దేవునికి సంభంధించిన ప్రశ్నలు

ప్రశ్న: దేవుడు ఉన్నాడా ? ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఉందా?

సమాధానము:
దేవుడు వున్నాడా? ఈ వాదనకి చాలా ఆసక్తి చూపించబడింది. ఇటీవల చేసిన పరిశోధనలను బట్టి ప్రపంచములోని 90 % ప్రజలు దేవుడు ఉన్నాడని లేదా ఒక మహా శక్తి అని నమ్ముతారు. ఏదైతేనేమి దేవుడున్నాడని నమ్ముతున్నా వాళ్లపై ఇది నిజంగా నిరూపించవలసిన భాద్యత ఉంచబడింది. ఇంకొక రకముగా ఆలోచిస్తే చాలా తర్కముగా అనిపిస్తుంది.

ఏమైనప్పటికి, దేవుడున్నాడని నిరూపించలేము అలా అని లేదని చెప్పలేము. బైబిలు చెప్పినట్లుగా విశ్వాసంతో దేవుడున్నాడన్న నిజాన్ని అంగీకరించాలని, “మరియు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉ౦డుట అసాధ్యమని, దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను” (హెబ్రీ 11.6). దేవుడు తలచుకుంటే ఆయన చాలా సూక్ష్మంగా ప్రపంచం అంతటా ప్రత్యక్షమై తాను ఉన్నాడని నిరూపించుకోగలడు. కానీ ఆయన అది చేస్తే, ఇంక విశ్వాసం యొక్క అవసర౦ లేదు. “యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని” అతనితో చెప్పెను (యోహాను 20.29).

ఏమయినప్పటికీ, దేవుడు ఉన్నాడనుటకు సాక్ష్యము లేదని, అర్థ౦ కాదు. "ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది; అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురి౦చుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఙానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు. మాటలు లేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలమానాలు భూమియందంతట వ్యాపించియున్నది. లోకదిగంతములవరకు వాటి ప్రకటనలు వ్యాప్తి చె౦దియున్నవి” (కీర్తనలు 19: 1-4) నక్షత్రములను చూసినపుడు, విశాలమైన ఈ విశ్వాన్ని పరిశీలి౦చినపుడు, ప్రకృతి యొక్క అద్భుతాలను గమనించినపుడు సూర్యాస్తమయ అందాలను చూసినపుడు—ఇవన్నీ సృష్టి కర్త అయిన దేవుని సూచిస్తాయి. ఇవి కూడ చాలవు అనుకుంటే మనందరి హృదయాలలో దేవుడు ఉన్నారన్న సాక్ష్యం ఉ౦ది. ప్రసంగి (3.11) లో చెప్పినట్లుగా, ...“ఆయన శాశ్వత కాల జ్ఙానమును నరుల హృదయములో ఉ౦చి వున్నాడు…”. చాలా లోతుగా గుర్తిస్తే, ఈ జీవితం వెనుక ఏదో వుంది, మరియు ఈ ప్రపంచము వెనుక ఎవరో వున్నారు. మనము ఈ సమాచారాన్ని అర్థ౦ లేదని కొట్టివేసినా కాని, దేవుని సన్నిధి మనతో మరియు మన ద్వారా ఇ౦కా వుంది. ఇంకా దేవుడు లేడని ప్రక్కకి తోసివేసే వారితో (కీర్తన 14.1) లో చెప్పినట్లుగా “దేవుడు లేడని బుధ్ధిహీనులు, తమ హృదయములో అనుకుందురు”. 98 % పైగా ప్రజలు చరిత్ర, సంస్కృతి, నాగరికత, కల అన్ని ఖండాల వారు నమ్మేదేమిటంటే దేవుడువున్నాడని, ఈ నమ్మకము వెనుక ఏదో ఉ౦ది (లేదా ఎవరో ) ఉన్నారని.

బైబిలు వాదనల ప్రకారము దేవుడున్నాడని చూస్తే, తర్కపరమైన వాదనలు ఉన్నాయి. ప్రథమముగా, తర్కవిభేదమైన వాదము కలదు. ఈ తర్క విభేదానికి ముఖ్య అంశం ఏమిటంటే దేవుడున్నాడని నిరూపించటం. “ఆయనను మించిన మరే శక్తి లేదని” నిరూపించటంతో దేవుని గూర్చిన నిర్వచనం మొదలవుతుంది. ఈ వాదన ఎలా వుంటుందంటే ఆయన ఉనికి కన్నా ఇంకొక గొప్ప ఉనికి ఉందంటే అది ఎంత గొప్పదో బయటపడాలి. ఒకవేళ దేవుడు లేనట్లయితే ఆయన ఒక గొప్ప చలించే వ్యక్తి కాకపొతే దేవుని యొక్క ప్రతి నిర్వచనము విరుద్ధమైపోతుంది. రెండవది సరియైన వాదన ఏమిటంటే ఖచ్చితంగా ఈ విశ్వ సృష్టి వెనుక ఒక అద్భుతమైన దైవిక సృష్టి కర్త ఉన్నారని. ఉదాహరణకి భూమి సూర్యుడికి కొన్ని వందల మైళ్ళ దగ్గరగా గాని, లేదా దూరంగా ఉన్నట్లయితే , ప్రస్తుతం ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తిని కలిగి ఉ౦డేది కాదు. వాతావరణములో ఉన్న అణువులలో కనుక కొంచెం మార్పు ఉన్నట్లయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి చనిపోయి ఉ౦డేది. 10,243 లో ఒక్క దానికే ప్రోటీన్ కణము అయ్యే అవకాశాలు ఉన్నాయి (2430 నుండి 10 వస్తాయి). ఒక్క కణము కొన్ని మిలియన్ల ప్రోటీన్ కణాలను కలిగి ఉంటుంది.

దేవుని ఉనికిని గూర్చిన మూడవ తర్కవాదన జగత్సంబంధమైన వాదన. ప్రతి పరిణామము వెనుక ఒక కారణము ఉ౦టుంది. ఈ విశ్వము మరియు సమస్తము ఒక ఏర్పాటే. ప్రతీది బయటకు అనగా ఉనికి లోనికి రావటానికి ఖచ్చితంగా ఏదో ఒక కారణము ఉ౦డే ఉ౦టుంది. చిట్టచివరిగా చెప్పేదేమిటంటే సమస్తము ఉనికి లోనికి రావటానికి ఏదో తెలియని కారణము ఖచ్చితంగా ఉ౦డే ఉ౦టుంది. ఆ “తెలియని కారణమే” దేవుడు. నాల్గవ వాదన నీతి పరమైన వాదన. ప్రతి సంస్కృతి చరిత్ర అంతా ఒక విధమైన ధర్మశాస్త్రము తో ఏర్పాటయింది. ప్రతి మనిషికి మంచి, చెడు విచక్షణ కలవు. హత్య, అసత్యమాడటం, దొంగతనం మరియు అనైతికం వీటన్నిటిని విశ్వమంతా ఎప్పుడో త్రోసివేసింది. మరి పరిశుడైద్ధున దేవుని నుండి కాకపోతే మరి ఈ మంచి చెడు విచక్షణా జ్ఙానము ఎక్కడనుండి వచ్చాయి. వీటన్నిటిని ప్రక్కకు త్రోసివేసి, బైబిలు ఏం చెపుతుందంటే ప్రజలు సృష్టి౦చినవాటిని

మరియు ఉపేక్షించటానికి వీలు లేని దేవుని జ్ఙానమును నమ్మటానికి బదులు అసత్యమును నమ్మరు. రోమా 1:25 లో చెప్పినట్లుగా “దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, మరియు సృష్టికర్తకు ప్రతిగా సృష్టి౦చినవాటిని

పూజించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్”. బైబిల్ ఇంకా ఏమని ప్రకటిస్తుందంటే (రోమా 1:20) “ప్రజలు ఏ సాకు లేకుండా దేవుని నమ్మటానికి బదులు—ఆయన అదృశ్య లక్షణములు,నిత్యశక్తియు, దైవత్వమును, స్పష్టముగా చూసి కూడ, ఎలా సృష్టించబడినవో అర్థము చేసుకుని కూడ నమ్మలేకున్నారు”.

ప్రజలు దేవుని యందు నమ్మకము లేదని చెప్పటానికి “శాస్త్రీయమైన” లేదా “సరియైన ఆధారము” లేక కాదు. నిజమైన కారణము ఏమిటంటే ఒకసారి దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నపుడు ఆయన ఇచ్చు అవసరమైన క్షమాపణ కొరకు ఆయన పట్ల బాధ్యులై ఉ౦డవలెనని గుర్తించాలి అనగా ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉ౦డాలి. (రోమా 3:23; 6:23). దేవుడు వున్నట్లయితే, మన క్రియల విషయమై మనము లెక్క అప్పచెప్పవలసినవారమై ఉన్నాము. ఒకవేళ దేవుడు లేనట్లయితే తీర్పు వస్తుందన్న చింత లేక మన ఇష్టానుసారంగా మనం చేయవచ్చు. సృష్టికర్తయిన దేవుడిని నమ్మటం అనే ప్రత్యామ్నాయాన్ని ఇవ్వటానికి –మన సమాజంలో ఈ పరిణామము బలంగా పట్టుకుని వుంది. దేవుడు ఉన్నాడు మరియు ఆఖరికి ప్రతిఒక్కరికి తెలుసు ఆయన ఉన్నాడని. నిజమేమిటంటే కొంతమంది చాలా వాదనలతో కలహించి చివరకి ఆయన ఉన్నారన్న నిజాన్ని నిరూపించలేకపోయారు.

