిగి యున్నారు.


ప్రశ్న: బైబిలు స్వలింగ సంపర్కము విషయమై ఏమి చెప్తుంది? స్వలింగ సంపర్కము పాపమా?

సమాధానము:
స్వలింగ సంపర్కము పాపమని బైబిలు సుస్థిరముగా చెప్తుంది (ఆదికాండము 19:1-13; లేవికాండము 18:22; రోమా 1:26-27; 1 కొరింథీయులకు 6:9). దేవునికి అవిధేయత చూపిస్తూ తృణీకరించినదాన్ని పర్యవసానమే స్వలింగ సంపర్కమని రోమా 1:26-27 భోధిస్తుంది. ప్రజలు పాపములో, అపనమ్మకములో కొనసాగినపుడు “దేవుడు వారిని భ్రష్టమనస్సుకు అప్పగిస్తాడు.” తద్వార దేవునికి దూరమైన నిరర్థకమైన నిరీక్షణలేని జీవితానికి దారితీస్తుంది. స్వలింగ సంపర్కులు “అపరాధులని” దేవుని రాజ్యంను స్వతత్రించుకోలేరని 1 కొరింధి 6:9 ప్రకటిస్తుంది.

దేవుడు ఒక మనిషిని స్వలింగ సంపర్కపు ఆశలతో సృష్టించడు. పాపాన్నిబట్టి స్వలింగ సంపర్కులుగా మారతారని బైబిలు చెప్తుంది (రోమా 1:24-27). మరియు అది వారి ఎంపికే. హింసకు, వీలుపడటానికి ఇతర పాపాలు చేయడానికి కొంతమందికి జన్మతహ అవకశాలు ఎక్కువగా ఎలాగుంటాయో అలాగే మరికొంతమందికి జన్మతహా స్వలింగ సంపర్కులవ్వటానికి ఎక్కువ అవకాశలుంటాయి. అయితే పాపపు ఆశలకు లోబడిపోతూ పాపాన్ని చేయాటానికి ఎంపిక చేయటం విషయంలో మానవులే భాధ్యత స్వీకరించాలి. ఓ వ్యక్తి జీవితంలోని పరిస్థితులు కోపాన్ని/ ఉద్రేకాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆవిధమైనటువంటి కోరికలు రావటం సమంజసమని అనగలమా? ఖచ్చితముగా కాదు. అదేవిధంగా స్వలింగ సంపర్కము విషయములో కూడా.

ఏదిఏమైనప్పటికి స్వలింగ సంపర్కము యితర పాపములకంటే “పెద్దది” అని బైబిలు చెప్పదు. ప్రతీ పాపము దేవునికి విరుద్దమైనదే. ఒక వ్యక్తిని దేవుని రాజ్యమునుండి దూరపరచే పాపముల పట్టి, 1 కొరింథీయులకు 6:9-10 లో స్వలింగ సంపర్కము ఒకటి అని పేర్కొంటుంది. ఒక దొంగ, హంతకుడు, విగ్రహారాధికుడు, వ్యభిచారికి దేవుని క్షమాపణ ఎంత అందుబాటులో వుందో స్వలింగ సంపర్కపులకు కూడా అంతే. పాపముపై విజయాన్ని సాధించటానికి దేవుడు వాగ్ధానము చేసినటువంటి శక్తి అందరితో పాటు స్వలింగ సంపర్కపులకు కూడా రక్షణవిషయమై క్రీస్తునందు విశ్వాసముంచిన వారికి లభ్యమౌతుంది (1 కొరింథీయులకు 6:11; 2 కొరింథీయులకు 5:17; మరియు ఫిలిప్పీ 4:13).


ప్రశ్న: బైబిలు ప్రకారము హస్త ప్రయోగము పాపమా?

