అంత్యదినాలకు సంభంధించిన ప్రశ్నలు

ప్రశ్న: అంత్యకాలపు ప్రవచనాలు ప్రకారము ఏం జరుగనైయున్నది?

సమాధానము:
అంత్యకాలము గురించి అనేక విషయాలను బైబిలులో పేర్కోంటుంది. సుమారుగా ప్రతీ పుస్తకము కనీసము ఒక ప్రవచనమైనా అంత్యకాలమును గూర్చి ఉంది. ఈ ప్రవచనాలన్ని తిసుకొని క్రమబద్దీకరించుటం అతికష్టమైనపని. ఈ క్రింద ఇవ్వబడిన సమీక్ష అంత్యకాలమున ఏం జరుగుతుందో బైబిలు ప్రకటించిన విషయాలు.

తిరిగి జన్మించిన విశ్వాసులను క్రీస్తు భూమినుండి ఎత్తబడుట అనే ప్రక్రియలో తీసుకెళ్ళును ( 1 థెస్సలోనీకయులకు 4:13-18; 1 కొరింథీయులకు 15:51-54). ఆయన న్యాయసింహాసన ముందు, వారు భూమిమీదనున్నప్పుడు మంచిపనులు మరియు విశ్వాసులగా వుంటూ పరిచర్య చేసినవారికి బహుమానములు పొందుట లేక వారు బహుమనములు పోగొట్టుకొనుట, గాని నిత్య జీవముకాదు, అయితే వారు పరిచర్య మరియు విధేయత సరిగ్గ చూపనందులకు (1 కొరింథీయులకు 3:11-15; 2 కొరింథీయులకు 5:10).

అంత్యక్రీస్తు ( మృగము) పరిపాలనలోనికి వచ్చి మరియు ఏడు సంవత్సారాలు ఇశ్రాయేలీయులతో నిబంధన చేయును ( దానియేలు 9:27). ఈ ఏడు సంవత్సారాల కాలమును "శ్రమలకాలము" అని తెలియబడును. ఈ శ్రమలకాలములో, బహుభీకరమైన యుద్ధములు, కరవులు, తెగుళ్ళు మరియు సామాన్య విపత్తులు జరుగును. దేవుడు పాపముపైన, చెడు మరియు దుష్ఠత్వముపైన తన ఉగ్రతను కురిపించును. ఈ శ్రమలకాలము లో అంత్యకాలమున రాబోయే నాలుగు గుఱ్ఱములపైన మనుష్యులు, మరియు ఏడు ముద్రలు, బూరధ్వని మరియు న్యాయపు పాత్రలు కూడ అగుపడును.

ఏడేండ్ల కాలపు మధ్యలో, అంత్యక్రీస్తు ఇశ్రయేలీయుఅల్తో చేసుకున్న శాంతి కొరకైన నిబంధనను భంగవిముక్తి చేసి మరియు వారికి వ్యతిరేకముగా యుధ్దము చేసెను. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు "తీవ్ర అసహ్యంను మరియు పాడు" చేయును మరియు యెరూషలేము దేవాలయములో ఆరాధించుటకు తన స్వరూపమును చేయును (దానియేలు 9:27; 2 థెస్సలోనీకయులకు 2:3-10), గాని మరల తిరిగి కట్టబడును. రెండవ భాగము శ్రమలకాలమును "మహా శ్రమలకాలముగా" పేర్కొనబడును (ప్రకటన 7:14) మరియు "అది యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినము" (యిర్మీయా 30:7).

ఏడేండ్ల శ్రమల చివరికాలంలో, అంత్యక్రీస్తు ఆఖరి యుద్దమును యెరూషలేముపై ప్రకటించును, అర్మగెద్దోను పోరాటము పూర్తిఅగును. యేసుక్రీస్తు తిరిగి వచ్చును, అంత్యక్రీస్తును నాశనము చేయును మరియు అతని యుద్దశూరులను, మరియు మండుచున్న అగ్నిగుండంలో పడద్రోయబడును ( ప్రకటన 19:11-21). క్రీస్తు సాతానును 1000 సంవత్సరాలు అగాధములో బంధించి మరియు అతడు ఈ భూమిమీద రాజ్యమును వెయ్యేండ్లు పరిపాలించును ( ప్రకటన 20:1-6).