చివరగా దేవుడున్నాడని ఒకే ఒక వాదన వుంది. ఆయన ఉన్నాడని ఎలా తెలుస్తుంది? క్రైస్తవులుగా మనకి తెలుసు ఆయన ఉన్నాడని, ఎందుకంటే మనం ప్రతిరోజూ ఆయనతో మాట్లాడుతాం కాబట్టి. మనం ఆయన తిరిగి మాట్లాడటం వినకపోవచ్చు, కాని ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం, ఆయన నడిపించే అనుభూతి చెందుతున్నాం, మనకు ఆయన ప్రేమతెలుసు, ఆయన కృపను కోరుకుంటున్నాం. మన జీవితంలో ఎన్ని విషయాలు ఉన్నా దేవుని కంటే ఎక్కువగా చెప్పటానికి మనదగ్గర ఏ ఇతర వివరణ లేదు. దేవుడు మనలను ఎంతో అద్భుతంగా రక్షించి మరియు మన జీవితాలను మార్చిన దానికి మనం ఆయనను అనుసరిస్తూ, ఆయన ఉనికిని స్తుతించటం తప్ప మనం ఏమి చేయలేము. ఈ వాదనలలో ఏ ఒక్కటీ వారిని కాని ఇతరులను కాని ఇంత స్పష్టముగా ఉన్నదానిని అనుసరి౦చటం ఎవరూ తప్పించలేరు. చివరికి దేవుని ఉనికిని విశ్వాసంతోనే అంగీకరించాలి. (హెబ్రీ 11.6). విశ్వాసం అనేది గుడ్డిగా చీకటిలోకి గంతు వేయటం కాదు, ఎక్కడ అప్పటికే 90 % ప్రజలు నిలబడి బాగా వెలిగించబడి ఉన్న గదిలోకి సురక్షితముగా అడుగుపెట్టటం.


ప్రశ్న: దేవుడు సత్యమైనవాడా? దేవుడు సత్యమైనవాడని నేను నిశ్చయంగా ఎలా తెలుసుకోగలను?

సమాధానము:
దేవుడు తన్ని తాను మనకి మూడు విధానాల్లో వెల్లడిపరిచినందువల్ల ఆయన నిజమైనవాడని మనకి తెలుసుః సృష్టియందు, ఆయన వాక్యంయందు మరియు ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు. దేవుని ఉనికి యొక్క అతి ప్రాధమికమయిన సాక్ష్యం ఆయన చేసినది మాత్రమే.

“ఆయన అదృశ్యలక్షణములను, అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తురులై యున్నారు” (రోమీయులు 1:20). “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” (కీర్తన 19:1).

ఒక పొలం మధ్యలోకనుక, నేను ఒక చేతి గడియారాన్ని చూస్తే, అది ఎక్కడినుండో “ప్రత్యక్ష్యమైయిందని కానీ, లేక అది అక్కడే ఎప్పుడూ ఉందనికానీ నేను అనుకోను. ఆ గడియారపు రూపకల్పన మీదన ఆధారపడి, దానికి ఒక రూపకర్త ఉన్నాడని నేను అనుకుంటాను. కానీ, లోకంలో మన చుట్టుపట్ల చాలా ఎక్కువ రూపకల్పనా మరియు ఖండితం ఉన్నాయి. కాలం యొక్క మన కొలత, చేతి గడియారాలపైన ఆధారపడదు కానీ దేవుని చేతిపని పైన ఆధారపడి ఉంది- భూమి యొక్క నియమానుసారమైన భ్రమణము ( మరియు సెసిమ్ -133 ఏటమ్ యొక్క వికిరణోత్తేజిత రసాయన లక్షణాలు). జగత్తు గొప్ప విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది మరియు ఇది ఒక రూపకర్తకోసం వాదిస్తుంది.

నాకు కనుక రహస్యలిపిలో ఉన్న ఒక సందేశం కనిపిస్తే, ఆ లిపిని విడగొట్టడానికి సహాయపడేటందుకు నేను ఒక గుప్తభాష నిపుణిని కోసం శోధిస్తాను. ఆ లిపిని సృష్టించి, సందేశాన్ని పంపించిన ఒక మేధావి ఉన్నాడన్నది నా తలంపు అవుతుంది. మనం మన శరీరాలలో ఉన్న ప్రతి జీవకణంలో మోసే “డిఎన్‌యే” కోడ్ ఎంత క్లిష్టమైనది? డిఎన్‌యే యొక్క జటిలత్వం మరియు ఉద్దేశ్యం, రహస్యలిపి యొక్క మేధావి అయిన ఒక లేఖకునికోసం వాదించదా?

దేవుడు ఒక జటిలమైన మరియు చక్కగా శృతి చేయబడిన భౌతికమైన లోకాన్ని సృష్టించడమేకాక; ఆయన ప్రతి వ్యక్తి హృదయంలో ఒక నిత్యత్వపు భావనని స్థిరపరిచేడు ( ప్రసంగి 3:11). కంటికి కనిపించేదానికన్నా జీవితంలో ఎక్కువ ఉందని, ఈ ఐహికమైన క్రమణికకన్నా ఎక్కువ ఉన్నతమైన ఒక ఉనికి ఉందని, మానవజాతికి ఒక అంతర్లీనమైన గ్రాహ్యత ఉంది. మన నిత్యత్వపు ఇంద్రియజ్ఞానం కనీసం రెండు విధాల్లో ప్రత్యక్ష్యపరచబడుతుంది: ధర్మశాస్త్రానికి ఆకారాన్ని ఇవ్వడం మరియు ఆరాధన.

చరిత్రంతటా ప్రతి శిష్టతా కొన్ని నైతికమైన ధర్మశాస్త్రాలకి విలువనిచ్చింది. అవి ఆశ్చర్యకరంగా సంస్కృతికీ సంస్కృతికీ తుల్యమైనవే. ఉదాహరణకి, ప్రేమ అన్న భావం సర్వత్ర గుణ్యమైనది, అయితే అబద్ధం పలకడం అన్న చర్య సర్వత్ర దండనకి అర్హమైనది. ఈ సామాన్యమయిన నీతి- మంచి చెడుల ఈ వసుదైక నీతి- మనకి ఇటువంటి ధర్మాధర్మ శంకలని ఇచ్చిన సర్వశ్రేష్టుడైన, నైతికమైన జీవిని సూచిస్తుంది.

అదేవిధంగా, లోకమంతటా ఉన్న మనుష్యులు, సంస్కృతితో ఏ సంబంధం లేకుండా ఆరాధన యొక్క ఒక పద్ధతిని ఎప్పుడూ అవలంబించుకున్నారు. ఆరాధన యొక్క విషయం మారవచ్చు, కానీ “ అధికోన్నతమైన శక్తి” యొక్క భావం మానవుడు అవడానికి ఒక నిరాకరించలేని భాగం. ఆరాధించే ఇచ్ఛ దేవుడు మనలని “తన స్వరూపమున” సృష్టించేడన్న” (ఆదికాండం 1:27) సత్యంతో ఏకీభవిస్తుంది.

దేవుడు తన్ను తాను మనకి తన వాక్యం అయిన బైబిల్ ద్వారా వెల్లడిపరచుకున్నాడు. లేకఖనమంతటిలో ఆ దేవుని యొక్క ఉనికి ఒక స్వయంవిదితం అయిన సత్యంగా చూడబడింది( ఆదికాండము 1:1; నిర్గమకాండము 3:14). బెంన్జామిన్ ఫ్రేంక్లిన్ తన ఆత్మకథ రాసినప్పుడు, అతను తన ఉనికిని నిరూపించుకోవడంలో సమయాన్ని వ్యర్థం చేయలేదు. అదేవిధంగా, దేవుడు ఆయన గ్రంధంలో తన ఉనికిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ, ఎక్కువ సమయాన్ని వెచ్చించలేదు. బైబిల్ యొక్క జీవితం- మార్చే స్వభావం, తమ న్యాయవర్తన మరియు దాని రాతలని అనుసరించిన అద్భుతాలు ఎక్కువ సమీపంగా ఉండే చూపుకి అధికారాన్ని కలుగజేయటానికి తగినంతది.

దేవుడు తన్ను తాను వెల్లడిపరచుకున్నది తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ( యోహాను 14:6-1). “ ఆదియందు వాక్యముండెను మరియు వాక్యము దేవుడాయెను. వాక్యం శరీరధారియై మన మధ్య నివసించెను. ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది( కొలొస్సయులు 2:9).

