Home

లేవీయకాండము

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27


-Reset+

చాప్టర్ 12

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను
2 నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమెయేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండ వలెను.
3 ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.
4 ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పది మూడు దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.
5 ఆమె ఆడుపిల్లను కనిన యెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.
6 కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదిన ములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావు రపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.
7 అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.
8 ఆమె గొఱ్ఱ పిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగును.