నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని.
కాని వారన్నారు: ‘మేము వినము.’
18కావున, సర్వదేశవాసులారా వినండి!
ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!
19భూలోకవాసులారా, ఇది వినండి:
యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను.
ఎందుకంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే.
వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది.
నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”
20యెహోవా ఇలా అన్నాడు:
“మీరు షేబ దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు?
దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు?
మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు!
మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”
21అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:
“యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను.
ప్రజల ఎదుట అడ్డబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి.
తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు.
స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”
22యెహోవా ఇలా అన్నాడు:
“ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది.
భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.
23సైనికులు విల్లంబలు, ఈ టెలు పట్టుకొనివస్తారు.
వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు.
వారు మిక్కిలి శక్తిమంతులు!
వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది.
ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది.
ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”
24ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము.
భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము.
కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము.
స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.
25మీరు పొలాల్లోకి వెళ్లవద్దు!
మీరు బాట వెంబడి వెళ్లవద్దు.
ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి.
పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.
26ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి.
బూడిదలో పొర్లండి
చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి!
మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి.
ఇవన్నీ మీరు చేయండి;
కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!
27“యిర్మీయా, నేను (యెహోవా)
నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను.
నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు,
వారిని గమనిస్తూ ఉండుము.
28నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు;
వారు చాలా మొండివారు.
వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు.
వారు తుప్పుతో కప్పబడియున్న కంచు,
ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.
29నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు.
కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది.
కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది!
శుద్ద వెండిని చేయాలను కోవటం వృధా ప్రయాస.
వృధా కాలయాపన.
అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
30‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు.
యెహోవా వారిని ఆమోదించలేదు
గనుక వారికాపేరు పెట్టబడింది.”
Notes
*6:1:ఉత్తర దిశ ఇది బబులోను సైన్యం ఉత్తర దిశనుండి యూదా రాజ్యంపై దండెత్తి రావటానికి సంబంధించినది.
†6:2:సుకుమారివి ఇచ్చట హెబ్రీ భాష జటిలంగా వుంది. సులభగ్రాహ్యం కాదు.
‡6:9:ప్రోగు చేయుము రైతులు పంట కోత సమయంలోను, నూర్పిడి సమయంలోను, కొంత పంటను. ధాన్యాన్ని పొలంలో వదలుట ఆనవాయితి. తద్వారా పేద ప్రజలు, బాటసారులు తమ ఆహారానికి సిద్ధంగా కొంత ధాన్యాన్ని పొందగలుగుతారు. ఈ వదలిన ధాన్యాన్ని తీసికొనే దానికి పరిగ ఏరుకోవటం, లేక ధాన్యపు గింజలు ఏరుకోవటం అని అంటారు.
§6:18:సర్వదేశవాసులారా … ధ్యానముంచండి ఇచ్చట హెబ్రీ భాష జటిలమై సులభ గ్రాహ్యముగా లేదు.
*6:20:షేబ షేబ దేశం ఇశ్రాయేలుకు దక్షిణంగా వున్నది. అనగా ఇప్పటి సౌదీ అరేబియాలో అది భాగమైవుంది. యిర్మీయా కాలంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో షేబ దేశం ప్రఖ్యాతి వహించింది.
†6:26:బూడిదలో పొర్లండి ప్రజలు యిలా చేస్తే వారు మహా దుఃఖంలో వున్నట్లుగాని, లేక చనిపోయిన వారి కొరకు విచారించుచున్నట్లుగాని సూచన.
‡6:29:అగ్ని … వచ్చింది వెండివంటి లోహాలను శుద్ధి చేయటానికి వారు వాటిని కడుగుతారు. అందులోని సీసపు మిశ్రమం ముందుగా కరుగుతుంది. దానిని కంసాలి కిందపోస్తాడు. మూసలో శుద్ధ లోహం మిగిలివుంటుంది. ఇక్కడ ప్రజలంతా చెడ్డవారేనని యిర్మీయా చెపుతున్నాడు. వారు కేవలం సీసంలాంటివారు. అక్కడ వెండి లేనేలేదు.
ఉత్తర దిశ ఇది బబులోను సైన్యం ఉత్తర దిశనుండి యూదా రాజ్యంపై దండెత్తి రావటానికి సంబంధించినది.
సుకుమారివి ఇచ్చట హెబ్రీ భాష జటిలంగా వుంది. సులభగ్రాహ్యం కాదు.
ప్రోగు చేయుము రైతులు పంట కోత సమయంలోను, నూర్పిడి సమయంలోను, కొంత పంటను. ధాన్యాన్ని పొలంలో వదలుట ఆనవాయితి. తద్వారా పేద ప్రజలు, బాటసారులు తమ ఆహారానికి సిద్ధంగా కొంత ధాన్యాన్ని పొందగలుగుతారు. ఈ వదలిన ధాన్యాన్ని తీసికొనే దానికి పరిగ ఏరుకోవటం, లేక ధాన్యపు గింజలు ఏరుకోవటం అని అంటారు.
సర్వదేశవాసులారా … ధ్యానముంచండి ఇచ్చట హెబ్రీ భాష జటిలమై సులభ గ్రాహ్యముగా లేదు.
షేబ షేబ దేశం ఇశ్రాయేలుకు దక్షిణంగా వున్నది. అనగా ఇప్పటి సౌదీ అరేబియాలో అది భాగమైవుంది. యిర్మీయా కాలంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో షేబ దేశం ప్రఖ్యాతి వహించింది.
బూడిదలో పొర్లండి ప్రజలు యిలా చేస్తే వారు మహా దుఃఖంలో వున్నట్లుగాని, లేక చనిపోయిన వారి కొరకు విచారించుచున్నట్లుగాని సూచన.
అగ్ని … వచ్చింది వెండివంటి లోహాలను శుద్ధి చేయటానికి వారు వాటిని కడుగుతారు. అందులోని సీసపు మిశ్రమం ముందుగా కరుగుతుంది. దానిని కంసాలి కిందపోస్తాడు. మూసలో శుద్ధ లోహం మిగిలివుంటుంది. ఇక్కడ ప్రజలంతా చెడ్డవారేనని యిర్మీయా చెపుతున్నాడు. వారు కేవలం సీసంలాంటివారు. అక్కడ వెండి లేనేలేదు.