యేసు యొక్క అద్భుతమైన జీవితంలో, ఆయన పాతనిబంధన యొక్క ధర్మశాస్త్రాలని పరిపూర్ణంగా గైకొని, అభిశక్తునికి సంబంధించిన (మత్తయి 5:7) ప్రవచింపులనన్నిటిని నెరవేర్చేడు (మత్తయి 5:17). ఆయన తన సందేశాన్ని ప్రమాణపూర్వకంగా సిద్ధిపరచడానికి మరియు తన దైవానికి సాక్ష్యమివ్వడానికీ లెక్కలేనన్ని కృపగల మరియు బాహాటమైన అద్భుతాలని చేసేడు( యోహాను 21:24-25). అటుపిమ్మట ఆయన శూలారోపణ యొక్క మూడుదినాల పిమ్మట ఆయన మృతులలోనుండి లేచేడు. ఆ సంగతి కండ్లారా చూసిన సాక్ష్యులవల్ల ధృవీకరించబడింది. యేసు ఎవరో అన్న సాక్ష్యాలు చారిత్రిక దస్తావేజులో విస్తారంగా ఉన్నాయి. అపొస్తలు పౌలు చెప్పినట్టు ఈ సంగతి “మరుగైయుండలేదు” (అపొస్తుల కార్యములు 26:26).

దేవుని గురించి తమ స్వంత అభిప్రాయాలుండే నిత్యశంకితులు ఎప్పుడూ ఉంటూ ఉంటారని మరియు వారు దాని ప్రకారమే సాక్ష్యాన్ని చదువుతారని మనం గుర్తిస్తాం. మరియు కొంతమందిని ఎంత సాక్ష్యమైనా సరే, ఒప్పించలేదు( కీర్తన 14:1). ఇదంతా ఆఖరికి విశ్వాసమే( హెబ్రీయులు 11:6).


ప్రశ్న: దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?

సమాధానము:
మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస్తారేమో. బైబిల్ యొక్క అధికారం లేకుండా, ఈ వాక్యాల యొక్క సంగ్రహం ఒక మనిషి యొక్క అభిప్రాయం కన్నా ఎక్కువ బృహత్తరమైనదేమీ కాదు కనుక, లేఖనాల ఉపప్రమాణాలు సంపూర్ణముగా అవసరం. మనిషి అభిప్రాయం తనంతట తానే దేవుని గురించి అర్థం చేసుకోవడంలో తరచుగా సరికానిది ( యోబు 42:7). మనకి దేవుని స్వభావాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమైనదని చెప్పడం ఒక పెద్ద మాట. అలా చేయలేకపోవటం వల్ల మనం ఆయన చిత్తానికి ప్రతికూలంగా, అబద్ధపు దేవుళ్ళను ఆరాధించి, వెంబడించేలా చేయగల సంభవనీయత ఉంది (నిర్గమకాండము 20:3-5).

దేవుడు తనను గురించి వెల్లడించదలచుకున్నది మాత్రమే తెలియబడుతుంది. దేవుని యొక్క గుణాల్లో లేక లక్షణాలలో “వెలుగు” అంటే అర్థం ఆయన తన గురించిన సమాచారమును తానే వెల్లడిపరచుకుంటున్నాడని (యెషయా 60:19), (యాకోబు 1:17). ఆయన యొక్క విశ్రాంతిలో మనలో ఒక్కడైనను ప్రవేశించకుండా, ఆయన తన గురించిన పరిజ్ఞానాన్ని తానే వెల్లడిపరిచేడన్న సత్యం నిర్లక్ష్యపెట్టబడకూడదు ( హెబ్రీయులు 4:1). సృష్టి అయిన బైబిల్ మరియు శరీరధారియైన వాక్యం (యేసుక్రీస్తు) దేవుడు ఎటువంటివాడో అని అర్థం చేసుకోవడానికి మనకి సహాయపడతాయి.

దేవుడు మన సృష్టికర్త అనీ మరియు మనం ఆయన సృష్టి యొక్క ఒక భాగం అని అర్హం చేసుకోవడంతో మనం ప్రారంభిద్దాం (ఆదికాండం 1:1 మరియు కీర్తనలు 24:1). మనిషి తన ప్రతిరూపంలో సృజింపబడ్డాడని దేవుడు చెప్పేడు. మనిషి మిగతా సృష్టికి అతీతం మరియు దానిమీద అధికారం మానవునికి ఇవ్వబడింది (ఆదికాండం 1:26-28). సృష్టి "పతనం"తో దెబ్బతిన్నా కానీ అది ఆయన క్రియ యొక్క ఒక ఈషద్దర్శనాన్ని మనకి ఇస్తుంది ( ఆదికాండము 3:17-18, రోమీయులు 1:19-20). సృష్టి యొక్క విశాలతను, జటిలత్వాన్ని, సౌందర్యాన్ని మరియు క్రమాన్ని చూస్తే భగవంతుని గురించి భయభక్తులు కలుగవచ్చు.

దేవుడు ఎటువంటివాడన్న మన శోధనకి సహాయం చేయడానికి, దేవుని కొన్ని నామములను చదవడం మనకి సహాయపడగలదు. అవి ఇలా ఉన్నాయిః

ఏలోయీము -ధృడమైనవాడు, దివ్యమైనవాడు( ఆదికాండము 1:1).
ఏదోనయి - ప్రభువు, యజమాని మరియు సేవకుని సంబంధాన్ని సూచించేది (నిర్గమకాండము 4:10,13).
ఎల్ ఎల్యోను - సర్వోన్నతుడు, అతి శక్తిమంతుడు
ఎల్ రోయి - చూచుచున్న శక్తిమంతుడు (ఆదికాండము 16:13)
ఎల్ షద్దయి - సర్వశక్తి గల దేవుడు (ఆదికాండము 17:1)
ఎల్ ఓలాము - నిత్య్డమగు దేవుడు (యెషయా 40:28)
యాహ్వే - దేవుడు “నేను ఉన్నవాడను” -అంటే బాహ్యమై ఉండునను దేవుడు (నిర్గమకాండము 3:13-14).

ఇప్పుడు మనం దేవుని మరిన్ని లక్షణాలని పరిశీలించడం కొనసాగిద్దాం: దేవుడు నిత్యమైనవాడు. అంటే అర్థం ఆయనకి ఏ ప్రారంభం లేదు మరియు ఆయన ఉనికి ఎప్పుడు అంతం అవదు ఆయన అమర్త్యుడు, అనంతమైనవాడు ( ద్వితీయోపదేశకాండము 33:27, కీర్తన 90:2, 1 తిమోతి 1:17). దేవుడు నిర్వికారుడు, అంటే అర్థం ఆయన నిర్వ్యత్యాసమైనవాడు; అంటే దేవుడు శుద్ధముగా ఆధారపడతగినవాడు మరియు నమ్మతగినవాడు(మలాకి 3:6 ; సంఖ్యాకాండము 23:19; కీర్తన 102:;26,27). ఆయన సాటిలేనివాడు, అంటే ఎవరూ ఆయనవలె క్రియల్లోకాని లేక ఉనికిలోకాని ఉండలేరని అర్థం; ఆయన అసమానమైనవాడు మరియు పరిపూర్ణుడు ( 2 సమూయేలు 7:22; కీర్తన 86:8, యెషయా 40:25; మత్తయి 5:48); దేవుడు రహస్యస్వరూపుడు, అంటే గూఢమైనవాడు, అననేష్వణీయమైనవాడు. ఆయన జ్ణానమును శోధించుట అసాధ్యము( యెషయా 40:28; కీర్తన 145:3; రోమీయులు 11:33,34).

దేవుడు న్యాయస్థుడు; ఆయన పక్షపాతి కాడు అన్న భావంలో (ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 18:30) ఆయన మనుష్యులను లక్ష్యపెట్టేవాడు కాదు. “ఆయన శర్వశక్తి సంపన్నుడు అంటే ఆయన శక్తిమంతుడు. ” తనకి ఇష్టమున్నదేదైనా ఆయన చేయగలడు, కానీ ఆయన క్రియలెప్పుడూ ఆయన స్వభావం ప్రకారం ఉంటాయి (ప్రకటన 19:6), యిర్మీయా 32:17, 27). ఆయన సర్వవ్యాపకుడు, ప్రతి చోటా ఎప్పుడూ ఉండేవాడని అర్థం; కానీ దేవుడే ప్రతీదీ అని దీని అర్థం కాదు (కీర్తన 139:7-13; యిర్మీయా 23:23). దేవుడు సర్వజ్ఞుడు- అంటే ఆయనకి గతం, వర్తమానం మరియు భవిష్యత్తు తెలియడమేకాక మనం ఎప్పుడు, ఏమిటి ఆలోచిస్తూ ఉంటామో అని కూడా ఆయనకి తెలుసు. ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు కనుక ఆయన న్యాయం కూడా ఎల్లప్పుడూ సబబుగానే నడుస్తుంది (కీర్తన 139:1-5, సామెతలు 5:21).

దేవుడు ఒక్కడే. అంటే, ఇంకెవరూ లేరనే కాక మన హృదయపు అంతరంగాల యొక్క అవసరాలు మరియు వాంఛలని నెరవేర్చేవాడు ఆయన ఒక్కడే మరియు ఆయన ఒక్కడు మాత్రమే మన ఆరాధనకి మరియు నిరత్యతకి యోగ్యుడు(ద్వితీయోపదేశకాండము 6:4). దేవుడు నీతిమంతుడు అంటే దేవుడు తప్పులని క్షమించడు మరియు క్షమించజాలడు. మన పాపాలు ఆయనపైన మోపబడినప్పుడు మన పాపాలు క్షమించబడటానికి ఆయన నీతి మరియు న్యాయం వలన యేసు దేవుని తీర్పుని అనుభవించవలిసి వచ్చింది (నిర్గమకాండము 9:27; మత్తయి 27:45-46; రోమీయులు 3:21-26).