సమాధానము:
బైబిలు హస్త ప్రయోగము గురించి ఎన్నడు ప్రస్ఫుటముగా ప్రస్తావించదు. అంతేకాదు, అది పాపమో కాదో కూడా పేర్కొనదు. హస్త ప్రయోగము విషయములో లేఖనములనుంచి అతి ఎక్కువగా చూపించబడే భాగము ఆదికాండము 38:9-10 లో వున్న ఓనాను కధాంశము. కొంతమంది భాష్యము ప్రకారము రేతస్సును నేలను విడువుట పాపము . ఏదిఏమైనప్పటికి ఆ వాక్య భాగము వివరిస్తుంది అదికాదు. ఎందుకంటే దేవుడు ఓనాను ఖండించింది రేతస్సును నేలమీద పడవేసినందుకు కాదుగాని తన అన్నకు సంతానము కలిగించుట ద్వారా తన భాధ్యతను నెరవేర్చనందుకు. ఈ వాక్య భాగము హస్త ప్రయోగము గురించి కాదుగాని కుటుంబ భాధ్యతను పరిపూర్ణముచేయుట విషయములో హస్త ప్రయోగము ఋజువు చేయటానికి గాను ప్రయోగించే రెండవ పాఠ్యభాగము మత్తయి 5:27-30. యేసుక్రీస్తు వ్యభిచార తలంపులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ పలికిన మాటలు "నీ కుడిచెయ్యి నిన్నభ్యంతరపరచిన యెడల దాని నరికి నీ యొద్దనుండి పారవేయుము." హస్త ప్రయోగానికి ఈ పాఠ్యాంశములో నున్న విషయాలకు సంభంధమువున్నప్పటికి యేసయ్య హస్త ప్రయోగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు అని అంటానికి అవకాశములేదు.

హస్త ప్రయోగము బైబిలులో ఎక్కడ ప్రస్ఫుటముగా చెప్పకపోయినప్పటికి హస్త ప్రయోగము చేయుటకు దారితీసేపనులు పాపముకాదు అనటానికి లేదు. మోహపు ఆలోచనలు, లైంగిక ప్రేరపణలు, అశల్లీల చిత్రాల ఫలితమే హస్త ప్రయోగము. ఈ సమస్యలను ఖచ్చితంగా ఆలోచించాలి. మోహపు అనైతిక ఆలోచనలను, అశల్లీల చిత్రాలను ప్రక్కకు పెట్టగలిగినట్లయితే హస్త ప్రయోగము సమస్యకానేరదు.

హస్త ప్రయోగము చేసిన చాలామంది అపరాధభావనకు గురిఅవుతారు. అయితే వాస్తవానికి పశ్చాతాప పడాల్సింది ఆ కార్యానికి వుపయోగించిన ప్రక్రియలే. కొన్ని బైబిలు సూత్రాలను లేక నియమాలను, హస్త ప్రయోగము అనే అంశానికి వర్తింపవచ్చు. ఉదా. ఎఫెసీ 5:3 లో " మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయేగాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్దులకు తగినది" మరియు 1 కొరింధి 10:31 "కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి,"అని పేర్కొంటుంది. ఈ క్రియాశీలకమైన పరీక్షను నెగ్గటం అసాధ్యం. బైబిలు భోధిస్తుంది రొమా 14:23 లో "అనుమానించువాడు తినిన యెడల విశ్వాసము లేకుండ తినును, గనుక దోషియని తీర్పునొందును. విశ్వాసమూలము కానిది యేదో అది పాపము." ఏవిషయములోనైన దేవునికి మహమను ఇవ్వలేకపోతే ఆ పనిని చేయకూడదు. ఒక వ్యక్తి ఏ పనైనా పరిపూర్ణంగా దేవునికి ప్రీతికరమనైది అని అనిపించనట్లయితే అది పాపమని గుర్తించాలి. 1 కొరింధి 6:19-20 “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుధ్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ గొప్ప సత్యము మన శరీరము విషయములో తీసుకొనే నిర్ణయంలపై ప్రభావం చూపాలి. ఈ నియమాల వెలుగులో హస్త ప్రయోగము పాపము అని నిర్థారించుట బైబిలు పరమైనదే. స్పష్టముగా హస్త ప్రయోగము దేవునికి మహిమకరమైనది కాదు, అది అవినీతిని వ్యత్యీకరించదు, మరియు దేవుడు మన శరీరాలపై దేవునియొక్క ఆధిపత్యాని చూపడు.