వెయ్యేండ్లు పరిపాలన చివరికాలంలో, సాతాను విడిపించ బడతాడు, ఓడిపోతాడు, అగ్ని గంధకముల గుండంలో పడద్రోయబడతాడు (ప్రకటన 20:7-10) నిత్యత్వమువరకు. తర్వాత క్రీస్తు విశ్వాసులందరిని తీర్పుతీర్చును ( ప్రకటన 20: 10-15) ధవళమైన మహా తెల్లని సింహాసనమందు, అందరిని అగ్ని గంధకముల గుండములో పడద్రోయును. అప్పుడు క్రొత్త ఆకాశమును మరియు క్రొత్త భూమిని మరియు నూతనమైన యెరూషలేమను పరిశుధ్దపట్టణమును - విశ్వాసులకొరకు నివసించే స్థలముగా అనుగ్రహించెను. అక్కడ పాపమును, ధుఖమును మరియు మరణమును ఇకనెన్నడూ ఉండదు ( ప్రకటన21-22).


ప్రశ్న: అంత్యకాలములో కనపడే సూచనలు?

సమాధానము:
మత్తయి 24:5-8 లో కొన్ని ప్రాముఖ్యమైన ఆచూకిలు అంత్యదినములు ఎలా అని గుర్తించటానికి, "అనేకులు నా పేరట వచ్చి- నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్డములనుగూర్చియు యుద్దసమాచారములను గూర్చియు వినబోదురు; మిరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము." అబద్దపు మెస్సీయాలు పెరుగుతున్న కొలది, యుద్డములు పెరుతూవుండగా, మరియు కరవులు, తెగుళ్ళు మరియు సామాన్య భూకంపములు అధికమవుతున్నయి అంటే- ఇవే అంత్యదినములకు సూచనలు. ఈ వాక్య భాగములో మనకు హెచ్చరిక ఇచ్చినప్పటికి; మనము మోసగింపబడకూడదు, కారణం ఈ ఘటన పురుడు నొప్పులకు మొదలు మాత్రమే, ఇంకా అంతము రావల్సివుంది.

కొంతమంది భాష్యం చెప్పేవారు భూకంపంను చూపిస్తారు, రాజకీయ ఆకస్మిక హింసాత్మక మార్పులను. మరియు ఇశ్రాయేలీయులు ఎదుర్కొనే ప్రతీదానిని తప్పనిసరియైన సూచనగా తీసుకొని అంత్యదినములు దగ్గరకు వచ్చినవని చెప్పుదురు. ఈ సంఘటనలు అంత్యదినములు దగ్గరకు వచ్చినవని చెప్తున్నప్పటికి, అంత్యదినములు దగ్గరకు వచ్చినవనుటకు అవి అవసరమైన దిక్సూచులు కాకపోవచ్చును. అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు అంత్యదినములలో అధిక శాతములో అబద్ద భోధకులు వచ్చును. "అయితే కడవరి దినములో కొందరు అబద్దికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల భోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టమగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు " 1 తిమోతి 4:1). అంత్యదినములు "నాశనకాలము" గా వివరించబడినది ఎందుకంటే అధికమవుతున్న మనుష్యులయొక్క దుష్ట స్వభావము మరియు ప్రజలు ఎవరైతే " సత్యమును ధిక్కరించేవారు (2 తిమోతి 3:1-9; మరియు చూడండి 2 థెస్సలోనీకయులకు 2:3).

ఇతర కొన్ని శక్యమైన సూచనలు అవి యెరూషలేములో యూదుల దేవాలయమును తిరిగి కట్టబడాల్సివుంది, ఇశ్రాయేలీయుల మద్య విరోధభావం అధికమౌతాదని, మరియు ప్రపంచములో ఒకే -పరిపాలన వస్తుందని సూచనలు. అతి ప్రాముఖ్యమైన అంత్యకాలపు సూచనేటంటే , ఏదిఏమైనా, అది ఇశ్రాయేలీయేలు దేశము. 1948లో, ఇశ్రాయేలు ఒక సార్వభౌమత్వపు దేశము, మరి ముఖ్యముగా క్రీ. శ 70 లో మొదటి సారిగా గుర్తింపుపొందినది. దేవుడు అబ్రాహాముకు వాగ్ధానము చేసేను అతని సంతానము కనాను దేశమును "నిత్య స్వాస్థ్యముగా" ( ఆదికాండం17:8), మరియు యెహెజ్కేలు ప్రవచించిన రీతిగా శారీరక మరియు ఆత్మీయ ముగా ఇశ్రాయేలు పునరుజ్జీవైమ్పచేయబడునని ( యెహెజ్కేలు 37 వ అధ్యాయము). తన స్వంత భూమిలోనే ఇశ్రాయేలు దేశము గా పరిగణిచబడటం అది అంత్యకాలపు ప్రవచనము ఎందుకంటే జరగబోవు (మరణాంతరం జీవచరిత్రకు) సంభంధించిన విషయాలలో ఇశ్రాయేలు ప్రాముఖ్యతచెందింది(దానియేలు 10:14; 11:41; ప్రకటన 11:8).