దేవుడు సర్వాధికారి, అంటే ఆయన సర్వశ్రేష్టుడు. తెలిసీ, తెలియకా కూడా, ఆయన సృష్టి సమస్తం కలిపికూడా ఆయన ఉద్దేశ్యాలని అడ్డగించలేదు. (కీర్తన 93:1, యిర్మీయా 23:20). దేవుడు, అంటే ఆయన అగోచరమయేవాడు ( యోహాను 1:18, 4:24). ఆయన త్రిత్వము. అంటే ఆయన ఒకరిలో ముగ్గురు అని- సారములో ఒకటే, శక్తి మరియు మహిమయందు సమానమే అనీ. ప్రధమ లేఖనము ఉదహరించబడినప్పుడు అది, “ తండ్రి, కుమారుడు మరియ పరిశుద్ధాత్మ” అన్న ముగ్గురు భిన్నమైన వ్యక్తిత్వాలని ఉదహరించినప్పటికీ , ఆ “నామము” ఏకవచనంలో ఉంది ( మత్తయి 28:19, మార్కు 1:9-11). దేవుడే సతము, అంటే ఆయన ఉనికికంతా ఆయన ఏకీభావాన్ని కలిగి ఉండి ఆయన అనశ్వరమైనవానిగా ఉండి అబద్ధాలు పలకలేడని అర్థం( కీర్తన 117: 2, 1 సమూయేలు 15:29).

దేవుడు పరిశుద్ధుడు-అంటే ఆయన నైతికంగా, అపవిత్రతనుండి వేరు చేయబడ్డాడని మరియు దానికి విరుద్ధమైనవాడని అర్థం. దేవుడు కీడునంతా చూస్తాడు మరియు అది ఆయనకి కోపాన్ని రప్పిస్తుందిః సామాన్యంగా పవిత్రతతోపాటు లేఖనంలో అగ్ని ఉదహరించబడుతుంది. దేవుడు దహించు అగ్నివలె చెప్పబడతాడు( యెషయా 6:3 ; హబక్కూకు 1:13; నిర్గమకాండము 3:2, 4,5; హెబ్రీయులు 12:29). దేవుడు దయాళువు-దీనిలో ఆయన మంచితనం, కృప, దయ మరియు ప్రేమ చేర్చబడి ఉన్నాయి- అవి ఆయన మంచితనానికి అర్థాల యొక్క లేశాలని అందించే పదాలు. అది కనుక దేవుని మహిమ వల్ల కాకపోతే, ఆయన యొక్క ఇతర లక్షణాలు ఆయన్నుంచి మనలని మినహాయించి పెడతాయి. కృతజ్ఞతాపూర్వకంగా, ఆయనకి మనలో ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా తెలుసుకునే ఇచ్ఛ ఉంది కనుక సంగతి అది కాదు( నిర్గమకాండము 34:6, కీర్తన 31:19, 1 పేతురు 1:3; యోహాను 3:16; యోహాను 17: 3).

ఒక దేవుని మహత్తైన ప్రశ్నకి సమాధానం చెప్పే ఒక సాత్వికమైన ప్రయత్నం ఇది. దయచేసి ఆయన్ని శోధించడం కొనసాగించడంలో గొప్పగా ప్రోత్సాహాన్ని పొందండి.


ప్రశ్న: బైబిలు త్రిత్వము గురించి ఏమి భోధిస్తుంది?

సమాధానము:
క్రైస్తవ అంశమైన త్రిత్వములో అతి కష్టమైనది దాన్ని సమగ్రవంతంగా వివరించలేకపోవటమే. “త్రిత్వము” అనే అంశం అర్థం చేసుకోడానికి చాల కష్టం. దేవుడు అపరిమితముగా ఉన్నతమైనవాడు గొప్పవాడు, కాబట్టి ఆయనను పరిపూర్ణముగా అవగాహన చేసుకోగలం అని అనికూడ అనుకోవద్దు. క్రీస్తు దేవుడని, తండ్రి దేవుడని పరిశుధ్దాత్ముడు దేవుడని బైబిలు భోధిస్తుంది. దేవుడు ఒక్కడే అనికూడా భోధిస్తుంది. త్రిత్వ దేవునిలో వ్యక్తులమధ్య సంభాందాన్నికి ఋజువులున్నప్పటికి మానవ మనస్సుకు అది గ్రహింపశక్యముకానిది. ఏదిఏమైనప్పటికి దీనిని బట్టి “త్రిత్వము” వాస్తవము కాదని, బైబిలు భోధనకాదని అనలేము.

ఒక్కదేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో వుండుటయే త్రిత్వము. దీని అర్థం ముగ్గురుదేవుళ్ళున్నారని ప్రతి పాదించటంకాదు. త్రిత్వము అన్న పదం లేఖనములో లేదన్న విషయము ఈ అంశం అధ్యయనం చేసేటప్పుడు మనస్సులోనుంచుకోవాలి. త్రియేకదేవుని వివరించటానికి ఉపయోగించినపదమిది. ముగ్గురు ఒకేసారి ఉనికిలో వున్నవారు. నిత్యులైన వ్యక్తులు దైవత్వమైయున్నారు. వాస్తవము ఏంటంటే త్రిత్వము అనే అంశానికి సంబంధించిన వివరాలు లేఖనాలలో వున్నాయి. త్రిత్వము గురించి బైబిలు భోధిస్తున్న కొన్ని విషయాలు.

1). దేవుడు అద్వితీయుడు- ఏకమై యున్నావాడు (ద్వితియోపదేశకాండం 6:4; 1 కొరింథి 8:4; గలతీయులకు 3:20; 1 తిమోతి 2:5).

2). త్రిత్వములో ముగ్గురు వ్యక్తులున్నారు (ఆదికాండము 1:1, 26; 3:22; 11:7; యెషయా 6:8, 48:16, 61:1; మత్తయి 3:16-17, 28:19; 2 కొరింథీయులకు 13:14). ఆదికాండము 1:1 లో "ఎలోహీమ్" అన్న హీబ్రూ పదము దేవుడు బహుళ పదమునకు వుపయోగించింది. ఆదికాండము లో 1:26, 3:22, 11:7 మరియు యెషయా లో 6:8, బహుళ సర్వ నామము "మన" వుపయోగించారు. ఎలోహీం సర్వ నామము, ఈ రెండు బహుళ పదాలు. ఇవి ఖచ్చితముగా భాషలో ఒకటికంటె ఎక్కువమందిని సూచిస్తుంది. ఈ వాదన త్రిత్వాన్నికి ఋజువు కాదు గాని దేవునిలోని బహుళత్వాన్ని మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది. దేవుడు హీబ్రులో ఎలోహీం, ఖచ్చితంగా త్రిత్వాన్నికి చోటిస్తుంది.

యెషయా 48: కుమారుడు తండ్రి గురించి, పరిశుధ్దాత్ముని గురించి మాట్లాడాడు. యెషయ 61: 1 వచనమును లూకా 4:14-19 ను పోల్చినట్లయితే కుమారుడే మాట్లాడినట్లు గనించగలము. యేసుక్రీస్తు బాప్తీస్మము గురించి వివరించే భాగం మత్తయి 3:16-17. ఈ భాగంలో కుమారుడైన దేవుని మీద పరిశుధ్దాత్ముడైన దేవుడు దిగరావటం, కుమారుడైన దేవునియందు తండ్రియైన ధేవుడు ఆనందిస్తున్నాడని చెప్పటం గమనించగలం. మత్తయి 28:11; 1 కొరింథీ 12:14 లో త్రిత్వములో ముగ్గురు వ్యక్తులున్నారనటానికి చక్కని ఉదాహరణ.

3). త్రిత్వములోని సభ్యులను వేరువేరుగా చూపించేటటువంటి వాక్యాభాగాలున్నాయి. పాతనిబంధనలో "ప్రభువును" "యెహోవా" కు వేరువేరుగా చూపించారు (ఆదికాండం 19:24; హోషేయా 1:4). ప్రభువు కుమారుని కనెను (కీర్తన 2:7, 12; సామెతలు 30:2-4). ఆత్మను "యెహోవాను" (సంఖ్యాకాండము 27:18) "ప్రభువైన దేవుడ్ని" (కీర్తన 51:10-12)వేరువేరుగా చూపించారు. తండ్రిదేవుడు, కుమారుడైన దేవుడు వేరువేరుగా నున్నది(కీర్తన 45:6-7; హెబ్రీయులకు 1:8-9). క్రొత్తనిబంధనలో తండ్రినుండి ఆదరణకర్తను, పరిశుధ్దాత్ముని పంపిస్తానని (యోహాను 14:16-17) యేసయ్య చెప్పాడు. దీనిని బట్టి యేసయ్య తాను తండ్రికాడని, పరిశుధ్దాత్ముడు కాడని స్పష్టంచేస్తున్నాడు. సువార్త పాఠ్యభాగలలో యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడిన సంధర్భాలన్ని గమనించాలి. యేసయ్య తనతో తానే మాట్లాడుకొంటున్నడా? లేదు. త్రిత్వములోని మరొక వ్యక్తియైన తండ్రితో మాట్లాడుతున్నాడా?

