134
యాత్ర కీర్తన.
యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి!
రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
సేవకులారా, మీ చేతులు ఎత్తి
యెహోవాను స్తుతించండి.
యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.