యేసుక్రీస్తుకు సంభంధించిన ప్రశ్నలు

ప్రశ్న: యేసుక్రీస్తు ఎవరు?

సమాధానము:
యేసుక్రీస్తు ఎవరు ? “అసలు దేవుడున్నాడా?” అసలు యేసుక్రీస్తు ఉన్నారా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ లో యేసు నిజంగా మానవ రూపంలో ఈ భూమి మీద నడిచారని సాధారణముగా ప్రతిఒక్కరు అంగీకరిస్తారు. యేసును గూర్చిపూర్తి వివరణ అడిగినపుడే వాదన మొదలవుతుంది. దాదాపుగా ప్రతి ముఖ్యమయిన మతము ఏమి చెపుతుందంటే యేసు ఒక ప్రవక్త అని, లేదా మంచి బోధకుడని, లేదా దైవజనుడని.

సి.ఎస్. లూయిస్ తాను రాసిన క్రైస్తవతత్వము అనే పుస్తకములో: “నేను ఎవరైతే ఆయన యేసుక్రీస్తు అని బుద్దిహీనంగా చెపుతారో వారిని ఆపటానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఆయనను గొప్ప నైతిక బోధకుడిగా ఒప్పుకోవటానికి సిద్దంగా వున్నాను. కాని ఆయన [యేసు క్రీస్తు] దేవుడని ప్రకటించటానికి మాత్రము అంగీకరించను”. ఒక విషయము మనము అసలు చెప్పకూడదు. ఒక వ్యక్తి కేవలం ఒక వ్యక్తి అయి కొన్ని మంచి విషయాలు చెప్పినంత మాత్రాన యేసు ఆయనను గొప్ప నీతి బోధకుడు అవడు అని చెప్పారు. అతడు అయితే పిచ్చివాడు –గుడ్లను దొంగిలించే స్థితిలో ఉన్న వ్యక్తి—లేదా నరకానికి సంబంధించిన దెయ్యము అయినా అయి వుండాలి. మీ ఇష్టము వచ్చినట్లుగా మీరు అనుకోవచ్చు. ఈ వ్యక్తిని దేవుని బిడ్డగా కాని లేదా పిచ్చివాడిగా లేదా ఇంకా అతి హీనమైన వ్యక్తిగా-….మీరు అనుకుని బుద్దిహీనుడిగా తోసివేసినా లేదా మీరు ఉమ్మి వేసినా, దెయ్యము అని చంపినా, కాళ్లతో తొక్కినా లేదా మీరు ఆయనని దేవుడని పిలిచినా ఏది అయినా అది మీ ఇష్టం. ఆయన గోప్ప మానవ బోధకుడని చెప్పే మాయమాటలకు తావు ఇవ్వవద్దు. ఆయన మనకొరకు అలాంటి అవకాశాన్ని తెరిచి ఉ౦చలేదు. ఆయనకి అలాంటి ఉద్దేశ్యమే లేదు.

కాబట్టి ఎవరు యేసుని గూర్చి వాదిస్తారు అతని గురించి బైబిల్ ఏమి చెపుతుందో ఎవరు చెప్తారు మొదట యోహాను 10:30 లో యేసును గూర్చిన మాటలు చూద్దాం, “నేనును తండ్రియును ఒక్కరమే” అని చెప్పారు. ఇంత వేగముగా మొదటి చూపులోనే ఆయన దేవుడని వాదించలేము. ఎలాగైతే యూదులు ఆయన ప్రకటనకు విరోధముగా –నీవు మనుష్యడవైయుండి దేవుడని చెప్పుకొనుచున్నావు కనుక దైవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము అని చెప్పిరి. యూదులు యేసు తనను దేవుడిగా చేసుకునిన ప్రకటనను ఈ విధంగా అర్థ౦ చేసుకున్నారు. ఈ క్రింది వరుసలను చూస్తే యేసు ఎక్కడా దేవుడిని గాను అని యూదులను సరిచేసినట్లు లేదు. దీనిని బట్టి చూస్తే నిజముగా యేసు తానే దేవుడినని , నేను నా తండ్రి ఒక్కరే అని ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇంకొక ఉదా( యోహాను 8.58). అబ్రహామ్ పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో సత్యము చెప్పుచున్నాను, ఆ మాటకు బదులుగా వాళ్లు కొట్టుటకు రాళ్ళను ఎత్తిరి. నిర్గమ కాండం 3:14 లో ఆయన నేను ఉన్నవాడును అనువాడనై యున్నాను అని పాతనిబంధనలో తానే ప్రకటించుకున్నారు. ఆయనను కొట్టటానికి యూదులు మరల రాళ్ళు ఎందుకు తీసారు—ఆయన చేసిన దైవదూషణను గూర్చి ఏమి చెప్పకుండా ,తాను దేవుడినని వాదించుకుంటున్నందుకా.

యోహను 1:1 లో చెప్పినట్లు ఆదియందు వాక్యము వుండెను. ఆ వాక్యము శరీరధారిగా మనుష్యలమధ్య నివసించెను. ఇది చాలా స్పష్టముగా యేసు మానవ రూపములో ఉన్న దేవుడు. అందుకే ఆయన శిష్యులలో ఒకరైన థామస్ ఆయనను నా దేవా, నా ప్రభువా అనెను. అందుకు యేసు ఆయనను ఖండించలేదు. తీతు 2:13 లో కూడ అపొస్తలుడైన పౌలు ఆయనను మహా దేవుడును మన రక్షకుడైన క్రీస్తు అని , అదే రీతిగా పేతురు కూడ మన దేవుడు రక్షకుడని సంబోధించెను. తండ్రియైన దేవుడు యేసుకి ప్రత్యక్షసాక్షి కాని కుమారుని గురించి చూస్తే మీ సింహాసనము, ఓ దేవా, తరతరములకు నిలుచును గాక మరియు మీ నీతి మీ రాజ్యమంతటా విస్తరింప చేయబడును గాక. పాత నిబంధనలో క్రీస్తును గూర్చిన ప్రవచనములము చూస్తే ఆయనే దైవము, ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.ఆయన భుజము మీద భారముండును . మరియు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త బలవంతుడైన నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టుదురు.

కాబట్టి సి.ఎస్ లూయిస్ ఏమని వాదిస్తున్నారంటే యేసును మంచి బోధకుడిగా నమ్మాలనటం అనేది మన ఇష్టం కాదు. యేసు చాలా స్పష్టంగా, తిరుగలేని విధంగా తానే దేవుడినని వాదించారు. ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే, ఆయన అబద్దికుడు, మరియు ప్రవక్త, మంచిబోధకుడు, లేదా దైవజనుడు అయివుండేవారు కాదు. యేసు మాటలలోనే చెప్పాలనుకుంటే నవీన “పండితులు” ఆయనను “నిజమైన చారిత్రక యేసు” అని వాదిస్తారు, పైగా బైబిల్ లో ఆయనను గురించి ఆరోపించిన విషయాలు ఏవి చెప్పరు. ఎలా ఒక పండితుడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసును గూర్చిన మంచి దృక్ఫథాన్ని త్రోసివేస్తే లేదా చెప్పకపోతే మరిఎవరితో ఉన్నట్లు, ఎవరిని సేవించినట్లు. తనకు తానే యేసుని బోధించినప్పుడు (యోహాను 1: 26).

ఈ ప్రశ్న యేసు యొక్క నిజమైన గుర్తింపు పైన ఎందుకు కాదు? యేసు దేవుడైనా లేదా కాకపోయినా ఇది మనకు ఒక సమస్య కాదు? యేసు దేవుడనటానికి దేవుడు కాదనటానికి చాలా ముఖ్యమైన కారణము , అతని మరణము సర్వ లోకము చేసిన పాపములకు శిక్ష సరిపోయెడిది కాదు.(1 యోహాను 2:2) కేవలం దేవుడు మాత్రమే అటువంటి అనంతమైన శిక్షను చెల్లి౦చగలడు. (రోమా 5:8;2 కోరింథి 5 21). మన పాపములు చెల్లించగలడు కావున యేసు దేవుడు. కేవలం యేసు క్రీస్తు నందు విశ్వాసముతో మాత్రమే రక్షణ కలుగుతుంది! అతను రక్షణ మార్గము వలనే దేవుడు. యేసు దేవుడని ఆయన తెలిపెను (యోహాను 14 :6) "నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప యెవడును తండ్రి యొద్దకు రాలేడు”


ప్రశ్న: యేసు దేవుడా? యేసు ఎప్పుడైనా దేవుడని అన్నారా?

సమాధానము:
బైబిల్ లో ఎక్కడా “నేనే దేవుడను” అని ఖచ్చితమైన పదాలతో యేసు గురించి తెలుపలేదు. ఏమయినప్పటికీ, ఆయన దేవుడని తెలుపలేదని కాదు. ఉదాహరణకి యోహాను 10:30 లో “నేనుయు మరియి తండ్రి ఒకరై ఉన్నాము.” మొదట చూడగానే, ఇది దేవుడని చెప్పినట్లు లేదు. ఏమయినప్పటికీ, (యోహాను 10:33) అతని ప్రవచనానికి యూదుల ప్రతిస్పందనను చూస్తే, “నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని, మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి”. యూదులు యేసు దేవుడన్న ప్రవచనాన్ని అర్ధo చేసుకున్నారు. తరువాత వాక్యాలలో యూదులు “నేను దేవుడను కాను” అన్న దాన్ని వ్యతిరేకించలేదు. దీనివల్ల మనకు యేసు ఆయన వాస్తవంగా దేవుడని (యోహాను 10:33) లో “నేనుయు మరియు తండ్రి ఒకరై ఉన్నాము.”అని ప్రకటించారు. యోహాను 8:58 మరియొక ఉదాహరణ. "అబ్రహాము పుట్టుక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను!" మరల యూదులు యేసు పై రాళ్ళు ఎత్తినపుడు బదులు పలికెను (యోహాను 8:59). వారు దైవదూషణ అని నమ్మేటట్లు నేను దేవుడను అని చెప్పడం వంటిది కాకపోతే యూదులు యేసుపై ఎందుకు రాళ్ళు రువ్వాలనుకున్నారు?

యోహాను 1:1 చెబుతుంది “వాక్యము దేవుడై యుండెను.” యోహాను 1:14 ప్రకారం “ఆ వాక్యము శరీర ధారియై యుండెను.” ఇది శరీరంలో యేసు దేవుడైయున్నాడని సూచిస్తుంది. అపోస్తలు 20:28 మనకు తెలుపుతోంది, "దేవుడు తన స్వరక్త మిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు ...”. తన స్వరక్త ముతో ఎవరు సంఘాన్ని కొన్నారు? యేసు క్రీస్తు. అపోస్తలు 20:28 దేవుడు తన స్వరక్తముతో సంఘాన్ని కొన్నారు. కాబట్టి యేసే దేవుడు!

యేసు గురించి శిష్యుడు, “నా ప్రభువా నా దేవా” అనెను (యోహాను 20:28). యేసు అతనిని సరిచేయలేదు. తీతుకు లో 2:13 మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూడండి అని ప్రోత్సహిస్తుంది- . యేసు క్రీస్తు (2 పేతురు 1:1 కూడా చూడండి). హెబ్రీ 1:8 లో, యేసు తండ్రి గురించి చెబుతారు, "తన కుమారుని గూర్చి అయితే, "దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది, మరియు నీ రాజ దండము న్యాయార్ధమయినది."

ప్రకటనలలో, ఒక దేవదూత యోహానును దేవునికి మాత్రమే నమస్కారము చేయుడని సూచించెను (ప్రకటనలు 19:10).లేఖనాలలో చాలా చోట్ల యేసు పూజలను అందుకున్నారు (మత్తయ2:11; 14:33; 28:9,17; లూకా 24:52; యోహాను 9:38).తనని పూజింజిన వారిని ఎప్పుడూ గద్దించలేదు. యేసు దేవుడు కాని ఎడల, ప్రకటనలలో దైవదూతలు తెలిపిన విధంగా, ఆయనను పూజించవద్దని ప్రజలను వారించెడివాడు. యేసు దేవుడనే వాదలకు లేఖనానలలోని పదబంధాలు మరియు సారాంశాలు ఇంకా చాలా ఉన్నాయి.

ఆయన దేవుడు కాకుండా యేసు దేవుడు కావటానికి ముఖ్య కారణము సర్వ లోక పాపములను చెల్లించుటకు ఆయన మరణము సరిపోయెడిదికాదు (1 యోహాను 2:2). అటువంటి అనంతమైన శిక్షను దేవుడు మాత్రమే చెల్లి౦చగలడు. దేవుడు మాత్రమే సర్వలోక పాపములను తీసుకుని, (2 కొరింథి 5:21), మరణించి- పాపము మరియు మరణమును జయించి మరియు పునరుద్ధానమయ్యెను.


ప్రశ్న: క్రీస్తు దైవత్వము లేఖనానుసారమా?

సమాధానము:
యేసు తన గురించి చేసుకొన్న ఖచ్చితమైన సవాళ్ళతోపాటు శిష్యులు కూడ క్రీస్తుని దేవత్వమును అంగీకరించారు. యేసు మాత్రమే పాపములు క్షమించుటకు అధికారము కలవాడని వారు సవాలు చేసారు. అది దేవునికి మాత్రమే సాధ్యం (అపోస్తలుల కార్యములు 5:31; కొలస్సీయులకు 3:13; కీర్తన 130:4; యిర్మియా 31:34). ఎందుకంటే పాపంచేత నొప్పింపబడినవాడు దేవుడు కాబట్టి. దీనికి అనుభంధమైన మరొక సవాలు యేసు సజీవులకును మృతులకును తీర్పు తీర్చువాడు “దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు” క్రీస్తుయేసు యెదుటను (2 తిమోతి 4:1). తోమా “నా దేవా నా దేవా” అని యేసుతో అనెను (యోహాను 20:28). పౌలు యేసయ్యను గొప్ప “దేవుడుగా, రక్షకుడుగా” (తీతుకు 2:13) అని పిలవటమే కాకుండా క్రీస్తు అవతరించకమునుపు “దేవుడు స్వరూపియైయున్నాడని” సూచించెను (ఫిలిప్పీయులకు 2:5-8). తండ్రియైన దేవుడు యేసయ్యను గురించి చెప్పినది “దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునది” (హెబ్రీయులకు 1:8).యోహాను భక్తుడు “ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము (యేసు) దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను” (యోహాను 1:1). క్రీస్తు దైవత్వమును భోధించేవి అనేకమైన లేఖనాలున్నవి (ప్రకటన 1:17; 2:8;22:13; 1 కొరింథి10:4; 1 పేతురు 2:6-8; కీర్తన 18:2; 95:1; 1 పేతురు 5:4; హెబ్రీయులకు 13:20), ఆయన శిష్యులు క్రీస్తును దేవుడుగా గుర్తించారనటానికి ఈ వచనాలలో ఏ ఒక్కటియైన సరిపోతుంది.

పాతనిబంధనలో యెహోవాకు (దేవుని నామం) మాత్రమే వర్తించేటటువంటి బిరుదులు యేసయ్యకు ఇచ్చారు. పాతనిబంధనలో “విమోచకుడు” (కీర్తన 130:7; హోషేయా 13:14). క్రొత్తనిబంధనలో యేసయ్యకు ఉపయోగించారు (తీతుకు 2:13; ప్రకటన 5:9). యేసయ్యకు ఇమ్మానుయేలు “దేవుడు మనతో” నున్నాడు (మత్తయి 1) అని పిలిచారు. జెకర్యా 12:10లో “వారు తాము పొడిచిన వానిమీద దృష్టియుంచి,” యెహోవా దేవుడు చెప్పిన దానినే క్రొత్తనిబంధనలో సిలువపై మరణించిన క్రీస్తుకు ఆపాదించారు ( యోహాను 19:37;ప్రకటన 1:7). ఒకవేళ పొడిచి దృష్టియుంచినది యెహోవామీద అయితే దానిని యేసుకు ఆపాదించినట్లయితే పౌలు యెషయ్యా 45:23 కు భాష్యం చెప్పుతూ దాన్ని ఫిలిప్పి 2:10,11 క్రీస్తుకు ఆపాదించారు. అంతేకాకుండా ప్రార్థనలో క్రీస్తునామాన్ని, దేవుని నామానికి జోడించెను, “తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపకలుగునుగాక” (గలతీయులకు 1;3; ఎ ఫెస్సీయులకు 1:2). ఒకవేళ క్రీస్తు దైవత్వంకానియెడల ఇది దేవ దూషణ అయివుండేది. యేసయ్య సర్వలోకమునకు సువార్తనందించి బాప్తిస్మము ద్వారా శిష్యులుగా చేయమన్న ఆఙ్ఞలో క్రీస్తునామము తండ్రి నామముతో అగపడుతుంది (మత్తయి 28:19; 2 కొరింధి 13:14).