4). త్రిత్వములోనున్న ప్రతీ వ్యక్తి దేవుడు (యోహాను 6:27; రోమా 1:7; 1పేతురు 1:2). కుమారుడైన దేవుడు (యోహాను 1:1, 14; రోమా 9:5; కొలస్సీయులకు 2:9; హెబ్రీయులకు 1:8; 1 యోహాను 5:20). పరిశుధ్దాత్ముడైన దేవుడు (అపోస్తలుల కార్యములు 5:3-4; 1 కొరింథీయులకు 3:16).

5). త్రిత్వములో ఒకరిమీద మరొకరు ఆధారపడియుంటారు. లేఖనములు చూపించుచున్నట్లుగా పరిశుధ్ధాత్ముడు తండ్రికి, కుమారునికి మరియు కుమారుడు తండ్రికి విధేయులు. ఇది అంతర్గత సంభంధమే కాని త్రిత్వములో ఏ ఒక్క వ్యక్తికి దైవత్వమును లేదనకూడదు. పరిమిత మనస్సు కలిగిన మనము అనంతుడైన దేవునిని ఈ విషయములో అవగాహన చేసుకొనుట అసాధ్యము. కుమారుని విషయములో పరిశుధ్ధాత్ముని విషయములో ఈ లేఖన భాగాలలో లూకా 22:42, యోహాను 5:36, యోహాను 20:21, మరియు 1 యోహాను 4:14. పరిశుధ్ధాత్ముని గురించి యోహాను 14:16, 14:26, 15:26, 16:7, మరియు ప్రత్యేకముగా యోహాను 16:13-14 గమనించండి.

6). త్రిత్వములోని సభ్యులకు వేరువేరు భాధ్యతలున్నాయి. తండ్రి అంతిమ విశ్వాసమునకు అంతిమ కారకుడు, లేక ఆధారము((1 కొరింథీయులకు 8:6; ప్రకటన 4:11); దైవిక ప్రత్యక్షత (ప్రకటన 1:1); రక్షణ (యోహాను 3:16-17); మరియు యేసుక్రీస్తు మానవ చర్యలు(యోహాను 5:17, 14:10). తండ్రి ఈ విషయములన్నిటిలో చొరవ తీసుకుంటాడు.

పరిశుధ్ధాత్ము తండ్రి ప్రతినిధిగా ఈ కార్యములను నిర్వర్తిస్తున్నాడు. విశ్వాన్ని సృష్టించడం, కొనసాగించటం (ఆదికాండము 1:2; యోబు 26:13; కీర్తన 104:30); దైవిక ప్రత్యక్షత (యోహాను 16:12-15; ఎఫెసీయులకు 3:5; 2 పేతురు 1:21); రక్షణ (యోహాను3:6; తీతుకు 3:5; 1 పేతురు 1:2); మరియు యేసుక్రీస్తు క్రియలు(యెషయా 61:1; అపోస్తలుల కార్యములు 10:38). తండ్రి పరిశుధ్ధాత్ముని శక్తి ద్వారా ఈ కార్యములన్ని తలపెడ్తాడు.

త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి పలువిధములైన ఉపమానములను ప్రయత్నించటమైనది. అయితే అందులో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణముగా సరితూగేదికాదు. గుడ్డును ఉదాహరణ తీసుకోవటం సరిపోదు. ఎందుకంటె పసుపు, తెల్లసొన, డొల్ల, గుడ్డులోని భాగాలే గాని అవి పరిపూర్ణంగా గుడ్డు కాదు. ఏపిల్ కాయ కూడా అదే విధంగా సరియైన ఉదాహరణ కాదు. ఎందుకంటె తోలు, గుజ్జు, విత్తనము భాగాలేగాని కాయ కాదు కాబట్టి. తండ్రి కుమార పరిశుధ్ధాత్ములు దేవునిలోని భాగాలు కాదు. ప్రతి ఒక్కరూ దైవమై యున్నారు. నీటిని ఉదాహరణగా తీసుకోవటం కొంతవరకు సబబే గాని అది కూడా సమగ్రవంతంగా త్రిత్వాన్ని వివరించలేదు. ఎందుకంటె ద్రవ పదార్థములోనునున్న నీరు, ఘన పదార్థములోనునున్న ఐస్, వాయు పదార్థములోనునున్న ఆవిరి నీటి యొక్క రూపము మాత్రమే. కాబట్టి ఈ ఉపమానములు త్రిత్వము గురించి కొంత అవగాహన అనుగ్రహించినప్పటికి పరిపూర్ణంగా సమగ్రమైనవి కాదు. అనంతమైన దేవున్ని, పరిథిలు కలిగిన ఏ ఉపమానము కూడా వివరించలేదు.

బైబిలు సిధ్ధాంతమైన త్రిత్వము క్రైస్తవ సంఘ చరిత్ర అంతట విభేధాలుకు కారణమైనదే. దేవుని వాక్యములో త్రిత్వము గురించి కేంద్రిత అంశములు స్పష్టముగా కనపరచబడినప్పటికి, కొన్ని విషయాలు అంత ప్రస్పుటముగా వివరించలేదు. తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, మరియు పరిశుధ్ధాత్ముడైన దేవుడు, కాని దేవుడు ఒక్కడే. ఇదే బైబిలు సిధ్ధాంతమైన త్రిత్వము. దీనికి మించి ఇతర విషయాలు ప్రశ్నార్థకమైనవి. అంతా ప్రాముఖ్యమైనవి కూడా కాదు. పరిమిత మానవమనస్సులతో త్రిత్వాన్ని పరిపూర్ణంగా వివరించటానికి ప్రయత్నించుటకు బదులు దేవుని గొప్ప లక్షాణాలు అనంతమైన మరియు ఉన్నతమైన స్వభావాన్ని కేంద్రీకరిస్తూ ఆయనకు పరిచర్యచేయాలి "ఆహా, దేవుని బుద్ది ఙ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు?" (రోమా11:33-34).


ప్రశ్న: దేవుడు ప్రేమయై యున్నాడు అన్న దానికి అర్ధం ఏంటి?

సమాధానము:
ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది ప్రేమను బైబిలు ఏవిధంగా వివరిస్తుందో చూధ్దాం. ఆ తర్వాత దేవుడు ప్రేమకు ఎలా మూలమయ్యాడో చూద్దాం. ప్రేమకు దేవుడిచ్చే నిర్వచనం ఇది మరియు దేవుడు ప్రేమై యున్నాడు, కాబట్టి ఆయన ఈ విధంగానే వుంటాడు. "ప్రేమ ధీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమునువిచారించుకొనదు;త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరిక్షించును; అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్ధకములగును. భాషలైనను నిలిచి పోవును; ఙ్ఞానమైనను నిరర్ధకమగును" (1కొరింధి 13:4-8అ).

ప్రేమ (దేవుడు) ఎవరిని బలవంతపెట్టడు. ఎవరైనను తన దగ్గరకు వస్తే అది ప్రేమకు స్పందించినప్పుడే. ప్రేమ (దేవుడు) అందరికి దయ చూపిస్తాడు. ప్రేమ (యేసుక్రీస్తు) నిష్పక్షపాతముగా అందరికి మంచి చేసాడు. ప్రేమ (యేసు) ఇతరులకు చెందిన దానిని ఆశించలేదు. తగ్గింపుజీవితం కలిగి యున్నాడు. ప్రేమ (యేసయ్య) తానేంతో శక్తివంతుడైనప్పటికి తాను గురుంచి డంబముగా చెప్పుకోలేదు. ప్రేమ (దేవుడు) బలవంతంగా విధేయతను కోరడు. పరలోకపు తండ్రి తనకుమారుడునుండి బలవంతంగా విధేయతను కోరలేదు.గాని యేసయ్య తానే ఇష్టపూర్వకంగ విధేయతను చూపించాడు ( యోహాను 14:31). ప్రేమ (యేసయ్య) ఎప్పుడు ఇతరుల కోరికలను తీర్చాడానికి చూశాడు, చూస్తున్నాడు.

దేవుని ప్రేమను గంభీరముగా వ్యక్త పరిచే వచనమే "దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను" యోహాను 3:16. రోమా 5:8 అదే వర్తమానాన్నిప్రకటిస్తుంది "అయితే దేవుడు మనయెడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు: ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను." ఈ వచనములను బట్టి దేవుని యొక్క కోరిక మనము ఆయనతో కలిసి నిత్యత్వమైనటువంటి పరలోకములో వుండాలని ఆశపడ్తున్నాడు. దానికి మార్గము సరాళము చేయుటకుగాను మన పాపములకై వెల చెల్లించాడు. తన చిత్తానుసారముగా మనలను ప్రేమించటానికి ఆయన నిర్ణయించుకున్నాడు. ప్రేమ క్షమియిస్తుంది. “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును" (యోహాను 1:9).