మనస్సులో ఈ సూచనలను దృష్ఠిలో పెట్టుకొని, మనము ఙ్ఞానవంతులుగా అంత్యకాలమును కొరకు వేచియుంటూ విషయాలను ముందుగానే గ్రహించుటకు సంసిద్దులుగానుండాలి. మనము చేయకూడనిది, ఏదిఏమైనా, ఏఒక్క ఘటనను తీసుకున్న అది అంత్యకాలమునకు సూచన్గా పరిగణించి భాష్యంచెప్పుటకు ప్రయత్నించ్కూడదు. దేవుడు మనకు సమాచారమునిచ్చాడు మనము సంసిద్దులుగానుండుటకు, మరియు దానికొరకే మనము పిలువబడినాము.


ప్రశ్న: సంఘము ఎత్తబడుట అంటే ఏంటి?

సమాధానము:
ఎత్తబడుట అనేది బైబిలులో ఎక్కడా కన్పడదు. ఎత్తబడుట అనే అంశం, అది, స్పష్టముగా లేఖనములో భోధించబడినది. సంఘం ఎత్తబడుట అనేది ఒక ప్రక్రియ అందులో దేవుడు విశ్వాసులనందరిని భూమిమీదనుండి తీసివేసి మార్గము సరాళము చేయుటకు తన నీతిరాజ్య పరిపాలనలో శ్రమకాలమందు తన ఉగ్రతను భూమిమీద పోయుటకు వేరుచేసెను. ఎత్తబడుట ప్రాధమికంగా 1 థెస్సలోనీయులకు 4:13-18 మరియు 1 కొరింథీయులకు 15:50-54 లో వివరించబడింది. యేసుప్రభువునందు నిద్రించిన విశ్వాసులను దేవుడు పునరుత్ధానముచేయును, మహిమగల శరీరమునిచ్చును, భూమిమీదనుండి తీసుకెళ్ళును, వారితో పాటు సజీవులుగ వున్న విశ్వాసులను మరియు ఆసమయములో వున్నవారికందరికి మహిమగల శరీరమునిచ్చును. " ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదురు. కాగా మనము ఆయన సదాకాలము ప్రభువుతో కూడ వుందుము" ( 1 థెస్సలోనీకయులకు 4:16-17).

ఎత్తబడుట అనేది సృష్ఠిలో ఆకస్మికంగా జరిగేది, మరియు మనము ఆసమయములో మహిమగల శరీరముఅనుగ్రహించబడును. "ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మనమంధరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూరమ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు; మనము మార్పు పొందుదము" (1 కొరింథీయులకు 15:50-52). ఎత్తబడుట అనే క్రియ మహిమతో కూడినది, మనమందరం ఆశతో వేచుచూచేది. సంపూర్తిగా పాపమునుండి విముక్తి కలుగుతుంది. ఎల్లప్పుడు దేవుని సన్నిధిలో నుందుము. ఈ ఎత్తబడుట గురుంచి అనేక తర్క వితర్క వాదనలు జరుగుటకు అవకాశమున్నది. గాని ఇది దేవుని ఉద్డేశ్యముకాదు. దానికి గాను, ఈ ఎత్తబడుటకు సంభంధించి, దేవుడు మననుండి కోర్కోనేది " కాబట్టి మీరు ఈ మాటలచేత ఒకనినొకడు ఆదరించుకొనుడి" థెస్సలోనీకయులకు 4:16-17).


ప్రశ్న: శ్రమలకాలము అంటే ఏంటి? శ్రమలకాలము ఏడు సంవత్సరములుండుననని ఏవిధంగా తెలుసు?

సమాధానము:
శ్రమలకాలము భవిష్యత్తు ఏడు సంవత్సరములు వ్యవధి దేవుడు ఇశ్రాయేలీయులపట్ల చేయాల్సినవన్ని ముగించి మరియు అవిశ్వాసప్రపంచాన్ని క్రమబద్దీకరణములో దానిని సమాప్తిచేయటం. సంఘం, అనేది యేసుక్రీస్తు వ్యక్తిత్వం మరియు ఆయన చేసినపనియందు ఎవరైతే నమ్మికయుంచారో వారిని ఆపాపపు శిక్షనుండి రక్షించుటకు, వారు ఆ శ్రమలకాలంలో పాల్గొనరు. సంఘం, దేవుడు తన ప్రజలను భూమిమీదనుండి తోడ్కొనిపోయే సన్నివేశము ఎత్తబడుట అంటాం (1 థెస్సలోనీకయులకు 4:13-18; 1 కొరింథీయులకు 15:51-53). సంఘం రాబోయే ఉగ్రతనుండి రక్షించబడినది (1 థెస్సలోనీకయులకు 5:9). లేఖనములు చూచినట్లయితే, శ్రమలకాలమునే అనేక వేర్వేరు పదాలతో పిలువబడియున్నది, యెహోవా దినము (యెషయా 2:12; 13:6-9; యోవేలు 1:15; 2:1-31; 3:14; 1 థెస్సలోనీకయులకు 5:2); భాధ లేక శ్రమలకాలము(ద్వితియోపదేశకాండం 4:30; జెఫన్యా 1:1); మహా శ్రమలకాలము, ఇది ఏడేండ్ల పాలనలోని విస్తృతమైన రెండవ భాగమును సూచిస్తుంది (మత్తయి24:21); కాలము లేక ఉగ్రతదిఅనము (దానియేలు 12:1; జెఫన్యా 1:15); యాకోబు సంతతివారికి ఆపద వచ్చు దినము (యిర్మీయా 30:7).

