7
యిర్మీయా దేవాలయ ప్రసంగం
యిర్మీయాకు యెహోవా నుండి ఇలా వర్తమానం వచ్చింది: “యిర్మీయా, నీవు దేవాలయ ద్వారం వద్ద నిలబడి, ఈ వర్తమానం ప్రజలకు బోధించుము:
“ ‘ఓ యూదా ప్రజలారా యెహోవా వాక్కు ఆలకించండి! యెహోవా ఆరాధించటానికి ఈ ఆలయ ద్వారం ద్వారా వచ్చే ప్రజాలారా ఈ వర్తమానం వినండి! సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు ఇలా చెపుతున్నాడు, మీ జీవన విధానం మార్చుకోండి. సత్కార్యములు చేయండి! మీరలా చేస్తే, ఈ స్థలంలో మిమ్మల్ని నివసించేలాగు చేస్తాను* ఈ స్థలంలో … చేస్తాను అంటే, “నేను మీతో ఉంటాను” అని కూడా అర్థం. కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం; యెహోవా ఆలయం దేవుని ఆలయం యెరూషలేములో వున్నంత మాత్రాన దేవుడు ఎల్లప్పుడూ యెరూషలేమును రక్షిస్తాడని చాలమంది ప్రజలు అనుకుంటారు. ప్రజలెంత దుష్టులైనా దేవుడు యెరూషలేమును రక్షిస్తాడని వారనుకుంటారు. ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు. మీరు మీ జీవితాలను మార్చుకొని మంచి పనులు చేస్తే, మిమ్మల్ని ఈ ప్రదేశంలో నివసించేలా చేస్తాను. మీరు ఒకరికొకరు సత్యవర్తనులై మెలగాలి. కొత్తవారి పట్ల న్యాయం పాటించండి. అనాధ శిశువులకు, విధవ స్త్రీల సంక్షేమానికి మంచి పనులు చేయండి. అమాయకులను చంపవద్దు! ఇతర దేవుళ్లను అనుసరించ వద్దు! ఎందువల్లనంటే ఆ దేవతలు మీ జీవితాలను నాశనం చేస్తాయి. మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.
“ ‘కాని మీరు అబద్ధాలనే నమ్ముతున్నారు. అబద్ధాలు ఆప్రయోజనకరమైనవి. మీరు దొంగతనాలు, హత్యలు చేస్తారా? వ్యభిచార పాపానికి ఒడిగడతారా? మీరు ఇతరులపై అకారణంగా నేరారోపణ చేస్తారా? బూటకపు బయలు దేవుణ్ణి ఆరాధిస్తారా? మీకు తెలియని ఇతర దేవుళ్లను అనుసరిస్తారా? 10 మీరీ పాపాలు చేసి, నా పేరుతో పిలవబడే ఈ ఆలయంలో నా ముందు మీరు నిలవగలమని అనుకొంటున్నారా? ఈ చోటులో నాముందు నిలబడి “మేము సురక్షితం” అని ఎలా అనుకోగలరు? మీరీ చెడుకార్యాలు చేయటానికి మీకు రక్షణ వుందని అనుకొంటున్నారా? 11 ఈ ఆలయం నా పేరుతో పిలవబడుతూ ఉంది! అయితే మీకు ఈ స్థలం ఒక దొంగల గుడారముకంటె భిన్నంగా కన్పించటం లేదా? నేను మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాను!’ ” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది!
12 “ ‘యూదా ప్రజలారా, ఇప్పుడు మీరు షిలోహు నగరానికి వెళ్లండి. అక్కడ నేను మొదటిసారిగా ఎక్కడైతే నా నామం కోసం ఒక ఇంటిని నిర్మించానో ఆ చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయులు కూడ దుష్టకార్యాలు చేశారు. వారు చేసిన పాపకార్యాలకు ప్రతిగా ఆ స్థలానికి నేను ఏమి చేసియున్నానో వెళ్లి చూడండి వారు … చూడండి ఏలీ, సమూయేలు కాలంలో బహుశా ఆ స్థలాన్ని ఫిలిష్తీయులు నాశనం చేసివుండవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. 13 ఇశ్రాయేలీయులారా, మీరీ చెడుకార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది! నేను మీతో అనేక పర్యాయాలు మాట్లాడి యున్నాను. కాని మీరు వినటానికి నిరాకరించారు. నేను మిమ్మల్ని పిలిచాను. అయినా మీరు పలకలేదు. 14 అందుచే యెరూషలేములో నాపేరు మీద పిలవబడే ఈ ఆలయాన్ని నాశనం చేస్తాను. షిలోహును నాశనం చేసినట్లు ఆ ఆలయాన్ని నాశనం చేస్తాను! ఆ ఆలయంలో మీరు విశ్వాసముంచారు. నేనా స్థలాన్ని మీకు, మీ పూర్వీకులకు ఇచ్చియున్నాను. 15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.’
16 “యిర్మీయా, నీవు మాత్రం యూదా ప్రజల కొరకు ప్రార్థన చేయవద్దు. వారి కొరకు నీవు అడుగవద్దు; వారి కొరకు నీవు చేసే ప్రార్థన నేను ఆలకించను. 17 యూదా పట్టణాలలో ఆ ప్రజలు ఏమి చేస్తున్నారో నీవు గమనిస్తున్నావని నాకు తెలుసు. యెరూషలేము నగర వీధుల్లో వారేమి చేస్తున్నారో నీవు చూడవచ్చు. 18 యూదా ప్రజలు ఏమి చేస్తున్నారనగా: పిల్లలు కట్టెలను పోగుచేయటం; తండ్రులు వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, ఆకాశ రాణికి§ ఆకాశ రాణి బహుశా బూటకపు దేవతైన అష్డారోతు కావచ్చు. ఆమె కామశాస్త్ర, యుద్ధ శాస్త్రాదుల ఆధి దేవత అని చెప్పబడింది. మెసపొటేమియ (అరాము లేక ప్రస్తుత ఇరాక్ దేశ ప్రాంతం) ప్రజలు ఆనాడు ఈ దేవతను ఆరాధించారు. ఆకాశంలో నక్షత్రంలా కనపడే వీనస్ (శుక్ర) గ్రహం అని వారు తలచేవారు. (ఆకాశ రాణి అని పాఠాంతరం) నివేదించటానికి రొట్టెలు చేయటం, యూదా ప్రజలు ఇతర దేవతా రాధనలో పానీయార్పణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే ఇవన్నీ చేస్తున్నారు. 19 కాని వాస్తవానికి యూదా ప్రజలు బాధపర్చేది నన్నుగాదు వారిని వారే బాధపర్చుకుంటున్నారు. వారిని వారే అవమాన పర్చుకుంటున్నారు” ఇది యెహోవా వాక్కు,