దేవునికి మాత్రమే సాధ్యమయ్యే పనులను యేసయ్యకు వర్తించారు. యేసయ్య చనిపోయినవారిని లేపటమే కాకుండా (యోహాను 5:21;11:38-44), పాపములు క్షమించాడు (అపొస్తలుల కార్యములు 5:31; 13:38), విశ్వాన్ని సృజించి దానిని కొనసాగించాడు (యోహాను 1:2; కొలస్సీయులకు 1:16,17). యెహోవా ఒక్కడే విశ్వాన్ని సృజించాడు అన్న మాటలు గ్రహించటం ద్వారా ఇది ఇంకను స్పష్టమౌతుంది (యెషయ 44:24).అంతేకాకుండా కేవలము దేవునికి మాత్రమే వర్తించిన గుణగణాలు క్రీస్తు కలిగియున్నాడు. నిత్యుడు (యోహాను 8:58), సర్వఙ్ఞాని (మత్తయి 16:21), సర్వవ్యామి (మత్తయి 18:20; 28:20)మరియు సర్వశక్తుడు (యోహాను 11:38-44).

తాను దేవుడనని చెప్పుకొంటూ ఇతరులను మోసపూరితంగా నమ్మించటం ఒక ఎత్తైతే, దాని ఋజువు పర్చడం మరో ఎత్తు, ఇంకా దాని ధృవీకరించి, ఋజువుపర్చడం మరొకటి. క్రీస్తు తానే దేవుడనని ఋజువు పర్చటానికి అనేక సూచక క్రియలు చేసాడు. క్రీస్తు నీటిని ద్రాక్షారసముగా మార్చడం (యోహాను 2:7), నీళ్ళమీద నడవడం (మత్తయి 14:25), ఐదు రొట్టెలు రెండు వేలమందికి పంచి పెట్టడం (యోహాను 6:11), గ్రుడ్డివారిని స్వస్థపరచడం (యోహాను 9:7), కుంటివారిని నడపించడం (మార్కు 2:3), రోగులను స్వస్థపరచడం (మత్తయి 9:35:మార్కు 1:40-42), చనిపోయినవారిని సహితము తిరిగి లేపడం (యోహాను 11:43-44);లూకా 7:11-15) యేసయ్య చేసిన సూచక క్రియలలో ఇవి కొన్ని మాత్రమే. అంతేకాకుండా, క్రీస్తు మరణంనుంచి తానే పునరుత్ధాడయ్యాడు. మరణంనుండి తిరిగిలేవడం అనేది అన్య పురాణాలలో నున్నప్పటికి ఏ మతముకూడా పునరుత్ధానాన్ని ఆపాదించుకోలేకపోయింది. అంతేకాకూండా మరి దేనికికూడా లేఖనమునకు అతీతంగా ఇన్ని నిడర్శనాలు , ఋజువులు లేవు.

క్రైస్తవేతర పండితులు సహా యేసుక్రీస్తును అంగీకరించగల పన్నెండు వాస్తవాలు.

1). యేసు సిలువపై మరణించాడు.
2). ఆయన సమాధి చేయబడ్డాడు.
3). ఆయన మరణము శిష్యులను నిరాశ, నిస్పృహలకు కారణం మయ్యింది.
4). యేస్యు సమాధి కొన్ని దినాల తర్వాత ఖాళీగా వున్నట్లు కనిపెట్టబడింది.
5). యేసయ్య శిష్యులు, పునరుత్ధానుడైన యేసును చూసిన అనుభవాన్ని నమ్మారు.
6). అనుభవంతర్వాత అనుమానించిన శిష్యులు ధైర్యముకలిగిన విశ్వాసులుఅయ్యారు.
7). ఆది సంఘభోధనలో ఈ వర్తమానం మూలాంశమైయున్నది.
8). ఈ వర్తమానం యెరూషలేంలో భోధించారు.
9). ఈ భోధనకు ఫలితమే సంఘం ప్రారంభమై ఎదిగింది.
10). సబ్బాతు (శనివారం) కు బదులుగా పునరుత్ధానదినం (ఆదివారం) ఆరాధనకు ప్రాముఖ్యమైనదినముగా మారింది.
11). అనుమానుస్ధుడుగా గుర్తింపుపొందిన యాకోబు మార్పు చెంది,పునరుత్ధానుడైన క్రీస్తును చూచినట్లు నమ్మాడు.
12). క్రైస్తవత్వానికి శత్రువుడైన పౌలు పునరుత్ధానుడైన క్రీస్తు ప్రత్యక్షతనుబట్టి మార్పు చెందినట్లుగా నమ్మాడు.

పునరుత్ధానాన్ని ఋజువుచేస్తూ సువార్తను స్థాపించగలిగితే పైన పేర్కొన్నవాటి విషయం పై వచ్చిన ఏ అనుమానాన్ననైనా నివృత్తిచేయవచ్చు.యేసు మరణం, సమాధి, పునరుత్ధానం, మరియు ఆయన కనపడటం (1కొరింధి 15:1-5). పైన పేర్కొన్న వాటిని వివరించటానికి కొన్ని సిధ్ధాంతాలు వున్నప్పటికి వాటికి సమర్థవంతంగా వివరణ ఇవ్వగలిగేది పునరుత్ధానము మాత్రమే. క్రీస్తుని శిష్యులు పునరుత్ధానమును సహితం తాము చూసారని చెప్పుకున్నారని విమర్శకులు కూడా ఒప్పుకున్నారు. భ్రమ, అబద్డములకు సాధ్యముకాని మార్పు పునరుత్ధానమునకు మాత్రమే సాధ్యమయింది. మొదటిదిగా, వారు లబ్ధి పొందింది ఏంటి? డబ్బు సంపాదించుకోడానికి క్రైస్తవత్వం ప్రభావితమైంది కాదు. రెండవది, అబద్దికులు హతసాక్షులవ్వలేరు. తమ విశ్వాసంకోసం, క్రూరమైన మరణం సహితం శిష్యులు అంగీకరించటానికి పునరుత్ధానము సరైన వివరణ. తాము నిజమను కొనే అబద్దానికోసం చనిపోయేవారు ఎందరో వుండవచ్చు గాని తాను అబద్దం అనుకోడానికికోసం చనిపోయే వారెవ్వరుండరు.

ముగింపులో క్రీస్తు తానే యెహోవా అని చెప్పుకున్నాడు (ఒక “దేవుడు” కాదు, ఒకే ఒక్క దేవుడు). ఆయన అనుచరులు (విగ్రహారాధనంటే భయపడే యూదులు) ఆయనను దేవునిగా నమ్మారు, గుర్తించారు. క్రీస్తు తన దైవత్వాన్ని ఋజువుపరచుకోడానికి అనేక సూచక క్రియలు చేశారు. పునరుత్ధానుడైనాడు అన్నది అన్నిటికి మించినది, ప్రపంచాన్నే తలక్రిందులు చేసినటువంటి ఋజువు. మరి ఏ సిధ్దాంతము కూడ ఈ వాస్తవాలకు సరియైన వివరణ ఇవ్వలేదు. బైబిలు ప్రకారము క్రీస్తే దేవుడు.


ప్రశ్న: యేసు దేవుని కుమారుడు అనగా అర్థం ఏంటి?

సమాధానము:
యేసు దేవుని కుమారుడు అనేది మానవ తండ్రికుమారులవలె కాదు. దేవుడు పెళ్ళి చేసుకోలేదు కుమారుని కలిగి యుండటానికి. దేవుడు మరియను శారీరకంగా కలువలేదు కుమారుని కనటానికి. యేసు దేవుని కుమారుడు అన్నప్పుడు మానవ రూపంలో ఆయనను దేవునికి ప్రత్యక్ష పరచాడు (యోహాను 1:1-14). పరిశుధ్ధాత్ముని ద్వారా మరియ గర్భము ధరించుటను బట్టి యేసు దేవుని కుమారుడు. లూకా1:35 ఈ విధంగా చెప్తుంది " దూత- 'పరిశుధ్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.'"

యూదా నాయకుల తీర్పు సమయంలో ప్రధానయాజకుడు యేసయ్యను రెట్టించి అడిగాడు. "అందుకు ప్రధానయాజకుడు ఆయనను చూచి -నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని ఆనబెట్టుచున్నాననెను" (మత్తయి 26:63). "అందుకు యేసు నీవన్నట్టే." 'ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా'" (మత్తయి 26:64). అందుకు దానికి యూదానాయకులు స్పందిస్తూ యేసయ్య దేవదూషణ చేస్తున్నాడని నేరారోపణ చేశారు (మత్తయి 26:65-66).ఆ తర్వాత పొంతిపిలాతుముందు "అందుకు యూదులు- మాకొక నియమము కలదు; తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి" (యోహాను 19:7). ఆయన దేవుని కుమారుడను చెప్పుకోవటం ఎందుకు మరణ శిక్ష విధించాల్సిన దేవదూషణ అయ్యింది? యూదానాయకులు "దేవుని కుమారుడు" అని చెప్పుకొన్నదాన్ని సరిగాఅర్థం చేసుకున్నారు. దేవుని కుమారుడు అనగా దేవుని స్వభావము కలిగినవాడు అని అర్థం. దేవుని కుమారుడు దేవునినుండి వచ్చాడు. దేవుని స్వభావము కలిగినవాడు అనగా దేవుడు. కాబట్టి యూదానాయకులు దేవదూషణగా గుర్తించారు. లేవీకాండం 24:15 ఆధారం చేసుకొని యేసయ్య మరణాన్ని కోరారు." ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునైయుండి," అని హెబ్రీయులకు 1:3 దీనిని చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది.

