15
యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, చివరకు మోషే మరియు సమూయేలు ఇక్కడికి వచ్చి యూదా కొరకు ప్రార్థన చేసినా, ఈ ప్రజలకై నేను విచారపడను. నానుండి యూదా ప్రజలను దూరంగా పంపివేయి! పొమ్మని వారికి చెప్పు! ‘మేమెక్కడికి వెళతాము, అని వారడుగ వచ్చు. అప్పుడు వారితో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పు:
 
“ ‘నేను వారిలో కొంతమంది అసహజంగా చనిపోవటానికి ఉద్దేశించాను.
వారు మృత్యువు వాతబడతారు.
కొంతమందిని కత్తికి బలిచేయటానికి ఉద్దేశించాను.
వారు కత్తులతో యుద్దానికి పోయి చనిపోతారు.
కొందరిని ఆకలి చావులకు ఉద్దేశించాను.
వారు కరువుకు గురవుతారు.
మరి కొందరిని అన్యదేశాలలో బందీలు కావటానికి ఉద్దేశించాను.
వారు బందీలై పరదేశానికి తీసుకుపో బడతారు.
నేను నాలుగు రకాల విధ్వంసకారులను వారిపైకి పంపుతాను.’
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
‘నేను ఖడ్గధారులైన శత్రువులను సంహారానికి పంపుతాను.
చనిపోయినవారి శరీరాలను లాగివేయటానికి కుక్కలను పంపుతాను.
వారి శవాలను తినివేయటానికి, నాశనం చేయటానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను.
ప్రపంచ ప్రజలందరికీ భీతావహంగా ఉండేలా
యూదా ప్రజలను భయంకరమైన దానికి ఒక ఉదాహరణగా చూపిస్తాను.
మనష్షే* మనష్షే మనష్షే బహుదుష్టుడైన యూదారాజు. అతడు చాలా అన్యదేవతలను ఆరాధించాడు. రాజులు రెండవ గ్రంథం 21:1-16 చూడండి. రాజు యెరూషలేములో చేసిన దానిని బట్టి
యూదా ప్రజలకు నేనీ విధంగా చేస్తాను.
మనష్షే యూదా రాజైన హిజ్కియా కుమారుడు.
మనష్షే యూదా రాజ్యానికి ఒక రాజు.’
 