దేవుడు ప్రేమయై యున్నాడు అన్న దానికి అర్ధం ఏంటి? ప్రేమ దేవుని గుణగణము. దేవుని శీలమునకు ఆయన వ్యక్తిత్వాన్నికి మూలమైనది ప్రేమ. దేవుని ప్రేమ ఏ విధముగానైన తన పవిత్రతను నీతిని న్యాయానికి లేక ఉగ్రతకు విరుద్దమైంది కాదు. దేవుని గుణ గణములన్నియు సమతుల్యముగా వున్నవి. దేవుడు చేసేనదంతాకూడా ప్రేమ పూరితమైంది, న్యాయమైనది, సరియైనది. నిజమైనటువంటి ప్రేమకు ఖచ్చితమైన ఉదాహరణే దేవుడు. తన కుమారుడైన యేసుక్రీస్తును ఎందరైతే స్వీకరించారో వారందరికి పరిశుధ్ధాత్మ యొక్క శక్తిని బట్టి ప్రేమించే సామర్ధ్యాన్ని దేవుడు ఆశ్చర్యంగా అనుగ్రహించాడు (యోహాను 1:12; 1 యోహాను 3:1, 23-24).


ప్రశ్న: ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతాడా?

సమాధానము:
మనుష్యులకు వినబడగలిగేటట్లు దేవుడు మాట్లడినట్లు బైబిలు అనేక మార్లు పేర్కోంటుంది (నిర్గమకాండం 3:14; యెహోషువ 1:1; న్యాయాధిపతులు 6:18; 1 సమూయేలు 3:11; 2 సమూయేలు 2:1; యోబు 40:1; యెష్షయా 7:3; యిర్మియా 1:7; అపోస్తలుల కార్యములు 8:26; 9:15 – ఇది ఒక చిన్న ఉదాహారణకు మాత్ర మే. ఈ దినాలాలో మనుష్యులకు వినబడగలిగేటట్లు దేవుడు మాట్లడకూడదని లేక మట్లాడకూడదు అని అంటానికి బైబిలులో ఏ కారణము లేదు. కొన్ని వందసార్లు బైబిలులో పేర్కొన్నట్లుగా మాట్లాడిన దేవుడు నాలుగు వేల సంవత్సరాల మానవ చరిత్రలో మరల జరిగిందిఅని మనము గుర్తించుకోవాలి. దేవుడు వినబడగలిగేటట్లు మాట్లాడుట అనేది ప్రత్యేక సంఘటననేగాని అది నియమము కాదు. బైబిలులో దేవుడు మానవులతో పలుమార్లు మాట్లాడాడు అని పేర్కొన్నప్పుడు అది వినబడిగలిగే స్వరమా లేక అంతర్గత ఆలోచన ఒక మానసికమైన ఆలొచన అన్నది వివరించలేం.

ఈ దినాలో కూడ దేవుడు మాట్లాడతూనే ఉన్నాడు. మొదటిగా ఆయన వాక్యము ద్వార మట్లాడుతున్నాడు ( 1 తిమోతి 3:16-17). యెష్షయా 55:11 ఈ విధంగా చెప్తుంది " నిష్ఫలముగా వాక్యము నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును." మనము రక్షింపబడుటకు గాను మరియు క్రైస్తవ జీవన విధానములో జీవించుటకుగాను అన్ని విషయములను తెలిసికొనుటకు దేవుని వాక్యమను బైబిలులో ముందుగానే పొందుపరిచెను. రెండవ పేతురు 1:3 ఈ విధంగా తెలియ పరుస్తుంది, "తన మహిమను బట్టియు, గుణాతిశయమునుబట్టియు, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవజ్ఞానమూలముగా ఆయన దివ్యశక్తి, జీవమునకును భక్తికిని కావలసినవాటినన్నిటిని మనకు దయచేయుచున్నందున."

రెండవదిగా, ప్రకటించిన విధంగా దేవుని వాక్యమును దేవుడు వాటిని సంఘటనల ద్వారా అభిప్రాయాలద్వార మాట్లాడుతాడు (1 తిమో తి 1:5; 1 పేతురు 3:16). మనస్సాక్షిద్వారా మంచి చెడులను గ్రహించటానికి తన అలోచనలను మనము కలిగియుండేటట్లు మన మనస్సులనురూపంతరపరిచే ప్రక్రియలలో దేవుడున్నాడు (రోమా 12:2). దేవుడు మన జీవితాలలో కొన్ని సంఘటనలను అనుమతించటం ద్వారా మనల్ని నడిపిస్తాడు. మనలను మారుస్తాడు మరియు ఆత్మీయంగా సహాయపడుతాడు (యాకోబు 1:2-5; హెబ్రీయులకు 12:5-11). మొదటి పేతురు 1:6-7 ఙ్ఞప్తిలోకి తెస్తుంది ఏంటంటే "ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెముకాలము మీకు దు:ఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షలవలన శుధ్ధపరచబడుచున్నదిగదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును."

చివరిగా దేవుడు కొన్ని పర్యాయాలు మానవులకు వినబడగలిగేటట్లు మాట్లాడవచ్చు. అయితే పలువురు పేర్కోనేటట్లు అనేక పర్యాయములు ఈ ప్రక్రియ జరుగుతుంది అన్న మాట అనుమాస్పదమే. మరియు బైబిలులో పేర్కోనేటట్లు, దేవుడు వినబడగలిగేటట్లు మాట్లాడటం అనేది ప్రత్యేకమైన విషయముగాని సాధారణమైంది కాదు. ఎవరైనా దేవుడు నాతో మట్లాడాడు అని చెప్పితే ఆ మాటలను వాక్యానుసారమైనందా కాదా అని బేరీజు వేసుకోవాలి. నేటి దినాలలో దేవుడు ఒకవేళ మట్లాడినట్లయితే ఆ మాటలు బైబ్నిలులోనే పేర్కొన్నమాటలతో అంగీకారముగానే వుంటుంది (1 తిమోతి 3:16-17). దేవుడు తనకు తాను విరుద్దముగా ప్రవర్తించడు.


ప్రశ్న: దేవునిని ఎవరు సృజించారు? దేవుడు ఎక్కడనుండి నుంచి వచ్చారు?

సమాధానము:
అన్ని విషయాలకు కారకము ఉండాలి కాబట్టి దేవునికి కూడా కారకముండే ఉండి తీరలి అన్న సామన్య వాదనే హేతువాదులు, సంశయవాదులు లేవనెత్తే సాధరణ వాదన. (ఒకవేళ దేవుడు దేవుడుగా కాకుండాకపోతే ఇక దేవుడేలేడు). దేవుడ్ని ఎవరు చేసారు అన్న సాధారణ ప్రశ్నను కొంచెం కృత్రిమ పద్దతులలో అడగటమే. శూన్యంనుంచి ఏ వస్తువువెలువడదని అందరికి తెలుసు. కాబట్టి ఒకవేళ దేవుడు ఒక “వస్తువు” అయినట్లయితే ఆయనే ఒక కారకమై ఉండి వుండాలి?

ఇది ఒక తప్పుడు అపోహమీద ఆధారపడి ఉన్న చిక్కు ప్రశ్న. ఒకవేళ దేవుడు ఎక్కడోనుంచి వచ్చినట్లయితే ఒక చోటనుంచి వచ్చినట్లు అని అన్నట్లే. అది అర్దరహితమైన ప్రశ్న అన్నదే సరియైన జవాబు. నీలిరంగు వాసన అంటే ఎలా వుంటుంది? అది నీలిరంగును, వాసన కల్గియుండే జాబితాకు చెందినవాడు కాదు. దేవుడు సృజింపబడనివాడు, అకారకము లేనటువంటివాడు, ఆయన ఎప్పుడు ఉనికిలో నున్నవాడు.

అది మనకేలాగు తెలుసు? శూన్యమునుండి ఏది రాదు అని మనకు తెలుసు కాబట్టి ఒకవేళ ఒకప్పుడు సమస్తము శూన్యము అయినట్లయితే శూన్యమునుండి ఏది ఉనికిలోకి వచ్చేదికాదు. అయితే ఇప్పుడు వస్తువులు ఉనికిలోఉన్నాయి. కాబట్టి ఇవి ఉనికిలోనికి రావడానికి ఏదో ఒకటి నిత్యము వుండి వుండాలి. ఆ నిత్యము ఉనికిలో ఉన్నదానినే దేవుడు అని అంటాం. కారకము లేనటువంటివాడే దేవుడు. ఆయనే సమస్తాన్నికి కారకుడు. కారకములేనటునటువంటి దేవుడే, విశ్వాన్ని అందులోనున్న సమస్తాన్నికి కారకుడు.


ప్రశ్న: దేవుడు చెడును సృష్టించాడా?