దానియేలు 9:27ప్రకారము అర్థం గ్రహించి శ్రమలకాము వ్యవధి మరియు కాలమును ఎరుగుట ఎంతైనా అవసరం. ఈ పాఠ్యాభాగము డెబ్బది వారముల గూర్చి మాట్లాడుతుంది ఆయన ప్రజలకు వ్యతిరేకముగా ప్రకటించబడింది. దానియేలు ప్రకలు యూదులు, ఇశ్రాయేలు దేశము మరియు దానియేలు 9:24 కాల పరిమితిని ప్రస్తావిస్తు దేవుడు తిరుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషమునిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుధ్ద స్థలమును అభిషేకించుటకును." దేవుడు ప్రకటించాడు నీ జనమునకు పరిశుధ్దపట్టణమునకు "డెబ్బది వారములు" విధింపబడెను. ఈ డెబ్బై ఏడేండ్ల కాలము, లేక 490 సంవత్సారాలు . ( కొన్ని తర్జుమాలు 70 వారముల ప్రార్థన). ఇది దానియేలులోని వేరొక పాఠ్యభాగముద్వారా ధృవీకరించబడుతుంది. 25 మరియు 26 వచనాలలో, దానియేలు మెస్సీయా డెబ్బైఏడు మరియు అరువది వారముల తర్వాత నిర్మూలము చేయబడును (మొత్తం 69), అప్పుడు యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆఙ్ఞ బయలుదేరిన సమయము. మరొక మాటలలో, 69 ఏడెండ్ల సంవత్సారాలు(483) యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆఙ్ఞ ఇవ్వబడింది, మెస్సీయా నిర్మూలము చేయబడును. బైబిలు పరమైన చారిత్రకారులు అవి 483 సంవత్సారాలు అని ధృవీకరించి అప్పుడు యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆఙ్ఞ బయలుదేరిన సమయము అప్పటినుండి యేసుక్రీస్తు సిలువవేయబడిన సమయము వరకు. చాలమంది క్రైస్తవ వేదాంతులు, వారు రాబోయే విషయాలను గూర్చి (భవిష్యత్తులో జరుగు పనులు / ఘటనలు) పైన చెప్పబడిన దానియేలు 70 ఏడు ను గూర్చి అర్థం గ్రహించవచ్చు.

ఈ 483 సంవత్సారాలు యెరూషలేము మరల కట్టించవచ్చునని ఆఙ్ఞ బయలుదేరిన సమయమునుండి మెస్సీయా నిర్మూలము చేయబడువరకు, ఇది కేవలము ఒక ఏడు సంవత్సారాలు మాత్రమే మిగిలియుండును ఇంకా దానియేలు 9:24 నెరవేరువరకు; "తిరుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషమునిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుధ్ద స్థలమును అభిషేకించుటకును." ఇది సంపూర్తియైన ఏడవ సంవత్సారం దానినే శ్రమలకాల వ్యవధి అంటారు - అది దేవుడు ఇశ్రాయేలీయుల పాపముపై తీర్పు ముగించిన సమయం.

