24
– 19 –
దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు. కీడు చేయాలని వారు వారి హృదయాల్లో పథకం వేస్తారు. వారు మాట్లాడేది అంతా కష్టం కలిగించాలని మాత్రమే.
– 20 –
మంచి గృహాలు జ్ఞానము, వివేకము మీద కట్టబడతాయి. జ్ఞానంవల్ల గదులు అన్నీ ప్రశస్తమైన మరియు సంతోషకరమైన సంపదలతో నింప బడతాయి.
– 21 –
జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. నీవు యుద్ధం ప్రారంభించక ముందు జాగ్రత్తగా పథకాలు వేయాలి. నీవు విజయం కావాలి అని అనుకొంటే నీకు మంచి సలహాదారులు చాలా మంది ఉండాలి.
– 22 –
బుద్ధిహీనులు జ్ఞానమును గ్రహించలేరు. మనుష్యులు ముఖ్యమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు బుద్దిహీనులు ఏమీ చెప్పలేరు.
– 23 –
నీవు కష్టాలు కలిగించాలని ఎల్లప్పుడూ తలుస్తూంటే, నీవు కష్టాలు పెట్టే మనిషివి అని ప్రజలు తెలుసుకొంటారు. మరియు వారు నీ మాట వినరు. బుద్ధిహీనుడు చేయాలని తలపెట్టే విషయాలు పాపం. ఇతరుల కంటే తానే మంచి వాడిని అనుకోనే మనిషిని ప్రజలు అసహ్యించుకొంటారు.
– 24 –
10 కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే.
– 25 –
11 మనుష్యులు ఒక వ్యక్తిని చంపాలని ప్రయత్నిస్తూంటే నీవు వానిని రక్షించుటకు ప్రయత్నించాలి. 12 “ఇది నా పని కాదు” అని నీవు చెప్పకూడదు. యెహోవాకు అంతా తెలుసు. నీవు వాటిని ఎందుకు చేస్తావో ఆయనకు తెలుసు. యెహోవా నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆయనకు తెలుసు. నీవు చేసే పనులకు యెహోవా నీకు బహుమానం ఇస్తాడు.
– 26 –
13 నా కుమారుడా, తేనె తాగు. అది మంచిది. తేనెపట్టులోని తేనె తియ్యగా ఉంటుంది. 14 అదే విధంగా జ్ఞానము నీ ఆత్మకు మంచిది. నీకు జ్ఞానము ఉంటే, అప్పుడు నీకు ఆశ ఉంటుంది. నీ ఆశకు అంతం ఉండదు.
– 27 –
15 మంచిమనిషి దగ్గర దొంగతనం చేయాలని లేకవాని ఇల్లు తీసివేసుకోవాలని కోరుకొనే దొంగలా ఉండవద్దు. 16 ఒక మంచి వాడు ఏడుసార్లు పడిపోయినా సరే, అతడు ఎల్లప్పుడూ మరల నిలబడతాడు. కానీ దుర్మార్గులు ఎల్లప్పుడూ కష్టంచేత ఓడించబడతారు.
– 28 –
17 నీ శత్రువుకు కష్టాలు వచ్చినప్పుడు సంతోషపడకు. అతడు పడిపోయినప్పుడు సంతోషపడకు. 18 నీవు అలా చేస్తే, అది యెహోవా చూస్తాడు. నీ విషయంలో యెహోవా సంతోషించడు. అప్పుడు యెహోవా ఒకవేళ నీ శత్రువుకు సహాయం చేయవచ్చు.
– 29 –
19 దుర్మార్గులను నీకు చింత కలిగించనీయకు.దుర్మార్గుల విషయమై అసూయపడకు. 20 ఆ దుర్మార్గులకు ఆశ లేదు. వారి వెలుగు చీకటి అవుతుంది.
– 30 –
21 నా కుమారుడా, యెహోవాను మరియు రాజును గౌరవించు. వారికి విరోధంగా ఉండేవారితో చేరవద్దు. 22 ఎందుకంటే, అలాంటి వాళ్లు త్వరగా నాశనం చేయబడవచ్చు. దేవుడు, రాజుకూడ వారి శత్రువులకు ఎంత కష్టం కలిగించగలరో నీకు తెలియదు.
మరిన్ని జ్ఞాన సూక్తులు
23 ఇవి జ్ఞానుల మాటలు:
ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. ఒకడు తనకు తెలిసినవాడైనంత మాత్రాన ఆయన అతనిని బలపరచకూడదు. 24 ఒక నేరస్థుడు స్వేచ్చగా వెళ్లిపోవచ్చని గనుక న్యాయమూర్తి చెబితే, అప్పుడు ప్రజలు అతనికి విరోధంగా ఉంటారు. అతని గూర్చి దేశాలే చెడుగా చెప్పుకుంటాయి. 25 అయితే ఒక న్యాయమూర్తి ఒక నేరస్తుని శిక్షిస్తే, అప్పుడు ప్రజలంతా అతనితో కలిసి ఆనందిస్తారు.
26 నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.
27 నీ పొలంలో నాట్లు వేయక ముందు నీ ఇల్లు కట్టుకోవద్దు. నీవు నివసించేందుకు ఒక గృహం కట్టు కొనకముందే, నీవు ఆహారం పండించటానికి సిద్ధంగా ఉన్నట్టు గట్టిగా తెలుసుకో.
28 గట్టి కారణం లేకుండా ఎవరికీ విరోధంగా మాట్లాడవద్దు. మరియు అబద్దాలు మాట్లాడకు,
29 “అతడు నాకు హాని చేశాడు, గనుక నేను అతనికి అలానే చేస్తాను. అతడు నాకు చేసిన వాటిని బట్టి నేను అతణ్ణి శిక్షిస్తాను” అని చెప్పవద్దు.
30 ఒక సోమరివాని పొలం పక్కగానే నేను నడిచాను. జ్ఞానములేని ఒక మనిషి ద్రాక్షాతోట పక్కగా నేను నడిచాను. 31 ఆ పొలాల నిండా కలుపు మొక్కలు పెరుగుతున్నాయి. నేలమీద పనికిమాలిన మొక్కలు పెరుగుతున్నాయి. పొలాల చుట్టూ గోడ విరిగిపోయి పడి పోతుంది. 32 నేను అది చూచి, దాని గూర్చి ఆలోచించాను. అప్పుడు ఈ విషయాల నుండి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. 33 కొంచెం నిద్ర, కొంచెం విశ్రాంతి, నీ చేతులు ముడుచుకొని, ఒక నిద్ర తియ్యటం. 34 ఈ విషయాలు నిన్ను త్వరగా దరిద్రుని చేస్తాయి. నీకు ఏమీ ఉండదు. ఒక దొంగ అకస్మాత్తుగా వచ్చి అంతా దోచుకొని పోయినట్టుగా అది ఉంటుంది.