ఇంకొక ఉదాహరణను యోహాను 17:12 లో యూదాను "నాశనపుత్రుడు" గా ఆభివర్ణించుటలో చూడగలుగుతాం. యోహాను 6:71 యూదా సీమోను కుమారుడు అని ప్రకటిస్తుంది. యోహాను 17:12 యూదాను "నాశనపుత్రుడు" గా ఎందుకు ఆభివర్ణిస్తున్నాడు? "నాశనము" అను మాటకు అర్థం "ధ్వంసం, వినాశము, వ్యర్థపరచటం." యూదా నాశనము అనగా " ధ్వంసం, వినాశము, వ్యర్థపరచటం" అనే వీటికి పుట్టినవాడుకాడు. అయితే యూదా జీవితానికి ఇది గుర్తింపుగా వున్నది. యూదా నాశనమును వ్యక్తీకరిస్తున్నాడు. అదేవిధంగా యేసు దేవుని కుమారుడు, దేవుడు. యేసయ్య దేవుని యొక్క మూర్తిమంతమునైయున్నాడు (యోహాను 1:1, 14).


ప్రశ్న: యేసు నిజంగా ఉనికిలో ఉన్నాడా? యేసు చారిత్రలో నున్నాడనటానికి నిర్హేతుకమైన నిదర్శానాలున్నాయా?

సమాధానము:
ఒక వ్యక్తి ఇలా అడిగినపుడు ఆ ప్రశ్నలో బైబిలు వెలుపట అన్నది ఇమిడి యున్నది. బైబిలు యేసుక్రీస్తు ఉనికిలోనున్నాడు అని అంటానికి బైబిలును వాడకూడదు అనేది మనము అంగీకరించం. క్రొత్తనిబంధనలో యేసుక్రీస్తు విషయమై వందలాది ఋజువులున్నాయి. కొంతమంది సువార్తలు, యేసుక్రీస్తుమరణమునకు వంద సంవత్సారాల తర్వాత రెండో శతాబ్ధములో రాసారని చెప్పేవారున్న్నారు. ఒకవేళ ఇది వాస్తవమైనప్పటికి (దీనిని మనము గట్టిగా ప్రశ్నిస్తున్నాం). రెండువందల సంవత్సారాలలోపు పురాతన నిదర్శానలను నమ్మదగినవిగా గుర్తిస్తారు. అనేకమంది పండితులు (క్రైస్తవేతర) పౌలు రచించిన పత్రికలు (కనీసము) కొన్నైన్న మొదటి శతాబ్ధములోని యేసుక్రీస్తు మరణమునుంచి 40 సంవత్సరాలలోపే పసులు రచించాడని నమ్ముతారు.

పురాతన చేవ్రాతల ఋజువుల ప్రకారము ఒకటవ శతాబ్దపు ఇశ్రాయేలీయుల దేశమునందు యేసు ఆ వ్యక్తి వున్నాడనుటకు అసాధరణమైన శక్తివంతమైన ఋజువు.

క్రీస్తు శకము 70వ సంవత్సరములో రోమీయులు, ఇశ్ర్హాయేలీయుల దేశమును దాడి చేసి యెరుషలేమును పూర్తిగా నాశనముచేసి అందలి నివసించేవారిని ఊచకోతకోసారు. కొన్ని పట్టణాలు అగ్నితో సమూల నాశనంచేశారు. అటువంటి పరిస్థితులలో యేసయ్య ఉనికికి సంభందించిన సాక్ష్యులు పూర్తిగా నాశనమయిన ఆశ్చర్య పడనక్కరలేదు. అనేకమందిని యేసయ్యను చూచిన అ సజీవ సాక్ష్యులు చంపబడ్డారు. ఈ వాస్తవాలు యేసయ్యకు సంభందించిన సజీవ సాక్ష్యులు తక్కువగా వుంటాయని సూచిస్తున్నాయి.

యేసుక్రీస్తుయొక్క పరిచర్య రోమా సామ్రాజ్యములోని ఒక మారుమూల ఏ మాత్రము ప్రాధాన్యతలేని ఒకటిగా భూభాగమునకు పరిమితమైంది. అయినాప్పటికి ఆస్చర్యకరంగా బైబిలేతర లౌకికమైన చరిత్రలో ఎక్కువ సమాచారం కలిగియుండుట. యేసుకి సంభందించిన కొన్ని ప్రాముఖ్యమైన చారిత్రక సాక్ష్యాలు ఈ దిగువను పేర్కొనబడినవి.

తిబేరియకు చెందిన మొదటి శతాబ్దపు రోమీయుడైన టాసిటస్ ఆ కాలపు ప్రపంచానికి చెందిన గొప్ప చరిత్రకారుడని గుర్తిస్తారు. ఆయన రచనలలో మత భక్తి కలిగిన క్రైస్తవుడు. "క్రిస్టియన్స్" ( క్రిస్టస్ అనగా లాటిన్ భాషలో క్రీస్తు తిబేరియస్ పరిపాలనలో పొంతిపిలాతు అధికారము క్రింద శ్రమపొందారు. సుటోనియస్ హెడ్రియన్ చక్రవర్తియొక్క ప్రముఖ కార్యదర్శి. మొదటి శతాబ్దములో క్రిస్టస్ (క్రైస్ట్) అనే వ్యక్తి వున్నాడని రాశాడు (యానల్స్ 15:44)

జోసెఫస్ ఫ్లేవియస్ ప్రఖ్యాతిగాంచిన యూదా చరిత్రకారుడు. యాంటిక్విటిస్ లో యాకోబు గురుంచి ప్రస్తావించిన ఆయన "యేసు అనగా క్రీస్తు అని పిలువబడే సహోదరుడు" అన్నాడు. ఆయన గ్రంధములో 18:3 ఎంతో వివాదస్పదమయిన వచనము. ఆసమయంలో యేసు అనే జ్ఞానము కలిగిన వ్యక్తి వుండేవాడు. ఆయానను మనిషి అని పిలువటం ధర్మబద్దమయితే ఎందుకంటే ఆయన ఎన్నో ఆశ్చర్యకరమైన క్రియలు చేశాడు. ఆయన క్రీస్తు ఆయన మూడవదినమున సజీవుడుగా అగుపడ్డాడు.ప్రవక్తలు కొన్ని వేల సంవత్సారాలు ముందుగా ఆయన గురించి పలికిన అద్భుతమైన

ప్రవచనాల కనుగుణంగా మూడవ దినమున సజీవుడుగా కనపడ్డాడు. మరియొక అనువాదము ఈ విధంగా పేర్కోంటుంది. ఆ సమయంలో యేసు అనే ఒక నీతిమంతుడు వుండేవాడు. ఆయన మంచివాడు, పవిత్రుడు, యూదులలోను మరియు ఇతర దేశస్థులు అనేకులు ఆయన శిష్యులయ్యారు. పిలాతు శిక్షించగా ఆయనను సిలువపై చంపారు. అయితే ఆయన శిష్యులు ఆయనను విడిచి పోలేదు. అయితే ఆయన శిష్యులు ఆయనను విడిచి పోలేదు. అంతేకాదు, ఆయన గురించే వారికి మూడు దినాన్న కనబడ్డాడని, ఆయన సజీవుడని, ప్రవక్తలు అనేక అద్భుతాలు విషయాలు పేర్కోన్నారని కాబట్టి ఆయనే మెస్సీయా అని భోధించేరు.

జూలియస్ ఆఫ్రికానస్ చరిత్రకారుడైన థాలస్ ను ఉదహరిస్తూ యేసుక్రీస్తు సిలువ సమయంలో ఏర్పడిన చీకటి గురించి ప్రస్తావించాడు (ఎక్స్టాంట్ రైటింగ్స్, 18).

ప్లిని ది యంగర్, ఆయన రాసిన లెటర్స్ 10:96 లో ఆదిమ క్రైస్తవుల ఆరాధన, ఆచారాలు గురించి ప్రస్తావిస్తూ యేసుక్రీస్తుని దేవుడుగా పూజించేవారని ఎంతో నీతిగా వుండేవారని ప్రేమవిందు అనగా ప్రభురాత్రి భోజన సంస్కారమును కలిగి యుండేవారని పేర్కొన్నాడు.