20 కావున యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “నా కోపాన్ని ఈ ప్రదేశంపై చూపిస్తాను. నేను మనుష్యులను, జంతువులను శిక్షిస్తాను. పొలాల్లో చెట్లను, భూమి మీద పంటను నాశనం చేస్తాను. నా కోపం ప్రళయాగ్నిలా వుంటుంది. దానిని ఆర్పగల శక్తి ఎవ్వరికీ లేదు.”
యెహోవా కోరేది బలులు కాదు, విధేయత
21 సర్వ శక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా అంటున్నాడు: “మీరు వెళ్లి మీరు కోరినన్ని దహన బలులు, సాధారణ బలులు అర్పించండి. తద్వారా వచ్చిన మాంసాన్ని మీరే తినండి. 22 మీ పూర్వీకులను నేను ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను వారితో మాట్లాడాను. కాని దహన బలుల గురించి, సాధరణ బలుల గురించి నేను వారికి ఏ రకమైన ఆజ్ఞలూ ఇవ్వలేదు. 23 వారికి ఈ ఆజ్ఞ మాత్రమే ఇచ్చియున్నాను, ‘నాకు విధేయులై వుండండి. అప్పుడు నేను మీ దేవుడనై యుంటాను. మీరు నా ప్రజలైయుంటాను. నేను చెప్పినదంతా చేయండి. మీకు శుభం కలుగుతుంది.’
24 “కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు. నన్ను లెక్కచేయలేదు. మొండిగా, వారు చేయదలచుకున్నదంతా చేశారు. వారు సన్మార్గులు కాలేదు. వారు మరింత దుష్టులయ్యారు. ముందుకు సాగక వెనుకకు తిరిగారు. 25 మీ పూర్వీకులు ఈజిప్టును వదలిన నాటినుండి ఈనాటి వరకు నా సేవకులను మీవద్దకు పంపియున్నాను. వారే ప్రవక్తలు. వారిని మీ వద్దకు అనేకసార్లు పంపాను. 26 కాని మీ పూర్వికులు వారి మాట వినలేదు. వారు నన్ను లెక్కచేయలేదు. వారు మిక్కిలి మొండివారు. వారి తండ్రుల కంటె వారు ఎక్కువ చెడుకార్యాలు చేశారు.
27 “యిర్మీయా, నీవు ఇవన్నీ యూదా ప్రజలకు చెపుతావు. అయినా వారు నీమాట వినరు! నీవు వారిని పిలుస్తావు. కాని వారు పలుకరు. 28 అందువల్ల వారికి నీవీ మాటలు చెప్పాలి: తన యెహోవా దేవునికి విధేయతగా లేని దేశం ఇదే. దేవుని ఉపదేశములను ఈ ప్రజలు వినలేదు. సత్య ప్రవచనాలు ఈ ప్రజలు ఎరుగరు.
కసాయి లోయ
29 “యిర్మీయా, నీ జుట్టు కత్తిరించి పారవేయి* కత్తిరించి పారవేయి ఈ పని విచారాన్ని తెలియ పరుస్తుంది. ఆయన రాజ్యంతో మాట్లాడుతూ, తన భయంకర స్థితిని గూర్చి ఏడ్వమని చెప్తున్నాడు. కొండమీదికి వెళ్లి దుఃఖించుము. ఎందుకంటావా? యెహోవా ఈ తరం ప్రజలను తిరస్కరించినాడు. ఈ ప్రజలకు యెహోవా విముఖుడైనాడు. కోపంతో ఆయన వారిని శిక్షిస్తాడు. 30 డ్వండి, ఎందుకంటే యూదా ప్రజలు చెడుకార్యాలు చేయటం నేను చూసియున్నాను.” ఇది యెహోవా వాక్కు. “వారు విగ్రహాలను ప్రతిష్టించారు. నేనా విగ్రహాలను అసహ్యించుకుంటున్నాను! నా పేరుతో పిలువబడే ఆలయంలో వారు విగ్రహాలను పెట్టినారు. నా నివాసాన్ని వారు అపవిత్రపర్చారు. 31 దా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు ఉన్నత స్థలాలు ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి చాలామంది వ్యర్థ దేవతాలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలనబడే బలిపీఠాలను నిర్మిస్తారు. సాధారణంగా వీటిని కొండలపై నిర్మిస్తారు. కాని కొన్నిటిని లోయలలో నిర్మించటంకూడా వుంది. నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు! 32 కావున నిన్ను హెచ్చరిస్తున్నాను. ప్రజలు ఈ స్థలాన్ని తోఫెతు అనిగాని, బెన్ హిన్నోములోయ అనిగాని పిలవకుండా వుండే రోజులు వస్తున్నాయి” ఇది యెహోవా వాక్కు. పైగా వారు దీనిని కసాయి లోయ కసాయి లోయ కసాయి శాలలో జంతువులను చంపి మాంసానికి పనికి వచ్చేలా నరుకుతారు. ఇక్కడ మనుష్యులనే జంతువుల రీతి నరుకుతారని భావం. అని పిలుస్తారు. “వారు ఈ పేరు పెడతారు కారణమేమంటే తోఫెతులో ఏమాత్రం ఇంకెవ్వరినీ పాతిపెట్టేందుకు ఖాళీ లేకుండా చనిపోయిన వారిని పాతిపెడతారు. 33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొనితింటారు. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు. 34 యూదా పట్టణాలలోను, యెరూషలేము నగర వీధులలోను ఆనందోత్సాహాలు లేకుండా చేస్తాను. యూదాలోను, యెరూషలేములోను పెండ్లి సందడులు, వేడుకలు ఇక వుండవు. ఈ రాజ్యం పనికిరాని ఎడారిలా మారిపోతుంది.”

