యాత్ర కీర్తన.
1యెహోవా సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి!
రాత్రి అంతా ఆలయంలో సేవించిన సేవకులారా, మీరందరూ ఆయన్ని స్తుతించండి.
2సేవకులారా, మీ చేతులు ఎత్తి
యెహోవాను స్తుతించండి.
3యెహోవా సీయోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక!
యెహోవా ఆకాశాన్ని, భూమిని చేశాడు.