“యెరూషలేము నగరమా, నీకొరకు ఒక్కడు కూడా విచారించడు.
ఎవ్వరూ నిన్ను గూర్చి విలపించరు.
నీ యోగ క్షేమాలు తెలుసుకొనేందుకు కూడా ఎవ్వరూ దగ్గరకు రారు.
యెరూషలేమా, నీవు నన్ను వదిలిపెట్టావు.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
“అనేక పర్యాయములు నీవు నన్ను చేరలేదు!
కావున నిన్ను నేను శిక్షించి నాశనం చేస్తాను.
మీ శిక్షను మీ మీదకు రాకుండా పట్టుకొని నేను అలసి పోయాను.
యూదా ప్రజలను నా కొంకె కర్రతో కొంకె కర్ర కొంకె కర్రలు, పంగల కర్రలు గడ్డి మొదలగు వాటిని గుర్చి లాగటానికి వినియోగిస్తారు. వేరు చేస్తాను.
వారిని రాజ్యంలోగల నగర ద్వారాలవద్ద నిరుపయోగంగా పారవేస్తాను.
నా ప్రజలలో మార్పు రాలేదు.
అందుచే నేను వారిని నాశనం చేస్తాను.
వారి పిల్లలను నేను తీసుకొని పోతాను.
అనేకమంది స్త్రీలు తమ భర్తలను కోల్పోతారు.
సముద్రతీరాన ఉన్న ఇసుకకంటె ఎక్కువగా విధవ స్త్రీలు వుంటారు.
మధ్యాహ్న సమయంలో నేను నాశన కారులను తీసుకొని వస్తాను.
యూదా యువకుల తల్లులపై వారు దాడి చేస్తారు.
యూదా ప్రజలకు బాధను, భయాన్ని కలుగ జేస్తాను.
ఇదంతా అతి త్వరలో సంభవించేలా చేస్తాను.
శత్రువు కత్తులతో దాడిచేసి ప్రజలను చంపుతాడు.
మిగిలిన యూదా వారిని వారు చంపుతారు.
ఒక స్త్రీకి ఏడుగురు కుమారులుండవచ్చు, కాని వారంతా హత్య చేయబడతారు.
ఆమె ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతుంది.
ఆమె కలవరపడి, తబ్బిబ్బై పోతుంది.
దుఃఖంవల్ల పట్టపగలే ఆమెకు చీకటి కలుగుతుంది.”
దేవునికి మరల యిర్మీయా తెలియజేయుట
10 తల్లీ, నీవు నాకు జన్మ ఇవ్వనట్లయితే బాగుండేది.
నేను దుఃఖపడుతున్నాను.
నేను దురదృష్టవంతుడను.
ఈ సమస్త రాజ్యాన్నీ నేను (యిర్మీయా) నిందిస్తూ, విమర్శిస్తూ ఉన్నాను.
నేనెవరికీ ఏదీ అప్పు యివ్వలేదు; అరువు తీసుకోలేదు.
కాని ప్రతివాడూ నన్ను శపిస్తున్నాడు!
11 యెహోవా, నేను నిన్ను భక్తితో సేవించాను.
ఆపదకాలం వచ్చినప్పుడు నా శత్రువుల గురించి నేను నిన్ను వేడుకున్నాను.
యెహోవానుండి యిర్మీయాకు జవాబు
12 “యిర్మీయా, ఇనుప ముక్కను నుగ్గుచేయటం
ఎవరితరమూ కాదని నీకు తెలుసు.
అంటే నా ఉద్దేశ్యం ఉత్తరాన్నుంచి వస్తున్న ఇనుమువలె ఉంటుంది ఉత్తరాన్నుంచి … ఉంటుంది ఇది బబలోను సైన్యం. ఈ సైన్యం ఉత్తరాన్నుంచి వచ్చి, యూదాపై దాడి చేయటాన్ని సూచిస్తుంది.
అలాగే ఇనుప ముక్కను చిదుక గొట్టే వారెవరు?
13 యూదా ప్రజలకు ధనము, ఐశ్వర్యం ఉన్నాయి.
ఆసంపదను పరులకు ఇస్తాను.
అన్యులు ఆ సంపదను ఖరీదు చేయనక్కరలేదు.
నేనే వారికి స్వయంగా ఇచ్చివేస్తాను.
ఎందువల్లనంటే యూదా చాలా పాపాలు చేసింది.
యూదా దేశంలో ప్రతిచోటా పాపాలు జరిగాయి.
14 యూదా ప్రజలారా, మీ శత్రువులకు మిమ్మల్ని బానిసలుగా చేస్తాను.
ముందెన్నడూ ఎరుగని రాజ్యంలో మీరు బానిసలవుతారు.
నేను మిక్కిలి కోపంతో ఉన్నాను.
నా కోపం రగులుతున్న అగ్నిలా ఉంది.
అందులో మీరు కాలిపోతారు.”
 
యిర్మీయా ఈ విధంగా చెప్పాడు:
15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో.
నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో.
ప్రజలు నన్ను గాయ పర్చుతున్నారు.
వారికి తగిన శిక్ష విధించుము.
ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు.
వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు.
నా గురించి ఆలోచించుము.
యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.
16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుకున్నాను.
నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది.
నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.
17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు.
కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, ఎగతాళి చేశారు.
నామీద నీ ప్రభావం పడుటవలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను.
నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను కోపగించుకొనేలా చేశావు.
18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు.
నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు.
యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను.
నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు.
నీవు ఇంకిపోయిన నీటిబగ్గలా ఉన్నావు.
19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే
నిన్ను నేను శిక్షించను.
నీవు మారి నావద్దకు వస్తే
నీవు నన్ను వెంబడించగలవు.
వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే
నాగురించి నీవు మాట్లాడగలవు.
యూదా పజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి.
అంతేగాని నీవు వూరి వారిలా వుండకూడదు.
20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను.
నిన్ను చూచి వారంతా
కంచుగోడలాంటి వాడని అనుకుంటారు.
యూదావారు నీతో పోట్లాడుతారు.
కాని వారు నిన్ను ఓడించలేరు.
ఎందువల్లంటే నేను నీతో వున్నాను.
నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.”
 
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను.
వారు నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి నిన్ను నేను రక్షిస్తాను.”

*15:4: మనష్షే మనష్షే బహుదుష్టుడైన యూదారాజు. అతడు చాలా అన్యదేవతలను ఆరాధించాడు. రాజులు రెండవ గ్రంథం 21:1-16 చూడండి.

15:7: కొంకె కర్ర కొంకె కర్రలు, పంగల కర్రలు గడ్డి మొదలగు వాటిని గుర్చి లాగటానికి వినియోగిస్తారు.

15:12: ఉత్తరాన్నుంచి … ఉంటుంది ఇది బబలోను సైన్యం. ఈ సైన్యం ఉత్తరాన్నుంచి వచ్చి, యూదాపై దాడి చేయటాన్ని సూచిస్తుంది.