*7:3: ఈ స్థలంలో … చేస్తాను అంటే, “నేను మీతో ఉంటాను” అని కూడా అర్థం.

7:4: యెహోవా ఆలయం దేవుని ఆలయం యెరూషలేములో వున్నంత మాత్రాన దేవుడు ఎల్లప్పుడూ యెరూషలేమును రక్షిస్తాడని చాలమంది ప్రజలు అనుకుంటారు. ప్రజలెంత దుష్టులైనా దేవుడు యెరూషలేమును రక్షిస్తాడని వారనుకుంటారు.

7:12: వారు … చూడండి ఏలీ, సమూయేలు కాలంలో బహుశా ఆ స్థలాన్ని ఫిలిష్తీయులు నాశనం చేసివుండవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం చూడండి.

§7:18: ఆకాశ రాణి బహుశా బూటకపు దేవతైన అష్డారోతు కావచ్చు. ఆమె కామశాస్త్ర, యుద్ధ శాస్త్రాదుల ఆధి దేవత అని చెప్పబడింది. మెసపొటేమియ (అరాము లేక ప్రస్తుత ఇరాక్ దేశ ప్రాంతం) ప్రజలు ఆనాడు ఈ దేవతను ఆరాధించారు. ఆకాశంలో నక్షత్రంలా కనపడే వీనస్ (శుక్ర) గ్రహం అని వారు తలచేవారు. (ఆకాశ రాణి అని పాఠాంతరం)

*7:29: కత్తిరించి పారవేయి ఈ పని విచారాన్ని తెలియ పరుస్తుంది. ఆయన రాజ్యంతో మాట్లాడుతూ, తన భయంకర స్థితిని గూర్చి ఏడ్వమని చెప్తున్నాడు.

7:31: ఉన్నత స్థలాలు ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి చాలామంది వ్యర్థ దేవతాలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలనబడే బలిపీఠాలను నిర్మిస్తారు. సాధారణంగా వీటిని కొండలపై నిర్మిస్తారు. కాని కొన్నిటిని లోయలలో నిర్మించటంకూడా వుంది.

7:32: కసాయి లోయ కసాయి శాలలో జంతువులను చంపి మాంసానికి పనికి వచ్చేలా నరుకుతారు. ఇక్కడ మనుష్యులనే జంతువుల రీతి నరుకుతారని భావం.