దానియేలు 9:27 ప్రకారము ఏడు సంవత్సారాల శ్రమలకాలపు వ్యవధిని ప్రాధాన్యపరచుతుంది:" అతడు ఒక 'వారమువరకు' అనేకులకు నిబంధనను స్థిరపరచును; అర్థవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచువరకు నాశనము చెయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించువరకు ఈలాగున జరుగును." ఈ వచనము ఎవరిగురించైతే ప్రస్తావిస్తుందో యేసు దానిని "నాశనకరమైన హేయ వస్తువు" ( మత్తయి 24:15) మరియు దానినే "మృగము" అని ప్రకటన 13లో అందురు. దానియేలు 9:27 చెప్తుంది మృగము ఒక ఏడు సమ్వత్సారాలవరకు నిబంధనను స్థిరపరచును, గాని వారము మధ్యలో ( 3 1/2సం.. శ్రమలకాలంలో), నిబంధనను నిలిపివేయును, నైవేద్యమును నిలిపివేయును. ప్రకటన 13 వివరిస్తుంది మృగము తన ప్రతిమను చేసి దేవాలయములో పెట్టి మరియు ఆ ప్రతిమకు నమస్కారముచేయవలెనని భూనివాసులను కోరెను. ప్రకటన 13:5 ఇది 42 నెలలు తన కార్యము జరుపును, అంటే 3 1/2 సంవత్సారాలు. దానియేలు 9:27 అది వరము మధ్యలో జరుగును, మరియు ప్రకటన 13:5 లో చెప్పబడినన రీతిగా మృగము 42 నెలలు తన కార్యము జరుపును, మొత్తం వ్యవధి 84 వారములు లేక ఏడు సంవత్సారాలని చూచుటకు సులభముగానున్నది. దానితో పాటు దానియేలు 7:25, అక్కడ :ఒక కాలము కాలములు అర్థకాలము" (కాలము= 1 సంవత్సారం; కాలములు=2 సంవత్సారాలు; అర్తకాలము-1/2 సంవత్సారం; మొత్తం 3 1/2 సంవత్సారాలు) మరియు " మహా శ్రమలకాలమును," చివరి ఎడేండ్లకాలములోని అర్థభాగపు శ్రమలకాల వ్యవదిలో మృగము పరిపాలనలోవుంటుందని సూచిస్తుంది.

శ్రమలకాలంను గూర్చి మరికొన్ని వాక్యాభాగాలు, ప్రకటన 11: 2-3 దీని ప్రకారము 1260 దినాలు మరియు 42 నెలలని ప్రస్తావిస్తుంది , మరియు దానియేలు 12:11-12, ప్రకారము 1290 మరియు 1335 దినాలని ప్రస్తావిస్తుంది. ఈ దినాలు మధ్యస్త స్థితినే శ్రమలకాలముగా సూచిస్తుంది. మరియు దానియేలు 12 లో అధికమైన దినాలు అవి దేశములయొక్క తీర్పును అంతిమ సమయా న్నిచూపిస్తాయి ( మత్తయి 25:31-46) మరియు ఈ సమయమే క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనకు సంసిధ్దముచేయును.


ప్రశ్న: శ్రమలకాలము సంభంధించిన ఎత్తబడుట ఎప్పుడు జరుగును?

సమాధానము:
శ్రమలకాలము సంభంధించిన ఎత్తబడుట వ్యవధి విషయము ఈ దినాలలో చాలా వివాదాస్పదమైనది. ప్రాధానమైన మూడు ధృక్పధాలు పూర్వ శ్రమలకాలము ( అంటే ఎత్తబడుట శ్రమలకాలము ముందు జరుగును), మధ్యమ శ్రమలకాలము (అంటే ఎత్తబడుట శ్రమలకాలము మధ్యలో జరుగును) మరియు పూర్వాంతరా శ్రమలకాలము (శ్రమలకాలము తర్వాత ఎత్తబడుట). నాల్గవ దృక్పధము, సామాన్యముగా దానిని పూర్వోత్తర ఉగ్రత అంటారు, ఇది కొద్దిగా మధ్యాంతర శ్రమలకామునుండి పరిణామము చెందినది.

మొదటిగా, శ్రమలకాలపు ఉద్దేశ్యమును గుర్తించుట ప్రాముఖ్యమైనది. దానియేలు 9:27 ప్రకారము, డెబ్బది "ఏడు" ( ఏడేండ్లు) ఇంకా రావాల్సి వుంది. దానియేలు మొత్తం డెబ్బైయేడును గూర్చిన ప్రవచనము (దానియేలు 9:27) ఇది ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రస్తావిస్తుంది. ఈ సమయము ఇశ్రాయేలీయులమీద ప్రత్యేకంగా దేవుడు కనుదృష్ఠిపెట్టినాడు. డెబ్బై ఏడు, శ్రమలకాలము, అదే సమయములో విశేషముగా ఇశ్రాయేలీయుఅలతో దేవుడు వ్య్వహరించిన సమయం. ఇదేమి తప్పనిసరిగ్గా సంఘము ఆక్కడ లేదు అని సూచించుటలేదు, గాని అది ఒక ప్రశ్నను తలెత్తుతుంది ఎందుకని సంఘము ఈ భూమిమీద ఆ సమయములో ఉండాలీ.