సమాధానము:
దేవుడు సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి చెడునుకూడ ఆయనే సృష్టించివుంటాడని తొలుత అనిపిస్తుంది. అయితే చెడు అనేది ఒక "రాయి" లేక విద్యుత్తులాగా వస్తువుకాదు.కూజాడు చెడును కలిగిఉండటం అనేది అసాధ్యం. చెడు దానంతట అది ఉనికిలో ఉండలేదు, వాస్తవానికి మంచిలోపించటమే చెడు. ఉదాహరణకు రంధ్రాలు వాస్తవమే కాని అవి ఉనికిలో వుండాలి అంటే ఇంకా ఏదన్న ఒక వస్తువు ఖచ్చితముగా ఉండాలి. దేవుడు సృష్టించినపుడు వాస్తవానికి మంచివిగా సృష్టించాడు. దేవుడు సృష్టించిన మంచివాటిలో మంచిని ఒకటే ఎంపిక చేసుకోగలిగేది స్వేఛ్చగలిగిన జీవులు మాత్రమే. వాస్తవికమైన ఎంపిక చేసుకోవటానికి వీలు కల్పించుటకుగాను, మంచికి భిన్నముగాని ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. దేవుడు, దేవదూతలు మరియు మనుష్యులకు మంచిని అంగీకరించే లేక మంచిని తృణీకరించీ (చెడు) చేయుటకుగాను ఎంపిక చేసుకొనే అనుమతిని దేవుడు కల్పించాడు. రెండు మంచి విషయముల మధ్య చెడు సంభంధమున్నట్లయితే దానిని చెడ్డది అని అంటాం. అయితే అది దేవుడు సృష్టించిన చెడ్డ వస్తువు కాదు. అయితే అది ఒక వస్తువు అయిపోలేదు, దానిని దేవుడు సృష్టించాడుఅన్నట్లు.

ఈవిషయాన్ని అర్ధంచేసుకోవడానికి మరొక దృష్టాంతం "చలి ఉనికిలో ఉందా" అని ఎవరైనా అడిగితే "ఉంది" అని జవాబివ్వవచ్చు. అయితే అది సరియైన జవాబు కాదు. ఎందుకంటే చల్లదనం ఉనికిలో ఉండదు, ఉష్ణతలోపించడమే చల్లదనం. అదేవిధంగా అంధకారము అనేది ఉనికిలో ఉండదు, వెలుగు లోపించడమే. చెడు అనేది మంచిలోపించటమే. ఇంకా శ్రేష్టమైన జవాబు ఏంటంటే చెడు అనేది దేవుడు లోపించడమే.

దేవుడు చెడును సృష్టించాల్సిన ఆసరంలేదు. అయితే మంచి లేకుండా ఉండగలిగేవుండే పరిస్థితిని అనుమతించాలి. దేవుడు చెడును సృష్టించలేదుగాని అనుతించాడు. ఒకవేళ దేవుడు చెడును అనుమతించకుండవుండినట్లయితే దేవతలు మానవులు సేవించేది ఎంపికనుబట్టి కాదుగాని, భాధ్యతలేక నియామాన్నిబట్టే. తయారుచేసిన, రూపొందించిన నియామాలకు అనుగుణంగా వ్యవహరించే యంత్రాలను (రొబొట్స్)తయారుచేయాలని ఆయన ఉద్దేశ్యం కాదు. దేవుడు చెడు చేయటానికి అనుమతిని ఇవ్వడంద్వారా మనము స్వచ్చిత్తాన్ని కలిగినవారమై ఆయనను సేవించాలావద్దా అనేది ఎంపికచేసుకోవడానికి సాధ్యమైంది.

పరిధులుకలిగినటువంటి మానవులముగా అపరిమితమైన దేవుడును ఎన్నడు పరిపూర్ణముగా ఎన్నికచేసుకోలేం (రోమా 11:33-34). కొన్నికొన్ని సార్లు దేవుడు ఎందుకిలాచేసాడు అని అనుకోని తర్వాత దేవుడు వేరే వుద్దేశ్యంతో ఇలాచేసాడని అర్థంచేసుకుంటాం. దేవుడు విషయాలను పవిత్రమైన నిత్యమైన దృక్పధంలో చూస్తాం. మనము విషయాలను పాపపు భూలోక మరియు పరిమితమైన దృక్పధంలో చూస్తాం. దేవుడు ఆదామును హవ్వను సృష్టించి భూమిమీద ఎందుకుపెట్టారు? వారు పాపముచేసి తద్వార చెడును మరికొన్ని శ్రమను మానవాళిపై తీసుకొస్తారని తెలిసికూడా? ఎందుకు ఆయన మనలను సృజించి పరలోకములో విడిచిపెట్టలేదు? అక్కడ శ్రమలులేకుండా పరిపూర్ణంగా వుండివుండే వాళ్ళం కదా. నిత్యత్వపు ఇవతలవున్నామనము ఆప్రశ్నలకు సమగ్రమైన జవాబులు ఇవ్వలేము. మనము గ్రహించగలిగేది దేవుడు పరిశుధ్ధుడని ఏదిచేసిన పవిత్రమైనదని, పరిపూర్ణమైనదని మరియు ఆయనకు మహిమకరమైనదని ఎంపిక ద్వార ఆయనను ఆరాధించే కల్గించుటకుగాను చెడును దేవుడు అనుమతించాడు. ఒకవేళ దేవుడు చెడును అనుమతించకపోయినట్లయితే ఆయన నియమాన్నిబట్టి ఆరాధించేవాళ్ళము కాని మనము ఆయన స్వచ్చిత్తాన్ని బట్టి ఎంపికకాదు.


ప్రశ్న: క్రొత్త నిబంధనలోనున్న ప్రకారము కాక పాత నిబంధనలో దేవుడు ఎందుకు వేరుగా నున్నాడు?

సమాధానము:
ఈ ప్రశ్నలు మౌళికమైన అపార్థము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో బహిర్గతమైన దేవుని స్వభావము విషయమై ఈ ఆలోచనను మరో విధంగా వ్యక్తపరుస్తూ ప్రజలు పలికే మాటలు ఏవనగా పాత నిబంధనలో దేవుడు ఉగ్రత కలిగినవాడు. అయితే క్రొత్త నిబంధనలోనున్న దేవుడు ప్రేమకలిగిన దేవుడు. బైబిలు దేవుడు తన్ను తాను చారిత్రక సంఘటనలద్వార, మనుష్యులతో తనకున్న సంభంధంద్వార క్రమక్రమేణా తన్నుతాను బయలుపరచుకుంటున్నాడు అన్న వాస్తవం. దేవుడు ఏమయి యున్నాడు అన్న అపోహకు పాత నిబంధనలోనున్న దేవుడ్ని, క్రొత్త నిబంధనలోనున్న దేవుడ్ని పోల్చులోడానికి దోహదపడ్తుంది. ఒక వ్యక్తి పాత, క్రొత్త నిబంధనలను చదివినట్లయితే దేవుని వ్యత్యాసములేదని ఆయన ప్రేమ ఉగ్రతలు రెండింటిలోను బహిర్గతమౌవుతున్నాయని అర్థమవుతుంది.

ఉదాహరణకు, పాత నిబంధనలోని దేవుడు "కనికరము, దయ మరియు కృపాసత్యములుగలవాడు, కోపించుటకు నిదానించువాడు, విస్తారమైన ప్రేమ, నమ్మకత్వములుగలవాడు, (నిర్గమకాండం 34:6; సంఖ్యాకాండం 14:18; ద్వితియోపదేశకాండం 4:31; నెహేమ్యా 9:17; కీర్తనలు 86:5, 15; 108:4; 145:8; యోవేలు 2:13) మరియు కృపాతిశయము గలవాడని ప్రకటిస్తుంది. అయితే క్రొత్త నిబంధనలో ఆయన ప్రేమ మరియు దయ పరిపూర్ణముగా వెళ్ళడయ్యేయనటానికి " దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగ ఆయన తన అద్వీతీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవముపొందునట్లు ఆయనను అనుగ్రహించెను" (యోహాను 3:16). పాత నిబంధన అంతటిలో దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ప్రేమకలిగిన తండ్రి తన బిడ్డలతో వ్యవహరించునట్లు వ్యవహరించాడు. అయితే వారు తమ ఇష్టానుసారముగా పాపముచేసి విగ్రహాలను ఆరాధించినపుడు దేవుడు వారిని శిక్షించేవాడు. అయితే ప్రతి సారి కూడ వారి విగ్రహారాధనవిషయమై పశ్చాత్తాపపడినపుడు వారిని విమోచించేవాడు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులతో దేవుడు ఇదేవిధంగా వ్యవహరించేవాడు. ఉదాహరణకు హెబ్రీయులకు 12:6 ఈ విధంగా చెప్తుంది, "ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును".

ఇదేవిధంగా పాత నిబంధనంతటిలో కూడ పాపముపై దేవునియొక్క తీర్పును ఉగ్రతయు చూపబడటం గమనించగలం. అదేవిధంగా క్రొత్త నిబంధనలో దేవునియొక్క ఉగ్రత దుర్నీతిచేత సత్యము అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను దుర్నీతిమీదను బయలుపరుబడుచున్నది. కాబట్టి స్పష్టముగా పాత నిబంధనలోనున్నటువంటి దేవుడు క్రొత్త నిబంధనలోనున్న దేవుని కంటే వ్యత్యాసం ఏమిలేదు. దేవుడు స్వతహాగా మార్పులేనివాడు. కొన్ని కొన్ని వాక్యభాగాలలో పరిస్థితులును బట్టి ఆయన గుణలక్షణములు ప్రస్ఫుటముగా అగుపడునప్పటికి దేవుడు స్వతహాగా మార్పులేనివాడు.

