Home

యోబు గ్రంథము

అధ్యాయం: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42


-Reset+

చాప్టర్ 15

1 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఈలాగునప్రత్యుత్తరమిచ్చెను
2 జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా?తూర్పుగాలితో తన కడుపు నింపుకొన దగునా?
3 వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా?నిష్‌ ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా?
4 నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు.దేవునిగూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.
5 నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది.వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.
6 నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవినీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి.
7 మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?
8 నీవు దేవుని ఆలోచనసభలో చేరియున్నవాడవా?నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
9 మేము ఎరుగనిది నీవేమి యెరుగుదువు?మేము గ్రహింపనిది నీవేమి గ్రహింతువు?
10 నెరసిన వెండ్రుకలు గలవారును చాలా వయస్సుమీరిన పురుషులును మాలో నున్నారునీ తండ్రికంటెను వారు చాల పెద్దవారు.
11 దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా?ఇట్లు నీతో మృదువుగా పలుకబడిన వాక్యముతేలికగా నున్నదా?
12 నీ హృదయము ఏల క్రుంగిపోయెను?నీ కన్నులు ఏల ఎఱ్ఱబారుచున్నవి?
13 దేవునిమీద నీవేల ఆగ్రహపడుచున్నావు? నీ నోటనుండి అట్టి మాటలేల రానిచ్చుచున్నావు?
14 శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు?
15 ఆలోచించుము ఆయన తన దూతలయందు నమి్మకయుంచడు.ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రముకాదు.
16 అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లుత్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అప విత్రుడు గదా.
17 నా మాట ఆలకింపుము నీకు తెలియజేతునునేను చూచినదానిని నీకు వివరించెదను.
18 జ్ఞానులు తమ పితరులయొద్ద నేర్చుకొని మరుగుచేయక చెప్పిన బోధను నీకు తెలిపెదను.
19 అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.
20 తన జీవితకాలమంతయు దుష్టుడు బాధనొందునుహింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నియు వాడుబాధనొందును.
21 భీకరమైన ధ్వనులు వాని చెవులలో బడును, క్షేమకాలమున పాడుచేయువారు వాని మీదికివచ్చెదరు.
22 తాను చీకటిలోనుండి తిరిగి వచ్చెదనని వాడు నమ్మడు వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు.
23 అబ్బా, ఆహారమెక్కడ దొరుకునని దానికొరకు తిరుగు లాడును. అంధకారదినము సమీపించుచున్నదని వానికి తెలియును.
24 శ్రమయు వేదనయు వానిని బెదరించును.యుద్ధముచేయుటకు సిద్ధపడిన రాజు శత్రువుని పట్టు కొనునట్లు అవి వానిని పట్టుకొనును.
25 వాడు దేవునిమీదికి చేయి చాపునుసర్వశక్తుడగువానిని ధిక్కరించి మాటలాడును.
26 మూర్ఖుడై ఆయనను మార్కొనునుతన కేడెముల గుబకలతో ఆయనమీదికి పరుగెత్తును.
27 వాని ముఖము క్రొవ్వు పట్టియున్నదివాని చిరుప్రక్కలపైని క్రొవ్వుకండలు పెరిగియున్నవి.
28 అట్టివారు పాడైన పట్టణములలో నివసించుదురుఎవరును నివసింపకూడని యిండ్లలోదిబ్బలు కావలసియున్న యిండ్లలో నివసించెదరు
29 కావున వారు భాగ్యవంతులు కాకపోదురు వారి ఆస్తి నిలువదు.వారి సస్యసంపద పంట బరువై నేలకు వంగదు
30 వారు చీకటిని తప్పించుకొనరు అగ్నిజ్వాల వారి లేతకొమ్మలను దహించునుదేవుని నోటి ఊపిరిచేత వారు నాశనమగుదురు.
31 వారు మాయను నమ్ముకొనకుందురు గాక;వారు మోస పోయినవారుమాయయే వారికి ఫలమగును.
32 వారి కాలము రాకముందే అది జరుగును అప్పుడే వారి కొమ్మ వాడిపోవును.
33 ద్రాక్షచెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారినిరాల్చును.ఒలీవచెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారినిాల్చును.
34 భక్తిహీనుల కుటుంబము నిస్సంతువగును.లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును
35 వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపముకందురువారి కడుపున కపటము పుట్టును.