ఎత్తబడుటను గూర్చిన ప్రాధమికమైన లేఖనభాగము 1 థెస్సలోనీకయులకు 4:13-18 లో వున్నది. అక్కడ చెప్పేదేంటంటే విశ్వాసులందరు, మరణించిన విశ్వాసులతో పాటు, మధ్యాకాశములో ప్రభువైన యేసును కలిసి మరియు అయనతో ఎల్లపుడు నివసించెదరు. ఎత్తబడుట అనేది దేవుడు తన ప్రజలను తోడ్కొనిపోయే సన్నివేశము. తరువాతి కొన్ని వచనములు, 1 థెస్సలోనికయులకు 5:9లో, పౌలు చెప్తున్నాడు, " ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు." ప్రకటన గ్రంధం, ప్రాధమికంగా శ్రమలకాలములో వ్యవధి గురించి చెప్తుంది, ప్రవక్తల సందేశమేంటంటే దేవుడు ఏ రీతిగా శ్రమల కాలమునందు తన ఉగ్రతను భూమిమీద కుమ్మరింపును గురించి చెప్తుంది.. విశ్వాసులను ఉగ్రతకు గురిచేయనని దేవుడు ఏమి అసంగతముగా వాగ్ధానము చేసినట్లు కనబడుటలేదు మరియు వారిని శ్రమలకాలమునందు కలిగే ఉగ్రతకు గురిచేసి వారిని విడిచి పెడ్తానని చెప్పలేదు. వాస్తావానికి త్వరలోనే క్రైస్తవులను ఉగ్రతనుండి విమోచనకలిగించునని దేవుడు వాగ్ధానము చేసెను. మరియు తన ప్రజలను భూమిమీదనుండి తీసివేసి ఈ రెండు సంఘటనలను పొందుపరచినట్లు చూపిస్తుంది.

ఎత్తబడుట గురించి మరొక అతికష్ఠమైన పాఠ్యభాగము ప్రకటన 3:10లో వుంది, అందులో క్రీస్తు భూనివాసులను శోధించుటకు రాబోవు "శోధనకాలములో" విశ్వాసులనందరిని కాపాడెదను అని వాగ్ధానముచేసెను. ఇది రెండు అర్థములనివ్వవచ్చును. అయితే క్రీస్తు పరిశుధ్దులను శోదనలగుండా వెళ్ళునపుడు వారిని కాపాడును , లేక వారు శోధనలనుండి బయటకువచ్చుటకు వారిని తోడ్పడును. గ్రీకు అర్థం చూచినట్లయితే "నుండి" అనే పదమును తర్జుమాచేసినపుడు రెండర్థములు సరియైనవే అన్నట్లు కనబడును. ఏదిఏమైనా, విశ్వాసులు ముఖ్యముగా ఙ్ఞప్తికి తెచ్చుకోవాల్సినదేంటంటే దేవుడు దేనినుండి కాపడతానని వాగ్ధానమును చేసాడో. అది ఒక పరీక్ష మాత్రమే కాదు, గాని అది శోధన "కాలం." క్రీస్తు విశ్వాసులను శోదనలగుండా వెళ్ళునపుడు వారిని కాపాడతానని వాగ్ధానము చేయటం, దానినే శ్రమలకాలమని అంటారు. శ్రమలకాలపు ఉద్డేశ్యము, ఎత్తబడుట ఉద్డేశ్యము, 1 థెస్సలోనికయులకు 5:9 అర్థం, ప్రకటన 3:10 దాని భాష్యం, అన్ని ఖచ్చితంగా పూర్వాంతర శ్రమలకాలమును గూర్చిన స్థితిని చూపిస్తున్నాయి. ఒకవేళ బైబిలును ఉన్నదున్నట్లుగా మరియు అనుగుణంగా తర్జుమా చేసినట్లయితే, పూర్వాంతర శ్రమలకాలపు స్థితియే బైబిలు ఆధారమైన భాష్యం అని చెప్పవచ్చు.


ప్రశ్న: యేసుక్రీస్తు రెండవరాకడ అంటే ఏంటి?