బాబిలోనియన్ టాల్మడ్ (సన్హెద్రిన్ 43ఎ)పస్కాముందు సాయంత్రం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని మరియు ఆయనపై వున్న నింద ఆయన మంత్రాలు ప్రయోగించేవాడని యూదులను మతభ్రష్టత పట్టించాడని అన్నదే.

సమోసటకు చెందిన లూసియన్ రెండవ శతాబ్ధపు గ్రీకు రచయిత క్రీస్తుని క్రైస్తవులు ఆరాధించేవారని, ఆయన క్రొత్త భోధలు భోధించేవాడని, సిలువ వేయబడ్డాడు అని ఒప్పుకున్నాడు. యేసయ్య భోధనలలో ప్రాముఖ్యమైనవి విశ్వాసులయొక్క సహోదరత్వము, మారుమనస్సు మరియు ఇతర దేవతలను తృణీకరించటం అని అన్నాడు. క్రైస్తవులు యేసయ్య నియమాలకు అనుగుణంగా జీవించేవారని, నిత్యజీవులని నమ్మేవారని, మరణముకైనను తెగించేవారని , స్వఛ్చంధంగానైన తమ్మును తాము పరిత్యజించేవారని రాశారు.

మెర (మర) బర-సెరపియన్ యేసు జ్ఞానము కలిగినవాడు మరియు పవిత్రుడని ఇశ్రాయేలీరాజుగా ఆయనను గుర్తించారని, యూదులు ఆయనను చంపారని, అయితే ఆయన అనుచరులు ఆయన భోధలు ద్వారా జీవించారు అని రాశారు.

గ్నాస్టిక్ రచనలలో (ద గాస్పల్ ఆఫ్ ట్రూత్, ద అపొక్రిఫాన్ ఆఫ్ జాన్, ద గాస్పల్ ఆఫ్ థామస్, ద ట్రిటీస్ ఆన్ రిజరక్షన్, ఇటిసి) అనేకమైన వాటిలో యేసయ్య గురుంచి ప్రస్తావించటం జరిగింది.

వాస్తవానికి క్రైస్తవేతర రచనలనుంచి సువార్తను మనము వ్రాయవచ్చు. యేసుని క్రీస్తు అన్నారు (జోసెఫస్) "అధ్భుతాలు" చేశారు. ఇశ్రాయేలీయులను కొత్త భోధలో నడిపించారు. పస్కాదినమున సిలువవేయబడ్డరు (బాబిలోనియన్ టాల్మడ్ ),యూదులలో (టాసిటస్) ఆయనే దేవుడని మరల తిరిగి వస్తాడని చెప్పుకున్నాడు (ఎలియాజరు), ఈ విషయాలను నమ్మి తన అనుచరులు ఆయనను దేవుడుగా అంగీకరించారు (ప్లీని ద యంగర్).

యేసుక్రీస్తు ఉనికికి సంభంధించిన అనేక నిదర్శానాలు ఇటు బైబిలు చరిత్రలలోను అటు లౌకిక చరిత్రలోనూ కూడ కలదు. అన్నిటికంటే యేసుక్రిస్తు ఉనికికి సంభంధించిన ఋజువులన్నిటిలో అతి గొప్పదైన మొదటి శతాబ్ధమునకు చెందిన వేలకొలది క్రైస్తవులు ఆయన శిష్యులతో కలిసి హతసాక్ష్యులుగా చనిపోడానికి ఇష్టపడటమే. ప్రజలు తాము నిజము అనుకొన్నదానికి చనిపోతారుగాని ఎవరూ అబద్దము అనేదానికి హతసాక్ష్యులవ్వరు.


ప్రశ్న: కన్యక గర్భము ధరించుట ఎందుకు అంత ప్రాముఖ్యమైంది?

సమాధానము:
కన్యక గర్భము ధరించుట అనే సిధ్ధాంతము చాల కీలకంగా ప్రాముఖ్యమైంది. (యెషయా 7:14; మత్తయి 1:23; లూకా 1:27, 34). మొదటిగా లేఖానాలు ఏవిధంగా ఈ సంఘటనను వివరిస్తుందో పరిశీలిద్దాము. మరియ ప్రశ్నకు "యిదెలాగు జరుగును?" (లూకా 1:34)అని దూతతో పలుకగా, దానికి ప్రతిస్పందనగా దూత - "పరిశుధ్ధాత్మా నీ మీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుధ్ధుడై దేవుని కుమారుడనబడును"(లూక 1:35)అని చెప్పెను. దేవునిదూత యోసేపును ప్రోత్సాహపరుస్తు నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, "ఆమే గర్భము ధరించినది పరిశుధ్ధాత్మ వలన కలిగినది" (మత్తయి1:20). మత్తయి నిర్థారించేది ఏంటంటే వారేకము కాకకమునుపే అంటే కన్యకగా నున్నప్పుడే ఆమే పరిశుధ్ధాత్మునివలన గర్భవతిగా నుండెను (మత్తయి 1:18). "దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీ యందు పుట్టి" అని గలతీ 4:4 కూడా కన్యక గర్భమును గూర్చి భోధిస్తుంది.

ఈ పాఠ్యాభాగాలనుంచి మనకు చాల స్పష్టముగా అర్థము అయ్యేదేంటంటే యేసు జన్మ ఫలితమే మరియ శరీరములో పరిశుధ్ధాత్ముడు జరిగించిన కార్యము. అభౌతికమైన(ఆత్మ) భౌతికము (మరియ గర్భము)రెండును కలిసి పాల్గొనెను. మరియ తన్ను తాను గర్భవతి చేసుకొనుటకు అవకాశములేదు, ఎందుకంటే ఆమె ఒక సామాన్యమైన పనిముట్టు లాంటిది. దేవుడు మాత్రమే అవతరించుట అనే అధ్భుతమును చేయగలడు.

ఏదిఏమైనప్పటికి, యోసేపు మరియల మధ్య శారీరక సంభంధమును నిరాకరించుటను అట్టి యేసు నిజమైన మానవుడు కాడు అని సూచిస్తుంది. యేసు సంపూర్తిగా మానవుడే, మనకు లాగా శరీరమును కలిగియున్నాడని అని లేఖనము భోధిస్తుంది. ఇది మరియ దగ్గర్నుండి పొందుకున్నాడు. అదే సమయంలో యేసు నిత్యమైన, పాపములేని స్వభావముతో సంపూర్తిగా దేవుడే (యోహాను 1:14; 1 తిమోతి 3:16; హెబ్రీయులకు 2:14-17.)

యేసు పాపములో పుట్టినవాడు కాదు అంటే ఆయన స్వభావములో పాపములేదు (హెబ్రీయులకు 7:26). తండ్రినుంచి ఒక తరమునుండి మరొక తరముకు పాపస్వాభావము సంప్రాప్తమైనట్లు అగుపడుతుంది (రోమా 5: 12, 17,19). పాపపు స్వభావమును ప్రసరించే గుణాన్నినుండి తప్పించుకొనుటకు కన్యక గర్భము ధరించుట దోహదపడింది మరియు నిత్యుడైన దేవుడ్ని పూర్తిమంతమైయున్న మానవుడుగా అవతరించుటకు అనుమతికలిగింది.


ప్రశ్న: యేసుక్రీస్తు పునరుత్ధానము సత్యమేనా?

సమాధానము:
యేసుక్రీస్తు మరణమునుండి పునరుత్ధానమవుట వాస్తవమని లేఖానాలు ఖండితమైన ఆధారాన్ని చూపిస్తుంది. యేసుక్రీస్తు పునరుత్ధాన వృత్తాంతామును మత్తయి 28:1-20;మార్కు16:1-20; లూకా 24:1-53; మరియు యోహాను 20:1–21:25 లో పేర్కోంటుంది. పునరుత్ధానుడైన యేసుక్రీస్తు అపోస్తలుల కార్యములు గ్రంధములో కూడ ( అపోస్తలుల కార్యములు 1:1-11) అగుపడుతారు. ఈ లేఖానాల భాగాలనుండి క్రీస్తు పునరుత్ధానుడు అనుటకు అనేక “ఋజువులు”న్నాయి. మొదటిది ఆయన శిష్యులలో వచ్చిన నాటకీయ మైన మార్పు. పిరికివారిగా దాగియున్న ఈ శిష్యులగుంపు శక్తివంతమైన ధైర్యముకలిగి సాక్ష్యులుగా ప్రపంచమంతటికి సువార్తనందించటానికి వెళ్ళారు. ఈ నాటకీయమైన క్రీస్తు అగుపడుట కాక మరి ఏ కారణము చూపుదుము?