మనము బైబిలు చదివి ధ్యానించే కొద్ది దేవుడు పాత, క్రొత్త నిబంధనలో ఒకే రీతిగా నున్నాడని స్పష్టమవుతుంది. బైబిలు 66 వ్యక్తిగత పుస్తకాలు రెండు (సుమారు మూడు) ఖండాలలో రచించినప్పటికి, మూడు భాషలలో, సుమారు 1500 సంవత్సారాలు, 40కంటే ఎక్కువమంది రచయితలున్నప్పటికి ఆది నుండి చివరవరకు పరస్పరము, వ్యత్యాసములేని ఒకే పుస్తకముగానున్నది. యిందులో ప్రేమ, దయ, నీతికలిగినటువంటి దేవుడు పాపములోనున్నటువంటి మనుష్యులతో ఏ విధంగా మసలుతాడో చూడగలుగుతాం. బైబిలు దేవుడు మానవులకు నిజంగా రాసిన ప్రేమ లేఖ. స్పష్టముగా దేవుని దయ మరియు ముఖ్యముగా మానావాళిపట్ల లేఖనములో అగుపడుచున్నది. బైబిలు అంతటిలో దేవుడు ప్రేమతో దయతో ప్రజలు తనతో ప్రత్యేక సంభంధము కలిగియుండాలని ఆహ్వానిస్తునాడు. ఈ ఆహ్వానానికి మనుష్యులు యోగ్యులనికాదు, గాని దేవుడు కృపగలవాడు, దయగలిగినవాడు,కోపించుటకు నిదానించువాడు, దీర్ఘశాంతపరుడు, కృపాతిశయముకలిగినవాడు కాబట్టి అంతేకాదు ఆయన పరిశుధ్ధుడు, నీతిమంతుడైన దేవుడుగా మనము చూస్తున్నాం. ఆయన మాటకు అవిధేయుడై, ఆయనను ఆరాధింపక, తాము సృష్టమును చూస్తూ సృష్టమునే దేవుళ్ళుగా ఆరాధించే వాళ్ళని తీర్పుతీరుస్తాడు (రోమా మొదటి అధ్యాయము).

దేవుడు నీతిమంతుడు, పరిశుధ్ధుడు కాబట్టి ప్రతీపాపము- భూత, వర్తమాన, భవిష్యత్తుకాలములలోనివి తీర్పులోనికి తీసుకురావాలి. అయితే దేవుడు తన అనంతమైన ప్రేమలో పాపమునకు ప్రాయశ్చిత్తముననుగ్రహించి, పాపియైన మానవుడ్ని ఉగ్రతమార్గమునుండి తప్పించాడు. ఈ అధ్భుతసత్యాన్ని 1 యోహాను 4:10 "మనము దేవుని ప్రేమించితమని కాదు; తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది." పాత నిబంధనలో బలుల ద్వారా పాపమునకు ప్రాయశ్చిత్తము అనుగ్రహించాడు.అయితే ఈ బలుల తాత్కాలికమైనవే. మరియు క్రీస్తుయొక్క రాకడకు మానవుల పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై ఆయన సిలువపై పొందేమరణానికి సూచనప్రాయముగా నున్నది. పాత నిబంధనలో దర్శనాత్మకంగా వున్న పరిపూర్ణమైనదేవుని ప్రేమ. యేసుక్రీస్తు ని ఈ లోకములో పంపించటము ద్వారా నూతన నిబంధనలో ప్రత్యక్షమవుతుంది. పాత మరియు క్రొత్త నిబంధనలు "మన రక్షాణార్థమై జ్ఞానము కలిగించుట" విషయమై అనుగ్రహించబడ్డాయి(2 తిమోతి 3:15). రెండు నిబందనలు ధ్యానించినట్లయితే "ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనా గమనమువలన కలుగు ఏ ఛాయయైనను లేదు" ( యాకోబు 1:17).


ప్రశ్న: మంచివారికి చెడు విషయాలు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?

సమాధానము:
క్రైస్తవ ధర్మశాస్త్రపరంగా వున్న క్లిష్టమైన ప్రశ్నలలో ఇది ఒకటి. దేవుడు నిత్యుడు, అనంతుడు, సర్వవ్యామి, సర్వ ఙ్ఞాని మరియు సర్వశక్తుడు. దేవుని మార్గములను పూర్తిమంతముగా అర్థం చేసుకోవాలని మానవుడు (అనినిత్యుడు, అనంతముకాని, అసర్వవ్యామి, అసర్వఙ్ఞాని మరియు అసర్వశక్తుడు)నుండి ఎందుకు ఆశిస్తారు? యోబు గ్రంధం ఈ విషయాన్ని గురుంచి వివరిస్తుంది. యోబును చంపుటకు కాక మిగిలిన విషయాలన్నిలో సాతాను అతనిని పరీక్షించుటకు దేవుడు అనుమతినిచ్చాడు. అయితే యోబు ఏవిధంగా స్పందించాడు? "ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను" (యోబు 13:15). "యెహోవా యిచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక" (యోబు 1:21). అనుభవించినవాటినన్నిటిని దేవుడు ఎందుకు అనుమతించాడు అనేది యోబుకు అర్థం కాలేదుగాని, అయినప్పటికి దేవుడు మంచివాడని ఎరిగి ఆయనయందు విశ్వాసముంచుతూ ముందుకు సాగిపోయెను.

మంచివారికి చెడు ఎందుకు జరుగుతుంది? మంచివారు ఎవరూ లేరు అనేది బైబిలు పరమైన జవాబు. మనమందరము పాపము చేత కళంకమై పీడించబడుతున్నామని బైబిలు చాల తేటతెల్లముగా ధృఉవీకరిస్తుంది(ప్రసంగీ7:20; రోమా 6:23; 1 యోహాను 1:8). రోమా 3:10-18 వచనముల ప్రకారము మంచివారు లేరు అనేదానిని స్పష్టీకరించలేదు. "నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవతప్పి యేకముగా పనికిమాలినవారైరి. మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింద విషసర్పమున్నది. వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పెదవులు పరుగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతిమార్గములు వారెరుగరు. వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు." ఈ క్షణమందే ఈ విశ్వముపైనున్న ప్రతి మానవుడు నరకములో పడద్రోయబడుటకు అర్హులు. మానవుడు జీవించే ప్రతీక్షణము కేవలము ఆయన దయ మరియు కృప వల్లనే జీవించుచున్నారు. మనము అనుభవించుటకు అర్హులమైన అగ్నిగుండము, నిత్యమైన నరకముతో పోల్చిచూచినట్లయితే ఈ భూమిమీద మనము ఏదైతే భయంకరమైన, ధు:ఖపూరితమైన పరిస్థితిని అనుభవించుచున్నామో మనము అనుభవించుటకు అర్హులమైనప్పటికి అది చాలా దయనీయమేనని అని అనిపిస్తుంది.

ఒక శ్రేష్టమైన ప్రశ్న ఏంటంటే "చెడ్డవారికి మంచిపనులు జరగటానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు?" రోమా 5:8 "అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను." ఈ లోకంలోనున్న ప్రజలు దుష్ట, చెడు, పాపపు స్వభావమునకు చెందినవారైనాప్పటికి దేవుడు ఇంకను ప్రేమించుచునే ఉన్నాడు.మనము అనుభవించాల్సిన పాపపుజీతాన్ని కొట్టివేయుటకు ఆయన మనకొరకు మరణించాడు (రోమా 6:23). యేసుక్రీస్తు రక్షకునిగా మనము అంగీకరించినట్లయితే (యోహాను 3:16; రోమా 10:9), నీ పాపములు క్షమించబడి నీకు వాగ్ధానము చేయబడిన పరలోకమనే నిత్యమైన గృహములోనికి ప్రవేశింతువు (రోమా8:1). మనకు నరకము యోగ్యమైనవారము. యేసుక్రీస్తునొద్డకు విశ్వాసముతో వచ్చినట్లయితే మనకు ఇవ్వబడింది నిత్యజీవము అనే పరలోకము.

అవును. అయోగ్యముగా ఎంచబడే ప్రజలకు కొన్నిసార్లు చెడ్డపనులు జరుగును. మనము అర్థం చేసుకున్నా లెక చేసుకోపోయిన దేవుడు మట్టుకు తన ఉద్దేశ్యపూర్వకముగా విషయాలను అనుమతిస్తాడు. అన్నిటికంటె మించి, ఏదిఏమైనప్పటికి దేవుడు మంచివాడు, న్యాయవంతుడు, ప్రేమగలిగినవాడు మరియు దయగలవాడు. తరచుగా మనకు జరిగే విషయాలను అర్థం చేసుకోలేము. అయినప్పటికి, దేవుని యొక్క మంచితనమును అనుమానించుటకంటే ఆయనయందు విశ్వాసముంచుతూ ప్రతిస్పందించవలెను."నీ స్వబుద్ధిని ఆధారముచేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును" (సామెతలు 3:5-6).