సమాధానము:
యేసుక్రీస్తు రెండవరాకడ అనేది దేవునియందు విశ్వాసముంచే విశ్వాసులకు కలిగిన అ నిరీక్షణ ఏంటంటే అన్నిటిని ఆయన అధీనములోనుంచును మరియు వాగ్ధానములలో మరియు వాక్యభాగములలొని ప్రవచనములయందు విశ్వాసముంచిఉనవారు కూడ ఆయన మొదటి రాకడలో బెత్లెహేములో ఒక చిన్న బాలుడుగా పశువుల పాకలో ప్రవచించినరీతిగా జన్మించాడు. యేసు, తన జన్మం, జీవితం, సేవ, మరణం మరియు పునరుత్ధానము విషయంలో మెస్సీయానుగూర్చిన ప్రవచనములన్నియు నెరవేర్చబడినాయి. ఏదిఏమైనా, ఇంకా కొన్ని మెస్సీయాను గూర్చిన ప్రవచనులు నెరవేర్చ్బడవలసి వున్నది. యేసుక్రీస్తు రెండవరాకడలో మరల తిరిగివచ్చునపుడు ఈ ప్రవచనములు ఇంకా నెరవేరబడుతాయి. మొదటిరాకడలో యేసుక్రీస్తు శ్రమలు పొందుతున్న దాసుడు. రెండవరాకడ యేసుక్రీస్తు జయోత్సాహుడైన రాజు. మొదటి రాకడలో యేసు ఎంతో దీనమైన పరిస్థితులలో వచ్చాడు. ఆయన రెండవ రాకడలో ఆయనతో పాటు వున్న దేవదూతలతో ఆయన ఆవిర్భవించును.

పాతనిబంధన ప్రవక్తలు రెండవ రాకడను గూర్చి సరియైన ప్రత్యేకత చూపించలేదు. ఇది యెషయా 7:14; 9:6-7 మరియు జెకర్యా 14:4 లో చూడవచ్చును. ఈ ప్రవచనములు కారణంగా ఇవి ఇద్దరు వ్యక్తులను గూర్చి చెప్పబడినట్లు, శ్రమను పొందిన యేసయ్యను , జయోత్సాహుడైన రాజును కూడ వుండే వుంటారని చాలమంది యూదా చరిత్రాకారులు నమ్మారు. వారు సరిగ్గ గ్రహించకలేకపోయింది ఏంటంటే ఒకే మెస్సీయా వేర్వేరు భాధ్యతలను నెరవేర్చగలడని. యేసు ఆయన మొదటి రాకడలో శ్రమను పొందిన దాసుడుగా భాధ్యతను నెరవేర్చాడు ( యెషయా 53). యేసు ఆయన రెమ్డవ రాకడలో ఇశ్రయేలీయులను విమోచించేవాడుగా మరియు రాజుగా నెరవేర్చునని చెప్పబడుతుంది. జెకార్యా 12:10 మరియు ప్రకటన 1:7 , రెండవ రాకడను వివరిస్తుంది, యేసు చీల్చబడిన వెనుకటి స్థితిని చూపిస్తుంది. ఇశ్రాయేలు, మరియు మొత్తం ప్రపంచం అందరు అంగాలార్పు లార్చుదురు ఎందుకంటే మొదటి రాకడలో వచ్చిన మెస్సీయాను అంగీకరించనందుకు.

యేసు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత , దూతలు అపోస్తలులతో ఈ విధంగా ప్రకటించెను " గలలియా మనుష్యులారా. మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మొ యొద్డనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆరితిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి" (అపోస్తలుల కార్యములు 1:11). జెకర్యా 14:4 రెండవసారి యేసుప్రభువు వారు ఒలీవలకొండపైన ప్రత్యక్షమవుతాడని గుర్తించారు. మత్తయి 24:30 ప్రకటిస్తుంది " అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమ్మారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు." తీతుకు 2:13 లో రెండవ రాకడనను " మహిమతో కూడిన ప్రత్యక్షత" వర్ణిస్తుంది.

ప్రకటన 19:11-16 వరకు రెండవ రాకడగురించి సంక్షిప్తంగా ఇవ్వబడింది, " మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శచేయుచు యుద్డము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద కిరిటములుండెను. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు; రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించికొనియుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది. పరలోకమునందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును: ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడమీదను వ్రాయబడియున్నది."


ప్రశ్న: వెయ్యేండ్ల పరిపాలన అంటే ఏంటి, మరియు వాస్తవికంగా దానిని అర్థంచేసుకోవాలా?

సమాధానము:
వెయ్యేండ్ల పరిపాలన ఈ బిరుదు 1000 ఏండ్ల భూమిమీద యేసుక్రీస్తు పరిపాలనకే ఇవ్వబడింది. కొంతమంది ఈ 1000 ను రూకముగనుండే పద్డతిలో ఉపయోగించారు. మరికొంతమంది ఈ 1000 ను ఉపమానముగా దీనిని చెప్పారు " చాలా కాల వ్యవధి," వాస్తవికంగాకాదు, భూమిమీద యేసుక్రీస్తు శారీరక పరిపాలన విషయం. ఏదిఏమైనా, ఆరు సార్లు ప్రకటన 20:2-7, వెయ్యేండ్ల పరిపాలన విశేషముగా దాని కాల వ్యవధి 1000సంవత్సరాలని చెప్పబడింది. ఒకవేళ దేవుడు మనతో సంభాషించటానికి ఇష్టపడినట్లయితే " చాలా కాల వ్యవధి," ఆయన చాల సులభతరమైన పద్దతిలో బహిర్గంగా మరియు పదేపదే సార్లు ఖచ్చితమైన వ్యవధి గురించి నొక్కివక్కాణించివుండేవాడు.