రెండవది అపోస్తలుడైన పౌలు జీవితము. సంఘాన్ని హింసించే ఈ వ్యక్తి సంఘానికి అపోస్తలుడుగా మార్పు చెందటానికి కారణం ఏంటి? దమస్కు మార్గమును పునరుత్ధానుడైన క్రీస్తు అగుపడినప్పుడే అది జరిగింది (అపోస్తలుల కార్యములు 9: 1-6). మూడవ ఖండితమైన ఋజువు ఖాళిసమాధి. ఒకవేళ క్రీస్తు పునరుత్ధానుడు కాని యెడల ఆయన దేహము ఏమయ్యింది? ఆయన శిష్యులు మరియు ఇతరులు ఆయనను పాతిపెట్టినటువంటి సమాధిని చూశారు. వారు వెనుదిరిగి వచ్చినపుడు ఆయన శరీరం (శవం)అక్కడ లేదు. వాగ్ధానము చేసిన ప్రకారము మూడవదినమున తిరిగి లేపబడ్డారని దేవదూతలు ప్రకటించారు (మత్తయి 28:5-7). నాలుగవ నిదర్శనము ఆయన పునరుత్ధానుడయ్యాడనుటకు అనేక మందికి ప్రత్యక్ష్యమయ్యాడు (మత్తయి 28:5, 9, 16-17;మార్కు 16:9; లూకా24:13-35; యోహాను 20:19, 24, 26-29, 21:1-14; అపోస్తలుల కార్యములు 1:6-8; 1 కొరింథీయులకు 15:5-7).

యేసుక్రీస్తు పునరుత్ధానానికి అపోస్తలులు ఇచ్చిన అధిక ప్రాముఖ్యమైన మరొక ఋజువు, క్రీస్తు పునరుత్ధానికి 1కొరింధీ 15. ఈ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు క్రీస్తు పునరుత్ధాన్ని విశ్వసించుట. అర్థంచేసికొనుట ఎందుకు మౌళికమైనదో వివరించాడు.ఈ కారణాలుబట్టి పాముఖ్యమైంది. మొదటిది, క్రీస్తు మరణము నుండి పునరుత్ధానుడు కాని యెడల విశ్వాసులు కూడా అవ్వరు (కొరింధీయులకు 15:12-15). రెండు క్రీస్తు మరణమునుండి తిరిగి లేవనియెడల పాపము కోసమే ఆయన చేసిన త్యాగం పరిపూర్ణమైంది కాదు (కొరింధీయులకు 15:16-19). క్రీస్తు పునరుత్ధానుడగుటను బట్టి ఆయన మరణాన్ని మన పాపమునకు ప్రాయశ్చిత్తముగా దేవుడు అంగీకరించునట్లు ఋజువవుతుంది. ఆయన ఒకవేళ మరణించి అదే మరణములో కొనసాగిన యెడల ఆయన త్యాగము పరిపూర్ణమైందికాదు. అంతేకాదు, విశ్వాసుల పాపములు క్షమించబడనేరవు. మరియు వారు మృతులుగానే కొనసాగెదరు (కొరింధీయులకు 15:16-19). నిత్యజీవము అనేది వుండి వుండేదికాదు (యోహాను 3:16). "ఇప్పుడైతే నిద్రించినవారిలో ప్రధమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు (కొరింధీయులకు 15:20).

అంతిమముగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచినవారు ఆయనవలె నిత్యజీవముతో లేపబడుతారని లేఖానాలు స్పష్టముచేస్తాయి (1కొరింధీయులకు 15:20-23). యేసుక్రీస్తు పునరుత్ధానము ఏవిధంగా పాపముపై విజయాన్ని అనుగ్రహిస్తుందో మరియు పాపమును జయించుటానికి శక్తి ప్రసాదిస్తుందో ఋజువు పరుస్తుంది(1కొరింధీయులకు 15:24). మహిమా స్వాభావముకలిగిన పునరుత్ధాన శరీరము మనము ఏవిధముగా పొందుతామో వివరిస్తుంది (1కొరింధీయులకు 15:34-39). క్రీస్తు పునరుత్ధానానికి ప్రతిఫలముగా ఆయనయందు విశ్వాసముంచినవారందరు మరణముపై అంతిమ విజయము పొందుతారని ప్రకటిస్తుంది (1కొరింధీయులకు 15:50-58).

క్రీస్తు పునరుత్ధానము ఎంత మహిమ గలిగిన సత్యం! "కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృధ్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి" (1కొరింధీయులకు 15:58).కాబట్టి బైబిలు ప్రకారము యేసుక్రీస్తు పునరుత్ధానము ఖచ్చితమైన వాస్తవము. క్రీస్తు పునరుత్ధానానికి 400 కంటె ఎక్కువమంది సాక్ష్యులని బైబిలు చెప్తుంది. మరియు ఈ వాస్తవము పై మౌళిక క్రైస్తవ సిధ్ధాంతాన్ని నిర్మిస్తుంది.


ప్రశ్న: యేసు శుక్రవారమున సిలువవేయబడినారా? ఆదివారము పునరుత్దానమైనట్లయితే, ఆ మూడు దినాలు సమాధిలో ఏవిధంగా గడిపాడు?

సమాధానము:
యేసయ్య ఏ రోజున సిలువవేశారు అనేది బైబిలు స్పష్టముగా ప్రస్తావించుటలేదు. అతి ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన రెండు దృక్పధాలు. ఒకటి శుక్రవారమని మరొకటి బుధవారమని. మరికొంతమంది ఈ రెండింటిని శుక్ర, బుధవారమును సమ్మేళనము చేసి మరొకరు గురువారమని కూడా ఆలోచించటం జరుగుతుంది.

మత్తయి 12:40 " యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో వుండును" అని యేసు చెప్పెను. శుక్రవారము సిలువవేయబడ్డాడు అని వాదించేవారు ఆయన మూడు దినములు సమాధిలో నుండటం సబబని, సాధ్యమని నమ్ముతారు. మొదటి శతాబ్ధపు యూదామనస్సునకు ఒక దినములోని భాగమును కూడా పూర్తి దినంగా లెక్కిస్తారు. యేసు సమాధిలో శుక్రవారమున కొంతభాగము, పూర్తి శనివారము, ఆదివారమున కొంతభాగము నున్నారు. కాబాట్టి మూడు దినాలు సమాధిలోనున్నట్లు గుర్తించవచ్చు. యేసుక్రీస్తు శుక్రవారమే సిలువవేయబడ్డాడు అన్న వాదనకు ప్రాముఖ్యమైన ఆధారమే మార్కు 15:42 " విశ్రాంతిదినమునకు పూర్వదినము." అది సాధారణమైనటువంటి విశ్రాంతిదినము సబ్బాతు అయినయెడల శనివారమై యుండాలి. అప్పుడు సిలువవేయటం అనేది శుక్రవారమే జరిగియుండాలి. శుక్రవారమే అని విచారించేవారు మత్తయి 16:21 మరియు లూకా 9:22 భోధిస్తున్నట్లుగా యేసు తాను "మూడవదినమున" తిరిగిలేస్తాననాడు. కాబట్టి మూడు పూర్తి పగలు, రాత్రులు సమాధిలో నుండాల్సిన అవసరంలేదు. అయితే మరికొన్ని అనువాదములు "మూడవదినమున" అని ఈ వచనాలకు వాడినప్పటికి అందరు సబబు అని అంగీకరించరు. మరియు మార్కు 8:31 లో క్రీస్తు మూడు దినాల "తర్వాత" లేపబడును అని వున్నది.

గురువారము అని వాదించేటటువంటివారు క్రీస్తు సమాధి చేయబడటానికి ఆదివారము తెల్లవారు ఝామున మధ్యన అనేక సంఘటనలు వున్నాయి(కొంతమంది 20 అని లెక్కపెడతారు). కాబట్టి అది శుక్రవారము కాకపోవచ్చని అంటారు. మరొక సమస్య ఏమనగా శుక్రవారమునకు, ఆదివారమునకు మధ్యన పూర్తి దినము శనివారము అనగా యూదుల సబ్బాతు అవ్వటం. కాబట్టి వేరు ఒకటిగాని, రెండుగాని పూర్తిదినాలుండినయెడల ఈ సమస్తాన్ని తుడిచి పెట్టొచ్చు. గురువారం అని వాదించేవారు ఈ హేతువును చూపిస్తారు.- ఒక స్నేహితుడ్ని శుక్రవారం సాయత్రంనుండి చూడనట్లయితే ఆ వ్యక్తిని గురువారం ఉదయం చూచినట్లయితే గత మూడు రోజులుగా నిన్ను చూడటంలేదు అని అనడం సబబే. కాని అది కేవలం 60 గంటలు మాత్రమే (2.5దినాలు). ఒకవేళ గురువారం సిలువవేయబడినట్లయితే మూడు రోజులు అనటానికి ఈ ఉదాహరణ వుపయోగిస్తారు.