బైబిలు చెప్తుంది క్రీస్తు తిరిగి వచ్చినపుడు ఆయన తానే రాజుగా యెరూషలేములో స్థాపించుకొని, దావీదు సింహాసనముమీద కూర్చుండును ( లూకా 1:32-33). షరతులేని నిబంధన అడుగుతున్నది వాస్తవికంగా, శారీరకంగా క్రీస్తు తిరిగి వచ్చి రాజ్యమును స్థాపించునని. అబ్రాహాము నిబంధన ఇశ్రాయేలీయులకు దేశమును వాగ్ధానము చేసెను, సంతతి ఆశీర్వదించబడునని మరియు పాలకుడుగా మరియు ఆత్మీయ ఆశీర్వాదమును అనుగ్రహించెను ( ఆదికాండం 12:1-3). పాలస్తీనీయులు నిబంధన ఇశ్రాయేలీయుల దేశమును మరియు దేశపు వృత్తిని పునరుద్దీకరించుటాన్ని వాగ్ధానాన్ని చేసెను ( ద్వితీయోపదేశకాండం 30:1-10). దావీదుతో చేసిన నిబంధన ఇశ్రాయేలీయులకు క్షమాపణను వాగ్ధానము చేసెను - అంటే దానిని బట్టి దేశము ఆశీర్వదింపబడును (యిర్మీయా 31: 31-34).

రెండవరాకడప్పుడు. ఈ నిబంధనలు అన్ని నెరవేర్చబడును ఇశ్రాయేలు ఇతర దేశములనుండి సమకూర్చబడినప్పుడు ( మత్తయి 24:31, మార్పునొందినవారు ( జెకర్యా 12:10-14), మెస్సీయా ఏసుక్రీస్తు అధికారములో దేశము పునరుద్డీకరింపబడినపుడు,వెయ్యేండ్స్ల పరిపానలలో సంపూర్ణమైన పరిసరలతో శారీరక మరియు ఆత్మీయకంగా పరిస్థితులు ఎట్లా ఉంటాయోనని బైబిలు చెప్తుంది. సమాధానము కలుగజేయు సమయము ( మీకా 4:2-4; యెషయా 32: 17-18), సంతోషము (యెషయా 61:7-10), పేదరికము గాని రుగ్మతలు గాని ఉండవు ( ఆమోసు 9: 13-15; యోవేలు 2:28-29). బైబిలు ఇంకా చెప్తుంది విశ్వాసులు మాత్రమే వెయ్యేండ్ల పరిపాలనలో ప్రవేశింతురు. ఈ కారణమునుబట్టి, అది సంపూర్తిగా నీతిమంతులుగా వుండు సమయము (మత్తయి 25:37; కీర్తనలు 24:3-4), విధేయత యిర్మీయా 31:33), పరిశుధ్దత ( యెషయా 35:8), సత్యము ( యెషయా 65:16) , మరియు పరిశుధ్ధాత్మా నింపుదల ( యోవేలు 2:28-29). క్రీస్తు రాజుగా పరిపాలించును (యెషయా 9:3-7; 11: 1-10), దావీదు అధిపతిగా ( యిర్మీయా 31: 15-21; ఆమోసు 9:11), ఘనులు మరియు అధిపతులు (యెషయా 32:1; మత్తయి 19:28), మరియు యెరూషలేము రాజకీయంగా ప్రపంచ కేంద్రమవుతుంది ( జెకర్యా 8:3).

ప్రకటన 20:2-7 వెయ్యేండ్ల పరిపాలన వ్యవధి కాలమునుగూర్చి సరిగ్గా వివరించెను. ఈ లేఖనభాగాలు కాకుండా లెక్కలేనన్ని ఇతరులుకూడ భూమిమీద మెస్సీయా వాస్తవంగా పరిపాలించును. చాల దేవుని నిబంధనలు మరియు వాగ్ధానాలు వాస్తవికంగా, శారీరకంగా భవిష్యత్తు రాజ్యమును నెరవేర్చబడును. వెయ్యేండ్ల పరిపాలన మరియు దాని వ్యవది 1000 సంవత్సరాలు అని నిరాకరించుటకు, దీనికి సరియైన ఆధారము లేదు.