బుధవారం అని అభిప్రాయపడేవాళ్ళు ఆ వారంలో రెండు సబ్బాతులున్నాయని పేర్కోంటారు. మొదటి సబ్బాతు తర్వాత (సిలువ వేసిన సాయంత్రంనుండి ఆరంభమైంది[మార్కు 15:42; లూకా 23:52-54]), స్త్రీలు సుగంధ ద్రవ్యములు కొన్నారు. - వారు సబ్బాతు తర్వాత ఆ పనిచేసారని గుర్తించుకోవాలి (మార్కు 16:1). బుధవారమని అభిప్రాయపడేవారు ఈ సబ్బాతుని "పస్కాదినము" అని అంటారు(లేవికాండం 16:29-31, 23:24-32, 39 ప్రకారము అతి పవిత్రమైనటువంటి దినము వారములో ఏడవదినం అవ్వాల్సిన అవసరంలేదు). ఆ వారంలో రెండో సబ్బాతు ఏడవదినమున వచ్చింది. లూకా 23:56 లో పేర్కోన్నట్లు స్త్రీలు మొదటి సబ్బాతు తర్వాత సుగంధద్రవ్యములు కొన్నారు. అవి సిధ్దంచేసిన తర్వాత సబ్బాతు దినమున విశ్రమించారు. సబ్బాతు తర్వాత సుగంధద్రవ్యములుకొని, సబ్బాతు తర్వాత అది సిద్డపరచటం అనేది రెండు సబ్బాతులు లేకపోతే సాధ్యమయ్యేది కాదు అనేదే వాదన. రెండు సబ్బాతులున్నావని అనే దృక్పధములో క్రీస్తు గురువారం సిలువవేయబడినట్లయితే (అనగా పవిత్రమైన సబ్బాతు దినమున (పస్కా) గురువారం సాయంత్రం ఆరంభమయ్యి శుక్రవారం సాయత్రంతో అంతమయి ఉండేది. శుక్రవారం సాయంత్రం వారాంతర సబ్బాతు ఆరంభమవుతుంది. మొదటి సబ్బాతు తర్వాత(పస్కా) స్త్రీలును ద్రవ్యములుకొనినట్లయితే అదే శనివారం సబ్బాతుని అయితే అ సబ్బాతు దినాన్ని వారు ఉల్లఘించారు.

కాబట్టి బుధవారమే సిలువవేయబడ్డాడు అనే వివరణ యిచ్చేవారు ఒకేఒక ఉల్లఘించని బైబిలు వచనము స్త్రీలును సుగంధ ద్రవ్యములు తీసుకు రావటం మత్తయి 12:40 ని యధాతధంగా తీసుకోవటం. ఆ సబ్బాతు అతి పవిత్రమైన దినము అనగా గురువారము మరియు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొనటానికి శుక్రవారము వెళ్ళి తిరిగి వచ్చి అదేదినాన్న సిద్దపరచి శనివారం అనగా యధావిధంగావుండే సబ్బాతు దినాన్ని విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఆదివారం సుగంధ ద్రవ్యాలు సమాధి దగ్గరకు తీసుకు వచ్చారు. యేసయ్యా బుధవారం సూర్యస్తసమయంలో సమాధి చేయబడ్డారు. అనగా యూదాకాలమాన ప్రకారం గురువారం ఆరంభమైంది. యూదాకాలమానాన్ని తీసుకున్నట్లయితే మూడు పగలు మూడు రాత్రులు, గురువారం రాత్రి (మొదటి రాత్రి), గురువారం పగలు (మొదటి పగలు), శుక్రవారం రాత్రి(రెండవ రాత్రి) శుక్రవారం పగలు (రెండవ పగలు), మరియు శనివారం రాత్రి (మూడవ రాత్రి) శనివారం పగలు (మూడవ పగలు) అని గుర్తించగలం. ఆయన ఎప్పుడు తిరిగి లేచాడో తెలియదు కాని ఆదివారం సూర్యోదయానికి ముందు అని మాత్రం ఖచ్చితముగా చెప్పగలం ( యోహాను 20:1 ఇంకా చీకటి ఉండగనే మగ్ధలేనే మరియ వచ్చెను).కాబట్టి శనివారం సూర్యాస్తసమయం తర్వాత యూదుల వారానికి తొలి దినాన్నా ఆయన లేచియుండాలి.

లూకా 24:13 బుధవారం అని వాదించేవారు ఒక విషయములో సమస్యను ఎదుర్కొంటారు. అదేమనగా ఎమ్మాయి గ్రామము గుండా అయనతో నడచినటువంటి శిష్యులు ఆయన పునరుత్ధానమైన అదేదిన్నాన్న జరిగియుండాలి. యేసయ్యను గుర్తుపట్టనటువంటి శిష్యులు యేసయ్య సిలువ గురుంచి చెప్పారు (లూకా 24:21). ఆ సంధర్భములో ( లూకా 24:21)"ఇదిగాక ఈసంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను." అయితే బుధవారం నుండి ఆదివారంవరకు నాలుగు దినములు. దీనికి ఇవ్వగలిగేటటువంటి ఒక భాష్యం ఏదనగా బహుశావారు బుధవారం సాయత్రం క్రీస్తు సమాధి చేయబడ్డాడని అంటే యూదుల ప్రకారము గురువారము అంటే గురువారంనుండి ఆదివారంవారానికి మూడు దినాలు.

ఈ మహా ప్రణాళికలో క్రీస్తు ఏ దినమున సిలువ వేయబడ్డాడు అనేది అంతా ప్రాముఖ్యముకాదు. ఒకవేళ అదే ప్రాముఖ్యమైనట్లయితే దేవుని వాక్యములో వారము, దినము బహుస్పష్టముగా వివరించబడియుండేది. ఆయన మరణించి భౌతికంగా మృతులలో నుండి తిరిగి లేచాడనేది అతి ప్రాముఖ్యము.దీనితో సమానమైనటువంటి ప్రాధాన్యతకలిగింది. ఆ ప్రక్రియ కారణము- పాపుల శిక్షను ఆయన మరణముద్వారా తనమీద వేసుకున్నాడు, యోహాను 3:16 మరియు 3:36 ప్రకారము ఎవరైతే ఆయనయందు విశ్వాసముంచుతారో వారు నిత్య జీవము కలిగియుంటారు. బుధవారమా, గురువారమా లేక శుక్రవారమా ఆయన మరణించిన దీనికి సమానమైనటువంటి ప్రాధాన్యత వుంది.


ప్రశ్న: యేసుక్రీస్తు మరణ పునరుత్ధాన మధ్యకాలాం నరకానికి వెళ్ళాడా?

సమాధానము:
ఈ ప్రశ్న విషయంలో తీవ్రమైన గందరగోళమున్నది. ఈ విషయము ప్రాధమిక అపోస్తలుల విశ్వాసప్రమాణములో "అదృశ్యలోకములోనికి దిగిపోయెననియు" అని పేర్కొంటుంది. లేఖానాలలో కొన్ని వాక్య భాగాలు యేసుక్రీస్తు నరకమునకు వెళ్ళెనని అర్థంవచ్చినట్లు వాదించారు. ఈ అంశంను పరిశోధించకముందు బైబిలు మరణించినవారి లోకము గురించి ఏవిధంగా భోధిస్తుందో అవగాహన చేసుకోవాలి.

హీబ్రూ లేఖానాలో మృతులలోకము "షియోల్" అని వివరించారు. సామాన్య అర్థం "మృతులుండే ప్రదేశము,"లేక "విడిచి వెళ్ళిన ప్రాణాత్మల ప్రదేశము". క్రొత్తనిబంధనలో గ్రీకు పదము దీనికి సమాంతరముగా "హెడెస్" కూడ "మృతుల ప్రదేశమునే" చూపిస్తుంది. క్రొత్తనిబంధనలోని లేఖనభాగాలు పాతాళమును తాత్కాలికమైన ప్రదేశమనియు అక్కడ ఆత్మలు అంతిమ పునరుత్ధానముకోసం వేచియుంటారని సూచిస్తుంది. ఈరెండిటిని మధ్య వ్యతాసాన్ని ప్రకటన 20:11-15 చూపిస్తుంది.నరకము (అగ్నిగుండం)శాశ్వతమైనది. తీర్పు తర్వాత నశించినవారి అంతిమస్థానము. హెడెస్ తాత్కాలికమైన ప్రదేశము కాబట్టి యేసుక్రీస్తు ప్రభువువారు నరకమునకు వెళ్ళలేదు. ఎందుకంటె అది భవిష్యత్తులోకానికి సంభంధించింది. మరియు గొప్ప ధవళ సింహాసనపు తీర్పు తర్వాత ప్రాతినిధ్యములోనికి వచ్చేది ( ప్రకటన 20:11-15) .

షియోల్/ హెడెస్, రెండు భాగాలు కలిగివున్నవి (మత్తయి 11:23, 16:18;లూకా 10:15, 16:23; అపొస్తలుల కార్యములు 2:27-31). ఒకటి రక్షింపబడినవారికి, రెండవది, నాశనమైనవారు. రక్షింపబడినవారి యొక్క ప్రదేశము "పరదైసు" గాను, "అబ్రాహామురొమ్ము" గాను పిలువబడుతుంది. రక్షింపబడినవారికి, నాశనమైనవారికి మధ్య వేరుపరుస్తు పెద్ద అగాధమున్నది (లూకా 16:26). యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమైనపుడు పరదైసులోనున్న విశ్వాసులను తనతోపాటు కొనిపోయెను (ఎఫెసీపత్రిక 4:8-10). అయితే పాతాళములోనున్న నాశనమయినవారి స్థితి మార్పు లేనిదిగానున్నది. అవిశ్వాసులుగా మరణించినవారి అంతిమ తీర్పుకై అక్కడ వేచియుంటారు. యేసుక్రీస్తు షియోలుకి/ హెడెస్సుకి, పాతాళమునకు వెళ్ళారా? అవును ఎఫెసీపత్రిక 4:8-10 మరియు 1 పేతురు 3:18-20 ప్రకారము.


ప్రశ్న: యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానల మధ్యనున్న మూడు రోజులలో ఎక్కడ గడిపాడు?

సమాధానము:
1 పేతురు 3:18-19 "ఏలయనగా మనలను దేవునియొద్డకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మ విషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్ర్మపడెను. దేవుని దీర్ఙ్హశాంతము ఇంక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్డపరచుచుండగా, అవిధేయులైనవారియొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మలయొద్దకు, ఆయన ఆత్మ రూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా ఎనిమిది మంది నీటిద్వారా రక్షణపొందిరి." 18 వచనములోనున్న "ఆత్మ విషయములో" అన్న భాగము శరీర విషయములో లాగా నిర్మితమయినది. కాబట్టి ఆత్మ అన్న పదాన్ని శరీరమన్న పదముతో పోల్చుట సముచితమే. ఇక్కడున్న శరీరము ఆత్మ, క్రీస్తు శరీరము ఆత్మయే. ఆత్మ విషయములో బ్రదికింపబడి అన్నది క్రీస్తు పాపముల విషయములో శ్రమపడి మరణముద్వారా, తండ్రినుండి తన ఆత్మను వేరుపరచినాడు అని సూచిస్తుంది(మత్తయి 27:46). శరీరము ఆత్మల మధ్యనే వ్యత్యాసము మత్తయి 27:46 మరియు రోమా 1:3-4 సూచించినట్లు క్రీస్తు శరీరము పరిశుధ్ధాత్మలమధ్య కాదు. క్రీస్తు పాపముల విషయమై ప్రాయశ్చిత్తము చెల్లించటం పరిపూర్ణమయినప్పుడు ఆయన ఆత్మ తెగిపోయిన సహవాసాన్ని పునరుద్డీకరించెను.

1 పేతురు 3:18-22 వచనాలలో క్రీస్తు శ్రమలకు (18) ఆయన మహిమపరచబడుటకు (22) మధ్యనున్న సంభంధాన్ని సూచిస్టుంది. కేవలం పేతురు మాత్రమే ఈ రెండు సంఘటనల మధ్యన జరిగిన సమాచారాన్ని అందిస్తున్నాడు. 19వ వచనములో భోధించటం అన్న పదం నూతన నిభంధనలో తరచుగా వాడే సువార్త భోధించటం అన్నవంటిది కాదు. ఒక వార్తను చాటించటం అని అర్థం. యేసు శ్రమనొంది సిలువపై మరణించాడు. ఆయన శరీరము మరణమునకు అప్పగించబడింది. ఆయన మీద పాపము మోపగా ఆయన ఆత్మ మరణించెను. అయితే ఆయన ఆత్మను బ్రదికించబడినపుడు ఆయన దానిని తండ్రికి అప్పగించెను. పేతురురాసినట్లుగా మరణానికి పునరుత్థానికి మధ్యన "చెరలోనున్న" ఆత్మలకు ప్రత్యేకంగా ప్రకటన చేసెను.

పేతురు మనుష్యులకు సూచించటానికి ప్రాణాత్మలు (సోల్స్)వుపయోగించాడు కాని ఆత్మలుగా (స్పిరిట్స్)కాదు. క్రొత్త నిబంధనలో ఆత్మ అన్నదానిని దేవదూతలకు, దయ్యములకు వుపయోగించారు కాని మనుష్యులకు కాదు. ఇదే భావాన్ని 22వ వచనములో కూడ చూడవచ్చు. మరియు బైబిలులోమరీ ఇంకెక్కడ కూడ యేసుక్రీస్తు నరకాన్ని దర్శించినట్లు పేర్కొనబడలేదు. అపోస్తలుల కార్యములు 2:31లో పేర్కొనబడిన పాతాళము కాదు. పాతాళముఅన్నది మరణించిన వారి స్థాయిని సూచించేది. పునరుత్థానముకోసం వేచియుండే తాత్కాలికమైన ప్రదేశము. ఈ రెండింటి మద్యననున్న వ్యత్యాసాన్ని ప్రకటన 20:11-15 ను చూడగలం. నరకం నిత్యమైనది, అంతిమ స్థానం నశించినవారికి ఇచ్చినటువంటి తీర్పు. పాతాళము (హెడెస్) తాత్కాలికమైనది.

మన ప్రభువు తన ఆత్మను తండ్రికి అప్పగించిన తర్వాత మరణించాడు. మరణ పునరుత్థానముల మధ్య పాతాళములోనున్న ఆత్మలకు (బహుశా త్రోసివేయబడినటువంటి దేవదూతలు యూదా6)లో భోధించెను. నోవహు ప్రళయమునకు ముందు కాలమునకు చెంధినవారికి వర్తమానము అందించెను. 20వచనము దీనిని స్పష్టము చేస్తుంది. చెరలోనున్న ఆత్మలకు ఏమి ప్రకటించారో పేతురు చెప్పలేదు గాని, బహుశా! వర్తమానము విమోచనమునకు సంభంధించినది కాకపోవచ్చు. ఎందుకంటే రక్షణ దేవదూతలకు వర్తించదు కాబట్టి (హెబ్రీయులకు 2:16). ఇది బహుశా! సాతాను మరియు అతని శక్తులపై ప్రకటించిన విజయము (1 పేతురు 3:22; కొలస్సీయులకు 2:15). ఎఫెసీయులకు 4:8-10 క్రీస్తు పరదైసుకు వెళ్ళినట్లు సూచిస్తుంది. (లూకా 16:20;23:43) మరియు ఆయన మరణమునకు ఆయనయందు విశ్వాసముంచిన వారందర్ని పరలోకమునకు తీసుకొనివెళ్ళెను. ఈ వాక్యభాగమునకు ఎక్కువ వివరములను ఇవ్వటంలేదు అని చెరను చెరగా కొనిపోబడెను అన్న దానికి ఎక్కువమణ్ది బైబిలు పండితులు అంగీకరించేది ఈ భాష్యంనే.

కాబట్టి యేసుక్రీస్తు మరణమునున్న మధ్య మూడురోజులలో ఖచ్చితంగా ఏంచేశారో అన్నది బైబిలు స్పష్టీకరించటం లేదు. ఆయన త్రోసివేయబడిన దేవదూతలు అవిశ్వాసులపై విజయాన్ని ప్రకటించటానికి వెళ్ళినట్లు సూచిస్తున్నాయి. యేసయ్య రక్షణ నిమిత్తము ప్రజలకు రెండవ అవకాశము ఇవ్వటానికి అన్న విషయము మాత్రము ఖచ్చితముగా అర్థంచేసుకోగలం. మరణం తార్వాత మనము తీర్పును ఎదుర్కోవాలి రెండవ అవకాశం లేదని ఖచ్చితముగా (హెబ్రి 9:27) చెప్తుంది. యేసుక్రీస్తు తన మరణము పునరుత్థానముల మధ్య ఏంచేశారో అని నిర్థిష్టమైన జవాబు లేదు. బహుశా మనము మహిమలో చేర్చబడిన తర్వాత అర్థంచేసుకోగలిగే ఒకే మర్మం ఇదేనేమో!